Phrack
-
పూలు చల్లిన హోలీ
కెమికల్ కలర్స్ ఔట్... నేచురల్ కలర్స్ ఇన్ పూల నుంచి తోడిన రంగులతో హోలీ చిలకరింపులు అందంగా ఉంటాయి. మరి, ఆ పూల అచ్చులతోనే రంగులు అద్దుకుంటే ఎలా ఉంటుంది? అచ్చం పూలు చల్లిన హోలీలా ఉంటుంది. ►ఫ్రాక్ అంతా పువ్వులు రంగులు అద్దుకోవడానికి ముట్టడి చేస్తే నడిచివచ్చే సౌందర్యం కళ్లను కట్టడి చేయాల్సిందే! ► టాప్ టు బాటమ్ పువ్వుల నవ్వులు తోడైతే వెస్ట్రన్ పార్టీలో వెలుగుల రవ్వలు విరజిమ్మాల్సిందే. ► రంగులన్నీ చేరి పువ్వులుగా మారి అవి ప్రింట్లుగా దర్శనమిస్తే పెరిగే వయసుకూ అడ్డుకట్టవేయాల్సిందే! వనితను వైవిధ్యంగా చూపాల్సిందే! ► అంతర్జాతీయ వేదికలైనా సరే పువ్వుల సింగారాలు దుస్తుల మీదకు చేరితే అందరి చూపులు అల్లుకుపోవాల్సిందే! ► పువ్వులు, లతలు జత చేరి అల్లుకుపోయాయంటే అవి లాంగ్ గౌన్‌కు కొత్త వన్నెలద్దాల్సిందే. అందంగా రూపుకట్టాల్సిందే! ► అమ్మాయి మేనిరంగుతో పోటీ పడాలని గులాబీల సోయగం ఫ్రాక్ మీద రూపు కడితే అవి నిలువెల్లా విరిజల్లులై మురిపించాల్సిందే! ► మోదుగపూల సింగారం తెల్లని టాప్ మీదకు చేరితే వాటికి పోటీగా పూలన్నీ రంగులను కుమ్మరించాల్సిందే! అవి మేనికి వసంతాన్ని మోసుకురావాల్సిందే! -
లె హంగారడి
ఫ్రాక్ వేసుకున్నప్పుడు మన బుజ్జి తల్లులకు ముద్దులు ముద్దల్లో కలిపి పెడతాం ఎత్తుకొని తిరుగుతాం. అదేంటో... లంగా వేసుకోగానే బాధ్యతలు చెబుతాం. నాన్నా! ‘ఓ గ్లాస్ మంచి నీళ్లు అందుకో..’ అని ప్రేమగా పురమాయిస్తాం. లంగా వేసుకున్న అమ్మాయి ఇంట్లో ఉంటే ప్యాంట్ వేసుకున్న అబ్బాయి కన్నా గొప్పది. గొప్పగా ప్రేమిస్తుంది. గొప్పగా బాధ్యతలు తీసుకుంటుంది గొప్పగా ఆలోచిస్తుంది. అసలు విషయం మరిచిపోయాం.. గొప్ప గొప్పగా నచ్చేస్తుంది. ‘‘పాతకాలపు యూరోప్ దుస్తుల డిజైనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ‘ఈ తరహా దుస్తులకు మన దేశీయ సంప్రదాయ కళను వాడితే..’ అనే ఆలోచన వచ్చింది. దాంతో వెస్ట్రన్ కట్స్, ఇండియన్ ఎంబ్రాయిడరీలతో పాటు పర్సియన్, గ్రీసు సంస్కృతులను తీసుకొని అందమైన డ్రెస్ డిజైన్స్ ఎన్నింటినో రూపొందించాను. ఇవన్నీ ఆసియా వనితలను ముఖ్యంగా సినిమా తారలను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఐదేళ్లలోనే ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఈ రంగంలో ఉన్నవారు ఒక కొత్తదనాన్ని పరిచయం చేయడంతో పాటు గతకాలపు గొప్పదనాన్నీ చూపించగలగాలి. అప్పుడే సృజనకు సరైన గుర్తింపు వస్తుంది’’ అంటారు రిధిమెహ్రా! సింపుల్ అండ్ స్టైల్‌గా కనిపించడానికి పాశ్చాత్య దుస్తులే అక్కర్లేదు. ఇలా భారతీయ కళను విభిన్నంగా చాటచ్చని హ్యాండ్లూమ్ లాంగ్లెహంగాతో నిరూపించారు డిజైనర్. నెటెడ్ లాంగ్ లెహంగాకి కొన్ని రంగులు, మరికొన్ని హంగులు చేర్చితే అబ్బురపరిచే సంప్రదాయ కళ ఇలా కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. -
ఖాదీ నాదీ
దేశం నాది జెండా నాది స్వేచ్ఛా నాది బాపూ ఇజం నాది నేసిన దేశభక్తి నాది నేతన్న క్షేమం నాది ఖాదీ నీదీ.. నాదీ... ► షార్ట్ ఖాదీ ఫ్రాక్‌లో సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌తో నటి కాజల్ అగర్వాల్ ►పార్టీవేర్‌గా మది దోచుకుంటున్న ఖాదీ ఫ్లెయిర్ కాలర్‌నెక్ గౌన్ ధరించిన నటి రాశీ ఖన్నా ► సింగిల్ కలర్ ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్. స్టైలిష్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తున్న నటి రకుల్ ప్రీత్‌సింగ్ ►ఆరెంజ్ కలర్ మ్యాక్సీ డ్రెస్‌కి డిజైనర్ ఖాదీ లాంగ్ ఓవర్‌కోట్ ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చింది. టు కలర్స్ స్పెషల్ డ్రెస్‌లో నటి రెజీనా! ► ఖాదీ ఫ్లోర్‌లెంగ్త్ అనార్కలీ ధరించి ట్రెడిషనల్ లుక్‌తో వెలిగిపో తున్న నటి లావణ్యా త్రిపాఠీ -
నిన్నలా నువ్వులా!
అందరిలో ఫ్రాక్ ఉంటుంది చిన్నప్పుడు వేసుకున్న నాన్న కొనిపెట్టిన అమ్మ తొడిగించిన అన్నయ్య సవరించిన అందరూ మెచ్చిన ఫ్రాక్ ఉంటుంది. పెళ్లీడు వచ్చిన మేనకోడలిని చూసిన మేనమామ ‘ఏంట్రా! నిన్ననే నిన్ను ఫ్రాక్‌లో చూసినట్టు అనిపిస్తుంది’ అన్నమాట అందరిళ్లలో వినపడేదే! బాల్యానికి సీతాకోక చిలుక రెక్కలలాంటివి ఫ్రాక్‌లు. ఫ్రాక్ వేసుకుంటే నిన్నలా ఉంటావు. నువ్వులా ఉంటావు. నవ్వుతూ ఉంటావు. చిన్నపిల్లలే కాదు టీనేజ్, యంగేజ్ అతివల డ్రెస్ జాబితాలోనూ ఎప్పుడూ వింటూ ఉండే పేరు ఫ్రాక్. ముచ్చటగా పురివిప్పిన నెమలిలా నయనానందం చేసే పొట్టి డ్రెస్‌నే ఫ్రాక్గా చెబుతుంటాం. లాంగ్గా ఉండే ఫ్రాక్‌ని గౌన్‌గా పలుకుతుంటారు. అలాగే చైల్డ్ డ్రెస్ లేదా లైట్ ఓవర్ డ్రెస్ అని కూడా అంటుంటారు. 16వ శతాబ్దిలో ఈ డ్రెస్ పుట్టినప్పటికీ దశల వారీగా అడుగులు వేస్తూ ఇంత దూరం ప్రయాణించడానికి చాలానే కష్టపడింది ఫ్రాక్. 20వ శతాబ్దం వరకు ఉమెన్స్ గౌన్ లేదా ఫ్రాక్ అనే పేరు స్థిరపడటానికి రకరకాల రూపాలు మార్చుకుంది. 16-17వ శతాబ్దిలో ఫుల్ లెంగ్త్‌తో.. లూజ్ ఔటర్ గార్మెంట్‌గా ఫార్మ్ వర్కర్స్కోసం బ్రిటన్ లో పుట్టింది ఫ్రాక్. మందపాటి క్లాత్, పెద్ద కాలర్ నెక్‌తో భారంగా ఉండేది. దీనిని మగవారే వాడేవారు. 18వ శతాబ్దిలో బ్రిటన్, అమెరికాలో మెన్స్ కోసం అన్ఫిటెడ్ ఫ్రాక్స్ వచ్చాయి. 19వ శతాబ్ది నాటికి బ్రాడ్ కాలర్, వెయిస్ట్ పాకెట్స్.. వంటి అదనపు హంగులు చేరాయి. దీనిని ‘ఫ్రాక్ కోట్’గా పురుషులు ధరించేవారు. వీటి పొడవు మోకాళ్ల వరకు, ఇంకా కింది వరకు కూడా ఉండేవి. నావికులు, చేపలు పట్టేవాళ్లూ ఈ తరహా ఫ్రాక్ కోటును ఉపయోగించేవారు. 19 శతాబ్ది చివరలో 20 శతాబ్ది మొదట్లో సరైన ఫిటింగ్ అవసరం లేని, సౌకర్యంలో తిరుగులేని గార్మెంట్‌గా అతివల దుస్తులలో చేరింది. నాటి నుంచి ఎన్నో హంగులు దిద్దుకొని ఇలా అందంగా మగువల చేత మన్ననలు అందుకుంటూనే ఉంది. -
హెడ్ టు టోయ్ ప్రామోనోయ్...
