చాలా వరకు రోజూ పోనీటెయిల్ వేసుకుంటుంటారు. వేసవిలో ఈ స్టైల్ సాధారణంగా చూస్తుంటాం. అయితే, ఎప్పుడూ ఒకే హెయిర్ స్టైల్ బోర్‌గా ఉంటుంది. భిన్నంగా ఏమీ అనిపించదు. కొత్తగా హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలంటే చాలా టైమ్ పడుతుంది అనుకుంటారు. కానీ, సింపుల్ హెయిర్ స్టైల్స్‌ను ట్రై చేయవచ్చు. తల ముందు భాగంలో చిన్న మార్పు చేసినా, ముఖానికి కొత్త అందం వస్తుంది. ఇది రెగ్యులర్‌గా వేసుకోవడానికి స్టైల్‌గానూ ఉంటుంది.
► జుట్టు అంతా చిక్కులు లేకుండా దువ్వాలి.
► ముందు భాగం నుంచి ఎడమవైపున ఒక పాయ తీయాలి.
► ఆ పాయను మూడు పాయలుగా విభజించి, జడలా చివరి వరకు అల్లాలి.
► సైడ్ జడ పాయను తల వెనుక భాగానికి తీసుకొని, పిన్నులు పెట్టాలి.
► మిగతా జుట్టును అంతా చేతిలోకి తీసుకొని, దువ్వి, గట్టిగా బ్యాండ్ పెట్టాలి.
ఈ స్టైల్ సింపుల్‌గానూ, స్టైలిష్‌గానూ ఉంటుంది. రోజూ చేసే హెయిర్ స్టైల్‌నే చిన్న మార్పుతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
– సత్యశ్రీ, హెయిర్ అండ్ మేకప్ స్టైలిష్ట్, ఫస్ట్ ఫౌండేషన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment