‘‘కంగారుగా సినిమాలు చేయడానికి ఇష్టపడను. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలను పదేళ్ల తర్వాత చూసుకున్నప్పుడు.. అప్పట్లో మంచి ప్రయత్నమే చేశాం అనే ఫీల్ ఉండాలనుకుంటున్నాను. ప్రతి సినిమాకు నా బెస్ట్ ఇవ్వాలని తాపత్రయపడతాను’’ అన్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జయజానకి నాయక’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మంగళవారం పాత్రికేయులతో ఆయన చెప్పిన విశేషాలు.
► ప్రస్తుతం నేను హీరోగా నటిస్తున్న ‘సాక్ష్యం’ సినిమాలో మంచి స్టోరీ కంటెంట్ ఉంది. యూనిక్ కాన్సెప్ట్. యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. ఇందులో వీడియో గేమ్ డైరెక్టర్ పాత్ర చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ ఫ్లై బోర్డింగ్, ఏటీవీ రైడింగ్‌తోపాటు బీఎమ్‌ఎక్స్ రైడింగ్ చేశాను. నా ఇంట్రడక్షన్ కూడా బీఎమ్‌ఎక్స్ సైక్లింగ్‌పై ఉంటుంది. ఇందుకోసం దుబాయ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. కాన్సెప్ట్ బేస్డ్‌గానే సినిమాలో ఐదు మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. రిలీజయ్యాక మంచి ప్రయత్నం అని ప్రేక్షకులు మెచ్చుకునేలా ‘సాక్ష్యం’ ఉంటుందని ఆశిస్తున్నాను. షూటింగ్ 70 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. న్యూయార్క్ షెడ్యూల్, మూడు పాటలు, క్లైమాక్స్ తప్ప షూటింగ్ కంప్లీట్ అయ్యింది. రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కొత్త యాంగిల్ ‘సాక్ష్యం’. శ్రీవాస్‌గారి వర్కింగ్ స్టైల్ సూపర్. ఎంజాయ్ చేస్తూ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాలో నా లుక్ ట్రెండీగా ఉంటుంది.
► ‘అల్లుడు శీను’ నాకు నచ్చి చేశాను. ‘జయజానకి నాయక’ ఫుల్ ఎమోషనల్ లవ్‌స్టోరీ. బోయపాటిగారు బాగా తీశారు. ‘స్పీడున్నోడు’ సినిమా తర్వాత బోయపాటిగారి లాంటి స్టార్ డైరెక్టర్ నన్ను నమ్మారు. నాలో ఆయనకు ఏం నచ్చిందో తెలీదు. నా మీద నమ్మకం ఉంచిన ఆయనకు థ్యాంక్స్. ‘స్పీడున్నోడు’ నుంచి ‘ జయజానకి నాయక’ సినిమాకు ఆరు నెలల్లో ఆల్మోస్ట్ 20 కేజీల బరువు తగ్గాను. ఇది అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పటి వరకు కెరీర్‌వైజ్‌గా నాది అమేజింగ్ జర్నీ. గతేడాది లాగానే ఈ ఇయర్ కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగాలని కోరుకుంటున్నాను. మాస్ ఇమేజ్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసి సినిమాలు చేయలేదు. అలా కథలు కుదిరాయి. ఈ విషయంలో ఐయామ్ లక్కీ అనిపిస్తుంది.
► ప్రతి విషయంలో నేను పాజిటీవ్‌గానే ఆలోచిస్తాను. విమర్శలను స్వీకరించగల మెంటల్‌స్ట్రెంత్ ఉంది. ప్రతి ఒక్కరు నేను ప్రొడ్యూసర్ (బెల్లంకొండ సురేష్) కొడుకు అనుకుంటారు. కానీ నేను చాలా కష్టపడతాను అని ఆలోచించే వారు తక్కువగా ఉంటారేమో.
► ప్రస్తుతం నాకున్న ఇమేజŒ తో హ్యాపీ. డైరెక్టర్స్‌లో కొత్త, పాత అన్న తేడా లేదు. మంచి కథ ఉంటే ఏ డైరెక్టర్‌తో అయినా చేస్తాను. నెక్ట్స్ మూవీ కోసం కథలు వింటున్నా. ఏడాదికి రెండు సినిమాలు చేయాలని ఉంది. తమిళ సినిమాల ఆలోచన ఇప్పట్లో లేదు. భవిష్యత్‌లో ద్విభాషా చిత్రం చేస్తానేమో చూడాలి.
ఆ విషయంలో నేను లక్కీ
Published Wed, Jan 3 2018 1:04 AM | Last Updated on Wed, Jan 3 2018 4:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment