styles
-
బంధాలను ప్రభావితం చేసే బాల్యానుభవాలు
రాహుల్, పూజ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఇద్దరికీ ఆఫీసులో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు వాళ్ల కాపురం అందంగా, ఆనందంగా సాగింది. ఆ తర్వాత అవగాహనలో సమస్యలు ఏర్పడ్డాయి, విభేదాలు పెరిగాయి. రాహుల్ తనకు తగినంత సమయం ఇవ్వడం లేదని పూజ భావిస్తోంది. ఆమె అవసరాలు తీర్చడాన్ని ఒత్తిడిగా రాహుల్ భావిస్తున్నాడు. ఈ విషయమై తరచూ గొడవలు పడుతున్నారు. ఆ గొడవలను వారికి వారు పరిష్కరించుకోలేక కౌన్సెలింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.మూలాలు బాల్యానుభవాల్లో..మొదటి సెషన్లో విడివిడిగా రాహుల్, పూజలు తమ చిన్ననాటి అనుభవాలను వివరించారు. రాహుల్ చిన్నప్పుడు తన తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఎమోషనల్ సపోర్ట్ పొందలేకపోయాడు. ఫలితంగా అతనిలో అవాయిడెంట్ అటాచ్మెంట్ ఏర్పడింది. దీంతో బంధాలలో సాన్నిహిత్యం కంటే స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటున్నాడు. పూజ బాల్యంలో తల్లిదండ్రుల నుంచి అనిశ్చితమైన ప్రేమను పొందింది. పూజ తల్లిదండ్రులు ఆమె ఎమోషనల్ అవసరాలను కొన్నిసార్లు తీర్చేవారు, మరికొన్నిసార్లు విస్మరించేవారు. ఫలితంగా ఆమెలో యాంగ్షియస్ అటాచ్మెంట్ ఏర్పడింది. తన భాగస్వామి కాస్త దూరంగా ఉంటే చాలు అభద్రతను, భయాన్ని అనుభవిస్తోంది. దాంతో నిత్యం తనతోనే ఉండాలని రాహుల్ పై ఒత్తిడి పెంచుతోంది. ఈ వ్యత్యాసాల కారణంగా చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారాయి. ఒకరినొకరు తీవ్రంగా ప్రేమిస్తున్నప్పటికీ అపార్థాలకు దారితీశాయి.రెండు నెలల్లో సమస్యలు దూరం.. ఇద్దరితో మాట్లాడి, వారి అటాచ్మెంట్ స్టయిల్స్ గురించి, వాటివల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి అర్థం చేసుకున్నాక, వాటిని బ్యాలెన్స్ చేయడానికి వారికి సూచించిన వ్యూహాలు కొన్ని..1. రాహుల్ తన స్వేచ్ఛ కోసం చేసే పనులు ప్రేమను తిరస్కరించడం కాదని పూజ గుర్తించాలి. అలాగే తన నిరంతర ధ్రువీకరణ అవసరాన్ని పరిమితం చేసుకోవాలి. 2. ఇద్దరూ తమ భావోద్వేగాలను, అవసరాలను స్పష్టంగా, నిర్మాణాత్మకంగా కమ్యూనికేట్ చేయడం ప్రారంభించారు. ఉదాహరణకు, పూజకు ధ్రువీకరణ అవసరం ఉన్నప్పుడు, ఆమె ప్రశ్నల ద్వారా కాకుండా తన భావాలను చెప్పడం నేర్చుకుంది.3. పూజకు ఇవ్వాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ప్రాధాన్యాన్ని గుర్తించి రాహుల్.. ఆమెకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు. అదే సమయంలో పూజ కూడా రాహుల్ స్వేచ్ఛకు గౌరవం ఇవ్వడం తెలుసుకుంది.4. ఇరువురూ తమ రోజువారీ జీవనంలో పరస్పర సహకారం, చిన్నచిన్న ఆనందాలను ఆస్వాదించేందుకు సమయం కేటాయించటం మొదలుపెట్టారు. ఉదాహరణకు, వారాంతాల్లో కలిసి వాకింగ్ చేయడం లేదా ఒక కొత్త హాబీని ఆరంభించడం లాంటివి.రెండు నెలల కౌన్సెలింగ్ తర్వాత వారి సంబంధంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. దాంతో, వారి మధ్య గొడవలు తగ్గి, ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ పెరిగాయి.అటాచ్మెంట్ థియరీ మన చిన్ననాటి అనుభవాలు, పెంపకం విధానాలు మన ప్రస్తుత సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే సిద్ధాంతమే అటాచ్మెంట్ థియరీ. బాల్యంలో తల్లిదండ్రులతో ఏర్పడే అనుబంధం, మన వ్యక్తిత్వానికి, భావోద్వేగ వ్యవహారానికి, ముఖ్యంగా ప్రేమ సంబంధాలకు మూలస్తంభం అవుతుంది. అయితే, ఈ అటాచ్మెంట్ శైలులు స్థిరమైనవి కావు, వాటిని మార్చుకోవచ్చు. ఇందులో మూడు రకాలున్నాయి. సెక్యూర్ అటాచ్మెంట్సెక్యూర్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు ప్రేమ, నమ్మకం, అనుబంధానికి ప్రాధాన్యమిస్తారు. ఇతరులతో సంబంధాలను బలంగా, స్వతంత్రంగా, అనురాగపూర్వకంగా నిర్వహించగలుగుతారు. ఉదాహరణకు ఒక సెక్యూర్ వ్యక్తి తన భాగస్వామి కొంత సమయం స్వతంత్రంగా గడపాలని కోరితే, దాన్ని సానుకూలంగా అర్థం చేసుకుంటాడు.యాంగ్షియస్ అటాచ్మెంట్యాంగ్షియస్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు సంబంధాల్లో ఎక్కువ భయాన్ని, అస్థిరతను అనుభవిస్తారు. వీరు ఎక్కువగా భావోద్వేగ ధ్రువీకరణ కోసం భాగస్వామిపై ఆధారపడతారు. ఉదాహరణకు భాగస్వామి తక్షణమే ఫోన్ కాల్కి ప్రతిస్పందించకపోతే, తనపై ప్రేమ లేదా శ్రద్ధ తగ్గిందని అనుమానపడతారు.అవాయిడెంట్ అటాచ్మెంట్అవాయిడెంట్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిస్తారు. అనుబంధం, సాన్నిహిత్యాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు ఈ అటాచ్మెంట్ శైలి ఉన్న వ్యక్తి.. భాగస్వామి తనతో ఎక్కువ సమయం గడపాలని కోరితే.. తన స్వేచ్ఛను లాగేసుకుంటున్నట్లు భావిస్తాడు, ప్రతిఘటిస్తాడు. -
Manish Malhotra: పల్లకీలో పెళ్లికూతుళ్లకు మనీష్ మల్హోత్రా సరికొత్త సొబగులు (ఫోటోలు)
-
శారీనే... కానీ కాస్త స్టయిల్ మారింది! ఫోటోలు
-
నవ్వుతూ ఉండాలి
‘సీతారామం’లోని సీత.. మృణాల్ ఠాకూర్.. భారీ సక్సస్ సాధించినప్పటికీ సెలెక్ట్‌డ్‌గా సినిమాలు చేస్తూ సెపరేట్ స్టయిల్ క్రియేట్ చేసుకుంది. ఆ స్టయిల్‌నే ఫ్యాషన్‌లోనూ చూపిస్తోంది.మా నాన్నే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఎన్ని సమస్యలున్నా హాయిగా నవ్వుతూ ఉండాలని నేర్పించారు. మంచి ఫలితాలకు సమయం పడుతుందని, సహనంతో వేచిచూడాలని చెబుతుంటారు. దాన్నే నమ్ముతాను! – మృణాల్ ఠాకూర్ మృణాళినీ రావ్.. ఇండియన్ టాప్ డిజైనర్స్‌లో ఒకరైన మృణాళినీ రావ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! చిన్నప్పుడు డాక్టర్ కావాలనుకుంది. పెద్దయ్యాక ఫ్యాషన్‌పై ఆసక్తి కలిగింది. దాంతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. ఇంట్లోనే డిజైన్స్‌ను తయారుచేసి, వీకెండ్స్‌లో ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శించేది. 2014లో ‘మృణాళినీ’ పేరుతో ఓ బొటిక్‌ను ప్రారంభించి, అతికొద్ది కాలంలోనే సెలబ్రిటీస్‌కు డిజైన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. అందుకే, ఈ బ్రాండ్ ధరలు హై రేంజ్‌లోనే ఉంటాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లలో లభిస్తాయి. చీర బ్రాండ్: అర్పితా మృణాళినీ రావ్,రూ.1,79,000, బ్లౌజ్ ధర: రూ. 53,760 జ్యూలరీ బ్రాండ్: ఎ జ్యూయెల్స్ బై అన్మోల్, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఎ జ్యూయెల్స్ బై అన్మోల్.. 1986లో ఈశూ దత్వానీ అన్మోల్ పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో కేవలం వారి వద్ద తయారైన ఆభరణాలను మాత్రమే విక్రయించేవాడు. అంతర్జాతీయ స్థాయి డిజైన్స్ అందించటానికి విదేశీ డిజైనర్స్‌తోనూ కలసి పనిచేయటం మొదలుపెట్టాడు. శిల్పా శెట్టీ, లారా దత్తా, మలైకా అరోరా, ఊర్వశి ఇలా పలు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీస్ వారి పెళ్లి నగలను ఇక్కడే డిజైన్ చేయించుకున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. -దీపిక కొండి -
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
Ponytail Hairstyles: పోనీటెయిల్.. ఈజీగా స్టైల్
చాలా వరకు రోజూ పోనీటెయిల్ వేసుకుంటుంటారు. వేసవిలో ఈ స్టైల్ సాధారణంగా చూస్తుంటాం. అయితే, ఎప్పుడూ ఒకే హెయిర్ స్టైల్ బోర్‌గా ఉంటుంది. భిన్నంగా ఏమీ అనిపించదు. కొత్తగా హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలంటే చాలా టైమ్ పడుతుంది అనుకుంటారు. కానీ, సింపుల్ హెయిర్ స్టైల్స్‌ను ట్రై చేయవచ్చు. తల ముందు భాగంలో చిన్న మార్పు చేసినా, ముఖానికి కొత్త అందం వస్తుంది. ఇది రెగ్యులర్‌గా వేసుకోవడానికి స్టైల్‌గానూ ఉంటుంది. ► జుట్టు అంతా చిక్కులు లేకుండా దువ్వాలి. ► ముందు భాగం నుంచి ఎడమవైపున ఒక పాయ తీయాలి. ► ఆ పాయను మూడు పాయలుగా విభజించి, జడలా చివరి వరకు అల్లాలి. ► సైడ్ జడ పాయను తల వెనుక భాగానికి తీసుకొని, పిన్నులు పెట్టాలి. ► మిగతా జుట్టును అంతా చేతిలోకి తీసుకొని, దువ్వి, గట్టిగా బ్యాండ్ పెట్టాలి. ఈ స్టైల్ సింపుల్‌గానూ, స్టైలిష్‌గానూ ఉంటుంది. రోజూ చేసే హెయిర్ స్టైల్‌నే చిన్న మార్పుతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. – సత్యశ్రీ, హెయిర్ అండ్ మేకప్ స్టైలిష్ట్, ఫస్ట్ ఫౌండేషన్, హైదరాబాద్ -
హైటెక్ సిటీ: పబ్ ప్రారంభం సెలబ్రెటీల సందడి..
-
రాత.. మార్చేను నీ భవిత
సాక్షి, కడప : చక్కటి అక్షరాలు రాతను అందంగా మారుస్తాయి. ప్రతి ఒక్కరిలో ప్రత్యేక గుర్తింపు తెస్తాయి. వీటికి తోడు మంచి మార్కులు సాధించి పెడతాయి. గతంలో కేవలం కాపీ రైటింగ్పైనే ఆధారపడి రాతను మెరుగు పరుచుకునేవారు. కానీ నేడు చేతిరాతకు ప్రత్యేక తరగతులు వచ్చాయి. చాలామంది తల్లిదండ్రులు వీటిపైన ఆసక్తి చూపుతున్నారు. వేసవి, దసరా, సంక్రాంతి సెలవుల్లో జరిగే చేతిరాత తరగతులకు తమ చిన్నారులను పంపుతున్నారు కూడా. ప్రస్తుతం ఇది మరింత విస్తరించి ప్రయివేట్ పాఠశాలలు సైతం చేతిరాతకు వారానికి ఒక తరగతి నిర్వహిస్తున్నారు. నిపుణులు సైతం ప్రత్యేక తరగతులే కాక నిరంతరం చేతిరాతపై ప్రత్యేక దృష్టి సారించాలని చెబుతున్నారు.అప్పుడే ఉత్తమ మార్కులు సాధిస్తారని పేర్కొంటున్నారు. – బద్వేలు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా విద్యార్థులు కష్టపడి సాధన చేస్తే చక్కటి దస్తూరి సాధ్యమే. చదువుతో పాటు చక్కని దస్తూరి చాలా ముఖ్యం. దస్తూరి సరిగా లేకుంటే మార్కులు కూడా తగ్గుతుంటాయి. విద్యార్థులు చదవడం, అర్థం చేసుకోవడం, జ్ఞాపకం పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని జవాబు పత్రంలో అందంగా రాయడం మరొక ఎత్తు. విద్యార్థి దశలోనే చదువుతో పాటు దస్తూరిని చక్కదిద్దుకోవడం చాలా అవసరం. ఏడాదంతా కష్టపడి చదివిన అంశాన్ని మూడు గంటల పరీక్ష నిర్ధేశిస్తుంది. ఎంత బాగా చదివామన్నది కాదు ఎంత బాగా రాశామా అన్న దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో విషయ పరిజ్ఞానంతో పాటు దస్తూరి కూడా కీలకమే. రాయడం అనేది కేవలం చదువులో భాగం మాత్రమే కాదు. కర్సివ్ అక్షరాలు రాసే సమయంలో చేతి వేళ్ల కదలికల మీద పట్టు పెరుగుతుంది. దీంతో పని మీద దృష్టి సారిస్తారు. అక్షరాలు రాసే సమయంలో మెదడులోని అనేక భాగాలు చురుగ్గా మారతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఇదే విషయం స్టాన్ఫోర్డు యూనివర్సిటీ పరిశోధనల్లో వెల్లడైంది. రాత మెరుగు ఇలా.. విద్యార్థులు పరీక్షా సమయంలో సమాధానాలు, కలిపిరాతగా, విడివిడిగా ఎలా రాయాలనే అనుమానం వాక్యాలను అనుసంధానం చేయలేకపోతారు. అక్షరాలను కొన్ని చిన్నగా, మరికొన్ని పెద్దవిగా రాస్తే రాత అందంగా ఉండదు. తెల్ల పేపరుపై రాసే సమయంలో ఒక లైన్ పూర్తయిన తరువాత రెండో లైన్‌ను మొదటిదానికి సమాంతరంగానే రాయాలి. అన్ని లైన్ల మధ్య దూరం ఒకేలా ఉండాలి. అక్షరాల మధ్య కొంత ఖాళీ స్థలం వదిలిపెడుతుంటారు. ఇలా రాస్తే అక్షరాలు, పదాలకు మధ్య తేడా కనిపించదు. అంకెలను వాడటంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ‘2’అంకెను ఆంగ్ల ఆక్షరం ‘జెడ్’మాదిరిగా, ‘5’అంకెను ‘ఎస్’మాదిరి రాస్తే మార్కులు కూడా తగ్గుతాయి. అంగ్ల అక్షరాల్లో ఐ, జే, పీలను ఇతర అక్షరాలతో కలిపే సమయంలో జాగ్రత్తగా కలపాలి. తెలుగులో ణ, మ, య అక్షరాలను సరిగా రాయాలి. చేతిరాతలో రకాలు కాలిగ్రఫీ : స్టోక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇటాలిక్ ఆక్షరాలను ఈ రకంలో రాస్తారు. రాయడం ఆలస్యం అవుతుంది. చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. లూసిడా : సింపుల్‌గా త్వరగా రాయవచ్చు. పిల్లలు సమయం వృథా కాకుండా రాయవచ్చు. ప్రింట్ తరహాలో అందంగా ఉంటుంది. కర్షివ్ : కలిపిరాతను కర్షివ్ రైటింగ్ అంటారు. ఒక అక్షరం పక్క అక్షరానికి కలిపి రాయడం. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల్లో వినియోగిస్తుంటారు. నార్మల్ : సంప్రదాయ రాత. ఇందులో ఎత్తు, లావు అనే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా రాయడం. వీటిని కొంతమేర స్టోక్స్ జత చేస్తే అందంగా కనిపించేలా చూడవచ్చు. పిల్లలకు ఎక్కువగా ఇదే నేరి్పస్తుంటారు. -
