లాంగ్‌ గౌన్‌లో మెరిసిపోతున్న హీరోయిన్‌! డ్రెస్‌ ధర తక్కువే.. అయితే.. | 96 Jaanu Actress Gouri G Kishan Cute Affordable Long Frock Details | Sakshi
Sakshi News home page

Gouri G Kishan: క్యాజువల్‌ డ్రెసెస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ ఈ బ్రాండ్‌! రూ. 4,500లతో..

Published Mon, Mar 27 2023 11:48 AM | Last Updated on Mon, Mar 27 2023 12:01 PM

96 Jaanu Actress Gouri G Kishan Cute Affordable Long Frock Details - Sakshi

Gouri G Kishan: ‘జాను’ సినిమాలో చిన్ననాటి జానకిగా సంప్రదాయంగా కనిపించి.. రెండో సినిమా ‘శ్రీదేవి–శోభన్‌బాబు’లో మోడర్న్‌ లుక్‌లో మెరిసి అభియనంలోనే కాదు అపియరెన్స్‌లోనూ వైవిధ్యాన్ని చాటుకుంది గౌరీ జి. కిషన్‌.  ఈ వెర్సటాలిటీని తను అనుసరించే ఫ్యాషన్‌లోనూ  చూపిస్తోంది. 

ప్రడే..
స్వచ్ఛమైన వెండి నగలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్‌. మెషిన్‌ మేడ్‌ కాకుండా నైపుణ్యంగల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఈ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకున్న వాల్యూ. ఆ క్రియేటర్‌ పేరు దీప్తి ముత్తుసామి. జ్యూలరీ డిజైనింగ్‌ మీదున్న ఆసక్తే ఆమెను ఈ రంగంలోకి దింపింది.

ఫ్యాషన్‌ ఎంట్రపెన్యూర్‌గా మార్చింది. దేశంలోనే పేరెన్నికగన్న జ్యూలరీ బ్రాండ్‌లలో ఒకటిగా ‘ప్రడే’ను నిలిపేలా చేసింది. ఈ బ్రాండ్‌ జ్యూలరీ ఇటు సంప్రదాయ వస్త్రధారణకైనా.. అటు వెస్టర్న్‌ అవుట్‌ ఫిట్స్‌కైనా నప్పేలా ఉంటుంది. ధరలూ అంతే అటు సామాన్యులూ కొనేలా ఇటు సెలెబ్రిటీల స్థాయినీ పెంచేలా ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.

మాగ్జీహం..
పేరుకు తగ్గట్టుగానే ఎంతో ఆనందభరితంగా ఉంటాయి ఈ మాగ్జీహం కలెక్షన్స్‌. కాలేజీకెళ్లే యువతులే ఈ డిజైనర్‌ మెయిన్‌ టార్గెట్‌. క్యాజువల్‌ డ్రెసెస్‌కు కేరాఫ్‌గా ఉంటుంది ఈ బ్రాండ్‌. బడ్జెట్‌ ఫ్రెండ్లీ దుస్తులను అందిస్తూ చాలామంది యువతులకు ఫేవరేట్‌గా మారింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి కొనుగోలు చేసుకోవచ్చు. చెన్నైలోని టీనగర్‌లో మెయిన్‌ బ్రాంచ్‌ ఉంది.

బ్రాండ్‌ వాల్యూ 
డ్రెస్‌ బ్రాండ్‌: మాగ్జీహం
ధర: రూ. 4,500

జ్యూలరీ
బ్రాండ్‌: ప్రడే
కమ్మల ధర: రూ. 3,130
నెక్‌పీస్‌ ధర: రూ. 19,030

కొన్నిసార్లు పొగడ్తలు కూడా  విమర్శల మాదిరి హాని చేస్తాయి. అందుకే, రెండింటినీ మనసుకు తీసుకోను. 
– గౌరీ జి.కిషన్‌ 
-దీపిక కొండి

చదవండి: Deepika Padukone: ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్‌.. రణ్‌వీర్‌ డ్రెసెస్‌కి కూడా! ఈ చీర ధర తెలిస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement