Brand Value
-
రాశీఖన్నా ధరించిన ఈ డ్రెస్ అన్ని లక్షలా? అంత ఏముందో!
అందం, అభినయాలతో ఆకట్టుకున్న కథానాయిక రాశీ ఖన్నా. ఫిట్నెస్ మీద ఎంత స్పృహతో ఉంటుందో దాన్ని ఎలివేట్ చేసే ఫ్యాషన్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటుంది. ఆ స్టయిలిష్ స్టార్ అభిరుచికి అద్దం పడుతున్న బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. ప్రతిభను నమ్ముకోవాలి ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరి అండా లేకుండానే ఈ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యా. నటిగా మంచి పేరు సంపాదించుకున్నా! మనకున్న నేపథ్యం.. ఫీల్డ్‌లోకి ఎంటర్ అవడానికి ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందేమో కానీ చాన్స్‌లు అందించేది మాత్రం మనలోని ప్రతిభే! అందుకే ప్రతిభను నమ్ముకోవాలి! – రాశీ ఖన్నా జ్యూలరీ బ్రాండ్: మాయా సాంఘ్వీ జ్యూయెల్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. మాయా సాంఘ్వీ జ్యూయెల్స్.. అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో ‘మాయా సాంఘ్వీ జ్యూయెల్స్’ ఒకటి. 1994లో ప్రారంభమైన ఈ దేశీ బ్రాండ్ నేడు అంత్జాతీయ స్థాయికి ఎదిగింది. సంస్కృతీసంప్రదాయ డిజైన్స్‌తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాల్లోని ఔట్‌లెట్స్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. శాంతి బనారస్.. సంప్రదాయ బనారస్‌కు పాశ్చాత్య మెరుగులు అద్దడంలో ‘శాంతి బనారస్’ శైలే వేరు. అంతేకాదు అల్లికలు, కుందన్ వర్క్స్‌తో అందమైన డిజైన్స్ రూపొందించడంలోనూ ఈ బ్రాండ్ ఫేమస్. ఈ డిజైన్స్‌కు విదేశాల్లోనూ డిమాండ్ ఎక్కువే. అయినా సరసమైన ధరల్లోనే లభిస్తాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ చీర డిజైనర్: శాంతి బనారస్ ధర: రూ. 1,40,000 ∙దీపిక కొండి -
అగ్రస్థానం..దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టీసీఎస్..
న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత విలువైన 75 బ్రాండ్స్ విలువ ఈ ఏడాది 379 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. 2022తో పోలిస్తే 4 శాతం క్షీణించింది. ఇటీవలి కాలంలో వ్యాపారాలు, వినియోగదారులకు సరఫరా వ్యవస్థ సంబంధ సమస్యలు, పెరిగిన వడ్డీ రేట్లు తదితర సవాళ్లు ఎదురవడం ఇందుకు కారణం. మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ సంస్థ కాంటార్ రూపొందించిన బ్రాండ్ రిపోర్టులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం అంతర్జాతీయంగా చూస్తే 100 అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్స్ విలువ 20 శాతం మేర పడిపోయింది. టాప్ 10 విలువైన భారతీయ బ్రాండ్స్‌లో 43 (సుమారు రూ.3.57 లక్షల కోట్లు)బిలియన్ డాలర్లతో సుమారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫీ, ఎయిర్టెల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, జియో మొదలైనవి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సమీక్షాకాలంలో పలు రంగాలు వృద్ధి నమోదు చేయగా, ఆటోమోటివ్, టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ వంటివి స్థిరంగా ఉన్నాయని కాంటార్ ఎండీ సౌమ్య మొహంతి తెలిపారు. -
సింగిల్ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా?
ఇండియాలో రిచెస్ట్ క్రికెటర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించి ఒక విషయం మళ్లీ వార్తల్లో నిలిచింది. 2017లో ఎనిమిదేళ్లకు గాను రూ. 100 కోట్లకు పైగా ఒప్పందంపై సంతకం చేసిన తొలి భారత క్రికెటర్‌గా (అప్పటికి భారత కెప్టెన్) రికార్డ్ దక్కించుకున్నాడు. స్పోర్ట్స్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్యూమాతో రూ.110 కోట్ల ఒప్పందం చేసుకోవడం ఇపుడు మళ్లీ విశేషంగా చర్చల్లో నిలుస్తోంది. ఈ డీల్ ద్వారా ప్యూమాకు గ్లోబల్ అంబాసిడర్లు జమైకన్ స్ప్రింటర్లు ఉసేన్ బోల్ట్ , అసఫా పావెల్ , ఫుట్‌బాల్ క్రీడాకారులు థియరీ హెన్రీ , ఆలివర్ గిరౌడ్ సరసన చేరాడని క్రికెట్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో క్రికెట్ స్టార్లకు ఎండార్స్మెంట్ డీల్స్ ఒక రేంజ్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని , రోహిత్ శర్మ లాంటి వాళ్లు కోట్ల విలువైన పలు ఎండార్స్మెంట్ ఒప్పందాలను కుదర్చుకున్నారు. వీరిలో రూ.1,000 కోట్లకు పైగా నికర విలువతో భారత ధనిక క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కోహ్లికి రూ.110 కోట్ల ప్యూమా డీల్ చాలా కీలకం. అయితే బ్రాండ్ విలువలో మాత్రం కోహ్లి మొదటి వాడు కాదు. 2001 లోనే లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ రూ. 100 కోట్ల డీల్ మార్కును సాధించాడు. అపారమైన బ్రాండ్ వాల్యూతో మెగాస్టార్లుగా మారుతున్న ట్రెండ్‌కు ఆద్యుడు సచిన్ అనే చెప్పాలి. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ వరల్డ్‌టెల్‌తో సచిన్ రూ.100 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. సచిన్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా క్రియేట్ చేసిన ఘనత మార్కెటింగ్ నిపుణుడు మార్క్ మస్కరెన్హాస్ నేతృత్వంలోనేదే ఈ సంస్థ. ఈ డీల్ అప్పట్టో సంచలనమే కాదు, ఇది భారత క్రికెట్లో బ్రాండింగ్, ఎండార్స్మెంట్ల రూపాన్ని మార్చేసిందని క్రీడా పండితుల భావన. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుణ్యమా అని క్రికెటర్ల బ్రాండ్ విలువ పెరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. -
మోడర్న్ డ్రెసెస్ కంటే.. చీరకట్టు అంటేనే ఇష్టం: హీరోయిన్
‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా’ అనే క్రేజీ డైలాగ్‌తో అంతే క్రేజ్ సంపాదించుకున్న ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి. అంతటి అందానికి మ్యాచ్ అయ్యే స్టయిల్‌ను క్రియేట్ చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. ఆర్ట్ బై సియా.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ప్రముఖ డిజైనర్స్ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కి ప్రాముఖ్యతనివ్వడంతో, డిజైన్స్ అన్నింటిలోనూ న్యూ స్టయిల్ ప్రతిబింబిస్తోంది. అదే దీనికి యాడెడ్ వాల్యూ. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. మొదట ఆన్లైన్లోనే కొనే వీలుండేది. ఈ మధ్యనే హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో స్టోర్ ఓపెన్ చేశారు. మసాబా గుప్తా ఇప్పుడున్న టాప్ మోస్ట్ డిజైనర్స్‌లో మసాబా గుప్తానే ఫస్ట్. 2009లో ‘హౌస్ ఆఫ్ మసాబా’ పేరుతో బ్రాండ్‌ను ప్రారంభించింది. నాణ్యత, సృజన బ్రాండ్ వాల్యూగా సాగిపోతున్న ఆమె డిజైన్స్ అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. ప్రపంచ వ్యాప్త సెలబ్రిటీస్ ఆమె బ్రాండ్‌కు అభిమానులుగా మారారు. మసాబా ఎవరి కూతురో తెలుసు కదా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్‌ల తనయ. పేరెంట్స్ పేరు ప్రఖ్యాతులను తన కెరీర్‌కి పునాదిగా మలచుకోకుండా కేవలం తన క్రియెటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జించిన ఇండిపెండెంట్ డిజైనర్.. అంట్రపెన్యూర్ ఆమె! బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: మసాబా గుప్తా ధర: రూ. 18,000 జ్యూలరీ బ్రాండ్: ఆర్ట్ బై సియా ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మోడర్న్ డ్రెసెస్ కంటే, ట్రెడిషనల్ వేర్ అంటేనే ఎక్కువ ఇష్టం. అందులోనూ చీరకట్టు అంటే మరీనూ! – లావణ్య త్రిపాఠి -దీపిక కొండి -
లాంగ్ గౌన్‌లో మెరిసిపోతున్న హీరోయిన్! డ్రెస్ ధర తక్కువే.. అయితే..
Gouri G Kishan: ‘జాను’ సినిమాలో చిన్ననాటి జానకిగా సంప్రదాయంగా కనిపించి.. రెండో సినిమా ‘శ్రీదేవి–శోభన్‌బాబు’లో మోడర్న్ లుక్‌లో మెరిసి అభియనంలోనే కాదు అపియరెన్స్లోనూ వైవిధ్యాన్ని చాటుకుంది గౌరీ జి. కిషన్. ఈ వెర్సటాలిటీని తను అనుసరించే ఫ్యాషన్‌లోనూ చూపిస్తోంది. ప్రడే.. స్వచ్ఛమైన వెండి నగలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్. మెషిన్ మేడ్ కాకుండా నైపుణ్యంగల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఈ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వాల్యూ. ఆ క్రియేటర్ పేరు దీప్తి ముత్తుసామి. జ్యూలరీ డిజైనింగ్ మీదున్న ఆసక్తే ఆమెను ఈ రంగంలోకి దింపింది. ఫ్యాషన్ ఎంట్రపెన్యూర్‌గా మార్చింది. దేశంలోనే పేరెన్నికగన్న జ్యూలరీ బ్రాండ్లలో ఒకటిగా ‘ప్రడే’ను నిలిపేలా చేసింది. ఈ బ్రాండ్ జ్యూలరీ ఇటు సంప్రదాయ వస్త్రధారణకైనా.. అటు వెస్టర్న్ అవుట్ ఫిట్స్కైనా నప్పేలా ఉంటుంది. ధరలూ అంతే అటు సామాన్యులూ కొనేలా ఇటు సెలెబ్రిటీల స్థాయినీ పెంచేలా ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. మాగ్జీహం.. పేరుకు తగ్గట్టుగానే ఎంతో ఆనందభరితంగా ఉంటాయి ఈ మాగ్జీహం కలెక్షన్స్. కాలేజీకెళ్లే యువతులే ఈ డిజైనర్ మెయిన్ టార్గెట్. క్యాజువల్ డ్రెసెస్‌కు కేరాఫ్‌గా ఉంటుంది ఈ బ్రాండ్. బడ్జెట్ ఫ్రెండ్లీ దుస్తులను అందిస్తూ చాలామంది యువతులకు ఫేవరేట్‌గా మారింది. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసుకోవచ్చు. చెన్నైలోని టీనగర్లో మెయిన్ బ్రాంచ్ ఉంది. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: మాగ్జీహం ధర: రూ. 4,500 జ్యూలరీ బ్రాండ్: ప్రడే కమ్మల ధర: రూ. 3,130 నెక్‌పీస్ ధర: రూ. 19,030 కొన్నిసార్లు పొగడ్తలు కూడా విమర్శల మాదిరి హాని చేస్తాయి. అందుకే, రెండింటినీ మనసుకు తీసుకోను. – గౌరీ జి.కిషన్ -దీపిక కొండి చదవండి: Deepika Padukone: ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్.. రణ్వీర్ డ్రెసెస్‌కి కూడా! ఈ చీర ధర తెలిస్తే.. -
Virat Kohli: విరాట్ కోహ్లికి ఊహించని షాక్!
Virat Kohli- Ranveer Singh: భారత సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉండే పేరు విరాట్ కోహ్లి. అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ రన్‌మెషీన్ పేరే ఓ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. రికార్డుల రారాజు అయిన కింగ్ కోహ్లి.. బ్రాండ్ వాల్యూ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అయితే, తాజా నివేదికల ప్రకారం.. దేశంలోని మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ ట్యాగ్‌ను కోహ్లి కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ స్థానాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఆక్రమించినట్లు సమాచారం. కాగా గత ఐదేళ్లుగా కోహ్లి వరుసగా ఇండియా మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీగా కొనసాగుతున్నాడు. అయితే, 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ వదిలేసిన కోహ్లిని.. ఆ తర్వాతి ఏడాదిలో వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం కోహ్లి టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు. అగ్రస్థానంలో రణ్వీర్ సింగ్! ఓ వైపు కెప్టెన్సీ చేజారడం.. అదే సమయంలో నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన కోహ్లి ఖాతాలో వెయ్యి రోజుల పాటు సెంచరీ అన్నదే లేకుండా పోయింది. ఈ పరిణామాలు కోహ్లి బ్రాండ్ వాల్యూపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో క్రోల్స్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ రిపోర్టు 2022లో ఈ మేరకు రణ్వీర్ కోహ్లిని వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకువచ్చినట్లు పేర్కొంది. పడిపోయిన బ్రాండ్ వాల్యూ కోహ్లి బ్రాండ్ వాల్యూ 185.7 మిలియన్ డాలర్ల(2021లో) నుంచి గతేడాది 176.9 మిలియన్ డాలర్లకు పడిపోయినట్లు వెల్లడించింది. అదే సమయంలో 2021లో 158.3 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూ కలిగిన రణ్వీర్ సింగ్.. 2022లో 181.7 మిలియన్ డాలర్లతో టాప్‌లోకి దూసుకొచ్చినట్లు తెలిపింది. త్వరలోనే మళ్లీ పూర్వవైభవం అయితే, కోహ్లి బ్రాండ్ వాల్యూలో ఈ మేర పతనం తాత్కాలికమేనని.. త్వరలోనే అతడు పూర్వవైభవం పొందే అవకాశం ఉందని క్రోల్ వాల్యూయేషన్ సర్వీసెస్ ఎండీ అవిరల్ జైన్ మనీ కంట్రోల్‌తో వ్యాఖ్యానించారు. 34 ఏళ్ల కోహ్లి బ్రాండ్ వాల్యూ క్రికెటర్‌గా తారస్థాయికి చేరిందని.. త్వరలోనే నాన్- క్రికెటర్‌గానూ వాల్యూబుల్ సెలబ్రిటీగా అదే స్థాయికి చేరుకోగలడని పేర్కొన్నారు. భార్య అనుష్క శర్మతో విరాట్ కోహ్లి ధోని మాదిరి సతీమణి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి పలు బ్రాండ్లకు ఎండార్స్ చేస్తున్న కోహ్లి.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని మాదిరి నాన్- క్రికెటింగ్ విభాగంలోనూ సత్తా చాటగలడని జైన్ అభిప్రాయపడ్డారు. 2021లో కోహ్లి బ్రాండ్ వాల్యూలో 5 శాతం తరుగుదల నమోదైందని.. అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా మరోసారి కోహ్లి మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ హోదా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. కింగ్ ఎల్లప్పుడూ కాగా ఆసియా కప్-2022 టీ20 టోర్నీతో సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి ఇటీవల ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా టెస్టుల్లోనూ శతక కరువు తీర్చుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 75 సెంచరీలు బాదిన అతడు.. బ్యాటర్‌గా పూర్వవైభవం సాధించాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తిరిగి మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ ట్యాగ్ పొంది రణ్వీర్ను వెనక్కినెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చదవండి: WC 2023: వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆరంభం ఆరోజే.. ఫైనల్ ఎక్కడంటే! హైదరాబాద్‌లోనూ.. WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా.. పాపం ముంబై! -
ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్.. రణ్వీర్ డ్రెసెస్‌కి కూడా! ఈ చీర ధర తెలిస్తే..
దీపికా పదుకోణ్ పరిచయం అక్కర్లేని పేరు. ది గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ (ఫై)లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు. ఆ అందానికి చక్కటి అవుట్ ఫిట్స్‌ని డిజైన్ చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇది కూడా.. సబ్యసాచి... పేరుకే ఇండియన్ బ్రాండ్ కానీ, ఇంటర్నేషనల్ బ్రాండ్‌కున్నంత పేరు.. డిమాండ్ సబ్యసాచి సొంతం. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అన్నీ సబ్యసాచి కలెక్షన్స్‌తోనే జరుగుతాయి. వాటిల్లో విరాట్ కొహ్లీ, అనుష్క శర్మల పెళ్లి బట్టలు ఫేమస్. కనీసం ఒక్కసారైనా సబ్యసాచి డిజైన్ వేర్ ధరించాలని.. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఏంతోమంది ఆశపడుతుంటారు. ఆ బ్రాండ్‌కున్న వాల్యూ అలాంటిది. ఈ మధ్యనే మధ్యతరగతి మహిళల కోసం రూ. పదివేల చీరను డిజైన్ చేశారు. ఇదే ఈ బ్రాండ్ చీపెస్ట్ చీర. సుమారు లక్ష చీరలను సిద్ధం చేస్తే, రెండు రోజుల్లోనే మొత్తం కొనుగోలు చేశారు. పదివేల చీరైనా, పదినిమిషాల్లో అమ్ముడైపోతుంది. ఇదంతా సబ్యసాచి ముఖర్జీ డిజైన్ మహత్యం. బెంగాలీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సబ్యసాచి.. తన కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగారు. 1999లో తన పేరునే ఓ బ్రాండ్ హౌస్‌గా మార్చి, మరింత పాపులర్ అయ్యారు. అందమైన ఆభరణాలు కూడా ‘సబ్యసాచి’ స్టోర్స్‌లో లభిస్తాయి. ఇండియాలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: సబ్యసాచి.. ధర: రూ. 1,95,000 బెల్టు ధర: రూ. 29,900 కమ్మలు ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. నా బ్యాగులో సూది, దారం తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడైనా వేసుకున్న డ్రెస్ కంఫర్ట్‌గా లేకపోతే ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్ చేసేసుకుంటా. రణ్వీర్ డ్రెసెస్కూ ఆల్టరేషన్ చేస్తా.. – దీపిక పదుకోణ్. -దీపిక కొండి -
చీరకట్టులో మెరిసిపోతున్న అనసూయ! ఎప్పుడు ఒకేరకమైన ఆహారం తినలేం కదా!
అనసూయ భరద్వాజ్.. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో మెరుస్తూ తన మీద తెలుగు ప్రేక్షకులకున్న అభిమానాన్ని రెట్టింపు చేసుకుంటోంది. ఫ్యాషన్‌లోనూ అంతే.. ట్రెండ్‌కు తగ్గ కట్టు, బొట్టు తీరుతో తన అభిమానుల ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తుంటుంది. కౌశికి కల్చర్ హైదరాబాద్‌కు చెందిన కౌశికి.. సెలబ్రిటీస్‌కి ఫేవరెట్ డిజైనర్. తన పేరు మీదే ఫ్యాషన్ లేబుల్‌ను క్రియేట్ చేసుకుంది. పట్టు పావడాలకు పెట్టింది పేరు. భారతీయ సంప్రదాయ నేత కళను ఆధునిక డిజైన్స్‌తో పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తుంది. మన్నికైన ఫాబ్రికే ఈ బ్రాండ్‌కి వాల్యూ. నాణ్యత, డిజైన్‌ను బట్టే ధరలు. ఆన్లైన్లో లభ్యం. హౌస్ ఆఫ్ క్యూసీ 2016లో ఒక వెబ్సైట్ ద్వారా ప్రారంభించిన వ్యాపారం, తమ అందమైన డిజైన్స్‌తో ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా నోటెడ్ అయింది. ఎలాంటి వారికైనా నప్పే, ఎలాంటి వారైనా మెచ్చే ఆభరణాలను అందించడం ‘హౌస్ ఆఫ్ క్యూసీ’ జ్యూయెల్స్ ప్రత్యేకత. హైదరాబాద్, బెంగళూరులలో ఈ మధ్యనే స్టోర్స్ ఓపెన్ చేశారు. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కూడా ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర. బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ బ్రాండ్: హౌస్ ఆఫ్ క్యూసీ జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చీర బ్రాండ్: కౌశికి కల్చర్ ధర: రూ. 11,000 ఫ్యాషన్ అనేది మన తిండి అలవాటులా ఉండాలి. ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలను తినలేం. అలాగే ఎప్పుడు ఒకే రకం బట్టలనూ ధరించలేం. – అనసూయ భరద్వాజ్ -దీపిక కొండి చదవండి: పెళ్లికళకు పరిపూర్ణత Sreyashi Raka Das: శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి.. అంచెలంచెలుగా ఎదిగి! సొంత లేబుల్‌తో.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
దేవనాగరి చీరలో సమంత! కోటి రూపాయల విలువైన ఫ్రేమ్స్ కూడా..
సమంత.. వైవిధ్యమైన నటి అని ప్రత్యేకంగా కితాబివ్వక్కర్లేదు. ఆమె నటించిన సినిమాలు చూస్తే చాలు. అదే వైవిధ్యం ఆమె అనుసరించే ఫ్యాషన్‌లోనూ కనిపిస్తుంది. సాక్ష్యం ఇదిగో.. ఈ బ్రాండ్సే..! దేవనాగరి.. ఓ పండుగ రోజు అమ్మమ్మ తయారుచేసిన సంప్రదాయ దుస్తులు ధరించడంతో అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియాంకల భవిష్యత్ ప్రణాళిక మారిపోయింది. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నా.. చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవనాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్ దుస్తుల్లో మెరిసిపోతుంటారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. లిండ్బర్గ్.. టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో లిండ్ బర్గ్ ఐ వేర్ ఒకటి. డెన్మార్క్‌లో మెయిన్ ఆఫీస్ ఉంది. అత్యాధునిక డానిష్ డిజైన్ సూత్రాలపై తయారుచేసే వీరి అందమైన, నాణ్యమైన కళ్లజోళ్లకు ఇండియాలో మంచి గిరాకీ ఉంది. 112 అంతర్జాతీయ అవార్డులను ఈ బ్రాండ్ సొంతం చేసుకుంది. టైటానియం, ప్లాటినం, బంగారం, వెండి, వజ్రాలు పొదిగిన ఫ్రేమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. అయితే, ఈ బ్రాండ్ కేవలం సంపన్నులకు మాత్రమే. ఇక్కడి ప్రారంభ ధరే రూ. లక్షకు పైగా ఉంటుంది. కోటి రూపాయల విలువైన ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. నచ్చినట్లు ఉండు నీకు నచ్చినట్లు నువ్వుండు. ఈ భూమి మీదకి వచ్చింది ఎవరి అభినందనల కోసమో, ఇతరులను సంతోష పెట్టడానికో కాదు. మనకు ఉన్నదాంట్లో సంతోష పడటానికి అలవాటు పడితే అవసరమైనవన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. – సమంత బ్రాండ్ వాల్యూ ఐ వేర్ బ్రాండ్: లిండ్బర్గ్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చీర బ్రాండ్: దేవనాగరి ధర: రూ. 48,500 చదవండి: Sara Ali Khan: పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా వదలను! నా బ్యూటీ సీక్రెట్ ఇదే Sudha Ravi: రెండ్రోజుల్లో ఫంక్షన్.. మూడు రోజుల్లో పెళ్లి.. సుధా రవికి చెప్పారా? ఆమె స్పెషాలిటీ ఏంటి? -
సోషల్ మీడియా పోస్ట్ వాల్యూకి ఇవే కొలమానం! ఈ చిట్కాలు పాటిస్తే..
Build Your Personal Brand- Tips: ఆన్లైన్లో మీరు పోస్ట్ చేసినదాని వాల్యూని లైక్స్, కామెంట్స్, రివ్యూస్ ద్వారా కొలుస్తారు. మిమ్మల్ని తప్పుదారి పట్టించే, హాని కలిగించే కంటెంట్, పుకార్లు, ఫొటోలు, రివ్యూలు లేదా సమస్యాత్మకమైన సైట్ల నుండి తెలియని పోస్ట్‌లు సోషల్ మీడియా సెర్చింగ్‌లో కనిపిస్తే ఏం జరుగుతుంది?! తమకు కావల్సిన వారి వివరాలను సేకరించడానికి సోషల్ మీడియా ప్రొఫైల్‌లను తనిఖీ చేయడం అనేది ఈ రోజుల్లో రొటీన్‌గా మారింది కాబట్టి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటం అవసరం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా బ్రాండ్ లేదా సెలబ్రిటీల విషయాలను బయటకు తీసుకురావడానికి తప్పనిసరిగా కొంత టైమ్, కృషిని పెట్టుబడిగా పెడతారు. సోషల్ ప్లాట్‌ఫారమ్‌లను వినోదం లేదా సామాజిక నెట్వర్క్ కోసం