హెప్పెప్టిప్టాప్
హెప్ అంటే ఇంగ్లిషులో చాలా స్టైలిష్. లేటెస్ట్‌లో లేటెస్ట్ అన్నమాట. ఇక పెప్ అంటే సూపర్ ఎనర్జీ ఉందన్నమాట. కొత్తగా వచ్చిన పెప్లమ్ జాకెట్స్లో హెప్ ఉంది పెప్ ఉంది. అలాంటి జాకెట్స్ వేసుకుంటే హెప్పెప్టిప్టాపే మరి... పెప్లమ్ డిజైనర్ టిప్స్ పొట్టి స్కర్ట్లు, ఫిటెడ్ జాకెట్స్, బ్లౌజ్,.. లకు నడుము వద్ద అదనంగా మరో ఫ్యాబ్రిక్‌ను జత చేయడాన్నే పెప్లమ్ అంటారు. పెప్లమ్ అనే పదం ప్రాచీన గ్రీకు మహిళల గార్మెంట్‌ను ఉద్దేశించి వాడింది. అంటే, నాటి నుంచి పెప్లమ్ రకరకాల స్టైల్స్‌ను చూపుతూనే ఉందన్నమాట. ఒక్క పెప్లమ్ టాప్ వార్డ్‌రోబ్‌లో ఉంటే చాలు ఎన్ని రకాల స్టైల్స్ అయినా వేషధారణలో చూపించవచ్చు. పెప్లమ్లో స్లిమ్‌గా కనిపించాలంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. బాటమ్‌గా పెన్సిల్ కట్ స్కర్ట్, ప్యాంట్స్ ఎంచుకోవాలి. కాంట్రాస్ట్ ఆభరణాలు మెడలో వేసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్ బదులు క్లచ్ చేత పట్టుకోవాలి. పెప్లమ్ గౌన్లు రెడ్‌కార్పెట్ వేదికలకు ప్రముఖ సినీతారలు ధరిస్తుంటారు. అవర్గ్లాస్ బాడీ కొలతలు గలవారికీ పెప్లమ్ గౌన్ మరింత అందాన్నిస్తుంది. -
భార్యలను ఇలా కొట్టాలంటూ సంచలన వీడియో
సౌదీ అరేబియా: ఆన్లైన్ లో ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. భార్యను ఎలా దండించాలో ఓ ముస్లిం పెద్ద ప్రత్యేక సూచనలు ఇస్తున్న ఆ వీడియో దుమారం రేపుతోంది. సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ అల్ సఖాబీ అనే వ్యక్తి ఫ్యామిలీ థెరపిస్టుగా పనిచేస్తున్నాడు. చెప్పిన మాట వినని భార్యలను ఎలా దండించాలనే విషయంలో అతడు ఓ వీడియో రూపంలో చెప్పాడు. అవేంటో అతడి మాటల్లోనే చూస్తే.. 'ఇది ఎంతో కష్టమైన విషయం అని నాకు తెలుసు. కానీ ఈ సమస్యను అల్లా దయతో సురక్షితంగా దాటుతాం. కోపంతో భార్యను కొట్టవద్దు. ఎంతో క్రమశిక్షణతో ఆ పనిచేయాలి. భార్యను కొట్టే విషయంలో కూడా ఇస్లాం నిబంధనలు పాటించాలి. భార్యలను ఇనుపరాడ్లు, కర్రలతో కొట్టవద్దు. అలాగే పదునైన ఆయుధాలు ఉపయోగించవద్దు. పళ్లను శుభ్రం చేసుకునే చిన్న సువ్వలాంటి వస్తువు లేదా.. హ్యాండ్ కర్చీఫ్ ఉపయోగించాలి. ఎందుకంటే ఆమె తన భర్త విషయంలో తప్పు చేసిందనే విషయం ఆమెకు తెలియజేయడమే అసలైన పని. కొట్టడానికి ముందు భర్తలు తమ హక్కులు.. భార్యల విధులు అల్లా ప్రకారం వారికి తెలియజేయాలి. నిద్ర వేళ భార్య దగ్గరకు వెళ్లొద్దు. దురదృష్టవశాత్తు కొంతమంది భార్యలు భర్తలతో సమానంగా జీవించాలని అనుకుంటారు. ఇదే పెద్ద సమస్యను సృష్టిస్తుంది. కొంతమంది భార్యలు కొట్టించుకునేందుకే భర్తలను రెచ్చగొడతారు. కానీ, భర్త భార్యను కొడుతున్నాడన్న విషయం బయటకు తెలియకుండా చూసుకోవాలి' అంటూ ఆయన సలహాలు ఇచ్చాడు.