Neil Nitin Mukesh
-
కూతురి కోసం...
షూటింగ్స్ ఆగిపోవడంతో ఇంటిపట్టున ఉంటున్న సినిమా స్టార్స్ తమకు నచ్చినట్లుగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ అయితే తన కూతురి కోసం సరదాగా పోనీ టెయిల్ వేసుకున్నారు. ‘‘నా కూతురు (నుర్వీ) పోనీ టెయిల్ వేసుకోనంటే వేసుకోనని ఒకటే మారాం చేసింది. తనని ఒప్పించడానికి నేను పోనీ టెయిల్ వేసుకున్నాను’’ అంటూ ఇక్కడున్న ఫొటోను షేర్ చేశారు నీల్ నితిన్. ప్రభాస్ ‘సాహో’, బెల్లకొండ సాయి శ్రీనివాస్ ‘కవచం’ చిత్రాల్లో నీల్ నితిన్ కీలక పాత్రల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
అతడే హీరో అతడే విలన్
చూడటానికి హాలీవుడ్ నటుడిలా ఉంటాడు. ఒక క్షణంలో హీరో. మరు నిమిషంలో విలన్. కాని ఎప్పుడూ ఆడపిల్లలు వెంటపడేలా ఉంటాడు. నీల్ నితిన్ ముఖేశ్ బాలీవుడ్లో, సౌత్‌లో ప్రస్తుతం చాలా బిజీ ఆర్టిస్ట్. పాటలు వినవచ్చే ఇంటి నుంచి వచ్చి వెండితెర మీద హంగామా సృష్టిస్తున్నాడు. నీల్ నితిన్ ముఖేశ్ పుట్టాక చూడటానికి ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ వచ్చింది. ఆమె ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆమె అలనాటి గొప్ప గాయకుడు ముఖేశ్‌ను తన సోదరుడిలా భావిస్తుంది కనుక. ముఖేశ్ కుమారుడు నితిన్ ముఖేశ్. నితిన్ ముఖేశ్ కొడుకు నీల్ నితిన్ ముఖేశ్. అంటే ముఖేశ్ మనమడు నీల్ నితిన్ ముఖేశ్. తల్లి పొత్తిళ్లలో ఉన్న నీల్‌ను చూసిన లత ‘ఈ పిల్లాడు మన దేశం పిల్లాడిలా లేడు. ఏదో గ్రహం నుంచి వచ్చినట్టుగా చాలా ముద్దులొలుకుతున్నాడు. చంద్రమండలం మీద కాలు పెట్టినవాడు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. అందుకని అతని పేరు పెట్టండి’ అని సూచించింది. అలా నీల్ నితిన్ ముఖేశ్ పేరు చంద్రుడితో ముడిపడింది. చంద్రుడిలాగే నీల్ కూడా అందగాడుగా ఎదిగాడు. నీల్ నితిన్ ముఖేశ్ కుటుంబం ఎప్పుడూ స్ట్రగుల్స్లోనే ఉంది. ముఖేశ్ గొప్ప గాయకుడే అయినా ప్రత్యేకమైన పాటలే అతనికి దక్కేవి. రఫీలా, కిశోర్ కుమార్లా అతడు అందరికీ పాడేవాడు కాదు. ఆయన తన కెరీర్లో స్థితిమంతుడు కాగలిగాడు కాని ఐశ్వర్యవంతుడు కాలేకపోయాడు. ఆయన కుమారుడు నితిన్ ముఖేశ్ కూడా తండ్రిలానే ప్లేబ్యాక్ సింగింగ్‌లో ప్రవేశించాడు. ‘తేజాబ్’లో ‘సోగయా ఏ జహా’ హిట్ పాట అతడు పాడింది. ‘నూరీ’ సినిమాలో ‘నూరీ... నూరీ’ పాట కూడా అతడే పాడాడు. అయితే తండ్రి గొంతులాగే నితిన్ ముఖేశ్ గొంతు కూడా అన్ని పాటలకు సరిపోదు. ఆ కుటుంబంలో మూడో తరంలో వచ్చిన నీల్ నితిన్ ముఖేశ్ తన తాతతండ్రులకు మల్లే గాయకుడు కావాలని అనుకోలేదు. నటుడు కావాలనుకున్నాడు. కాని అది అంత సులభమా? నీల్, రణ్‌బీర్ కపూర్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. రణ్‌బీర్ కపూర్ కాలేజ్‌కు వచ్చేవాడేకాని ఏనాడూ క్లాస్‌లో కూచునేవాడు కాదు. కాలేజీ బయటే అతనో కాలేజీ నడిపేవాడు తన గ్యాంగ్‌తో. నీల్‌కు ఆ గ్యాంగ్ పట్ల ఆకర్షణ ఉన్నా తన నేపథ్యం కారణాన బుద్ధిగా క్లాసుల్లో కూచునేవాడు. కాని ఆ పాఠాలు ఏమీ తలకెక్కేవి కాదు. యాక్టింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుండేవాడు. అది చూసిన రణ్‌బీర్ ‘అంత కష్టపడతావెందుకు. నేను కూడా యాక్టర్‌నే అవుదామనుకుంటున్నాను. కాని హైరానా లేకుండా ఉన్నాను’ అన్నాడు అతనితో. దానికి నీల్ ‘కరెక్ట్. నువ్వు అలాగే ఉండాలి. ఎందుకంటే నీది కపూర్ ఘరానా. మీరంతా నటులు. నాది మాధుర్ ఘరానా. మేమంతా పాటగాళ్లం. ఆ ఇంటి నుంచి వచ్చి నటుడిగా నిరూపించుకోవాలంటే చాలా కష్టపడాలి’ అన్నాడు. అన్నట్టుగా నటనలో తర్ఫీదు అయ్యాడు. అతని తీర్చిదిద్దినట్టుండే రూపం లాభించింది. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ అతన్ని హీరోగా పెట్టి ‘జానీ గద్దార్’ సినిమా తీశాడు. ‘జానీ గద్దార్’ ఒక క్రైమ్ థ్రిల్లర్. ఒక ముఠాలో నమ్మకంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఆ ముఠాకు చెందిన డబ్బును కాజేసే కుర్రాడిగా నీల్ అందులో నటించాడు. నిజానికి అది పూర్తిగా నెగెటివిటి ఉన్న పాత్ర. నీల్ వంటి అందగాడు అంత నిర్దయమైన పాత్రను పోషిస్తే ప్రేక్షకులు రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంది. కాని నీల్ తన ప్రతిభతో పాత్రను నమ్మించగలిగాడు. ‘జానీ గద్దార్’ పెద్ద హిట్ అయ్యింది. తర్వాత కబీర్ ఖాన్ దర్శకత్వంలో తయారైన ‘న్యూయార్క్’లో ముస్లిం కుర్రాడిగా నటించాడు. న్యూయార్క్‌లో చదువుకుంటూ పార్ట్‌టైమ్‌గా క్యాబ్ నడిపే అతగాణ్ణి పోలీసులు అరెస్ట్ చేస్తారు డిక్కీలో ఆయుధాలున్నాయని. కేసు క్షణాల్లో బిగుసుకుపోతుంది. అక్కణ్ణుంచి కథ మలుపులు తిరుగుతూ పోతుంది. న్యూయార్క్ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత నీల్‌కు కాలం కలిసి రాలేదు. ‘లఫంగే పరిందే’, ‘జైల్’, ‘తేరా క్యాహోగా జానీ’ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంకో మూడు సినిమాలు అదే దారి పట్టాయి. నీల్ తన తండ్రిలా, తాతలా స్ట్రగుల్ ఎదుర్కొనాల్సి వస్తుందా అని ఆందోళన చెందాడు. సినీరంగంలో ఈ ఆందోళన సర్వసాధారణం. ఇవాళ్టి పున్నమి. రేపటి అమావాస్య. అయితే అప్పుడు సౌత్ నుంచి మురగదాస్ ఆదుకున్నాడు. విజయ్ హీరోగా చేసిన ‘కత్తి’లో విలన్ వేషం ఆఫర్ చేశాడు. అది పెద్ద హిట్ అయ్యింది. ‘ప్రేమ్‌రతన్ ధన్ పాయో’, ‘గోల్మాల్ అగైన్’ వీటిలో వేసిన పాత్రలు, ఆ సినిమాలు హిట్ అయ్యాయి. ‘ఇందు సర్కార్’లో ‘సంజయ్‌గాంధీ’లా కనిపించి ఆకట్టుకున్నాడు నీల్. తెలుగులో ‘కవచం’, ‘సాహో’ సినిమాలు ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గర చేశాయి. నీల్ పెళ్లి చేసుకున్నాడు. రుక్మిణి సహాయ్ అతని భార్య పేరు. ఉమ్మడి కుటుంబంలో ఉండటానికే ఇష్టపడతాడు. శారీరక దారుఢ్యం మీద చాలా శ్రద్ధ పెట్టే నీల్ కనీసం పది పదిహేనేళ్లు అన్ని భాషలలో నటించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. మంచిగానూ చెడ్డగానూ కనిపించగల నటుల వరుసలో నీల్ టాప్ లెవల్లో ఉన్నాడు. అతని విజయపరంపరకు ఇప్పుడప్పుడే ఢోకా లేదు. – ఫీచర్స్ డెస్క్ -
పామును రౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేశాయి
-
వైరల్: పామును రౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేశాయి
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ స్వయంగా తీసి, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం పోస్ట్ చేసిన ఈ వీడియోను దాదాపు 78వేల మంది వీక్షించారు. ‘బైపాస్ రోడ్’ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన ఈ వీడియోను చిత్రీకరించారు. అయితే షూటింగ్ ఎక్కడ జరిగిందన్నది ఆయన తెలుపలేదు. ఆ వీడియోలో.. నాలుగు పిల్లులు ఓ నాగు పాము చుట్టుముట్టాయి. ఓకే సారి అన్ని పిల్లులు తనని చుట్టుముట్టేసరికి పాము కన్ఫ్యూజ్ అయింది. శత్రువులు ఏ వైపునుంచి దాడిచేస్తారో తెలియక బిక్కచచ్చిపోతూ చూడసాగింది. ఇంతలో ఓ పిల్లి పాము తల వెనకాలకు చేరింది. మెల్లగా పాము దగ్గరకు వచ్చి.. చదవండి : వైరల్: ఎంత అలసిపోతే మాత్రం.. అప్పుడు నిద్రపోతారా? చలానా వేస్తే చచ్చిపోతా.. యువతి హల్చల్ -
ఫేమస్ అవ్వటానికి ఇలా చేస్తావా..? : హీరో
బాలీవుడ్లో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకపోయినా హీరోగా క్యారెక్టర్, ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఆకట్టుకున్న నటుడు నీల్ నితిన్ ముఖేష్. ఇటీవల సౌత్ సినిమాలతోనూ అలరిస్తున్న ఈ నటుడు తాజాగా సాహో సినిమాతో మరోసారి మెప్పించాడు. అయితే సాహో రిలీజ్ తరువాత అంకూర్ పాటక్ అనే వ్యక్తి నీల్‌ను ఉద్దేశిస్తూ అభ్యంతరకర ట్వీట్ చేశాడు. ‘ఇది 2019, ఇంకా సినిమాలో నటిస్తున్నందుకు నిర్మాతలు నీల్ నితిన్ ముఖేష్‌కు డబ్బు ఎందుకు ఇస్తున్నారు? నాకు సమాధానం కావాలి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన నీల్.. ‘మీరు ఎవరో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. కానీ మీరు ఫేమస్ కావడానికి ఇది సరైన పద్ధతేనా..? మీకో విషయం చెప్పాలి. నేను గాడ్ ఫాదర్ లేకుండా 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటికీ కొనసాగుతున్నాను’ అంటూ రిప్లై ఇచ్చారు. నీల్ స్పందనపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రోల్స్‌కు సరైన సమాధానమిచ్చారంటూ నీల్‌ను అభినందిస్తున్నారు. Waise Pathak ji. Aap kaun hai pata nahi aur Janna bhi nahi chahta. But Is this the best way YOU seek attention haha. Let me tell you one thing. I’ve survived for 12 years without Godfathers and I will keep surviving. https://t.co/gVPgYuLeIb — Neil Nitin Mukesh (@NeilNMukesh) August 30, 2019 -
‘సాహో నుంచి తీసేశారనుకున్నా’
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సాహో టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌లోనూ భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఆ అంచనాలు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రధాన పాత్రదారులు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన నీల్ నితిన్ ముఖేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘దర్శకుడు సుజీత్ ఈ సినిమా కథ బాహుబలి తొలి భాగం రిలీజ్ సమయంలోనే నాడు వినిపించాడు. కథ నచ్చటంతో వెంటనే ఓకె కూడా చెప్పాను. కానీ ప్రభాస్.. బాహుబలి 2తో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ ఆలస్యమైంది. నేను కూడా ఇతర సినిమాలు చేశాను. ఒక దశలో నన్ను సాహో నుంచి తీసేశారేమో అనుకున్నా. కానీ సుజీత్ ఇచ్చిన మాట ప్రకారం నన్ను కీలక పాత్ర కోసం మళ్లీ పిలిచారు’ అని వెల్లడించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘సాహో’ను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈసినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అంతం అన్నింటికీ సమాధానం కాదు
ఇండియన్ తెరపై ఇంతవరకెన్నడూ చూడని యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. బాహుబలి లాంటి సినిమాల తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్రబృందం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్, సాంగ్స్‌తో భారీ అంచనాలను పెంచేసిన సాహో.. రోజురోజుకూ హైప్ పెంచేస్తోంది. ఈ చిత్రంలో ముఖ్యపాత్రలను పోషించిన వారి పోస్టర్లను రిలీజ్ చేస్తోంది యూనిట్. అంతం అన్నింటికీ సమాధానం కాదు అంటూ నీల్ నితీష్ ముఖేష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తాజాగా.. బ్లడ్‌కు బ్లడీ ఇన్విటేషన్ అవసరం లేదంటూ అరుణ్ విజయ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ డైలాగ్‌లను చూస్తుంటే వీరి క్యారెక్టర్స్ ఏరేంజ్‌లో ఉండబోతున్నాయో అర్థమవుతోంది. యూవీ క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్ట్ 30న విడుదల కానుంది. Swooning the audience with his mysterious look.. Here comes our first character poster ft. @NeilNMukesh in a dashing avatar! 😎#Saaho releases worldwide on 30th August! #30AugWithSaaho #Prabhas @ShraddhaKapoor @sujeethsign @UV_Creations @itsBhushanKumar @TSeries pic.twitter.com/vEChHoEnjf — UV Creations (@UV_Creations) August 5, 2019 Here comes our second super stylish character poster ft @arunvijayno1 as #Vishwank 😎#Saaho releases worldwide on 30th August! #30AugWithSaaho pic.twitter.com/Iu5tjThaDB — UV Creations (@UV_Creations) August 6, 2019 -
బాలీవుడ్ పిలుస్తోంది!
సినిమా: దక్షిణాది కథానాయికలు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం అంత సులభమైన విషయం కాదు. ఇక్కడ ఎంతో క్రేజ్ తెచ్చుకుంటేగానీ అది సాధ్యం కాదు. అలాంటిదిప్పుడు నటి భావనారావుకు అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. కన్నడ నటి భావనారావు. మాతృభాషలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ తమిళంలోనూ పరిచయమైంది. ఇక్కడ కొలకొలయా ముందిరిక్కా, విణ్మీన్గళ్, వనయుద్ధం చిత్రాల్లో నటించిన ఈ భామ కన్నడంలో 2017లో నటించిన సత్యహరిచంద్ర చిత్రం ఆమెకు అభినందనలు, అవార్డులను తెచ్చిపె ట్టింది. ప్రస్తుతం శివరాజ్‌కుమార్, సుధీప్, ఎమీజాక్సన్ నటిస్తున్న విలన్ అనే చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇలా కన్నడం, తమిళం భాషల్లో నటిస్తున్న భావనారావ్ను బాలీవుడ్ పిలిచింది. హిందీలో నీల్ నితిన్ ముఖేశ్‌కు జంటగా బైపాస్ రోడ్డు అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ ఎంట్రీ గురించి భావనారావ్ తెలుపుతూ తాను కన్నడ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, హిందీ, తెలుగు, ఇతర భాషా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. అలా ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు నమన్ నితీశ్ దర్శకత్వం వహిస్తున్న బైపాస్ రోడ్డు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. ఈ చిత్రం ఊహించని మలుపులతో సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది. దర్శకుడు కథ చెప్పగానే అందులో తన పాత్ర చాలా నచ్చిందని చెప్పింది. ఈ చిత్రంలో చాలా బలమైన పాత్ర అని, నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర కావడంతో సవాల్‌గా తీసుకుని నటిస్తున్నట్లు చెప్పింది. నటిగా తనకు నూతన సంవత్సరం చాలా ఆనందంగా ప్రారంభమైందని చెప్పింది. తొలిసారిగా బాలీవుడ్‌కి ప్రవేశించడం చాలా సంతోషంగా ఉందని అంది. హిందీలోనూ మంచి నటిగా రాణిస్తాననే నమ్మకం తనకుందని భావనారావ్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. స్వతహాగా భరతనాట్య కళాకారిణి అయిన భావనారావ్ నటనలోనూ శిక్షణ పొందడంతో బాలీవుడ్‌లోనూ రాణిస్తుందనే నమ్మకాన్ని ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. -
షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 స్టిల్స్
-
మా ముద్దుల కూతురు... నుర్వీ
బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కుటుంబం పెద్దదైంది. యస్.. మీ గెస్ నిజమే. నీల్ తండ్రి అయ్యారు. గత ఏడాది రుక్మిణి మాథుర్‌ని నీల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రుక్ష్మిణి ఓ పాపకు జన్మనిచ్చారు. ‘‘మొత్తం ముఖేష్ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నాం. దేవుడి దయ వల్ల తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. మా డార్లింగ్ డాటర్‌కి నుర్వీ నీల్ ముఖేష్ అని నామకరణం చేశాం’’ అని నీల్ పేర్కొన్నారు. ఇక ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... సౌత్‌లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న మరో సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. అటు నార్త్‌లో నీల్ హీరోగా ‘బైపాస్ రోడ్’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో టాలీవుడ్ ‘హార్ట్ఎటాక్’ గాళ్ అదా శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. నీల్ బ్రదర్ నామాన్ నీల్ నితిన్ ముఖేష్ ఈ సినిమాకు దర్శకుడు కావడం విశేషం. -
విలన్‌ను మిస్ అవుతున్న హీరో!
‘జయ జానకి నాయకా’ లాంటి హిట్ సినిమా తరువాత ‘సాక్ష్యం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. అయితే సాక్ష్యం మాత్రం ఈ హీరోకి అంతగా కలిసి రాలేదు. ఇక ఈ సినిమా ఫలితం తన తదుపరి చిత్రాలపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగార్వాల్ కలిసి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ విలన్‌కు సంబంధించిన యాక్షన్ పార్ట్ షూటింగ్‌ను కంప్లీట్ చేసేసింది చిత్ర యూనిట్. అయితే ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ.. తనతో వర్క్ చేయడం చాలా సరదాగా ఉందంటూ ట్వీట్ చేశాడు మన హీరో. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. వంశధార క్రియేషన్స్‌పై నవీన్ శొంటినేని నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. We'll miss the action on sets @NeilNMukesh.. was super fun working with you. Glad #BSS5 gonna be your first Telugu release :)) See you soon bro 😎@MsKajalAggarwal pic.twitter.com/ysyHI7tjfL — Sai bellamkonda (@BSaiSreenivas) August 13, 2018 -
ప్రభాస్ అందర్నీ ప్రేమలో పడేస్తాడు!
బాహుబలి సిరిస్‌తో ప్రభాస్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. ప్రభాస్ గురించి ఏ చిన్న విషయమైనా దేశం మొత్తం చూస్తోంది. బాహుబలితో అంతగా ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అబుదాబిలో భారీ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు నీల్ నితీన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో తను, తన భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్చేశాడు. ‘ నేషనల్ డార్లింగ్ ప్రభాస్. అతను చాలా ఆత్మీయంగా మాట్లాడుతాడు. ఆయన పిలిచిన వెంటనే మాతో వచ్చి గడిపిన తీరు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అతను అందర్నీ వెంటనే ప్రేమలో పడేస్తాడు’ అంటూ ఫోటోతో పాటు, కామెంట్‌ను పోస్ట్ చేశాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
బెల్లంకొండ సినిమాలో బాలీవుడ్ విలన్
జయ జానకి నాయక సినిమాతో కమర్షియల్ హిట్ సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత సాయి శ్రీనివాస్ మరో భారీ బడ్జెట్లో చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాలో విలన్‌గా నటిస్తున్న నీల్ నితిన్ నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అలరించనున్నారు. -
‘సాహో’.. తాజా అప్డేట్
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో యువి క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సుజిత్(రన్ రాజా రన్ ఫేం) దర్శకుడు. భారీ యాక్షన్ సీన్స్ షూట్ కోసం చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుండగా కొద్ది రోజులుగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. దుబాయ్‌లో అత్యంత భారీ వ్యయంతో సాహో యాక్షన్ సీన్స్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో ఫైట్స్ తో పాటు చేజ్ సీన్స్ కూడా చిత్రీకరించాలని భావించారు. అయితే అనుమతుల విషయంలో ఆలస్యం జరగటంతో ఈషెడ్యూల్ ను వాయిదా వేశారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో దుబాయ్ తరహా సెట్‌ను రూపొందించిన రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసే అవకాశాలను కూడా చిత్రయూనిట్ పరిశీలించారట. అయితే తాజా సమాచారం ప్రకారం మార్చి మూడో వారం నుంచి దుబాష్ షెడ్యూల్ షూటింగ్ మొదలు కానుందట. అనుమతుల విషయంలో క్లారిటీ రావటంతో ఇప్పటికే కొంత మంది యూనిట్ సభ్యులు దుబాయ్ చేరుకొని ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశారు. ఈ షెడ్యూల్లో దుబాయ్, అబుదాబి, రొమేనియాల్లో 60 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఉత్తరాది నటులు నీల్ నితన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, మందిరా బేడిలు కీలక పాత్రలో నటిస్తున్నారు. -
ప్రభాస్ నిజంగా డార్లింగే..
ముంబై: బాహుబలితో జాతీయ స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌పై ప్రశంసల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రభాస్ కొత్త చిత్రం సాహోలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్.. ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ నిజంగా డార్లింగ్ అని.. తనతో పని చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. పనిలో పనిగా హీరోయిన్ శ్రద్ధా కపూర్‌పై ప్రశంసించారు. త్వరలోనే సెట్స్‌లో మీతో చేరనున్నందకు సంతోషంగా ఉందని నీల్ నితిన్ ట్వీట్ చేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న సాహోలో వీరితో పాటు జాకీష్రాఫ్, మందిరా బేడి, అరుణ్ విజయ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్నితెలుగుతో పాటు తమిళం, హిందీలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. #Prabhas is truly a Darling and @ShraddhaKapoor you are amazing. Looking forward to seeing you soon on the sets. God Bless. — Neil Nitin Mukesh (@NeilNMukesh) October 6, 2017 -
సెకండ్ గేరులోకి...
ఫస్ట్ గేరులో బండి, బస్సు, కారు... ఏవైనా నెమ్మదిగా వెళతాయి. సెకండ్ గేరులో స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రభాస్ అండ్ కో కూడా సెకండ్ గేరులోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ‘సాహో’ బండి (సిన్మా)ని సెకండ్ గేరు (షెడ్యూల్)లోకి తీసుకెళ్లి చిత్రీకరణ స్పీడ్ పెంచాలనే ఉద్దేశంలో ఉన్నారు. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీలు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. హైదరాబాద్‌లో ఓ పది రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. హీరో ప్రభాస్, విలన్ నీల్ నితిన్ ముఖేశ్, ఇతర ముఖ్య తారలపై కొన్ని సీన్స్ తీశారు. మరో వారంలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వేస్తున్నారు. ప్రస్తుతం సెట్ వర్క్ స్పీడుగా జరుగుతోంది. చిత్రీకరణ సంగతి పక్కన పెడితే... ఇందులో హీరోయిన్ ఎవరనేది ప్రకటించలేదు. -
ఇందు సర్కార్
భారత దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా మధుర్ బండార్కర్ తెరకెక్కించిన చిత్రం ‘ఇందు సర్కార్’. ఆమె విధించిన ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందిరా గాంధీ పాత్రను సుప్రియా వినోద్ చేశారు. ఇందిరాగాంధీ రెండో తనయుడు సంజయ్‌గాంధీ రోల్‌ను నీల్ నితిన్ ముఖేష్ చేశారు. ఇందు అనే అమ్మాయి పాత్రను కృతీ కుల్హరీ చేశారు. నిజ జీవిత కథలను తెరెకెక్కించడంలో మధుర్ బండార్కర్ ప్రతిభావంతుడు. ఈ చిత్రం పై అంచనాలు పెరగడానికి అదో కారణమైతే మరో కారణం సుప్రియ, నీల్ నితిన్ లుక్స్. అచ్చంగా ఇందిరా గాంధీలా సుప్రియ లుక్, సంజయ్‌లా నీల్ లుక్ ఉండటం విశేషం. పాత్రలకు తగ్గ ఆర్టిస్టులను ఎన్నుకోవడంలో మధుర్ సిద్ధహస్తుడని లుక్స్ చూసినవాళ్లు అంటున్నారు. ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది. -
ప్రభాస్‌కు విలన్!
