skirt
-
పొట్టి స్కర్ట్‌లో పూజిత.. తెలుగమ్మాయి భలే అందంగా! (ఫొటోలు)
-
ఇదేం స్టయిలిష్ కాస్ట్యూమ్! కానీ ధర వింటే షాకవ్వడం ఖాయం!
చాలా విభన్నమైన స్టయిలిష్ కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేస్తుంటారు డిజైనర్లు. ఒక్కొక్కరిది ఒక్కో తరహా స్టయిల్. వెస్ట్రన్ స్టయిల్ కొందరూ దేశీ సంస్కృతిని మిళితం చేసేలా ఇంకొకరు ఎంచుకుని మరి కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్‌ని తయారు చేస్తారు. వాటి ధరలు కూడా ఎక్కువే. ప్రముఖ సెలబ్రెటీలకు మంచి బ్రాండెడ్ కాస్ట్యూమ్స్ అందించేది వారే. రాను రాను ఎలా డిజైన చేయాలో తెలియాక ఒక్కొసారి ఇలా పిచ్చిగా డిజైన్ చేస్తారో లేక ఏం తోచక ఇలా చేస్తారో గానీ ఇదే వెర్రీ అనిపించేలా ఉంటాయి ఆ కాస్ట్యూమ్‌లు. అది కూడా మంచి పేరుగాంచిన ఓ ప్రముఖ కంపెనీ యే ఇలాంటి డిజైన్ని తీసుకొస్తే..ఛీ ఏంటీ ఇవి కూడా ఇలా దిగజారిపోతున్నాయా? లేక బ్రాండ్ పడిపోయిందా? అనిపిస్తాయి. అలాంటి పిచ్చి కాస్ట్యూమ్‌నే ఓ ప్రముఖ కంపెనీ విడుదల చేసి అందర్నీ కంగుతినేలా చేసింది. వివరాల్లోకెళ్తే..ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ బాలెన్సియగా ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ అత్యంత వెరైటీగా ఓ టవల్ స్కర్ట్ డిజైన్వేర్ని పరిచయం చేసింది. అది మన ఇళ్లలోని పెద్ద చిన్న మగవాళ్లంతా ప్రతి రోజు కనిపించే తీరు తరహా స్టయిలే అది. అది ఎవర్నీ ఆకర్షించకపోగా దాని ధర చూసి ఒక్కసారిగా భగ్గమంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఈ టవల్ స్కర్ట్ డిజైన్ వేర్ ఏంటంటే ఏం లేదు జస్ట్ ఫ్యాంట్‌పై టవల్ కట్టుకునేలా స్టయిల్. నిజానికి ఇది స్టయిల్ కాదు. మన ఇంట్లో మగవాళ్లు ఫ్యాంటు తీసే ముందు ఇదే తరహాలో టవల్ చుట్టుకుని ఉంటారు. దీన్నే గ్రేట్ డిజైన్ అంటూ విడుదల చేయడం ఒక ఎత్తు అయితే, ధర ఏకంగా రూ 76,000 వేలు అని ప్రకటించడం మరింత విడ్డూరం. దీంతో ప్రముఖ గృహోపకరణాల కంపెనీ ఐకియా ఈ డిజైన్‌కి అయ్యే ఖర్చు జస్ట్ రూ. 1700/- కంటే ఎక్కవ అవ్వదంటూ అందుకు సంబంధించిన సేమ్ మోడల్ని నెట్టింట షేర్ చేసింది. పలువులురు నెటిజన్లు కూడా ఐకియాకు మద్దతు ఇస్తూ అవును అంతకంటే ఎక్కువ ధరేమి ఉండదు. పోనీ ఆ టవల్ జస్ట్ కాటన్ టర్కీ టవల్. దాని ధర కూడా అంత ఉండదు. కానీ ఏకంగా ఫ్యాంట్ విత్ టవల్ కలిపి అంత ధర ప్రకటించారని మండిపడ్డారు. మరో నెటిజన్ ప్రతి కుటుంబంలోని డాడీలు ఉండే స్టయిలే అది బాస్ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by IKEA UK (@ikeauk) (చదవండి: విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!) -
Delhi Metro: లుంగీ అనుకుని స్కర్ట్ వేసుకున్నారా ఏంటి భయ్యా..?
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో తరచూ ఏదో ఒక ఘటనతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇద్దరు యువకులు రోటీన్‌కు భిన్నంగా స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. స్నేహితులైన వీరిద్దరూ ఏం చక్కా అమ్మాయిలు వేసుకునే స్కర్టులతో మెట్రో ఎక్కారు. రిలాక్స్‌గా కన్పిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిని చూసిన తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. కొందరైతే పగలబడి నవ్వారు. కాగా.. ఈ ఫొటోలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి. వీరిద్దరూ లుంగీ అనుకుని పొరపాటున స్కర్ట్ ధరించారేమో అని ఓ యూజర్ ఛలోక్తులు విసిరాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. స్కర్ట్లు అమ్మాయిలే ధరించాలని రూల్ ఏమైనా ఉందా? సౌకర్యంగా ఉంటే అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు. అందులో తప్పేముంది అని వీరికి మద్దతు తెలిపారు. లుంగీకంటే ఇవే బాగున్నట్టున్నాయ్ ఫ్రీగా.. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sameer Khan (@sameerthatsit) చదవండి: సోలో సెయిలింగ్ రేస్‌లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్ నేవీ ఆఫీసర్ -
స్కర్ట్ వేసుకున్న స్టార్ హీరో.. వరల్డ్‌వైడ్‌గా చర్చ
Brad Pitt Explains On Why He Wore Skirt On Bullet Train Red Carpet: ఇప్పటివరకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన దుస్తులు ధరించి ట్రోలింగ్‌కు గురి కావడం చూశాం. తాజాగా ఇలాంటి డిఫరెంట్ వేర్‌తో దర్శనమిచ్చి వైరల్‌గా మారాడు ఓ స్టార్ హీరో. హాలీవుడ్ ప్రముఖ కథానాయకుల్లో బ్రాడ్ పిట్ ఒకరు. యాక్షన్ సినిమాలతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ ఆస్కార్ విన్నర్. ఈ హీరో కూడా అప్పుడప్పుడు విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తుంటాడు. బ్రాడ్ పిట్ తాజాగా నటించిన చిత్రం 'బుల్లెట్ ట్రైన్'. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు పలు దేశాల్లో ప్రీమియర్ షోలను వేస్తున్నారు. ఇలానే కొన్ని వారాల క్రితం బెర్లిన్‌లో 'బుల్లెట్ ట్రైన్' ప్రీమిర్ షోను ప్రదర్శించారు. ఈ షో కోసం వేసిన రెడ్ కార్పెట్‌పై స్కర్ట్ వేసుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు బ్రాడ్ పిట్. మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్, బూట్లు, వదులుగా ఉండే నార షర్ట్, జాకెట్‌తో దర్శనమిచ్చిన బ్రాడ్ పిట్ లుక్ వరల్డ్‌వైడ్‌గా వైరల్ అయింది. బ్రాడ్ పిట్ వేసుకున్న కాస్ట్యూమ్‌పై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. దీంతో ఈ విషయంపై తాజాగా లాస్ ఏంజెల్స్‌తో జరిగిన మూవీ ప్రీమియర్ షోలో స్పందించాడు బ్రాడ్ పిట్. చదవండి: సౌత్ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు: అలియా భట్ ఈ ప్రీమియర్ షోకు సాధారణ దుస్తుల్లో వచ్చన బ్రాడ్ పిట్.. 'బెర్లిన్‌లో అలా ఎందుకు చేశానో నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ త్వరలో మనందరం చనిపోతాం. అందుకే కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని అనిపించింది' అని స్కర్ట్ వేసుకోవడంపై వివరణ ఇచ్చాడు. అలాగే తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. 'నేను రిటైర్ అవుతున్నాననే ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదు. ప్రస్తుతం నేను మిడిల్ ఏజ్‌లో ఉన్నాను. చివరి రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నానో చెప్పాను అంతే' అని పేర్కొన్నాడు. చదవండి: 4కె ప్రింట్‌తో మళ్లీ రిలీజ్ చేస్తున్నారంటగా.. ఫ్యాన్స్ హ్యాపీనా.. -
Women Party Wear Dresses: పార్టీవేర్.. సీజన్కేర్..
సీజన్‌కు తగ్గట్టు స్టైల్‌గా ఉండాలి వేడుకకు తగ్గట్టు బ్రైట్‌గా ఉండాలి అంతకుమించి కంఫర్ట్ ఉండాలి డిజైనర్ క్రాప్‌టాప్స్, పలాజో స్కర్ట్స్‌తో సింపుల్ అండ్ మార్వలెస్ అంటూ మార్కులు కొట్టేయడం ఇప్పుడిక సూపర్ ఈజీ. రాబోయేది పెళ్ళిళ్ల సీజన్. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తక్కువ మందితో సింపుల్‌గా కుటుంబసభ్యుల మధ్యన మాత్రమే వేడుకలు జరిగే అవకాశాలున్నాయి. బర్త్‌డే పార్టీ అయినా, చిన్న చిన్న గ్యాదరింగ్స్ అయినా తక్కువ మందితో జరుపుకునే వేడుక ల్లో మీరు బ్రైట్‌గా వెలిగిపోవాలంటే సింపుల్ ఐడియా స్కర్ట్ పలాజో, డిఫరెంట్ క్రాప్‌టాప్. అందులోనూ ఇది వేసవి కూడా కావడంతో ధరించే డ్రెస్ సౌకర్యంగానూ ఉండాలి. అదే టైమ్‌లో బ్రైట్‌గా కనిపించాలి. స్టైలిష్ అనిపించాలి. ఈ హంగులన్నీ తీసుకువచ్చే ఇండోవెస్ట్రన్ స్టైల్‌ని కాటన్ ఫ్యాబ్రిక్‌తోనే ప్లాన్ చేసుకోవచ్చు. సౌకర్యమే ఫస్ట్ ప్రింటెడ్ కాటన్‌తో డిజైన్ చేసిన డ్రెస్సులివి. క్యాజువల్ వేర్కి, పార్టీవేర్‌కి వాడుకోదగినవి. ఇకత్ కాటన్, హకోబా కాటన్, ప్రింటెడ్ కాటన్స్ని పలాజో డిజైన్‌కి తీసుకున్నాం. పలాజోలు ఇష్టం లేనివారు ఇదే ప్యాటర్న్‌తో స్కర్ట్‌లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వీటికి కాంబినేషన్‌గా ఫ్లోరల్ షిఫాన్, చందేరీతో డిజైన్ చేసిన క్రాప్‌టాప్స్, పెప్లమ్ స్టైల్ క్రాప్‌టాప్ జత చేశాం. ఈ డ్రెస్సింగ్ బర్త్‌డే వంటి పార్టీలకు బాగా నప్పుతాయి. ఇది వేసవి కాబట్టి ఈ డ్రెస్సింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. అమ్మాయిలకు మాత్రమే ఈ డ్రెస్సులు బాగుంటాయి అనుకోనక్కర్లేదు. అన్ని వయసుల వారూ ఈ డ్రెస్సింగ్ స్టైల్‌ను కొన్ని మార్పులతో ప్లాన్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ స్టైల్‌కు నప్పే దుపట్టాను కూడా జత చేసుకోవచ్చు. భార్గవి అమిరినేని ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
నీ స్కర్టు పొట్టిగా ఉంది.. ఇంటికి వెళ్లిపో..
లండన్ : కంపెనీలలో డ్రెస్ కోడ్ పేరిట మహిళలపై వేధింపులు ఆగటంలేదు. పొట్టి దుస్తులు వేసుకుందన్న కారణంతో ఓ యువతిని ఆఫీసు నుంచి ఇంటికి పంపేసిన ఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని హాడ్డెస్‌డన్ హార్ట్‌ఫోర్డ్‌షెర్‌కు చెందిన లిల్లి క్యాటెల్ అనే యువతి గత కొద్ది నెలలుగా వార్విక్ ఎస్టేట్స్ అనే కంపెనీలో జూనియర్ క్రెడిట్ కార్డ్ కంట్రోలర్‌గా పనిచేస్తోంది. రోజూలానే గత బుధవారం కూడా ఆఫీసుకు వెళ్లింది. కార్యాలయంలో పనిచేసుకుంటుండగా హెచ్ఆర్ టీమ్ సభ్యురాలు ఒకరు ఆమెను పిలిచి ‘‘నీ స్కర్టు చాలా పొట్టిగా ఉంది. బాస్ నిన్ను ఇంటికి పంపమన్నారు. ఇంటికి పోయి డ్రెస్ మార్చుకుని రా’’ అని చెప్పి ఇంటికి పంపేసింది. అంతవరకు చక్కగా పనిచేసుకుంటున్న ఆమె మొదటిసారి ఇబ్బంది పడింది. అవమానకర పరిస్థితిలో ఇంటికి బయలుదేరింది. దీనిపై లిల్లి మాట్లాడుతూ.. ‘ఆ రోజు నేను మాట్లాడటానికి ఓ రెండు నిమిషాలు సమయం ఇచ్చుంటే బాగుండేది. నన్నో చిన్నపిల్లలా భావించటం నాకేం నచ్చలేదు. అప్పుడే నిశ్చయించుకున్నాను! నాకు మాట్లాడే అవకాశం వచ్చే వరకు వెనక్కు తిరిగి వెళ్లేది లేదని. ఆ సంఘటన జరిగినప్పుడు నేనెంతో బాధపడ్డాను. ఆఫీసు బయట ఉన్న కారు దగ్గరకు చేరుకోగానే నాకు విపరీతమైన ఏడుపు వచ్చింది. కారులో కూర్చున్నప్పటికి ఏడుపు ఆపుకోలేకపోయాను. దారుణమైన విషయం ఏంటంటే.. అదే స్కర్టును నేను చాలా సార్లు వేసుకెళ్లాను. అన్ని రోజులు ఏమీ అనని వారు ఆ రోజే ఎందుకు నన్ను అవమానించారు. నాకు చాలా కోపం వచ్చింది. నా మీద కాస్త కూడా కనికరం చూపలేదు. చివరకు ఆ కార్యాలయంలో పనిచేయలేనని అనిపించింది. ఆఫీసుకు రావటంలేదని వాళ్లు నాకు నోటీసులు పంపిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసేశాను. యువతులు 40-50 ఏళ్ల మహిళల్లా దుస్తులు వేసుకోలేరు. ఆఫీసుల్లో డ్రెస్ కోడ్ పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇదే విషయమై ఆ కంపెనీ వాళ్లతో పోట్లాడాను కూడా’ అని తెలిపింది. -
ఛీ.. ఇదేం స్కూలు!
పుణె: ‘విద్యార్థినులు ఒకే రంగు లోదుస్తులు వేసుకోవాలి. మరుగుదొడ్డికి నిర్ణీత సమయంలో మాత్రమే వెళ్లాలి’ అంటూ ఓ ప్రైవేటు పాఠశాల ఆంక్షలు విధించింది. మహారాష్ట్రలోని పుణెలోని మయీర్ ఎమ్ఐటీ స్కూల్ విధించిన ఆంక్షలు వివాదాస్పదమయ్యాయి. విద్యార్థినులు ధరించే స్కర్టుల పొడవు ఎతుందో కచ్చితంగా పేర్కొనాలని స్కూల్ యాజమాన్యం ఆదేశించింది. ‘విద్యార్థినులు తెలుపు లేదా స్కిన్ కలర్ లోదుస్తులు ధరించాలి. వారు ధరించి స్కర్ట్ పొడవు ఎంతుందో కచ్చితంగా పేర్కొనాలి. ఈ వివరాలు స్కూల్ డైరీలో రాసి మాతో సంతకం పెట్టించుకుని తీసురావాల’ని స్కూల్ యాజమాన్యం ఆదేశించినట్టు ఓ విద్యార్థి పేరెంట్ తెలిపారు. తమ ఆదేశాలు పాటించని విద్యార్థులు, తల్లిదండ్రులపై చర్యలు తప్పవని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవేం ఆంక్షలంటూ మండిపడుతున్నారు. గతానుభవాలతోనే... అయితే మంచి ఉద్దేశంతోనే ఈ నిబంధనలు పెట్టామని ఎమ్ఐటీ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర కరాద్ నగరె తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. గతంలో తమకు ఎదురైన కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధించామని, వీటి వెనుక ఎటువంటి రహస్య అజెండా లేదని వివరణయిచ్చారు. -
చీరంచు గౌనుకు ముద్దు
పాత మోడల్ పట్టు, లేదంటే పెద్ద పెద్ద అంచులున్న చీరలు కొన్నేళ్లుగా అలాగే ఉంటూ ఉంటాయి. చాలామంది వాటిని పెట్టెల్లో, బీరువా అడుగున చేరుస్తూ ఉంటారు. వాటికి ఇలా కొత్త రూపమిచ్చి, మీ టీనేజ్ అమ్మాయిలను మరింత అందంగా మెరిపించవచ్చు. ⇔ పెద్ద అంచున్న మెటీరియల్‌ను స్కర్ట్ భాగానికి తీసుకొని, బ్లౌజ్‌ను ప్లెయిన్‌గా డిజైన్ చేయాలి. ప్లెయిన్ బ్లౌజ్ మీద ఏదైనా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినా చూడముచ్చటగా ఉంటుంది. ⇔ కేవలం పల్లూ భాగాన్ని తీసుకొని దాంతో స్కర్ట్ భాగాన్ని డిజైన్ చేయాలి. బ్లౌజ్ పార్ట్, స్లీవ్స్‌ని ప్లెయిన్‌గా తీసుకోవాలి. చూడముచ్చటైన స్టైలిష్ ఫ్రాక్ రెడీ. ⇔ చిన్న అంచు ఉన్న ప్లెయిన్ శారీని లాంగ్ కుర్తీ టాప్‌గా మార్చేస్తే చూడముచ్చటగా ఉంటుంది. ⇔ రెండు రకాల చీరల రంగు క్లాత్‌లను తీసుకొని ఇలా పొట్టి గౌన్ని సింపుల్‌గా తీర్చిదిద్దవచ్చు. ⇔ చూడగానే ఆకట్టుకునే ఇలాంటి ఫ్రాక్స్ని చీరలతో ఎన్నో మోడల్స్‌లో డిజైన్ చేయవచ్చు. -
లె హంగారడి
ఫ్రాక్ వేసుకున్నప్పుడు మన బుజ్జి తల్లులకు ముద్దులు ముద్దల్లో కలిపి పెడతాం ఎత్తుకొని తిరుగుతాం. అదేంటో... లంగా వేసుకోగానే బాధ్యతలు చెబుతాం. నాన్నా! ‘ఓ గ్లాస్ మంచి నీళ్లు అందుకో..’ అని ప్రేమగా పురమాయిస్తాం. లంగా వేసుకున్న అమ్మాయి ఇంట్లో ఉంటే ప్యాంట్ వేసుకున్న అబ్బాయి కన్నా గొప్పది. గొప్పగా ప్రేమిస్తుంది. గొప్పగా బాధ్యతలు తీసుకుంటుంది గొప్పగా ఆలోచిస్తుంది. అసలు విషయం మరిచిపోయాం.. గొప్ప గొప్పగా నచ్చేస్తుంది. ‘‘పాతకాలపు యూరోప్ దుస్తుల డిజైనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ‘ఈ తరహా దుస్తులకు మన దేశీయ సంప్రదాయ కళను వాడితే..’ అనే ఆలోచన వచ్చింది. దాంతో వెస్ట్రన్ కట్స్, ఇండియన్ ఎంబ్రాయిడరీలతో పాటు పర్సియన్, గ్రీసు సంస్కృతులను తీసుకొని అందమైన డ్రెస్ డిజైన్స్ ఎన్నింటినో రూపొందించాను. ఇవన్నీ ఆసియా వనితలను ముఖ్యంగా సినిమా తారలను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఐదేళ్లలోనే ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఈ రంగంలో ఉన్నవారు ఒక కొత్తదనాన్ని పరిచయం చేయడంతో పాటు గతకాలపు గొప్పదనాన్నీ చూపించగలగాలి. అప్పుడే సృజనకు సరైన గుర్తింపు వస్తుంది’’ అంటారు రిధిమెహ్రా! సింపుల్ అండ్ స్టైల్‌గా కనిపించడానికి పాశ్చాత్య దుస్తులే అక్కర్లేదు. ఇలా భారతీయ కళను విభిన్నంగా చాటచ్చని హ్యాండ్లూమ్ లాంగ్లెహంగాతో నిరూపించారు డిజైనర్. నెటెడ్ లాంగ్ లెహంగాకి కొన్ని రంగులు, మరికొన్ని హంగులు చేర్చితే అబ్బురపరిచే సంప్రదాయ కళ ఇలా కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. -
శారీ పల్లూతో స్కర్ట్!
⇔ చీరలను స్కర్ట్లుగా రూపొందించుకోవడం మనకు ఎప్పటి నుంచో తెలుసు. ⇔ అయితే, చీర మిగతా భాగాన్ని స్కర్ట్‌కి ఉపయోగించినా పల్లూ భాగాన్ని ఏం చేయాలో తెలియక ఓ పక్కన పెట్టేస్తుంటారు. కొందరు పల్లూ భాగంతో బ్లౌజులు కుట్టుకుంటారు. ⇔ అయితే, పల్లూతో కలిపి లేయర్డ్ స్కర్ట్ ఏ విధంగా రూపొందించుకోవచ్చో తెలుసుకుందాం. ⇔ స్కర్ట్స్లలో హిప్పీ స్టైల్ ఒకటి. నాలుగైదు రకాల సిల్క్ ఫ్యాబ్రిక్స్‌ను ఉపయోగించి ఈ స్కర్ట్‌ను రూపొందించుకోవచ్చు. చీర అంచులను ఈ స్కర్ట్‌కు జత చేయవచ్చు. ⇔ రెండు-మూడు రకాల సిల్క్ చీరలను ఎంచుకొని వాటికి కుచ్చులపెట్టి, పైన బెల్ట్ భాగాన్ని జత చేయాలి. దీనిని నడుము చుట్టూ చుట్టి, నాడతో ముడి వేస్తే మరో అందమైన లేయర్డ్ డ్రెస్ రెడీ. ⇔ ఒక ప్లెయిన్ చీర, మరో ప్రింటెడ్ చీర ఎంచుకొని రెండింటి కాంబినేషన్‌తో ఒక డిజైనర్ స్కర్ట్‌ను రూపొందించుకోవచ్చు. ⇔ స్కర్ట్ నడుము కింది భాగంలో లేదా క్రాస్‌గా చీర పల్లూ భాగం వచ్చేలా జాగ్రత్త తీసుకోవాలి. దీంతో ఆకర్షణీయమైన పల్లూ భాగం స్కర్ట్ మీద ఓ వైపు అందంగా ఇమిడిపోతుంది. స్కర్ట్‌కు ఇదో డిజైన్ అనిపించేలా ఉంటుంది. అందంగానూ కనిపిస్తుంది. ⇔ దాండియా నృత్యాలలో డిజైనర్ లెహంగాలు లేవని ఇబ్బంది పడకుండా ఇలాంటి స్కర్ట్‌లను ఆనందంగా ధరించవచ్చు. -
ప్యాంట్ స్కర్ట్
న్యూలుక్ స్కర్ట్ తెలుసు. ప్యాంట్ హవా ఎరిగిందే! మరి, ప్యాంట్ స్కర్ట్ ఏంటనుకుంటున్నారా! న్యూలుక్‌తో కలర్ఫుల్గా కనిపించాలంటే ప్యాంట్‌ను + స్కర్ట్‌ను కలిపేస్తే.. ఇదిగో ఇలా ఈ కొత్త డిజైన్ మీ ముందు ఉంటుంది. డెనిమ్ ప్యాంట్ పై భాగాన్ని కత్తిరించాలి. స్కర్ట్ నడుము భాగంలోని కుట్లు విప్పదీసి ప్యాంట్‌కి జత చేయాలి. పిల్లల స్కర్ట్లు పొట్టివైనా, టీనేజ్ అమ్మాయిల ఫ్యాన్సీ డ్రెస్ కైనా ఇలాంటి ఐడియా బాగా నప్పుతుంది. లాంగ్ లెహెంగా: రంగు రంగు క్లాత్ ముక్కలను ప్యాచ్‌లుగా తీసుకొని, స్కర్ట్ మోడల్ కుట్టాలి. దీనికి నడుము భాగంలో ప్యాట్ పై భాగానికి జత చేయాలి. ఈ ప్యాంట్ స్కర్ట్ క్యాజువల్వేర్కి బాగా నప్పుతుంది. చూసినవారు ‘నీ జీనూ స్కర్టు చూసి బుల్లమ్మో..’ అని పాడుకోవాల్సిందే! నెటెడ్తో: సెల్ఫ్ ప్రింట్లు ఉన్న నెటెడ్ మెటీరియల్ స్కర్ట్‌కి పై భాగాన డెనిమ్ ప్యాంట్‌ను జత చేస్తే ఇలా అందమైన స్కర్ట్ రూపుదిద్దుకుంటుంది. -
హెప్పెప్టిప్టాప్
హెప్ అంటే ఇంగ్లిషులో చాలా స్టైలిష్. లేటెస్ట్‌లో లేటెస్ట్ అన్నమాట. ఇక పెప్ అంటే సూపర్ ఎనర్జీ ఉందన్నమాట. కొత్తగా వచ్చిన పెప్లమ్ జాకెట్స్లో హెప్ ఉంది పెప్ ఉంది. అలాంటి జాకెట్స్ వేసుకుంటే హెప్పెప్టిప్టాపే మరి... పెప్లమ్ డిజైనర్ టిప్స్ పొట్టి స్కర్ట్లు, ఫిటెడ్ జాకెట్స్, బ్లౌజ్,.. లకు నడుము వద్ద అదనంగా మరో ఫ్యాబ్రిక్‌ను జత చేయడాన్నే పెప్లమ్ అంటారు. పెప్లమ్ అనే పదం ప్రాచీన గ్రీకు మహిళల గార్మెంట్‌ను ఉద్దేశించి వాడింది. అంటే, నాటి నుంచి పెప్లమ్ రకరకాల స్టైల్స్‌ను చూపుతూనే ఉందన్నమాట. ఒక్క పెప్లమ్ టాప్ వార్డ్‌రోబ్‌లో ఉంటే చాలు ఎన్ని రకాల స్టైల్స్ అయినా వేషధారణలో చూపించవచ్చు. పెప్లమ్లో స్లిమ్‌గా కనిపించాలంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. బాటమ్‌గా పెన్సిల్ కట్ స్కర్ట్, ప్యాంట్స్ ఎంచుకోవాలి. కాంట్రాస్ట్ ఆభరణాలు మెడలో వేసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్ బదులు క్లచ్ చేత పట్టుకోవాలి. పెప్లమ్ గౌన్లు రెడ్‌కార్పెట్ వేదికలకు ప్రముఖ సినీతారలు ధరిస్తుంటారు. అవర్గ్లాస్ బాడీ కొలతలు గలవారికీ పెప్లమ్ గౌన్ మరింత అందాన్నిస్తుంది. -
స్కర్ట్... కుచ్చుల గౌను...
న్యూలుక్ వేసవిలో పిల్లలకు వేయాల్సిన దుస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సిల్క్ దుస్తులు కాకుండా పిల్లల సున్నితమైన చర్మానికి హాయినిచ్చే ఫ్యాబ్రిక్‌వి ఎంచుకోవాలి. ఇందుకు మెత్తని టీ షర్టులు, పెద్దమ్మాయిల కాటన్ స్కర్ట్లు బాగా ఉపయోగపడతాయి. వాడకుండా ఉంచిన వీటితో పిల్లలకు అందమైన స్కర్ట్లు ఎలా రూపొందించుకోవచ్చో తెలుసుకుందాం... పిల్లలు త్వరగా పొడవు పెరుగుతుంటారు. వారి డ్రెస్సులు మాత్రం కొత్తదనం పోనివి చాలానే ఉంటాయి. అలాంటి వాటికి ఇలా కుచ్చులు పెట్టి అందంగా మార్చేయవచ్చు. మీదైన స్టైల్‌తో డిజైనర్ మార్క్ కొట్టేయవచ్చు. స్కర్ట్ పై భాగంలో భుజం మీదుగా రెండు స్ట్రాప్‌లు జత చేస్తే ఎండాకాలానికి ఉపయోగపడేలా జంపర్ స్టైల్ గౌన్ సిద్ధం. అందంగానూ కుచ్చులు కుచ్చులుగానూ డ్రెస్‌ను మార్చేయాలంటే 2-3 రకాల పొడవాటి క్లాత్‌లు తీసుకోవాలి. ఇందుకు పాత గౌనులు, స్కర్ట్లు తీసుకోవచ్చు. కట్ చేసిన స్కర్ట్ పొడవాటి క్లాత్‌లను.. కుచ్చులుగా కుట్టాలి. ఇలా కుట్టిన వాటిని ఒకదాని కింద మరొకటి జత చేస్తూ కుట్టాలి. దీనికి లైనింగ్‌గా లోపలి వైపు పల్చని కాటన్ క్లాత్ వేసి కుట్టాలి. ఇలా చేస్తే పిల్లల ఒంటికి లోపలి డిజైన్ గుచ్చుకోకుండా ఉంటుంది. -
హాఫ్ శారీ.. ఫుల్స్టైల్...
బామ్మల నాటి స్టైల్ మళ్లీ నేడు మన అమ్మాయిల మతులు పోగొట్టడానికి రెడీ అయ్యింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిిపిస్తూనే నయా స్టైల్ మార్కులు కొట్టేస్తోంది. అదే హాఫ్ శారీ. పెళ్లికెళ్లాలన్నా, కాలేజీ పార్టీలకు కలర్‌ఫుల్ లుక్ తేవాలన్నా ఫుల్స్టైల్ డ్రెస్ హాఫ్ శారీనే! ఎండాకాలం లంగాఓణీలా..! అని భయపడేవారికి సరికొత్తగా మరింత సౌకర్యవంతంగా ఆకట్టుకుంటున్నాయి ఈ లంగాఓణీలు. ఫ్యాషన్ దుస్తులలో కొంతకాలంగా నెటెడ్ ఫ్యాబ్రిక్ సృష్టించిన హంగామా చూశాం. వెల్వెట్ మెరుపులూ తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి స్థానాన్ని పట్టు హంగులు కొట్టేశాయి. బెనారస్ మెరుపులు హల్ చల్ చేస్తున్నాయి. మగువలు తమ సింగారాన్ని మెత్తనైన పట్టుతో సంప్రదాయపు, ఆధునికపు వేడుకలకు ఇలా అందంగా అమరే క్లాసిక్లుక్తో మార్చేయవచ్చు. ఇంతకాలం కాంట్రాస్ట్ కలర్స్ ఇంపుగా అనిపించేవి. దీంతో ఇవే మన దక్షిణ భారతీయ ఫ్యాషన్లలో హల్చల్ చేశాయి. ఇప్పుడిక చాలా క్లోజ్డ్ కలర్స్(దగ్గరగా ఉండేవి) అంటే ఉదాహరణకు ఎరుపులో మరికొన్ని షేడ్స్‌ను తీసుకోవచ్చు. ఎరుపు, నారింజ, ముదురు ఎరుపు.. ఇలా తీసుకుంటూ వాటికి బంగారు జరీ పెద్ద అంచులను జత చేర్చి దుస్తులను డిజైన్ చేయడం వల్ల ఒక క్లాసిక్ లుక్ వస్తుంది. పెద్ద పెద్ద మోటిఫ్స్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఈ తరహా లుక్‌కి బాగా నప్పుతాయి. ఏ రంగు ఫాబ్రిక్ తీసుకున్నా దానికి పెద్ద పెద్ద జరీ అంచులను జతగా చేస్తే రిచ్ లుక్ వస్తుంది. అన్నీ డిజైనర్ లుక్‌తో ఆకట్టుకోవాలనే అత్యాశకు పోతే గాఢీ లుక్‌తో ఎబ్బెట్టుగా కనిపిస్తారు. అందుకని, చిన్న చిన్న మోటివ్స్ ఉన్న ప్లెయిన్ నెటెడ్, చందేరీ, షిఫాన్ ఓణీలు ఈ తరహా లుక్‌కి బాగా నప్పుతాయి. లంగాఓణీలో ఎంత సింపుల్‌గా కనిపిస్తే అంత బాగుంటుంది. అదే సమయంలో క్లాసిక్లుక్తో, రిచ్‌గానూ ఆకట్టుకోవాలనుకునేవారికి ఈ తరహా వేషధారణ బాగా నప్పుతుంది. గ్రామీణ నేపథ్యంతో పాటూ బామ్మల కాలం నాటి ఒరిజినాలిటీని, రంగులను డిజైనింగ్‌లో చూపిస్తే ఇలాంటి అందమైన వేషధారణ మరింత ఆకర్షణీయంగా రూపుకడుతుంది. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ -
ఆషాఢ లక్ష్ములు...
ముస్తాబు ఆషాఢంలో గోరింట పూసిన చేతులతో ఆదిలక్ష్ములు... శ్రావణంలో సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్ములు... మాసమేదైనా... వేడుకేదైనా... అమ్మాయిల ఛాయిస్ లంగా, ఓణీ అయితే ఐశ్వర్యం ఆ ఇంట కొలువుదీరుతుంది. అమ్మానాన్నలకు కనులపండుగవుతుంది. నేటి తరం అమ్మాయిలు ముస్తాబుకు ఇష్టపడి ఎంచుకునే ముచ్చటైన లంగా, ఓణీల కాంబినేషన్ మీ కోసం... 1- నీలాకాశం రంగు నెట్ లెహంగాకు ఎరుపురంగు బెనారస్ చున్నీని జత చేరిస్తే ఏ పండగైనా నట్టింటికి నడిచొచ్చేస్తుంది. మిర్రర్ వర్క్ ఉన్న లెహంగా బార్డర్, బెనారస్ బ్లౌజ్ అదనపు ప్రత్యేకతలు. 2- హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన సియాన్ గ్రీన్ రా సిల్క్ లెహంగాను మరింత ఆకర్షణీయంగా మార్చివేసింది బెనారస్ చున్నీ. కుందన్ వర్క్ చేసిన ఆఫ్‌వైట్ రా సిల్క్ బ్లౌజ్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. 3- కనకాంబరం రంగు లెహెంగాకు రాయల్ బ్లూ చున్నీ జతకడితే పండిన గోరింటాకు ఎర్రదనం చెక్కిళ్లలో పూస్తుంది. సీక్వెన్స్ చమ్కీ వర్క్ బార్డర్ జత చేసిన లెహంగా స్టోన్ వర్క్‌తో మెరిసిపోతుంటే, కుందన్వర్క్ బ్లౌజ్ ప్రత్యేక శోభను తీసుకువస్తుంది. 4- మిర్రర్ వర్క్ చేసిన షిమా జార్జెట్ మెటీరియల్‌ను లెహంగాగా మార్చి, అద్దాలతో కట్ వర్క్ చున్నీని మెరిపిస్తే పట్టపగలే తారలు దిగివచ్చినట్టుగా అనిపించకమానదు. 5- పీచ్ కలర్ నెట్ లెహంగా, మింట్ గ్రీన్ చున్నీ, ఫుల్ స్లీవ్స్ నెట్ బ్లౌజ్.. పైనంతా స్వీక్వెన్స్ వర్క్‌తో రూపుకడితే రాత్రి దీపకాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోవచ్చు. డిజైనర్ టిప్స్: కుందన్స్, స్టోన్స్, చమ్కీ, మిర్రర్లతో చేసిన వర్క్‌లు పాడైపోకుండా ఉండాలంటే లెహంగాలను దగ్గరికి మడతపెట్టకూడదు. ఎంబ్రాయిడరీ గల లెహంగాలేవైనా హ్యాంగర్‌కి వేలాడదీయాలి. ఏ లెహంగా అయినా శుభ్రపరచాలంటే మైల్డ్ షాంపూతో లేదంటే డ్రై వాష్ చేయించడం ఉత్తమం. మిర్రర్ వర్క్, స్వీక్వెన్స్ వర్క్ గల లెహెంగాలు రాత్రి వేడుకలకు బ్రైట్‌గా కనిపిస్తాయి. సంప్రదాయ వేడుకలకు కేశాలంకరణగా జడ, కాంబినేషన్ ఆభరణాలు బాగా నప్పుతాయి. బర్త్‌డే, రిసెప్షన్ వంటి ఈవెనింగ్ వేడుకలకు కట్ వర్క్ చున్నీలు, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు, వదులుగా ఉండే కేశాలంకరణ బాగా నప్పుతాయి. కర్టెసీ: శశి, ఫ్యాషన్ డిజైనర్, ముగ్ధ ఆర్ట్ స్టూడియో, హైదరాబాద్ www.mugdha410@gmail.com