Actress Malavika Sharma In Pink Organza Stotram Saree, Know Its Price Details - Sakshi
Sakshi News home page

Malavika Sharma: అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్‌ చేస్తున్న మాళవిక! చీర ధర 68 వేలకు పైమాటే!

Published Wed, Dec 21 2022 3:19 PM | Last Updated on Wed, Dec 21 2022 6:56 PM

Malavika Sharma In Pink Organza Stotram Saree Price Details - Sakshi

అందమైన అల్లికల చీరలో మాళవిక (PC: Malavika Sharma Instagram)

Malavika Sharma- Fashion Brands: ‘నేల టికెట్‌’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది మాళవిక శర్మ. చేసిన కొద్ది సినిమాల్లోనే వైవిధ్యమైన పాత్రలు పోషించి నటన పట్ల తనకున్న అభిరుచిని చాటుకుంది. ఫ్యాషన్‌ పట్లా తన టేస్ట్‌ భిన్నమైనదేనని తెలుస్తోంది ఆమె ఫాలో అవుతున్న ఈ బ్రాండ్స్‌ను చూస్తుంటే! 

స్తోత్రం
సంప్రదాయ కట్టుకు పాశ్చాత్య సౌందర్యాన్ని తీసుకు రావడంలో ‘స్తోత్రం’ పెట్టింది పేరు. అంతేకాకుండా అల్లికలు, కుందన్‌ వర్క్స్‌తో అందమైన డిజైన్స్‌ రూపొందించడంలోనూ ఈ బ్రాండ్‌ది ప్రత్యేక ముద్ర. దీని డిజైన్స్‌కు విదేశాల్లోనూ మంచి డిమాండే ఉంది. అయినా సరసమైన ధరల్లోనే లభిస్తాయి. పలు ప్రముఖ ఆన్‌లైన్‌  స్టోర్స్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది.


PC: Malavika Sharma Instagram

ఫైన్‌ షైన్‌ జ్యూయెలరీ
చెన్నైకి చెందిన అనిల్‌ కొఠారి .. తొలుత తన కెరీర్‌ను  ‘బ్రౌన్‌ ట్రీ – యువర్‌  హెల్త్‌  ఫుడ్‌  స్టోర్‌ ’ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా మొదలుపెట్టాడు. కొద్ది నెలల్లోనే అదే కంపెనీకి సీఈఓగా ఎదిగి సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మన్‌గా నిలిచాడు. తర్వాత అతని దృష్టి ఫ్యాషన్‌ రంగం మీదకు మళ్లింది.

అప్పుడే  ఈ  ‘ఫైన్‌ షైన్‌ జ్యూయెలరీ’ని ప్రారంభించాడు. అనేక ఫ్యాషన్‌ ఈవెంట్లకు తన బ్రాండ్‌ నగలను స్పాన్సర్‌ చేశాడు. ప్రధాన కస్టమర్లు సెలబ్రిటీలే. అందుకే వీటి ధరలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.


PC: Malavika Sharma Instagram

బ్రాండ్‌ వాల్యూ 
చీరబ్రాండ్‌: స్తోత్రం 
ధర: రూ. 68,500

జ్యూయెలరీ
బ్రాండ్‌: ఫైన్‌ షైన్‌ 
ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

అందుకే లాయర్‌ కావాలనుకున్నా..
నల్లరంగు అంటే చాలా ఇష్టం. అందుకే లాయర్‌ కావాలనుకున్నా.. – మాళవిక శర్మ  
-దీపిక కొండి

చదవండి: Kajol: 48 ఏళ్ల వయసులోనూ ఆకట్టుకునే రూపం.. ఈ మూడు పాటించడం వల్లే అంటున్న కాజోల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement