Lungi
-
అటెన్షన్... లుంగీ ఇన్ లండన్
దక్షిణ భారతంలో లుంగీతో కనిపించడం వింతేమీ కాదు. అయితే లండన్‌లో కనిపిస్తే మాత్రం వింతే. ఆ వింతే ఈ వీడియోను వైరల్ అయ్యేలా చేసింది. వలేరి అనే తమిళియన్ రంగు రంగుల లుంగీలు ధరించి లండన్ వీధుల్లో, పాపుల్లో ‘రీల్స్’ చేసి అక్కడి ప్రజల రియాక్షన్‌ను రికార్డ్ చేసింది. ‘వియరింగ్ లుంగీ ఇన్ లండన్’ కాప్షన్‌తో ఆమె పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. -
లుంగీలు, నైటీలపై తిరగొద్దు.. చూడలేకపోతున్నాం!
నోయిడా: నోయిడాలోని ఒక అపార్ట్ మెంట్ సముదాయంలో వింత నోటీసు ఒకటి జారీ చేసింది సొసైటీ కమిటీ. సాయంత్రం వేళ సొసైటీలో వాకింగ్ చేస్తున్న కొందరు మహిళలు నైటీలలో వస్తుంటే పురుషులు మాత్రం లుంగీలలో వచ్చి పార్కు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. వారలా తిరగడం కొందరికి అసౌకర్యం కలిగించడంతో నేరుగా వెళ్లి సొసైటీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది సొసైటీ పెద్దలు సీరియస్ గా రియాక్టయి ఇకపై కాలనీ బహిరంగ ప్రదేశాల్లో నైటీలను, లుంగీలను నిషేదిస్తూ సొసైటీ నివాసులందరికీ నోటీసులు పంపించారు. నోయిడాలోని హిమసాగర్ అపార్ట్ మెంట్స్ లోని సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కాలనీ వాసులు రోజంతా భగభగ మండుతున్న ఎండ తాకిడికి ఉక్కిరిబిక్కిరై ఉండటంతో ఉపశమనం కోసం సాయంత్రం పూట చల్లగాలికి కాలనీ కామన్ ఏరియాల్లోనూ, కమ్యూనిటీ పార్కుల్లోనూ వాకింగ్ చేస్తుంటారు. వేసవికాలం కాబట్టి చాలామందికి ఇది దైనందిన జీవితంలో భాగమే. చూడలేకపోతున్నాం.. కానీ ఆ కాలనీలోని వాసులు మహళలైతే నైటీల్లోనూ పురుషులైతే లుంగీల్లోనూ వాకింగ్ చేస్తుండటమే అసలు తగువుకు తెరతీసింది. వారలా తిరుగుతుండటం చూసి కొందరికి అసౌకర్యంగా అనిపించి వెంటనే సొసైటీ పెద్దలను కలిసి.. బహిరంగ ప్రదేశాల్లో లుంగీ, నైటీల్లో వాకింగ్ చేస్తుంటే చూడలేకున్నాం తక్షణమే చర్యలు తీసుకోండని ఫిర్యాదు చేశారట. ఇంకేముంది అప్పటికప్పుడు సమావేశమై అపార్ట్ మెంట్ వాసుల వస్త్రధారణ విషయమై కూలంకషంగా చర్చించి హిమసాగర్ వాసులకు డ్రెస్ కోడ్ విధిస్తూ నోటీసు సిద్ధం చేసి జూన్ 10న కాలనీ వాసులందరికీ పంపించారు సొసైటీ పెద్దలు. ఇదే నోటీసు.. సోసైటీ పరిధిలో తిరిగేవారికి డ్రెస్ కోడ్.. మన కాలనీలోని పార్కుల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ తిరిగేటప్పుడు మీ వస్త్రధారణ ఇతరులకు అభ్యంతరకరంగానూ అసౌకర్యంగానూ ఉండకుండా చూసుకోగలరు. ఇకపై ఎవ్వరూ ఈ పరిసర ప్రాంతాల్లో ఇళ్లల్లో వేసుకునే లుంగీలు, నైటీలు వంటి దుస్తులు వేసుకుని తిరగవద్దని అభ్యర్ధిస్తున్నామని రాశారు. తప్పేముంది - ముమ్మాటికీ తప్పే దీంతో కాలనీ వాసుల్లో కొందరు ఒక్కసారిగా ఖంగుతున్నారు. అసలే వేసవికాలం.. ఎండలు భగ్గుమంటున్నాయి.. రిలాక్స్ గా ఉంటుందని లుంగీలు, నైటీలు వేస్తుకుంటుంటాం. ఎవరికో అసౌకర్యంగా ఉందని వద్దంటే ఎలా అని వాపోతున్నారు. మరికొంత మంది మాత్రం ఇది చాలా మంచి నిర్ణయమని ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. హిమసాగర్ అపార్ట్ మెంట్ కమిటీ జారీ చేసిన ఈ నోటీసు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా గెలిచేది మేమే.. -
Delhi Metro: లుంగీ అనుకుని స్కర్ట్ వేసుకున్నారా ఏంటి భయ్యా..?
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో తరచూ ఏదో ఒక ఘటనతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇద్దరు యువకులు రోటీన్‌కు భిన్నంగా స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. స్నేహితులైన వీరిద్దరూ ఏం చక్కా అమ్మాయిలు వేసుకునే స్కర్టులతో మెట్రో ఎక్కారు. రిలాక్స్‌గా కన్పిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిని చూసిన తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. కొందరైతే పగలబడి నవ్వారు. కాగా.. ఈ ఫొటోలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి. వీరిద్దరూ లుంగీ అనుకుని పొరపాటున స్కర్ట్ ధరించారేమో అని ఓ యూజర్ ఛలోక్తులు విసిరాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. స్కర్ట్లు అమ్మాయిలే ధరించాలని రూల్ ఏమైనా ఉందా? సౌకర్యంగా ఉంటే అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు. అందులో తప్పేముంది అని వీరికి మద్దతు తెలిపారు. లుంగీకంటే ఇవే బాగున్నట్టున్నాయ్ ఫ్రీగా.. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sameer Khan (@sameerthatsit) చదవండి: సోలో సెయిలింగ్ రేస్‌లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్ నేవీ ఆఫీసర్ -
అది వేసుకుని వచ్చాడని సినిమా టికెట్ ఇవ్వనన్న మల్టీప్లెక్స్ థియేటర్...ఐతే
ఇటీవల చిన్న పెద్ద అంతా బయటకు వస్తే కచ్చితం ఫ్యాంట్ షర్టు లేదా షార్ట్స్ వంటి ఇతర ఫ్యాషెన్ డ్రెస్‌లను ధరంచడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ట్రెండ్ కూడా అదే. ఐతే ఎవరైన సంప్రదాయబద్ధమైన డ్రస్‌లు వేసుకుంటే నోరెళ్లబెట్టడమే కాకుండా రావద్దంటూ నిరాకరిస్తున్నారు. ఏదో చేయరాని నేరం చేసినట్లు చూడటం వంటివి చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక బంగ్లాదేశ్ వ్యక్తి సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చినందుకు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత క్షమాపణలు చెప్పించుకుని తగిన గౌరవాన్ని పొందాడు బంగ్లాదేశ్‌లోని సమాన్ అలీ సర్కార్ అనే వృద్ధుడు మల్టీప్లెక్స్ థియేటర్‌కి లుంగీతో వచ్చాడు. అతను బంగ్లదేశ్ రాజధాని సోనీ స్క్వేర్ బ్రాంచ్‌లో ఉన్న మల్టీపెక్స్ థియేటర్లో 'పురాణ్' అనే ప్రముఖ సినిమాను వీక్షించేందుకు వచ్చాడు. ఐతే థియోటర్ వాళ్లు అతని వేషధారణ చూసి సినిమా టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ విషయం కాస్త సోషల్ మాధ్యమంలో పెద్ద దూమారం రేపింది. దురదృష్టవశాత్తు సదరు మల్టీప్లెక్స్ పై వ్యతిరేక భావన ఏర్పడటమే గాకుండా నెటజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు మల్టీప్లెక్స్ థియేటర్ వెంటనే అప్రమత్తమై సరిచేసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యం జరిగిన దానికి వివరణ ఇస్తూ...సదరు వ్యక్తి సమాన్ అలీని, అతని కుటుంబాన్ని సినిమా చూసేందుకు థియోటర్‌కి ఆహ్వానించడమే కాకుండా వారితో తీసుకన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ మల్టీప్లెక్స్ థియేటర్‌కి వచ్చి సినిమా చూడొచ్చు అని, థియేటర్‌కి ఇలానే రావాలనే పాలసీ ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు రెడీ అయ్యి రావచ్చు అని సదరు థియేటర్ యజమాన్యం వివరణ ఇచ్చుకుంది. (చదవండి: తప్పులు సరిదిద్దుకోండి!... కెనడాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా) -
షాకింగ్: 6 అడుగుల పామును లుంగీలో వేసుకొని వెళ్లాడు
పాములంటే అందరికి చచ్చేంత భయం. వాటిని తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఒకవేళ పాములు మన కంట పడితే.. ఇంకేమైనా ఉందా ఇక అక్కడి నుంచి పరుగున జారుకోవడమే. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏమాత్రం బేరుకు లేకుండా ఆరు అడుగుల పామును తన చేతులతో అవలీలగా ఆడించాడు. పాము అతన్ని కాటేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ దానికి చిక్కకుండా భలే మేనేజ్ చేశాడు. చివరికి పామును తను కట్టుకున్న లుంగీలో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు. అప్పట్లో ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత్ నంద తన ట్విటర్లో షేర్ చేశాడు. ‘లుంగీని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో మరోసారి వార్తలోకెక్కింది. తాజాగా ఓ ట్విటర్ యూజర్ మళ్లీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ఇందులో దాదాపు 6 అడుగుల పామును పట్టుకొని లుంగీలో వేసేసుకొని హ్యాపీ వెళ్ళిపోతున్నాడు. అయితే దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్‌కు గురవుతున్నారు. సదరు వ్యక్తి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. చదవండి: అరుదైన పాము పట్టివేత.. ఎప్పుడైనా చూశారా.. #ViralVideo: खतरनाक सांप को पकड़कर डाल दिया लूंगी के अंदर#Snake #SnakeViralVideo pic.twitter.com/cOV21NCAnU — India.com (हिन्दी) (@IndiacomNews) May 18, 2021 -
ఆనంద్ మహీంద్ర లుంగీ గిఫ్ట్..
-
ఆనంద్ మహీంద్ర లుంగీ గిఫ్ట్..
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన లాక్డౌన్ నిబంధనలను పాటిస్తున్న వ్యాపార వేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా ట్విటర్ ద్వారా వాట్సాప్ వండర్ బాక్స్ విశేషాలను పంచుకుంటూ తన అనుచరులను బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. పలు వీడియోలు, చమత్కారాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల లుంగీ గురించి ప్రస్తావించి, నవ్వులు పూయించిన ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వాట్సాప్ వండర్ బాక్స్ లో తనను ఆకట్టుకున్న ఇన్స్టంట్ సూట్ గురించి ప్రస్తావించారు. కరోనా వైరస్ కాలంలో ‘ఇన్స్టంట్ సూట్’ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌కు త్వరగా ఎలా హాజరుకావచ్చో వివరించే వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో పంచుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన సూట్ కింద ధరించేందుకు ఈ పెద్దమనిషికి తాను ఒక లుంగీని కూడా పంపించాలనుకుంటున్నానని ట్వీట్ చేశారు. అంతేకాదు, లాక్డౌన్ మనకు చాలా విషయాలను నేర్పిస్తోందంటూ మగవాళ్ల హెయిర్ కటింగ్ కష్టాలపై కూడా ఆయన మరో ట్వీట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా జుట్టును ఎలా కత్తిరించుకోవాలని నేర్చుకుంటున్నానని, కానీ తన వల్ల కావడం లేదంటూ బార్బర్ గొప్పతనాన్ని గుర్తిస్తున్నానని పేర్కొన్నారు. (కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్) దీంతో ఎప్పటిలాగానే కమెంట్ల వెల్లువ కురుస్తోంది. అవసరమే ఆవిష్కరణకు నాంది అని ఒకరు, పొరపాటున కాన్ఫరెన్స్ కాల్ స్విచ్ చేయడం మర్చిపోతే పరిస్థితి ఏంటని మరికొందరు, లుంగీ లేకుండా వర్క్ ఫ్రం హోం చేయడం చాలా బోరింగ్" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇక హెయిర్ కటింగ్ కష్టాలపై ఒక్కొక్కరు ఒక్కో పోస్ట్ ట్విటర్లో సందడి చేస్తున్నారు. (ఓ గాడ్! మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా?) చదవండి : పెట్రో డిమాండ్ ఢమాల్ The lockdown has made us understand that the ‘essential elements’ we need for a comfortable existence are minimal. But I am promoting my barber to a much higher position in the value chain! I’ve been learning how to cut my own hair, but I’ve reached the end of my abilities! 😊 — anand mahindra (@anandmahindra) April 17, 2020 -
లుంగీవాలాకు కంగారు పుట్టించే వార్త..
లక్నో: హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్, సీట్ బెల్ట్ ధరించకపోతే ఫైన్.. ముగ్గుర్ని ఎక్కించుకుని తిరిగావంటే.. దెబ్బకు దేవుడు గుర్తొచ్చేంత ఫైన్. ఇప్పుడు వీటి సరసన కొత్తగా చేరిన ఆంక్ష వింటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇప్పటికే జూలైలో పాసయిన నూతన మోటార్ వాహన చట్టం 2019తో వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఏ వైపు నుంచి ఫైన్ మోత మోగుతుందో అని భయంతో వణికిపోతున్నారు. పెరిగిన జరిమానాలు ఆ రీతిలో ఉన్నాయి మరి! ఇవేవీ చాలవన్నట్టు కొత్తగా మరో ఆంక్షను అమల్లోకి తీసుకువచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. లుంగీలు ధరించి వాహనం నడిపితే పైసా వసూలు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రక్ డ్రైవర్లు లుంగీ కట్టుకుని వాహనం నడిపిస్తూ కంటపడితే రూ.2000 జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. బనియన్, లుంగీల ధారణకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. లుంగీలకు బదులుగా ఫుల్ ప్యాంట్, బనియన్లకు బదులుగా టీషర్ట్స్ ధరించాలని కోరుతున్నారు. ఈ నియమం స్కూలు వాహనాలకు కూడా వర్తిస్తుందని యూపీ ట్రాఫిక్ ఏఎస్పీ పూర్నేందు సింగ్ పత్రికాముఖంగా వెల్లడించారు. ఈ కొత్త ఆంక్షల కోసం తెలిసిన జనాలు ఇదేం విడ్డూరం అని నోరెళ్లబెడుతున్నారు. చదవండి: ఇప్పుడెలా వేస్తారు ట్రాఫిక్ చలానా!? నూతన మోటార్ వాహన చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే చలానాల మోత మోగుతోంది దేశంలో. కొన్ని జరిమానాలు ఏకంగా రూ.80 వేలను దాటడం గమనార్హం. ఇక వాహనాలు నడిపేవారు చెప్పులు వేసుకోకూడదు అనే నియమం ఉన్నప్పటికీ అది ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. దీన్ని ఉల్లంఘిస్తే రూ.1000 చెల్లించాలి. ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించినవారికి కళ్లు తేలేసే జరిమానాలు విధిస్తున్నప్పటికీ ఏకకాలంలో సామన్యుల నడ్డి విరుస్తున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ నిబంధనలతో నిద్రలోనూ ఉలిక్కిపడుతున్నారు లుంగీవాలాలు. చదవండి: కారు ఆపిన ట్రాఫిక్ పోలీస్.. ‘గుండెపోటు’ -
లుంగీల్లో చెన్నైసూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు హఠాత్తుగా లుంగీల్లోకి మారిపోయారు. వైరటీ ప్యాంట్లు ధరించి న్యూ లుక్కుతో అభిమానులు అలరించారు. ఓ స్వచ్ఛంద కార్యక్రమం కోసం వారీ అవతారం ఎత్తారు. ఈ ఫోటోలను రసెల్ ట్వీట్ చేశాడు.