సిటీకి ఇప్పుడు ప్రామ్ థీమ్ అనే సరికొత్త ఫీవర్ పట్టుకుంది. ఈ ట్రెండీ థీమ్‌ను అనుసరించి ఫ్రాక్‌ల నుంచి షూస్ దాకా ఎన్నో వచ్చేశాయి. వీటన్నింటిని మేళవించి నిర్వహించే వేడుకలను ప్రామ్ థీమ్ పార్టీలంటున్నారు. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఈ ట్రెండ్ సిటీని ప్రస్తుతం పట్టి కుదిపేస్తోంది. - శిరీష చల్లపల్లి కాగితపు పూలతో తయారు చేసిన కిరీటాలు... బుట్ట గౌను, ఫ్రాక్‌లు.. విచిత్రంగా అనిపించే ఫ్యాన్సీ ఆభరణాలు.. యాక్ససరీస్.. టాప్ టు బాటమ్ వెరైటీగా అనిపించే లుక్‌తో ఆశ్చర్యపరిచే అమ్మాయిలే ప్రామ్ పార్టీకి సింబల్స్. నగరంలో పెరుగుతున్న ప్రామ్ క్రేజ్‌కు ఈ పార్టీలే నిదర్శనం. ప్రామ్.. ఫ్రమ్ అమెరికా పాశ్చాత్య దేశాల నుంచి పుట్టుకొచ్చిన ట్రెండ్ ఇది. అక్కడి హైస్కూళ్లలో సీనియర్లు, జూనియర్లు కలిసిన సందర్భాల్లో విద్యార్థినులు నిర్వహించే డ్యాన్స్ మేళవించిన వేడుకలే ఈ ప్రామ్ థీమ్ పార్టీలు. అమెరికా, కెనడా, యూకేలలో ఎక్కువగా కనిపిస్తాయి ఈ ప్రామ్ సెలబ్రేషన్స్. ఇప్పుడు మన నగరానికి కూడా వచ్చేశాయి. ఆద్యంతం.. ఆకట్టుకునే లుక్.. సాధార ణంగా సిటీలో జరిగే థీమ్ పార్టీల్లో వేదిక నుంచి అన్నీ థీమ్‌కు తగ్గట్టుగా ఉంటాయి. అయితే ఈ ప్రామ్ పార్టీల్లో థీమ్ అంతా వ్యక్తికే పరిమితం. ఈ పార్టీలకు హాజరయ్యే వ్యక్తి తల నుంచి కాళ్ల దాకా పూర్తి సెపరేట్‌గా డెకరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తలకి కాగితపు పూలతో తయారు చేసిన కిరీటం పెట్టుకోవడంతో ఇది మొదలవుతుంది. రంగురంగుల గులాబీలతో తలకు కిరీటంలో ధరించే ప్రామ్ హెడ్‌బ్యాండ్ ఈ పార్టీ థీమ్‌కి సరైన సింబల్. ఇక ఫ్లోర్ లెన్త్ ఫ్రాక్లాగా పొడుగ్గా మోకాళ్ల కిందకి ఉంటూనే స్లీవ్ లెస్ టచ్ ఇచ్చి.. అక్కడక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండే వాటిని ప్రామ్ ఫ్రాక్ అని వ్యవహరిస్తున్నారు. నియాన్ గ్రీన్, నియాన్ పింక్, ఫంకీ బ్లూ, చిల్లీ రెడ్, కార్బన్ బ్లాక్ రంగులు కలిగిన ఫ్రాక్‌లు ఈ పార్టీలకు ఎక్కువగా డిజైన్ చేస్తారు. ఇక ఈ పార్టీకి షైనింగ్ ప్రామ్ స్పెషల్ జ్యువెల్లరీ కూడా ఉంది. స్పింజెడ్ స్టోన్స్‌తో అందంగా మెరిసే ప్రామ్ మిడ్ రింగ్స్, కళ్లు మిరిమిట్లు గొలిపేలా హైహీల్ ప్రామ్ షూస్ మార్కెట్లో ప్రత్యేకంగా లభిస్తున్నాయి. ఇలా తల నుంచి కాలి వరకు ఒక సరికొత్త థీమ్ డ్రెస్సింగ్‌తో అమ్మాయిలు తమదైన శైలిలో ప్రామ్ పార్టీలు జరుపుకుంటున్నారు. ఈ తరహా పార్టీలకు ఈ డ్రెస్ కోడ్ తప్పని సరి. దీని కోసం స్పెషల్ ఏంజల్ లుక్‌లో మెరిసిపోతూ ట్రెండ్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ప్రామ్ గర్ల్స్. ప్రామ్ ఫ్రాక్‌లు రూ.1500 నుంచి లభ్యమవుతున్నాయి. విభిన్న రకాల ప్రామ్ జ్యువెల్లరీ ఆన్లైన్లో అందుబాటులో ఉంది.