సిక్స్ ప్యాక్లో మరో యంగ్ హీరో | Bellamkonda srinivas six pack body in Jaya Janaki nayaka | Sakshi
Sakshi News home page

సిక్స్ ప్యాక్లో మరో యంగ్ హీరో

Published Sun, Jun 18 2017 10:54 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

సిక్స్ ప్యాక్లో మరో యంగ్ హీరో - Sakshi

సిక్స్ ప్యాక్లో మరో యంగ్ హీరో

అల్లుడు శీను సినిమాతో గ్రాండ్గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్.. హీరోగా స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయాడు. స్పీడున్నోడు సినిమాతో చేసిన రెండో ప్రయత్నం కూడా నిరాశపరచటంతో మూడో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్తో జయ జానకి నాయక అనే కమర్షియల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడట. బాలీవుడ్ స్థాయి భారీ యాక్షన్ సన్నివేశాలు, టాప్ కాస్టింగ్తో సినిమాను రిచ్గా తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో హీరో సిక్స్ ప్యాక్ లుక్తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement