బెల్లంకొండ సినిమాలో బాలీవుడ్‌ విలన్‌ | Neil Nitin Mukesh Confirmed For Bellamkonda Sai Srinivas Next | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 14 2018 10:36 AM | Last Updated on Wed, Mar 14 2018 11:08 AM

Neil Nitin Mukesh Confirmed For Bellamkonda Sai Srinivas Next - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

జయ జానకి నాయక సినిమాతో కమర్షియల్‌ హిట్ సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రస్తుతం శ్రీవాస్‌ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత సాయి శ్రీనివాస్‌ మరో భారీ బడ్జెట్‌లో చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

శ్రీనివాస్‌ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వంశధార క్రియేషన్స్‌ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. థ్రిల్లర్ జానర్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాలో విలన్‌గా నటిస్తున్న నీల్‌ నితిన్‌ నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అలరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement