కెమికల్ కలర్స్ ఔట్... నేచురల్ కలర్స్ ఇన్ పూల నుంచి తోడిన రంగులతో హోలీ చిలకరింపులు అందంగా ఉంటాయి. మరి, ఆ పూల అచ్చులతోనే రంగులు అద్దుకుంటే ఎలా ఉంటుంది? అచ్చం పూలు చల్లిన హోలీలా ఉంటుంది.
►ఫ్రాక్ అంతా పువ్వులు రంగులు అద్దుకోవడానికి ముట్టడి చేస్తే నడిచివచ్చే సౌందర్యం కళ్లను కట్టడి చేయాల్సిందే!
► టాప్ టు బాటమ్ పువ్వుల నవ్వులు తోడైతే వెస్ట్రన్ పార్టీలో వెలుగుల రవ్వలు విరజిమ్మాల్సిందే.
► రంగులన్నీ చేరి పువ్వులుగా మారి అవి ప్రింట్లుగా దర్శనమిస్తే పెరిగే వయసుకూ అడ్డుకట్టవేయాల్సిందే!
వనితను వైవిధ్యంగా చూపాల్సిందే!
► అంతర్జాతీయ వేదికలైనా సరే పువ్వుల సింగారాలు దుస్తుల మీదకు చేరితే అందరి చూపులు అల్లుకుపోవాల్సిందే!
► పువ్వులు, లతలు జత చేరి అల్లుకుపోయాయంటే అవి లాంగ్ గౌన్‌కు కొత్త వన్నెలద్దాల్సిందే. అందంగా రూపుకట్టాల్సిందే!
► అమ్మాయి మేనిరంగుతో పోటీ పడాలని గులాబీల సోయగం ఫ్రాక్ మీద రూపు కడితే అవి నిలువెల్లా విరిజల్లులై మురిపించాల్సిందే!
► మోదుగపూల సింగారం తెల్లని టాప్ మీదకు చేరితే వాటికి పోటీగా పూలన్నీ రంగులను కుమ్మరించాల్సిందే! అవి మేనికి వసంతాన్ని మోసుకురావాల్సిందే!
పూలు చల్లిన హోలీ
Published Thu, Mar 9 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
Advertisement
Advertisement