
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో తరచూ ఏదో ఒక ఘటనతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇద్దరు యువకులు రోటీన్‌కు భిన్నంగా స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. స్నేహితులైన వీరిద్దరూ ఏం చక్కా అమ్మాయిలు వేసుకునే స్కర్టులతో మెట్రో ఎక్కారు. రిలాక్స్‌గా కన్పిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
వీరిని చూసిన తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. కొందరైతే పగలబడి నవ్వారు. కాగా.. ఈ ఫొటోలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి. వీరిద్దరూ లుంగీ అనుకుని పొరపాటున స్కర్ట్ ధరించారేమో అని ఓ యూజర్ ఛలోక్తులు విసిరాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. స్కర్ట్‌లు అమ్మాయిలే ధరించాలని రూల్ ఏమైనా ఉందా? సౌకర్యంగా ఉంటే అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు. అందులో తప్పేముంది అని వీరికి మద్దతు తెలిపారు. లుంగీకంటే ఇవే బాగున్నట్టున్నాయ్ ఫ్రీగా.. అని మరో యూజర్ రాసుకొచ్చాడు.
చదవండి: సోలో సెయిలింగ్ రేస్‌లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్ నేవీ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment