ponytail
-
గుర్రంతో పోటీపడి పరుగులు తీస్తున్న ధోని..
రాంచీ: టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని తన పోనిటేల్ గుర్రంతో పోటీపడి మరి పరుగులు తీశాడు. ఐపీఎల్ 14వ సీజన్ రద్దు కావడంతో ధోని రాంచీకి చేరుకొని తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్న స్కాటిష్ బ్రిటీష్ గుర్రం అయిన షెట్లాండ్ పోనితో సరదాగా ఆడుకున్నాడు. అది పరుగులు తీస్తుంటే.. ధోని కూడా దాని వెనకాలే పరిగెత్తుతూ చిన్న పిల్లాడిలా మారిపోయాడు. అయితే గుర్రంతో పోటీపడి పరుగులు తీయలేక ఒక దశలో వెనుకపడ్డాడు. అయితే 35 ఏళ్లు వచ్చిన తనలో ఫిట్నెస్ మాత్రం తగ్గలేదని ధోని చూపించాడు.దీనికి సంబంధించిన వీడియోనూ సాక్షి ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. '' స్ట్రాంగర్ దెన్ ఫాస్టర్.. ఇట్స్ ప్లే టైమ్ విత్ షెట్లాండ్ పోనీటేల్'' అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇక ధోని సారధ్యంలోని సీఎస్కే ఐపీఎల్ 14వ సీజన్లో దుమ్మురేపింది. యూఏఈ వేదికగా జరిగిన గత ఐపీఎల్ సీజన్‌ను మరిపిస్తూ సీఎస్కే ప్రదర్శన కొనసాగింది. సీఎస్కే తాను ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. 2 ఓటములతో 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక కరోనా మహమ్మారితో వాయిదా పడిన లీగ్‌ను సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. చదవండి: శతక్కొట్టిన పంత్.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్ View this post on Instagram A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) -
పోనీ టెయిల్‌కి సెకండ్ వెర్షన్
వేసవిలో జుట్టును లూజ్‌గా వదిలేయడం ఇబ్బందిగానే ఉంటుంది. వెంట్రుకలు మెడమీద పడకుండా, నీటుగా హెయిర్‌స్టైల్ ఉండాలనుకుంటే ఈ స్టైల్‌ను ఫాలో అవ్వచ్చు. ఇది పోనీటెయిల్‌కి సెకండ్ వెర్షన్‌గా చెప్పచ్చు. ► జుట్టును చిక్కుల్లేకుండా దువ్వాలి. తర్వాత అటూ ఇటూ రెండు పాయలు తీసి ఒక పాయగా కలిపేసి, మధ్యన రబ్బర్ బ్యాండ్ వేయాలి. ► రబ్బర్ బ్యాండ్ వేసిన పాయకు దిగువ భాగాన మరొక రబ్బర్ బ్యాండ్ వేయాలి. ► రెండు రబ్బర్ బ్యాండ్స్ మధ్యలో ఉన్న హెయిర్‌ను ఓవెల్ షేప్ ఖాళీ ఉంచి, ఆ మధ్యలో నుంచి మిగతా హెయిర్‌ను బయటకు తీసి, ఒకసారి దువ్వెనతో దువ్వి, వదిలేయాలి. ► జుట్టు మందంగా ఉన్నవారు మధ్య నుంచి ఒక పాయగా తీసి, మెడమీద మిగతా హెయిర్‌తో కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. దీనివల్ల మెడ మీద చెమట కు వెంట్రుకలు చికాకు పెట్టకుండా, హెయిర్‌స్టైల్ నీటుగా ఉంటుంది. – సత్యశ్రీ సుతారి హెయిర్ స్టైలిస్ట్, ఫస్ట్ ఫౌండేషన్, హైదరాబాద్ -
Ponytail Hairstyles: పోనీటెయిల్.. ఈజీగా స్టైల్
చాలా వరకు రోజూ పోనీటెయిల్ వేసుకుంటుంటారు. వేసవిలో ఈ స్టైల్ సాధారణంగా చూస్తుంటాం. అయితే, ఎప్పుడూ ఒకే హెయిర్ స్టైల్ బోర్‌గా ఉంటుంది. భిన్నంగా ఏమీ అనిపించదు. కొత్తగా హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలంటే చాలా టైమ్ పడుతుంది అనుకుంటారు. కానీ, సింపుల్ హెయిర్ స్టైల్స్‌ను ట్రై చేయవచ్చు. తల ముందు భాగంలో చిన్న మార్పు చేసినా, ముఖానికి కొత్త అందం వస్తుంది. ఇది రెగ్యులర్‌గా వేసుకోవడానికి స్టైల్‌గానూ ఉంటుంది. ► జుట్టు అంతా చిక్కులు లేకుండా దువ్వాలి. ► ముందు భాగం నుంచి ఎడమవైపున ఒక పాయ తీయాలి. ► ఆ పాయను మూడు పాయలుగా విభజించి, జడలా చివరి వరకు అల్లాలి. ► సైడ్ జడ పాయను తల వెనుక భాగానికి తీసుకొని, పిన్నులు పెట్టాలి. ► మిగతా జుట్టును అంతా చేతిలోకి తీసుకొని, దువ్వి, గట్టిగా బ్యాండ్ పెట్టాలి. ఈ స్టైల్ సింపుల్‌గానూ, స్టైలిష్‌గానూ ఉంటుంది. రోజూ చేసే హెయిర్ స్టైల్‌నే చిన్న మార్పుతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. – సత్యశ్రీ, హెయిర్ అండ్ మేకప్ స్టైలిష్ట్, ఫస్ట్ ఫౌండేషన్, హైదరాబాద్ -
ఆర్మీ: నెయిల్ పాలిష్, పోనిటెయిల్‌కు ఓకే
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.. అగ్రరాజ్య సైన్యానికి సంబంధించి పలు కీలక మార్పులకు ఆమోదం తెలిపారు. సైన్యంలో మహిళా సైనికుల వస్త్రధారణకు సంబంధించి కొన్ని నియమాల్లో కీలక మార్పులు చేశారు. ఇక మీదట అమెరికన్ సైన్యంలోని మహిళా సైనికులు షార్ట్ పోనిటెయిల్ వేసుకోవడానికి.. లిప్‌స్టిక్ పెట్టుకోవడానికి అనుమతించారు. అలానే మగ సైనికులు స్పష్టమైన రంగుల నెయిల్ పాలిష్ ధరించవచ్చని తెలిపారు. ఇక బిడ్డకు పాలిచ్చే మహిళా సైనికులు వస్త్రధారణకు సంబంధించి పలు సడలింపులు ఇచ్చారు. బ్రెస్ట్ ఫీడింగ్, పంపింగ్ ద్వారా బిడ్డకు పాలిచ్చే తల్లులు ప్రస్తుత వస్త్రధారణ ప్రమాణాలకు అదనంగా లోపల మరో వస్త్రం ధరించేందుకు అనుమతిచ్చారు. ఈ నూతన మార్పులు ఫిబ్రవరి 25 నుంచి అమల్లోకి రానున్నాయి అని తెలిపారు. ప్రస్తుత మార్పులు అమెరికా సైన్యంలో చేరే మహిళల సంఖ్యను పెంచుతాయని.. అంతేకాక ప్రస్తుతం ఉన్న మహిళా సైనికులపై అసమాన ప్రభావాన్ని చూపుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: బైడెన్ వలస చట్టంపై హోరాహోరీ ) మాజీ డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ సూచనల ఫలితమే ఈ మార్పులు. ఈ కమిటీ మిలటరీలో జాతివివక్ష, మైనారిటీలపై అధికార దుర్వినియోగం వంటి పలు అంశాల పరిశీలనకు ఉద్దేశించబడింది. గతంలో అమెరికా సైన్యంలోని మహిళలు పొడవాటి జుట్టును బన్(కొప్పు)లా కట్టుకోవాల్సి వచ్చేది. ఇది అసౌకర్యంగా ఉండటమే కాక.. హెల్మెట్ ధరించడంలో ఇబ్బంది కలిగేది. ఇక తాజా సవరణలతో ఈ సమస్యలు తొలగిపోనున్నాయి. ఈ సందర్భంగా ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ గ్యారీ బిట్రో మాట్లాడుతూ.. ‘‘మా విధానాలను నిరంతరం పరిశీలించుకుంటూ.. అవసరమైన చోట మార్పులు చేసుకుంటూ.. ముందుకు సాగుతున్నాం. ఇక మేం అవలించే విధానాల వల్ల సైన్యంలోని సైనికులందరు మాకు ఎంత విలువైన వారో.. వారి పట్ల మాకు ఎంత నిబద్ధత ఉందో వెల్లడవుతుంది. మా ర్యాంకుల్లో చేరిక, ఈక్విటీ వంటి అంశాల్లో.. మాటల కంటే చేతలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని ఈ రోజు మేం మరోసారి నిరూపించాం. మేం ప్రకటించిన ఈ మార్పులు మన ప్రజలను మొదటి స్థానంలో ఉంచే విధానాలకు ఒక ఉదాహరణ అని మేం నమ్ముతున్నాం’’ అన్నారు. (చదవండి: అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్) The #USArmy has revised Army Regulation 670-1, Wear and Appearance of Army Uniforms and Insignia. The updates will be effective Feb. 25, 2021 and directly supports the Army’s diversity and inclusion efforts. Learn more in this STAND-TO! ➡️ https://t.co/Y2VlaZgQHr#ArmyLife pic.twitter.com/4y9e7hBJ5a — U.S. Army (@USArmy) January 27, 2021 ఇక ఆర్మీలో చేసిన ఈ మార్పులు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మగ వారికి నెయిల్ పాలిషా.. వ్వాటే జోక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అమెరికా వాయు సేన తన విభాగంలో పని చేస్తున్న మహిళా సైనికుల హెయిర్ స్టైల్ విషయంలో పలు మార్పులు చేసిన వారం రోజుల తర్వాత మిలిటరీ ఈ నూతన మార్పులు ప్రకటించింది. ఇక ఇదే కాక బైడెన్ లింగమార్పిడి వ్యక్తులను సైన్యంలోకి నిషేధిస్తూ.. ట్రంప్ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. అంతేకాక ‘‘దేశానికి సేవ చేయాలనుకునే వారిని ప్రోత్సాహిస్తేనే.. అమెరికా సురక్షితంగా ఉంటుంది. అలాంటి వారి విషయంలో వివక్ష చూపకూడదని.. వారి పట్ల గర్వంగా భావించాలి’’ అని బైడెన్ ట్వీట్ చేశారు. -
కూతురి కోసం...
షూటింగ్స్ ఆగిపోవడంతో ఇంటిపట్టున ఉంటున్న సినిమా స్టార్స్ తమకు నచ్చినట్లుగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ అయితే తన కూతురి కోసం సరదాగా పోనీ టెయిల్ వేసుకున్నారు. ‘‘నా కూతురు (నుర్వీ) పోనీ టెయిల్ వేసుకోనంటే వేసుకోనని ఒకటే మారాం చేసింది. తనని ఒప్పించడానికి నేను పోనీ టెయిల్ వేసుకున్నాను’’ అంటూ ఇక్కడున్న ఫొటోను షేర్ చేశారు నీల్ నితిన్. ప్రభాస్ ‘సాహో’, బెల్లకొండ సాయి శ్రీనివాస్ ‘కవచం’ చిత్రాల్లో నీల్ నితిన్ కీలక పాత్రల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
పిలక ఉందని ఎల్కేజీ విద్యార్ధికి ఉద్వాసన
కార్పొరేట్ పాఠశాలల్లో పెట్టే నిబంధనలకు అర్థం పర్థం లేకుండా పోతోంది. ఇంగ్లీషులో మాట్లాడలేదని పంపేయడం లాంటి ఘటనలు ఇంతకుముందు చూశాం. కానీ, పిలక ఉందన్న కారణంగా ఎల్కేజీ చదివే పిల్లాడిని స్కూలు నుంచి తొలగించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. సెయింట్ విన్సెంట్ పల్లొంట్టి స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న మూడున్నరేళ్ల విష్ణును ఇంటికి తీసుకెళ్లేందుకు వాళ్ల తండ్రి మంజునాథ్ స్కూలుకు వచ్చారు. ప్రిన్సిపాల్ పాల్ డిసౌజా ఆయనను పిలిపించి, పిల్లల్ని ఇలా పిలకతో పంపకూడదని.. పిలక కట్ చేస్తేనే అతన్ని పాఠశాలలో కొనసాగనిస్తామని చెప్పారు. బాబుకు ఐదేళ్లు వచ్చేవరకు తల వెంట్రుకలు తీయరాదని, ఇది తమ కుటుంబ ఆచారమని మంజునాథ్ ప్రిన్సిపల్‌కు తెలిపారు. అయితే అలాంటి మూఢనమ్మకాలను తాము అంగీకరించబోమని ప్రిన్సిపల్ మొండిగా మాట్లాడి పిల్లాడిని పాఠశాల నుంచి పంపేశారు. అడ్మిషన్ సమయంలో తాను చెల్లించిన డొనేషన్ తిరిగి ఇచ్చారని మంజునాథ్ తెలిపారు. అయితే.. ఇప్పటికే అన్ని స్కూల్లోల అడ్మిషన్లు పూర్తయిపోయాయని, ఇక తమ పిల్లాడిని వచ్చే విద్యాసంవత్సరంలోనే స్కూలుకు పంపాల్సి ఉంటుందని మంజునాథ్ తెలిపారు. ఈ విషయంపై తమకు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, వస్తే పాఠశాలపై చర్య తీసుకుంటామని ప్రాథమిక విద్య డైరెక్టర్ కె.ఆనంద్ తెలిపారు. -
ఒబామా కుమార్తె ఫొటో హల్చల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె మలియా ఒబామా (16) ఫొటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. బ్రూక్లిన్ ర్యాప్ టీ షర్టు ధరించిన ఆమె పోని టెయిల్ హెయిర్‌తో నేరుగా ఫోజిచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫొటో ఎవరు తీశారు ? ఇంటర్నెట్లోకి ఎలా వచ్చిందో? అనే విషయం మాత్రం తెలియలేదు. అయితే అమెరిక అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా ఈ ఫొటోపై స్పందించలేదు.