
కూతురు నుర్వీతో నీల్ నితిన్ ముఖేష్
షూటింగ్స్ ఆగిపోవడంతో ఇంటిపట్టున ఉంటున్న సినిమా స్టార్స్ తమకు నచ్చినట్లుగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ అయితే తన కూతురి కోసం సరదాగా పోనీ టెయిల్ వేసుకున్నారు. ‘‘నా కూతురు (నుర్వీ) పోనీ టెయిల్ వేసుకోనంటే వేసుకోనని ఒకటే మారాం చేసింది. తనని ఒప్పించడానికి నేను పోనీ టెయిల్ వేసుకున్నాను’’ అంటూ ఇక్కడున్న ఫొటోను షేర్ చేశారు నీల్ నితిన్. ప్రభాస్ ‘సాహో’, బెల్లకొండ సాయి శ్రీనివాస్ ‘కవచం’ చిత్రాల్లో నీల్ నితిన్ కీలక పాత్రల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment