లె హంగారడి
ఫ్రాక్ వేసుకున్నప్పుడు మన బుజ్జి తల్లులకు ముద్దులు ముద్దల్లో కలిపి పెడతాం ఎత్తుకొని తిరుగుతాం. అదేంటో... లంగా వేసుకోగానే బాధ్యతలు చెబుతాం. నాన్నా! ‘ఓ గ్లాస్ మంచి నీళ్లు అందుకో..’ అని ప్రేమగా పురమాయిస్తాం. లంగా వేసుకున్న అమ్మాయి ఇంట్లో ఉంటే ప్యాంట్ వేసుకున్న అబ్బాయి కన్నా గొప్పది. గొప్పగా ప్రేమిస్తుంది. గొప్పగా బాధ్యతలు తీసుకుంటుంది గొప్పగా ఆలోచిస్తుంది. అసలు విషయం మరిచిపోయాం.. గొప్ప గొప్పగా నచ్చేస్తుంది.
‘‘పాతకాలపు యూరోప్ దుస్తుల డిజైనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ‘ఈ తరహా దుస్తులకు మన దేశీయ సంప్రదాయ కళను వాడితే..’ అనే ఆలోచన వచ్చింది. దాంతో వెస్ట్రన్ కట్స్, ఇండియన్ ఎంబ్రాయిడరీలతో పాటు పర్సియన్, గ్రీసు సంస్కృతులను తీసుకొని అందమైన డ్రెస్ డిజైన్స్ ఎన్నింటినో రూపొందించాను. ఇవన్నీ ఆసియా వనితలను ముఖ్యంగా సినిమా తారలను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఐదేళ్లలోనే ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఈ రంగంలో ఉన్నవారు ఒక కొత్తదనాన్ని పరిచయం చేయడంతో పాటు గతకాలపు గొప్పదనాన్నీ చూపించగలగాలి. అప్పుడే సృజనకు సరైన గుర్తింపు వస్తుంది’’ అంటారు రిధిమెహ్రా!
సింపుల్ అండ్ స్టైల్‌గా కనిపించడానికి పాశ్చాత్య దుస్తులే అక్కర్లేదు. ఇలా భారతీయ కళను విభిన్నంగా చాటచ్చని హ్యాండ్లూమ్ లాంగ్‌లెహంగాతో నిరూపించారు డిజైనర్. నెటెడ్ లాంగ్ లెహంగాకి కొన్ని రంగులు, మరికొన్ని హంగులు చేర్చితే అబ్బురపరిచే సంప్రదాయ కళ ఇలా కళ్లముందు సాక్షాత్కరిస్తుంది.