హెప్‌పెప్‌టిప్‌టాప్
హెప్ అంటే ఇంగ్లిషులో చాలా స్టైలిష్. లేటెస్ట్‌లో లేటెస్ట్ అన్నమాట.
ఇక పెప్ అంటే సూపర్ ఎనర్జీ ఉందన్నమాట.
కొత్తగా వచ్చిన పెప్‌లమ్ జాకెట్స్‌లో హెప్ ఉంది పెప్ ఉంది.
అలాంటి జాకెట్స్ వేసుకుంటే
హెప్‌పెప్‌టిప్‌టాపే మరి...
పెప్‌లమ్ డిజైనర్ టిప్స్
పొట్టి స్కర్ట్‌లు, ఫిటెడ్ జాకెట్స్, బ్లౌజ్,.. లకు నడుము వద్ద అదనంగా మరో ఫ్యాబ్రిక్‌ను జత చేయడాన్నే పెప్‌లమ్ అంటారు. పెప్‌లమ్ అనే పదం ప్రాచీన గ్రీకు మహిళల గార్మెంట్‌ను ఉద్దేశించి వాడింది. అంటే, నాటి నుంచి పెప్‌లమ్ రకరకాల స్టైల్స్‌ను చూపుతూనే ఉందన్నమాట. ఒక్క పెప్‌లమ్ టాప్ వార్డ్‌రోబ్‌లో ఉంటే చాలు ఎన్ని రకాల స్టైల్స్ అయినా వేషధారణలో చూపించవచ్చు. పెప్‌లమ్‌లో స్లిమ్‌గా కనిపించాలంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. బాటమ్‌గా పెన్సిల్ కట్ స్కర్ట్, ప్యాంట్స్ ఎంచుకోవాలి. కాంట్రాస్ట్ ఆభరణాలు మెడలో వేసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్ బదులు క్లచ్ చేత పట్టుకోవాలి. పెప్‌లమ్ గౌన్లు రెడ్‌కార్పెట్ వేదికలకు ప్రముఖ సినీతారలు ధరిస్తుంటారు. అవర్‌గ్లాస్ బాడీ కొలతలు గలవారికీ పెప్‌లమ్ గౌన్ మరింత అందాన్నిస్తుంది.