ఆరడుగుల ఎత్తు. ఏనుగునైనా లొంగదీయగల కండ బలం. ఆపదలో ఆలోచననే ఆయుధంగా వాడల బుద్ధి బలం. ఇలాంటి లక్షణాలు ఉన్న ఓ హీరోతో పోటీపడాలంటే ఆ శత్రువు ఎలా ఉండాలి. ఎత్తుకు పై ఎత్తు వేయాలి. పరిస్థితుల్ని వాడాలి. అదును చూసి దెబ్బకొట్టాలి. ఈ దెబ్బకు హీరో దిమ్మ తిరగాలి. ఇలాంటి విలన్‌ను గెలిస్తేనే కదా ఈ హీరో సత్తా ఏంటో మరింత తెలిసేది. ప్రస్తుతం ‘సాహో’టీమ్ అదే పనిలో ఉందట. ఎందుకంటే పై లక్షణాలన్నీ ఈ చిత్ర కథానాయకుడికి ఉంటాయట. ఇందులో ప్రభాస్ హీరో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోకి పోటాపోటీగా ఉండాలని విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్‌ను తీసుకున్నారట. బాలీవుడ్ చిత్రాలు ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘ప్లేయర్స్’, ‘వాజిర్’ వంటి చిత్రాల్లో నితిన్ ముఖేష్నే విలన్. మురగదాస్ డైరెక్షన్లో వచ్చిన ‘కత్తి’ సినిమాలోనూ విలన్‌గా ఇరగదీశాడు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని సమాచారం. -
చిరుకు నో చెప్పి.. ప్రభాస్‌కు ఓకె..!
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాకు రెడీ అవుతున్నాడు. బాహుబలి కోసం నాలుగేళ్ల పాటు కష్టపడ్డ డార్లింగ్ ప్రజెంట్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సాహో సెట్స్ మీదకు వెళ్ళనున్న నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడు పెంచారు. ఇప్పటికే కథా కథనాలు ఫైనల్ కాగా ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్స్‌తో పాటు సౌత్ హీరోయిన్స్‌ను కూడా పరిశీలిస్తున్నారు. తాజాగా ఈ భారీ చిత్రానికి ప్రతినాయకుణ్ని ఫైనల్ చేశారు. బాలీవుడ్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఫాంలో ఉన్న యువ నటుడు నీల్ నితిన్ ముఖేష్‌ను ఫైనల్ చేశారట. గతంలో తమిళ సినిమా కత్తిలో విలన్‌గా నటించిన నీల్, తరువాత చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 కోసం సంప్రదించినా అంగీకరించలేదు. అయితే తాజాగా ప్రభాస్ సాహోలో నటించేందుకు నీల్ అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సాహోకు సంబంధించిన నటీనటులు వివరాలతో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
నీల్ నితిన్ ముఖేష్, రుక్మిణి సహాయ్ రిసెప్షన్
-
'నా పేరు చూసి నవ్వాల్సిన పనిలేదు'
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తన పేరును ఎగతాళి చేయడంపై బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ స్పందించాడు. తన పేరు చూసి నవ్వాల్సిన పనిలేదని, అది తనకెంతో గర్వకారణమని చెప్పాడు. దిగ్గజ గాయకుడు ముకేశ్ కుటుంబంలో పుట్టడం దీవెనగా భావిస్తున్నామని అన్నాడు. 'నా పేరు చూసి చాలా మంది నవ్వుతున్నారు. కానీ నేను గర్వపడుతున్నాను. ఈ రోజుల్లో తండ్రుల పేర్లను ఎంత మంది పెట్టుకుంటున్నారు. వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నార'ని ప్రశ్నించాడు. నీల్.. ప్రముఖ గాయకుడు నితిన్ ముకేశ్ కుమారుడు, దిగ్గజ గాయకుడు ముకేశ్ కుమార్ మనవడు. తన తండ్రి, తాత పేరు నిలపాల్సిన బాధ్యత తన భుజాలపై ఉందని నీల్ అన్నాడు. ఏనుగులపై సవారీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు 'పెటా'తో అతడు చేతులు కలిపాడు. -
