Jaya Janaki Nayaka
-
తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ మూవీ.. ఏకంగా ప్రపంచ రికార్డ్ సొంతం!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'జయ జానకి నాయక'. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో రిలీజ్ అయినప్పటీ నుంచి ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తాజాగా 800 మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కాగా.. ఈ సినిమాను హిందీలో ఖుంఖార్ పేరుతో రిలీజ్ చేశారు. సౌత్ డబ్బింగ్ మూవీస్‌లో ఇప్పటివరకు జయ జానకి నాయక మాత్రమే ఈ రికార్డ్ సాధించింది. యశ్ నటించిన కేజీఎఫ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. కానీ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలోనే హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 772 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో కొనసాగుతోంది. కాగా.. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #JayaJanakiNayaka 800M+ Views 💥👌@BSaiSreenivas @Rakulpreet #BellamkondaSrinivas #RakulPreetSingh #PenMovies pic.twitter.com/eC5M6cml89 — South Hindi Dubbed Movies (@SHDMOVIES) February 20, 2024 -
రేర్ రికార్డ్ నెలకొల్పిన జయ జానకి నాయక
-
రేర్ రికార్డ్ నెలకొల్చిన జయ జానకి నాయక
-
ప్రపంచ రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ మూవీ!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన చిత్రం జయ జానకి నాయక. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 709 మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. ఏకంగా హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 702 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో నిలిచింది. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
బెల్లంకొండ సినిమాలో బాలీవుడ్ విలన్
జయ జానకి నాయక సినిమాతో కమర్షియల్ హిట్ సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత సాయి శ్రీనివాస్ మరో భారీ బడ్జెట్లో చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాలో విలన్‌గా నటిస్తున్న నీల్ నితిన్ నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అలరించనున్నారు. -
బెల్లంకొండతో సుకుమారి
వరుసగా భారీ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నెక్ట్స్ సినిమాలో ఓ క్రేజీ హీరోయిన్ తో జతకట్టనున్నాడు. శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జయ జానకీ నాయక లాంటి మంచి హిట్ తరువాత చేస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సాక్ష్యం సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెడుతున్నాడు ఈ యంగ్ హీరో. దర్శకుడిగా మారిన యాంకర్.. ఓంకార్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నాడు. ఇటీవల రాజుగారి గది 2 సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న ఓంకార్, నెక్ట్స్ సినిమాను డిఫరెంట్ జానర్ లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే నెక్ట్స్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ని హీరోయిన్గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. అజ్ఞాతవాసి సినిమాలో సుకుమారిగా ఆకట్టుకున్న కీర్తి సురేష్.. కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. -
ఆ విషయంలో నేను లక్కీ
‘‘కంగారుగా సినిమాలు చేయడానికి ఇష్టపడను. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలను పదేళ్ల తర్వాత చూసుకున్నప్పుడు.. అప్పట్లో మంచి ప్రయత్నమే చేశాం అనే ఫీల్ ఉండాలనుకుంటున్నాను. ప్రతి సినిమాకు నా బెస్ట్ ఇవ్వాలని తాపత్రయపడతాను’’ అన్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జయజానకి నాయక’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మంగళవారం పాత్రికేయులతో ఆయన చెప్పిన విశేషాలు. ► ప్రస్తుతం నేను హీరోగా నటిస్తున్న ‘సాక్ష్యం’ సినిమాలో మంచి స్టోరీ కంటెంట్ ఉంది. యూనిక్ కాన్సెప్ట్. యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. ఇందులో వీడియో గేమ్ డైరెక్టర్ పాత్ర చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ ఫ్లై బోర్డింగ్, ఏటీవీ రైడింగ్‌తోపాటు బీఎమ్ఎక్స్ రైడింగ్ చేశాను. నా ఇంట్రడక్షన్ కూడా బీఎమ్ఎక్స్ సైక్లింగ్‌పై ఉంటుంది. ఇందుకోసం దుబాయ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. కాన్సెప్ట్ బేస్డ్‌గానే సినిమాలో ఐదు మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. రిలీజయ్యాక మంచి ప్రయత్నం అని ప్రేక్షకులు మెచ్చుకునేలా ‘సాక్ష్యం’ ఉంటుందని ఆశిస్తున్నాను. షూటింగ్ 70 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. న్యూయార్క్ షెడ్యూల్, మూడు పాటలు, క్లైమాక్స్ తప్ప షూటింగ్ కంప్లీట్ అయ్యింది. రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కొత్త యాంగిల్ ‘సాక్ష్యం’. శ్రీవాస్‌గారి వర్కింగ్ స్టైల్ సూపర్. ఎంజాయ్ చేస్తూ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాలో నా లుక్ ట్రెండీగా ఉంటుంది. ► ‘అల్లుడు శీను’ నాకు నచ్చి చేశాను. ‘జయజానకి నాయక’ ఫుల్ ఎమోషనల్ లవ్‌స్టోరీ. బోయపాటిగారు బాగా తీశారు. ‘స్పీడున్నోడు’ సినిమా తర్వాత బోయపాటిగారి లాంటి స్టార్ డైరెక్టర్ నన్ను నమ్మారు. నాలో ఆయనకు ఏం నచ్చిందో తెలీదు. నా మీద నమ్మకం ఉంచిన ఆయనకు థ్యాంక్స్. ‘స్పీడున్నోడు’ నుంచి ‘ జయజానకి నాయక’ సినిమాకు ఆరు నెలల్లో ఆల్మోస్ట్ 20 కేజీల బరువు తగ్గాను. ఇది అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పటి వరకు కెరీర్‌వైజ్‌గా నాది అమేజింగ్ జర్నీ. గతేడాది లాగానే ఈ ఇయర్ కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగాలని కోరుకుంటున్నాను. మాస్ ఇమేజ్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసి సినిమాలు చేయలేదు. అలా కథలు కుదిరాయి. ఈ విషయంలో ఐయామ్ లక్కీ అనిపిస్తుంది. ► ప్రతి విషయంలో నేను పాజిటీవ్‌గానే ఆలోచిస్తాను. విమర్శలను స్వీకరించగల మెంటల్స్ట్రెంత్ ఉంది. ప్రతి ఒక్కరు నేను ప్రొడ్యూసర్ (బెల్లంకొండ సురేష్) కొడుకు అనుకుంటారు. కానీ నేను చాలా కష్టపడతాను అని ఆలోచించే వారు తక్కువగా ఉంటారేమో. ► ప్రస్తుతం నాకున్న ఇమేజŒ తో హ్యాపీ. డైరెక్టర్స్‌లో కొత్త, పాత అన్న తేడా లేదు. మంచి కథ ఉంటే ఏ డైరెక్టర్‌తో అయినా చేస్తాను. నెక్ట్స్ మూవీ కోసం కథలు వింటున్నా. ఏడాదికి రెండు సినిమాలు చేయాలని ఉంది. తమిళ సినిమాల ఆలోచన ఇప్పట్లో లేదు. భవిష్యత్‌లో ద్విభాషా చిత్రం చేస్తానేమో చూడాలి. -
బోయపాటి నెక్ట్స్.. మెగా హీరోతోనా..!
జయ జానకి నాయక సినిమాతో మరోసారి సత్తా చాటిన మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, తన నెక్ట్స్ సినిమా పనుల్లో బిజీ అవుతున్నాడు. కొత్త హీరోతో కూడా మంచి బిజినెస్ చేసిన బోయపాటి నెక్ట్స్ సినిమాను మాత్రం స్టార్ హీరోతోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. అంతేకాదు ఇప్పటికే కథ కూడా రెడీ చేసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో సరైనోడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బోయపాటి, మరోసారి మెగా హీరోతోనే సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమా చేస్తున్న రామ్ చరణ్ తో తన నెక్ట్స్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. చరణ్ కూడా రంగస్థలం తరువాత చేయబోయే సినిమాను ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో బోయపాటి తో చరణ్ సినిమా కన్ఫామ్ అన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ పై ఎలాంటి ప్రకటన లేకపోయినా.. వరుసగా ధృవ, రంగస్థలం 1985 లాంటి ప్రయోగాలు చేస్తున్న చరణ్, ఈ సారి మాస్ కథకే ఓటేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
జయ జానకి నాయకకు వంద థియేటర్లు పెరిగాయ్..!
సాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 11న విడుదలైన సినిమాల్లో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయి కూడా మంచి వసూళ్లు సాధించిన సినిమా జయ జానకి నాయక. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే తొలి వారం భారీ పోటి కారణంగా ఎక్కువగా థియేటర్లు దక్కకపోవటంతో ఇప్పుడు థియేటర్లు పెంచే పనిలో పడ్డారు నిర్మాతలు. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో 14 కోట్లకు పైగా వసూలు చేసి ఈ సినిమాకు తాజాగా మరో వంద థియేటర్లు పెంచారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తుండటం జయ జానకి నాయకకు కలిసోస్తోంది. ఈ వారం భారీ సినిమాలేవి విడుదల కాకపోవటంతో పాటు థియేటర్ల సంఖ్య కూడా పెరగటంతో జయ జానకి నాయకకు కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. -
జయ జానకి నాయక.. వైభవంగా వేడుక
-
జానకీనాయకుడి విజయోత్సవం
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘జయ జానకి నాయక’. రకుల్‌ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విజయోత్సవం శనివారం కృష్ణాజిల్లాలోని హంసలదీవిలో జరిగింది. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ– ‘‘పవిత్రమైన హంసలదీవిలో ‘జయ జానకి నాయక’ షూటింగ్ జరగడం ఈ చిత్రవిజయానికి ముఖ్య కారణమని భావిస్తున్నాం. ఈ చిత్రం విజయోత్సవం చేయడానికి ఇంతకన్నా మంచి ప్లేస్ మాకు దొరకలేదు. శ్రీనివాస్ సూపర్‌గా యాక్ట్ చేశాడు’’ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘మా చిత్రానికి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. ఇవాళ 120 థియేటర్లు పెరిగాయంటే కారణం ప్రేక్షకులు ఇచ్చిన సపోర్టే. ఇకనుంచి ఇంతకంటే మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి కృషి చేస్తాను. నేను జీవితంలో గర్వంగా చెప్పుకొనే సినిమా ఇది. ఇలాంటి గర్వించదగ్గ చిత్రాన్ని ఇచ్చినందుకు బోయపాటి శ్రీనుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘30 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అసలు ‘హంసల దీవి’ అనే ప్లేస్ ఒకటి ఉందని నాకు తెలీదు. మా బోయపాటి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్ చేయించాడు. రెండో వారంలో సినిమా థియేటర్లు పెరగడం అంటే చిన్న విషయం కాదు. బోయపాటి సత్తా ఇది. అన్నీ తానై సినిమాని నడిపించారు’’ అన్నారు జగపతిబాబు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘జయ జానకీ నాయక’ మేనేజర్‌పై కేసు నమోదు
బంజారాహిల్స్: ‘జయజానకీ నాయక’ సినిమా షూటింగ్ కోసం వినియోగించిన లైట్లకు సంబంధించిన బకాయిలను అడిగేందుకు వెళ్లిన తనను దుర్భాషలాడడమే కాకుండా డబ్బులు ఎగ్గొట్టారంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా క్రియేషన్స్ మేనేజర్ కిషోర్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణానగర్‌కు చెందిన పెద్దిరెడ్డి అశోక్‌రెడ్డి అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్ నుంచి గత జనవరి 2వ తేదీ వరకు అన్నపూర్ణస్టూడియోలో జరిగిన జయజానకీ నాయక సినిమా పాట చిత్రీకరణ కోసం 250 ఎల్ఈడీ ట్యూబులు, 250 కాయిన్‌లైట్లు సరఫరా చేశారు. ఇందుకుగాను రూ.10.75 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత తనకు ఇవ్వాల్సిన బిల్లును ఇవ్వడం లేదని, అడగడానికి వెళ్తే బెదిరింపులకు దిగారని, నిర్మాత బెల్లం కొండ సురేష్‌తో పాటు ఈ సినిమా నిర్మాత రవీందర్‌రెడ్డితో మాట్లాడితే తర్వాత ఇస్తామంటూ చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు వెళ్లగా మేనేజర్ కిషోర్ తనను చంపేస్తానంటూ బెదిరించారని, తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిషోర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కథ నచ్చితేనే సినిమాలు తీస్తా
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన చిత్రం ‘జయ జానకి నాయక’. రకుల్ ప్రీత్‌సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందన్నారు నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది. అల్లు అరవింద్‌గారు ‘కథను నమ్మి, మంచి సినిమా తీశావ్. నీకు మంచి భవిష్యత్ ఉంది’ అనడం సంతోషం కలిగించింది. టెక్నిషియన్స్‌ను నమ్ముతాను. బడ్జెట్ విషయంలో రాజీపడకుండా నిర్మించాను. ఇకపై నేను నిర్మించబోయే సినిమాల్లోనూ కథకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. కథ నచ్చితేనే సినిమాలు చేయాలనుకుంటున్నాను. బోయపాటి శ్రీనుగారి డైరెక్షన్ సూపర్. ఆయన యాక్షన్ సీక్వెన్స్‌ను బాగా తెరకెక్కించారు. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకుంటున్నారు. సాయి శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ బాగుంది. అతనికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాను మరో మెట్టు ౖపైకి ఎక్కించింది. బోయపాటిగారితో త్వరలోనే మరో సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
జయహో... జయ జానకి నాయక
ప్రేమంటే ఏంటి? రెండు ముద్దులు, మూడు హగ్గులు ఇవ్వడమా... ప్రేమికుడంటే ఎవడు? అమ్మాయితో ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరిగేవాడా.... కానే కాదు!!! మరేంటి? అందరి ఆనందం కోసం అనుక్షణం ఆలోచించడమే... ప్రేమ. కష్టాల్లోనూ అమ్మాయి తోడుగా సైనికుడల్లే పోరాడేవాడే... ప్రేమికుడు. తండ్రంటే ఎవరు? పరువు కోసం కన్నబిడ్డను కసాయిలా చంపేవాడా.... పరువు, పరపతి అంటే ఏంటి? కన్నబిడ్డ ప్రేమను కాదని డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారడమా... కానే కాదు!!! మరేంటి? కన్నబిడ్డ కోరుకున్నది ఇచ్చేవాడు... కష్టాల్లో పిల్లల కన్నీళ్లు తుడిచేవాడు... తండ్రి.ప్రేమలో పలుకుబడి కాకుండా కన్నబిడ్డ సంతోషాన్ని, నిజాయితీనీ చూడడమే... పరువు, పరపతి. సంపాదించడమంటే ఏంటి? లంకంత కొంపలో ఉంటూ, స్టార్ హోటళ్లలో భోంచేస్తూ, సూటు–బూటు వేసుకుని తిరగడమా....కానే కాదు!!! మరేంటి? కొంపలో మన కోసం కష్టపడేవాళ్లను కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం... పిజ్జాలు–బర్గర్లు పక్కనపెట్టి, పొట్టకూటికై రెక్కల కష్టం చేసే ప్రజలకు కాస్త సాయం చేయడం... సూటు–బూటుల్లోనూ మన సంప్రదాయాలకు విలువ ఇవ్వడమే... అసలైన సంపాదన. ఈ శుక్రవారం (నిన్న) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జయ జానకి నాయక’లో దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిందిదే. అడుగడుగునా విలువలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు అంటే ఎవరు చూస్తారండి? అనొచ్చు. బోయపాటి శ్రీనుకూ ఈ సందేహం వచ్చుండొచ్చు. అందుకేనేమో... మందుబిళ్ల చుట్టూ పంచదార పొడి అద్దినట్టు... మంచి కథ చుట్టూ మళ్లీ మళ్లీ చూడాలనిపించే కమర్షియల్ హంగులు అద్దారు. మాసీ కమర్షియల్ మెసేజ్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు. ఇందులో ఆనందంలోనే కాదు, కష్టాల్లోనూ ప్రేమించిన అమ్మాయి తోడు నిలిచిన కథానాయకుడిగా, అందుకోసం ఎంత దూరమైనా వెళ్లే యువకుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించారు. అతని ప్రేయసిగా, అందరూ ఆనందంగా ఉండాలనుకునే అమ్మాయిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. పరువు కోసం కన్నబిడ్డను చంపే తండ్రిగా జగపతిబాబు, కన్నబిడ్డ కన్నీళ్లు తుడిచే తండ్రిగా శరత్‌కుమార్ నటించారు. మిగతా కీలక పాత్రల్లో తరుణ్ అరోరా, నందు, ప్రగ్యా జైశ్వాల్, ధన్యా బాలకృష్ణ, స్పెషల్ సాంగులో కేథరిన్ త్రేసా నటించారు. సందేశాలు–కమర్షియల్ హంగులు పక్కనపెట్టి ఈ సినిమా కథలోకి వెళితే.... చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ చక్రవర్తి (శరత్‌కుమార్) రెండో కుమారుడు గగన్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). కాలేజీలో కుర్రాడి మంచితనం, అమ్మాయిలను ఏడిపించిన పోకిరీల ఆటకట్టించిన గడుసుతనం చూసి స్వీటీ అలియాస్ జానకి (రకుల్‌ప్రీత్ సింగ్) ప్రేమలో పడుతుంది. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకునే స్వీటీ తీయనైన మనసు చక్రవర్తికి, అతని ఫ్యామిలీకి నచ్చుతుంది. కానీ, ఈ ప్రేమ సంగతి స్వీటీ తండ్రి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారి (జయప్రకాశ్)కి నచ్చదు. ఎందుకంటే... ప్రముఖ వ్యాపారవేత్త, ఇండియాలో పేరు మోసిన హైవేస్ కాంట్రాక్టర్ అశ్వత్థ నారాయణవర్మ (జగపతిబాబు) స్వీటీ తండ్రితో సంబంధం కలుపుకోవాలనుకుంటాడు. పెద్ద సంబంధం రావడంతో గగన్ ఫ్యామిలీని స్వీటీ తండ్రి చులకన చేసి మాట్లాడతాడు. ఆయన మాటలు గగన్ గుండెకు గాయాన్ని చేస్తాయి. కష్టంగా ఉన్నా కన్నతండ్రిపై స్వీటీకున్న గౌరవాన్ని గౌరవిస్తూ ఆమెకు దూరమవుతాడు గగన్. విశాఖలో తెలిసినోళ్ల (ప్రగ్యా జైశ్వాల్) ఇంటికి వెళతాడతను. అక్కడ అశ్వథ్‌ను ఎవరో చంపబోతుంటే గగన్ కాపాడతాడు. అప్పుడొక ఊహించని మలుపుతో ఇంటర్వెల్ పడుతుంది. ఆసక్తికరమైన ట్విస్టులతో సెకండాఫ్ సాగుతుంది. గగన్–అశ్వథ్ నారాయణవర్మ–లిక్కర్ కింగ్ అరుణ్ పవార్ (తరుణ్ అరోరా)ల మధ్య యుద్ధం మొదలవుతుంది. అసలీ అరుణ్ పవార్ ఎవరు? స్వీటీ సంతోషం కోసం గగన్ ఏం చేశాడు? పరువే ప్రాణంగా బతికే అశ్వథ్ నారాయణవర్మ ఏం చేశాడు? అశ్వథ్ నారాయణవర్మ ఒక్కడే శత్రువు అనుకుంటే... స్వీటీకి అండగా, తనకు అడ్డుగోడగా వచ్చిన గగన్‌ను అరుణ్ పవార్ ఏం చేశాడు? అనేది మిగతా చిత్రకథ. స్టార్టింగ్ టు ఎండింగ్ బోయపాటి మార్క్ మాస్ కమర్షియల్ ఫార్మాట్లో సినిమా సాగుతుంది. దీన్ని క్లాస్.. మాస్ ఎంటర్టైనర్ అనాలి. బోయపాటి గత సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా పాటలు–ఫైట్లు, మరీ ముఖ్యంగా ఎమోషనల్ సీన్లు చిత్రీకరించారు. చిత్రకథ ప్రారంభమైన కాసేపటికే కథానాయకుడికి అండగా అతని తండ్రి, అన్న ఎంత దూరం వస్తారనే సంగతి చూపించి, ఫైట్స్‌కి కావలసిన ఎమోషన్ బిల్డప్ చేశారు. ప్రేక్షకుడు నమ్మేలా తీశారు. ముఖ్యంగా హంసలదీవిలో తీసిన ఫైట్ సినిమా మెయిన్ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. హీరో వయసు, బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫైట్స్ డిజైన్ చేయించడంలో బోయపాటి మార్క్ కనిపిస్తుంది. వంద సినిమాల అనుభవం ఉన్న హీరోను, పదీ ఇరవై సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలను మాత్రమే కాదు.. ఏ హీరోని అయినా తన కథకు తగ్గట్టుగా బోయపాటి మౌల్డ్ చేయగలుగుతారని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను చూపించిన విధానం చూస్తే అర్థమవుతుంది. దర్శకుడి విజన్‌ని అర్థం చేసుకుని భారీ ఎమోషనల్ ఫైట్స్‌కి అనుగుణంగా తన మజిల్స్, బాడీని బిల్డ్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మెచ్చుకుని తీరాల్సిందే. అలాగే, పాత్రకు అనుగుణంగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు. జగపతిబాబు, శరత్‌కుమార్, తరుణ్ అరోరా, వాణీ విశ్వనాథ్, చలపతిరావు తదితరులు చక్కని నటన కనబరిచారు. ఫస్టాఫ్‌లో అందంగా కనిపించిన రకుల్‌ప్రీత్ సింగ్, సెకండాఫ్‌లో ఎమోషనల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. బీచ్ సాంగ్‌లో ప్రగ్యా జైశ్వాల్, స్పెషల్ సాంగులో కేథరిన్ త్రేసాలు అందాలతో కుర్రకారును కనువిందు చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఖర్చుకు ఏ మాత్రం వెనకాడలేదు. ఆయన పెట్టిన ప్రతి రూపాయినీ సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ స్క్రీన్‌పై చూపించారు. రిచ్ లుక్‌తో, లావిష్‌గా షూట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో ‘నువ్వేలే నువ్వేలే...’, ‘వీడే వీడే...’, ‘ఏ ఫర్ ఆపిలు..’, ‘జయ జానకి నాయక..’ పాటలు బాగున్నాయి. ‘అడవిలాంటి గుండెలోన తులసి కోట నువ్వేలే..’ అంటూ కథానుగుణంగా ‘నువ్వేలే నువ్వేలే...’ పాటలో చంద్రబోస్ అర్థవంతమైన సాహిత్యం అందించారు. హృదయానికి హత్తుకునే ప్రేమకథతో సాగే ఈ క్లాసీ మాసీ ఎంటర్టైనర్ కుటుంబసమేతంగా చూసేలా ఉంది.శుక్రవారం ఫస్ట్ షో రిపోర్ట్ ప్రకారం ప్రేక్షకులు జానకీ నాయకుడికి బ్రహ్మరథం పడుతున్నారని టాక్ వచ్చింది. ‘‘ముందు చెప్పినట్టు... మంచి సందేశానికి కమర్షియల్ హంగులు జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈ జానకి నాయకుణ్ణి చూసినోళ్లంతా జయహో.. జయ జయహో.. ‘జయ జానకి నాయక’ అంటున్నారు’’ అని ‘సాక్షి’తో చిత్రబృందం పేర్కొంది. – సత్య పులగం -
'జయ జానకి నాయక' మూవీ రివ్యూ
టైటిల్ : జయ జానకి నాయక జానర్ : ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, శరత్ కుమార్.. సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : బోయపాటి శ్రీను నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తరువాత వచ్చిన స్పీడున్నోడు సినిమాతో నిరాశపరిచాడు. స్టార్ ఇమేజ్ అందుకోవాలంటే మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా సాయి శ్రీనివాస్ కు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిందా..? బోయపాటి స్టార్ హీరోస్ తోనే కాకుండా యంగ్ హీరోస్ తో కూడా మ్యాజిక్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడా..? కథ : చక్రవరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత చక్రవర్తి (శరత్ కుమార్). తన భార్య చనిపోయిన దగ్గర నుంచి తల్లి తండ్రి తానే అయ్యి కొడుకుల బాగోగులను చూసుకుంటుంటాడు. కొడుకులతో కలిసి తాను మందు కొడుతూ గొడవలకు వెళుతుంటాడు. చక్రవర్తి చిన్న కొడుకు గగన్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). నా అనుకున్న వాళ్లకోసం ఎంతకైనా తెగించే మనస్థత్వం ఉన్న కుర్రాడు. అందుకే గగన్ మంచితనం నచ్చి, క్లాస్మేట్ స్వీటీ(రకుల్ ప్రీత్ సింగ్) అతన్ని ప్రేమిస్తుంది. గగన్ కూడా స్వీటీ ప్రేమలో పడతాడు. అదే సమయంలో పరువు కోసం కన్న కూతుర్ని కూడా చంపుకునే అశ్వింత్ నారాయణ వర్మ( జగపతి బాబు)కు, మర్డర్లు చేసి లిక్కర్ కింగ్ గా ఎదిగిన అర్జున్ పవార్ కు ఓ ప్రాజెక్ట్ విషయంలో యుద్ధం మొదలవుతుంది. వీరి గొడవకు గగన్, స్వీటీల ప్రేమకు సంబంధం ఏంటి..? అశ్వింత్ నారాయణ, అర్జున్ పవార్ లలో ఎవరు గెలిచారు..? గగన్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలి సినిమాతోనే మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జయ జానకి నాయక సినిమాలో మరింత పరిణితి కనబరిచాడు. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లుక్స్ పరంగా గగన్ పాత్రలో ఒదిగిపోయేందుకు తనవంతుగా చాలా కష్టపడ్డాడు. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ మరోసారి ఆకట్టుకుంది. ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో మాత్రమే కనిపించే రకుల్ ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ గా కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో తన స్టైల్ గ్లామర్ తో ఆకట్టుకోగా, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో కంటతడి పెట్టించింది. ప్రగ్యా జైస్వాల్ పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది. లెజెండ్ తరువాత మరోసారి జగపతి బాబు స్టైలిష్ విలన్ గా కనిపించాడు. అర్జున్ పవార్ పాత్రకు ఖైదీ నంబర్ 150 ఫేం తరుణ్ అరోరా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. తమిళ నటుడు శరత్ కుమార్ తండ్రి పాత్రలో తన మార్క్ చూపించాడు. యాక్షన్, ఎమోషన్స్ తో అలరించాడు. సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా గుర్తుపెట్టుకునే స్థాయి పాత్ర దక్కలేదు. ఇతర పాత్రల్లో నందు, చలపతిరావు, సితార తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : స్టార్ హీరోలతో తిరిగులేని బ్లాక్ బస్టర్ లను అందించిన బోయపాటి శ్రీను ఓ యంగ్ హీరోతో చేసిన సినిమా జయ జానకి నాయక. తన మార్క్ మాస్ యాక్షన్ ఏమాత్రం తగ్గకుండానే సాయి శ్రీనివాస్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథతో అలరించాడు బోయపాటి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కంటతడి పెట్టించి తనలోని కొత్త యాంగిల్ ను చూపించాడు. వందల కొద్ది విలన్లతో జరిగే పోరాట సన్నివేశాలు కాస్త అతిగా అనిపించినా.. మాస్ ఆడియన్స్ ను అలరిస్తాయి. ఈ సినిమా విజయంలో యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. దేవీ శ్రీ మ్యాజిక్ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. సినిమా రిజల్ట్ కు ముందే పాటలతో విజయం సాధించిన దేవీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయి పెంచాడు. నిర్మాత సినిమా కోసం చేసిన ఖర్చు ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ : బోయపాటి శ్రీను దర్శకత్వం లీడ్ యాక్టర్స్ నటన యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : కామెడీ లేకపోవటం జయ జానకి నాయక.. బోయపాటి ఖాతాలో మరో మంచి హిట్. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
జానకీ నాయకుణ్ణి అందరూ ఇష్టపడతారు : బోయపాటి శ్రీను
‘‘భద్ర’ తర్వాత నేను చేసిన తులసి, సింహా, దమ్ము, లెజెండ్, సరైనోడు’ సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. ‘భద్ర’ సినిమా తర్వాత నేను చేసిన బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ ‘జయ జానకి నాయక’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘జయ జానకి నాయక’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘లవ్, ఎమోషన్స్, యాక్షన్ అన్నీ ఉన్న కథ ఇది. ఫీల్ గుడ్, ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులూ మా జానకీ నాయకుణ్ణి ఇష్టపడతారు. నేను పని చేసిన నిర్మాతలందరితో హ్యాపీ. అల్లు అరవింద్గారితో ‘సరైనోడు’ చేశా. ఎంతో కంఫర్ట్బుల్ ప్రొడ్యూసర్. ఆ రేంజ్లో రవీందర్‌రెడ్డి సినిమా చేశాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇలాంటి నిర్మాతలు మనకు ఎంతో అవసరం’’ అన్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు బోయపాటిగారు 6 సినిమాలు చేస్తే, అన్నీ హిట్టే. ఆయన సినిమాల్లో ‘జయ జానకి నాయక’ బెస్ట్ మూవీ అని చెప్పగలను. సినిమాకు మంచి కథ కుదరడమే తొలి సక్సెస్. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు. ‘‘కొన్ని సినిమాలను ఇది నా సినిమా అని గర్వంగా చెప్పుకుంటాం. ‘ఇది నా సినిమా’ అని జీవితాంతం చెప్పుకునేలా ‘జయ జానకి నాయక’ ఉంటుంది’’ అని సాయిశ్రీనివాస్ అన్నారు. ‘‘ఈ సినిమాలో జానకి పాత్ర చేసే అవకాశం రావడం నా అదృష్టం. ప్రేక్షకులకు నా క్యారెక్టర్, స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ అవుతాయి’’ అని రకుల్ ప్రీత్‌సింగ్ చెప్పారు. ‘‘సినిమా అందర్నీ అలరించే విధంగా ఉంటుంది’’ అన్నారు ప్రగ్యా జైస్వాల్. నటుడు నందు పాల్గొన్నారు. -
బోయపాటి మార్క్‌కు భారీ ప్రైజ్..!
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లతో వరుస విజయాలు సాధిస్తున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం జయ జానకి నాయక. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (11-08-2017) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ లోనూ సత్తా చాటింది. హీరో కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్స్ లేకపోయినా బోయపాటి ఇమేజ్ కారణం సినిమా బిజినెస్ భారీగానే జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు కేవలం శాటిలైట్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు వర్షన్ ను 5 కోట్లకు స్టార్ మా సొంతం చేసుకోగా.. హిందీ డబ్బింగ్ రైట్స్ సోనీ నెట్ వర్క్ 7 కోట్లకు సొంతం చేసుకుంది. బోయపాటి గత చిత్రం సరైనోడు హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేయటంతో జయ జానకి నాయకను భారీ మొత్తానికి తీసుకునేందుకు సోని సంస్థ ముందుకు వచ్చింది. -
మాటిచ్చా... నిలబెట్టుకున్నా!
‘‘మన బ్లడ్‌కి ఓ కలర్... మన మాటకు ఓ విలువ... మనకు ఓ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ కోసం నేనెంత దూరమైనా వెళతా. ‘సరైనోడు’ తర్వాత నాకు పెద్ద ఛాన్సులొచ్చాయి. కానీ, ఎప్పుడో సాయితో సినిమా చేస్తానని నేను మాటిచ్చా. అందుకని ఈ సినిమా చేశా. కానీ, చేసిది ఎలా ఉండాలి? పెద్ద స్థాయిలో ఉండాలి. ఏదో సినిమా చేయాలని చేయలేదు. నేను చేసిన ఆరు సినిమాల కంటే ఓ పాయింట్ ఎక్కువ వెళ్లా తప్ప... తక్కువ వెళ్లలేదు’’ అన్నారు బోయపాటి శ్రీను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (సాయి), రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా ఆయన దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘జయ జానకి నాయక’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బోయపాటి చెప్పిన విశేషాలు... ⇒ నేను సినిమా తీసిన ప్రతిసారి ‘మీరు ప్రయోగాలు చేయరా? మారరా?’ అనడుగుతారు. ఓ అందమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, మంచి పాటలు జోడించి ‘భద్ర’ తీశా. ఆ తర్వాత నేను చేసిన అందమైన ప్రేమకథే ఈ సిన్మా. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రతి ఒక్క గుండెను చేరే చిత్రమిది. ప్రతి ఒక్కరి మనసుల్ని స్పృశించే చిత్రమిది. కొత్తగానూ, కథానుగుణంగానూ ఉంటుందని ‘జయ జానకి నాయక’ టైటిల్ పెట్టాం. ప్రేమంటే ఏంటి? ఆడపిల్లంటే ఏంటి? వాళ్లను మనమెంత అపురూపంగా కాపాడుకోవాలనేది సినిమాలో చెప్పాను. ⇒ నా ప్రతి సినిమాలోనూ యాక్షన్ హైలైట్ అయినా అవెందుకు ఆడాయంటే.. యాక్షన్‌తో పాటు ఎమోషన్ కనెక్ట్ అయ్యుంటుంది గనుక! ప్రేక్షకుడు కొట్టు అన్నప్పుడే నా హీరో కొడతాడు. ఫైట్ ఫర్ ఫైట్, సాంగ్ ఫర్ సాంగ్ అన్నట్టు నేను తీయను. ప్రతిదీ కథలో భాగంగా ఉంటుంది. ఇందులోనూ అలాంటి ఎమోషనల్ ఫైట్స్ ఉన్నాయి. థియేటర్లో ప్రేక్షకుడు ‘వాణ్ణిప్పుడు హీరో కొట్టాలిరా’ అని ఫీలైనప్పుడే హీరో కొడతాడు. కథలో భాగంగానే పాటలొస్తాయి. అందువల్లే, కథలోంచి పాటలు రావడంతో నా వర్క్ సులభమైందని దేవిశ్రీ చెప్పాడు. అతను మంచి పాటలు ఇవ్వడంతో పాటు సూపర్బ్ రీ–రికార్డింగ్ ఇచ్చాడు. ⇒ ‘లెజెండ్’ తర్వాత బన్నీతో చేస్తున్నప్పుడు ‘తనతో మీకు ఎలా కుదురుతుంది?’ అనడిగారు. బన్నీ బాడీ లాంగ్వేజ్‌కి సరిపడినట్లే ‘సరైనోడు’ తీశా కదా! నాకు దొరికిన మెటీరియల్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తా తప్ప... ఎక్కడికో వెళ్లి చేయను. మైఖేల్ జాక్సన్ దొరికితే డ్యాన్స్ చేస్తా. మైక్ టైసన్ దొరికితే బాక్సింగ్ చేస్తా. సాయి ఓ ముడిసరుకు లాంటోడు. తన ప్లస్సులను ప్లస్ చేస్తూ, మైనస్‌లను తగ్గిస్తూ, తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపడినట్లు సిన్మా తీశా. ⇒ ఈ సినిమా బడ్జెట్‌కు తగ్గట్టు బిజినెస్ జరిగింది. నాపై కొన్ని అంచనాలు ఉన్నాయి. కొత్త హీరో అని వాటి కంటే తక్కువగా నేనెందుకు సిన్మా తీస్తా? ఈ సంగతి మా నిర్మాతకు తెలుసు. ఆయనే మా సినిమాకు గ్రేట్ ఎసెట్. డబ్బు కాదు, మంచి సినిమా ముఖ్యమని తీశారు. సేమ్ టైమ్... ఆయన క్రెడిట్ కార్డు ఇచ్చారని ఎలా పడితే అలా వాడలేదు. నన్ను నమ్మి సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లను, నిర్మాతను డిజప్పాయింట్ చేసేలా సినిమా ఉండదు. ‘స్టార్‌తో కాకుండా కొత్త హీరోతో ఈ సినిమా తీయడం వల్ల బిజినెస్ పరంగా మీపై ఒత్తిడి పెరిగిందా?’ అనడిగితే... ‘ఒత్తిడి ఉంటుందని సాయితో సినిమా చేయాలనుకున్నప్పుడే తెలుసు. కానీ, ఒత్తిడి ఫీలవలేదు. ఎందుకంటే... మంచి కథ కుదిరింది’ అన్నారు బోయపాటి. ⇒ మూడు సినిమాలు ఒకే రోజున విడుదల కావడం వల్ల ఇబ్బంది ఏం లేదు. నిజానికి, జూన్ 23న లేదా జూలై తొలి వారంలో మా సినిమా విడుదల కావాలి. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇంకా వెనక్కి వెళితే మా నిర్మాత నెలకు కోట్ల రూపాయల వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి. ఆల్రెడీ ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. సో, రిలీజ్ చేస్తున్నాం. మనకు 1200లకు పైగా థియేటర్లు ఉన్నాయి. అన్నిటిలోనూ మన సినిమాను విడుదల చేసుకోలేం కదా! మా సినిమా 750 నుంచి 800 థియేటర్లలో విడుదలవుతోంది. ⇒ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవిగారు ఎప్పుడు? ఏం చేస్తారో? నాకు తెలీదు గానీ.. నేనైతే ఆయన కోసం ఓ కథ రెడీ చేశా. మహేశ్‌బాబుగారితో ఓ సరికొత్త జానర్ కథ గురించి డిస్కస్ చేశా. నాకు డేట్స్ ఎక్కువ కావాలనడిగా. వచ్చే ఏడాది మే–జూన్ నెలల్లో తప్పకుండా బాలకృష్ణగారితో ఓ సినిమా స్టార్ట్ చేస్తా. అఖిల్ కోసం రెండు లైన్లు రెడీ చేశా. అయితే... ఈ సినిమా హడావిడి పూర్తయిన తర్వాత, బాలకృష్ణగారి సినిమా మొదలయ్యేలోపు ఏం చేయాలి? ఏ సినిమా చేస్తే న్యాయం చేయగలను? అనేది చూస్తా! -
బోయపాటి స్టైల్.. జయ జానకి నాయక
స్టార్ వారసుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా జయ జానకి నాయక. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే భారీ ప్రమోషన్ లో హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. హై ఎమోషన్ సీన్ షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్లకు నటించి చూపిస్తున్న దర్శకుడు మరోసారి తన మార్క్ చూపించాడని అర్ధమవుతోంది. ఇప్పటికే యాక్షన్ ఎమోషనల్ టీజర్ లతో ఆకట్టుకున్న బోయపాటి.. మేకింగ్ ను యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో కట్ చేయించాడు. -
నా ప్లస్ పాయింట్స్ అవే!
‘‘మా నాన్నగారి (బెల్లంకొండ సురేశ్)కి మంచి పేరుంది. నాకు కొంత పేరొచ్చింది. కానీ, నాకంటూ ఓ స్టార్డమ్ లేదు. అభిమానులు లేరు. అందువల్ల, నేను అందరికీ నచ్చేటట్టు సినిమా చేయాలి. అది నా తొలి సినిమా కావొచ్చు. నా తదుపరి సినిమా కావొచ్చు. కమర్షియల్ హంగులు, మంచి దర్శకుడు, నటీనటులు, స్పెషల్ సాంగులు ఉన్నప్పుడే ఎక్కువమంది ప్రేక్షకులకు సినిమా చేరువవుతుంది’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా `దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన సిన్మా ‘జయ జానకి నాయక’. ఈ నెల 11న ఈ సినిమా విడుదలవుతోన్న సందర్భంగా ఇంటర్వ్యూ... ⇒ జానకి నాయకుడు కొత్తగా కనిపిస్తాడా? బోయపాటి హీరోలా కనిపిస్తాడా? కొత్తగా ఉంటూ బోయపాటి హీరోలా కనిపిస్తాడు. ఫస్టాఫ్ ప్రేమకథ, సెకండాఫ్ బోయపాటిగారి స్టైల్ ఆఫ్ యాక్షన్‌తో కూడిన సినిమా. ‘భద్ర’లో చిన్న ప్రేమకథ ఉంది గానీ... బోయపాటిగారు మా సినిమాలో పక్కా ప్రేమకథను చూపించారు. అదంతా కొత్తగా ఉంటుంది. సీతాదేవిని లంక నుంచి రాముడు తీసుకొచ్చినప్పుడు ‘జయ జానకి నాయక’ అని ప్రజలు జేజేలు పలికారు. మాదీ అటువంటి కథే! జానకి కోసం రాముడులాంటి యువకుడు ఎలా యుద్ధం చేశాడనేది సినిమా. ⇒ బోయపాటి దర్శకుడని ఒప్పుకున్నారా? కథ విన్నారా? కథ వినలేదు. మనం మంచి సినిమా తీయొచ్చు లేదా పక్కా కమర్షియల్ సినిమా తీయొచ్చు. కానీ, రెండిటితో సినిమా తీయడం కష్టం. బోయపాటిగారు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమా తీశారు. నా మూడో సినిమాకు ఇంత మంచి కథ వచ్చినందుకు.. ఐయామ్ లక్కీ. నా వయసును దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సినిమా తీశారు. మంచి డైలాగులు చెప్పించారు. ఇంకొకటి... ‘నీకు నేనున్నా. మళ్లీ నీతో సినిమా చేస్తా’ అన్నారు. ఆయనకు నేనంతగా నచ్చడమనేది నాలో కాన్ఫిడెన్స్ పెంచింది. చెప్పాలంటే... బోయపాటిగారు మాకు ఈ సినిమా ఫ్రీగా చేసిపెట్టారు. అందరూ ఏమైనా అనుకోండి! అదంతా ట్రాష్ (చెత్త). నన్ను నమ్మి చేసి నా ఫ్యామిలీని సపోర్ట్ చేశారు. ⇒ యువ హీరోలు ప్రయోగాలు చేస్తుంటే... మీరు యాక్షన్, కమర్షియల్ రూటులోనే వెళ్తున్నట్టున్నారు? వీవీ వినాయక్‌గారి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్తో హీరోగా పరిచయమయ్యా. అందులో నా యాక్షన్‌కు మంచి పేరొచ్చింది. డ్యాన్స్, యాక్షన్... కమర్షియల్ అంశాల్లో చాలా ఏళ్లు శిక్షణ తీసుకున్నా. అవే నా ప్లస్సులు. వాటిని ఇంకా ప్లస్ చేసుకుంటూ, నా మైనస్‌లను కవర్ చేసుకుంటూ సినిమాలు చేయాలి. నా ప్లస్సులను వదులుకుంటే కష్టం! కథ బాగుంటే ప్రేమకథలు, ప్రయోగాలు కూడా చేస్తా. ఫ్రైడే సిన్మాతో వస్తే మండేకి మర్చిపోతున్నారు. అందుకే, మంచి సినిమాతో రావాలనుకుంటున్నా. ⇒ మొదటి రెండు సినిమాల్లో మీలో మీరు గమనించిన మైనస్‌లు ఏంటి? సన్నగా ఉన్నా. యాక్షన్ సిన్మా హీరో కొడితే జనాలు నమ్మేలా ఉండాలి. సన్నగా ఉంటే బాగోదు. అందువల్లే ఈ సినిమాకు ముందు 25 కేజీల బరువు పెరిగా. తర్వాత పది కిలోలు తగ్గా. నా ఫిజిక్, డిక్షన్ విషయాల్లో జాగ్రత్త తీసుకున్నా. ఈ సినిమాతో నాకు ఎమోషనల్గానూ బాగా చేశాడనే పేరు వస్తుంది. -
నేను ప్రేమించినప్పుడు మాట్లాడతా!
‘‘బహుశా.. సినిమాల్లో నటించే పాత్రలు నటీనటులపై ప్రభావం చూపుతాయేమో! అందువల్లే, ‘మాకంటూ ఓ సొంత లైఫ్ లేదు, డిప్రెషన్లోకి వెళ్లాం’ అని చాలామంది చెబుతున్నారనుకుంటున్నా. నేను సాయంత్రం ప్యాకప్ చెప్పగానే... నటించే పాత్ర నుంచి బయటికొచ్చేస్తా’’ అన్నారు రకుల్‌ప్రీత్‌సింగ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు జోడీగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆమె నటించిన సినిమా ‘జయ జానకి నాయక’. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. రకుల్ చెప్పిన విశేషాలు... ⇒ జానకి... బబ్లీ అండ్ హ్యాపీ కాలేజ్ గాళ్. కుటుంబమంటే ప్రేమ. ఏ పని చేయాలన్నా తానే ముందడుగు వేస్తుంది. ఓ ఘటన వల్ల అటువంటి అమ్మాయి లైఫ్ మొత్తం మారుతుంది. ఆ ఘటన ఏంటి? ఆమె లైఫ్ ఎలా మారింది? అనేది చిత్రకథ. ఈ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో జానకిగా నేను నటించాను. ⇒ కొన్ని పోస్టర్స్ చూస్తే నేను స్యాడ్గా, డల్‌గా కనిపిస్తా. ఇటువంటి ఎమోషనల్ పాత్రను నేనిప్పటి వరకు చేయలేదు. అందువల్ల సెట్లో ఉన్నంతసేపూ నా ప్రపంచానికి దూరంగా, డల్‌గా ఉండేదాన్ని. లేదంటే రోజంతా క్యారెక్టర్‌కు కావలసిన మూడ్‌లో ఉండలేం. ఓ రోజు షూటింగులో ఉన్నప్పుడు ‘నాతో రెండు నిమిషాలు మాట్లాడలేవా?’ అని మా అమ్మ ఫోన్ చేస్తే... ‘నో మమ్మీ’ అని పెట్టేశా. బోయపాటిగారయితే అప్పుడప్పుడూ ‘షాట్ అయ్యిందమ్మా... కొంచెం నవ్వొచ్చు’ అనేవారు. (నవ్వులు) ఓ నాలుగు రోజులు షూటింగ్ చేసిన తర్వాత డల్‌గా నటించడం కొంచెం కష్టమనిపించింది. ⇒ ఏడుపు సీన్స్ కోసం గ్లిజరిన్ వాడారా? అనడిగితే... అవును! నా లైఫ్‌లో గ్లిజరిన్ లేకుండా ఇప్పటివరకు ఎప్పుడూ ఏడవలేదు. అలా ఏడ్చే సందర్భం రాదనుకుంటున్నా. ఈ సినిమా కోసం గ్లిజరిన్ వాడి వాడి సాయంత్రానికి నా కళ్లు వాచిపోయేవి. సరదాగా బోయపాటిగారితో ‘సార్... ఈ షెడ్యూల్ పూర్తయ్యేసరికి నేను ఓల్డ్ అవుతా. ఏడ్చి ఏడ్చి రెండు చెంపలపై చారలు వచ్చేస్తాయి’ అన్నాను. ⇒ బోయపాటిగారు చాలా స్మార్ట్. ఎందుకంటే... ఆయన ఎలాంటి సినిమా తీస్తున్నారో? ఏం తీస్తున్నారో? కథలో బలం ఏంటో? ఆయనకు బాగా తెలుసు. గొప్ప ప్రేమకథ, కుటుంబ విలువలు ఉన్న సినిమా ఇది. జానకి చుట్టూ కథంతా తిరుగుతుంది కాబట్టి... ‘జయ జానకి నాయక’ టైటిల్ పెట్టారు. బోయపాటిగారి నుంచి డిఫరెంట్ ట్రీట్మెంట్లో వస్తున్న సినిమా. ఆయన సిగ్నేచర్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటుంది. ⇒ బోయపాటిగారితో ‘సరైనోడు’ చేశాను. ఆ సినిమా రిలీజ్ కాకముందే ఈ ఆఫర్ వచ్చింది. ఆయనేంటి? సినిమా ఎలా తీస్తారనేది తెలుసు. అందుకని సాయి శ్రీనివాస్ కొత్త హీరో కదా? అని ఆలోచించకుండా, వెంటనే ఒప్పేసుకున్నా. సాయి అద్భుతంగా నటించాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సూపర్బ్. మా నిర్మాత రవీందర్‌రెడ్డిగారు చాలా మంచి వ్యక్తి. మంచి సినిమా తీయాలని ఖర్చుకు వెనుకాడకుండా తీశారు. ⇒ ‘లైఫ్‌లో కష్టం వచ్చిన ప్రతిసారి లైఫ్‌ను వదులుకోం. కానీ, ప్రేమను మాత్రం వదిలేస్తాం. నేను వదలను. ఎందుకంటే... నేను ప్రేమించా’ అని ట్రైలర్లో డైలాగ్ ఉంది. అటువంటి పరిస్థితి మీకొస్తే? అని రకుల్‌ను ప్రశ్నించగా... ‘‘ఫస్ట్ నా లైఫ్‌లో లవ్ రావాలి. అది వచ్చినప్పుడు... నేను ప్రేమించినప్పుడు మాట్లాడతా’’ అన్నారు. ⇒ ప్రస్తుతం హిందీలో ‘అయ్యారే’, తమిళంలో సూర్య సరసన ఓ సినిమా చేస్తున్నా. మహేశ్‌బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించిన ‘స్పైడర్’ వచ్చే నెల్లో విడుదలవుతుంది. -
సెన్సార్ పూర్తి చేసుకొన్న 'జయ జానకి నాయక'
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'జయ జానకి నాయక'. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. క్లాస్-మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకొనే విధంగా దేవి తనదైన మార్క్ తో రెడీ చేసిన ఆడియో జూలై 31న అంగరంగ వైభవంగా సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలైన సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న 'జయ జానకి నాయక' సెన్సార్ నేడు(02-08-2017) పూర్తయ్యింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. 'ఏ విషయంలోనూ రాజీపడకుండా జయ జానకి నాయక చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్ గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి. ఇవాళ సెన్సార్ పూర్తయ్యింది, సినిమా చూసిన సెన్సార్ సభ్యులు 'యు/ఎ' సర్టిఫికెట్ ను అందించారు. క్లీన్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న పూర్తి నమ్మకం మాకుంది' అన్నారు. -
ఒక్క సీన్ కోసం 20 టేకులు, 3 రోజులు
సీనియర్ నటుడు జగపతిబాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా ఎన్నో విజయాలు సాధించిన జగ్గుబాయ్, ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు. తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు రివార్టులు సొంతం చేసుకున్న ఈ విలక్షణ నటుడు, తన రీసెంట్ సినిమా ఎక్స్ పీరియన్స్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సినిమా జయ జానకి నాయక. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కీలకమైన ఓ సన్నివేశం కోసం బోయపాటి చెప్పిన ఎక్స్ప్రెషన్ ను జగ్గుబాయ్ ఇవ్వలేకపోయాడట. మూడు రోజుల పాటు 20 టేకులు చేసినా.. అనుకున్న ఎక్స్ప్రెషన్ రాకపోవటంతో డబ్బింగ్, ఎడిటింగ్ లలో ఆ సన్నివేశాన్ని ఎడ్జస్ట్ చేశారని తెలిపాడు. ప్రస్తుతం ఆ సీన్ ఎంటో చెప్పకపోయినా.. అదే డైలాగ్ ను సినిమా సక్సెస్ మీట్ లో ప్రేక్షకుల ముందుకు చెప్తానని తెలిపాడు. -
జయ జానకి నాయక ఆడియో రిలీజ్
-
జూలై 31న 'జయ జానకి నాయక' ఆడియో
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'జయ జానకి నాయక'. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్లాస్ మాస్ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకొనే విధంగా దేవి తనదైన మార్క్ తో రెడీ చేసిన జయ జానకి నాయక ఆడియోను జూలై 31న ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. 'ఏ విషయంలోనూ రాజీపడకుండా జయ జానకి నాయక చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్, గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి. ఇటీవల విడుదల చేసిన 'నువ్వేలే నువ్వేలే' పాటకి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. దేవి మళ్ళీ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నాడు. జూలై 31న ఆడియో విడుదల వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం. ఆడియో విడుదల తర్వాత సినిమా మీద ఉన్న క్రేజ్ మరింత పెరుగుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్, పోస్టర్స్ ని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకొంటుండడం చాలా సంతోషంగా ఉంది' అన్నారు.