హాలీవుడ్లో మరో భారతీయ నటుడు
బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నాడు. విలక్షణ నటులు, టాప్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు మాత్రమే సాధించగలిగే హాలీవుడ్ ఆఫర్‌ను అందుకున్నాడు నీల్. ప్రస్తుతం సల్మాన్ హీరోగా నటిస్తున్న 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' షూటింగ్ పూర్తి చేసిన నీల్ త్వరలో హాలీవుడ్ టివి సీరీస్ షూటింగ్లో పాల్గొననున్నాడు. హెచ్‌బివో ఛానల్లో ప్రసారం అవుతున్న 'గేమ్ ఆఫ్ త్రోన్స్' టివి సీరీస్ కోసం బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్‌ను సంప్రదించారు. 'గేమ్ ఆఫ్ త్రోన్స్'ను డైరెక్ట్ చేస్తున్న జార్జ్ పోవెల్, 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా కోసం రెండు కత్తి యుద్ధాలను డైరెక్ట్ చేశాడు. ఈ సన్నివేశాల కోసం నీల్నితిన్కు నెల రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ సమయంలోనే నీల్ వర్కింగ్ స్టైల్ నచ్చిన డైరెక్టర్ జార్జ్, తన టివి సీరీస్‌లో ఆఫర్ ఇచ్చాడు. 'ప్రేమ్ రథన్ ధన్ పాయో' సినిమాలో భారతీయ రాజకుటుంబానికి చెందిన యువకుడిగా నటిస్తున్నాడు నీల్ నితిన్ ముఖేష్. రాజశ్రీ ప్రొడక్షన్స్ భారీగా నిర్మిస్తున్న ఈసినిమాకు సూరజ్ బర్జాత్యా దర్శకుడు. సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. -
ఆసిన్ ప్రేమకు బ్రేకప్
చెన్నై: నటి ఆసిన్ ప్రేమ బ్రేకప్ అయినట్లు బాలీవుడ్లో ప్రచారం హోరెత్తుతోంది. తెలుగు,తమిళ భాషల్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన ఆమె గజినీ చిత్రంతో బాలీవుడ్ రంగప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే అక్కడ యమ క్రేజ్‌ను సంపాదించుకున్న ఆసిన్‌కు హిందీలో అవకాశాలు వెల్లువెత్తాయి. గజినీ తరువాత సల్మాన్‌ఖాన్‌తో రెడీ, అక్షయకుమార్ సరసన హౌస్‌ఫుల్ 2, కిలాడి 786, అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా భోల్ బచ్చన్ భోల్ చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్‌తో ప్రేమాయణం నడిపారు. అయితే కొంతకాలం తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఆసిన్ ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాకుల్శర్మతో పరిచయం ప్రేమగా మారిందనే ప్రచారం జోరుగా సాగింది. దాన్ని ఈ ప్రేమ జంట ఖండించలేదు. అలా 2013 నుంచి సాగిన ఆసిన్ రాకుల్ల ప్రేమకు తాజాగా బ్రేక్ పడిందని బాలీవుడ్ వర్గాల బోగట్టా. ప్రస్తుతం ఆల్ఈజ్ వెల్ చిత్రంలో ఆసిన్, అభిషేక్‌బచ్చన్ జంటగా నటిస్తున్నారు.