ఉపయోగించడంలో తప్పు లేదు కానీ బ్రాండ్, సెలబ్రిటీల విషయాలను ఆన్లైన్ సరిగ్గా నిర్వహించడంలో అవగాహన మాత్రం తప్పనిసరి. నోటిఫికేషన్ నిర్వహణ సోషల్ మీడియా గెయిన్ గ్రూప్‌లు, కమ్యూనిటీలలో భాగం కావాలి. ఇన్ఫ్లుయెన్సర్ /ఫ్యాన్స్/పోటీదారులు మిమ్మల్ని అనుసరిస్తున్నారో లేదో చెక్ చేస్తుండాలి. మీ ఫ్రెండ్స్ జాబితాలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో చెక్ చేసుకోవాలి. అలాగే, కంటెంట్ షేర్ చేయడంలో, పోస్ట్ చేయడంలో చురుగ్గా ఉండాలి. ప్రతికూల కంటెంట్‌ను సమర్థంగా అణిచివేయగలగాలి. ►విశ్లేషించడం, ప్రచారం చేయడం, ప్రతికూల పోస్ట్‌ల కారణంగా జరిగిన నష్టాన్ని సవరించుకోవాలి. కంటెంట్ నియంత్రణకు డూప్లికేట్, కాపీరైట్ ఉల్లంఘన, ఇతర విషయాల జాడలను తొలగించాలి. మీ డిజిటల్ బ్రాండ్ గుర్తింపు, విజిబిలిటీ, విశ్వసనీయతను సరిగ్గా నిర్వహించడం ద్వారా ఆన్లైన్లో బ్రాండ్ లేదా సెలబ్రిటీగా నిలబెడుతుంది. పోటీ నుండి వేరు చేస్తుంది. ►మీ ఆన్లైన్ బ్రాండ్‌ను సెట్ చేయడానికి అన్ని సోషల్ మీడియా ఛానెల్‌లలో స్థిరమైన, పాజిటివ్ కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నారని నిర్ధారించుకోండి. మీ ఆన్లైన్ ప్రేక్షకులను పెంచడంలో మీకు సహాయపడే సానుకూల కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి కొత్త సైట్లు, సమూహాలను కనుక్కోండి. ►ఇంటర్నెట్లో మీ ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండాలంటే ప్రతికూల వ్యాఖ్యలు, పోస్ట్‌లకు త్వరగా ప్రతిస్పందించాలి. ►మీ ఫోన్, ఇతర పరికరాల జిపిఎస్ నుండి మీకు అనుకూలమైన ప్రకటనల ప్రచారాలు, ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి కంపెనీలు మీరున్న ప్లేస్‌ను ట్రాక్ చేస్తాయి. అందుకని, గోప్యతా సెట్టింగ్స్ చేసుకోండి. ఆన్లైన్లో దాడి ఫాలోవర్స్ నుండి అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు, పరువు నష్టం కలిగించే తప్పుడు ప్రకటనలు, మీ బ్రాండ్ లేదా సెలబ్రిటీ ఆన్లైన్ ఇమేజ్ అవమానపరిచేలా వెబ్ పేజీలు సెటప్ చేసి ఉంటాయి. మంచి మార్గం సోషల్ మీడియాలో మీ కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ముందు వార్తాపత్రికలు, వార్తా సైట్లు, పరిశోధన పత్రాలు, రేడియో, టెలివిజన్ ప్రకటనలు, పత్రికా ప్రకటనల నుంచి సమాచారం సేకరించుకోవాలి. ఉనికికి చిట్కాలు ►మీ పోస్ట్‌లను షెడ్యూల్ చేయడానికి క్యాలెండర్‌ను సృష్టించండి. ►ప్రసిద్ధ హ్యాష్‌ట్యాగ్‌లను గుర్తించండి. ►ఇంటర్వ్యూల కోసం ప్రెస్, ఏజెన్సీల మద్దతు తీసుకోండి. ఇంటర్నెట్ ఎప్పటికీ మరచిపోదు, మీరు పోస్ట్ చేసిన వాటిని తిరిగి మీకు చూపుతుంది. Locobuzz, Reputology, Mention, Reputation Defender వంటి ప్రసిద్ధ ORM టూల్స్ ఉపయోగించండి. మీ బ్రాండ్ ఇమేజ్‌ని లోతుగా సెర్చ్ చేసి, మీ డిజిటల్ ఆస్తులతో పాటు నష్టాలు ఏమున్నాయో చెక్ చేయండి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Skin Care: నల్లటి మచ్చలు మాయం, చర్మ నిగారింపు.. ఎన్నో ఉపయోగాలు! ఈ డివైజ్ ధర? -
అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక! చీర ధర?
Malavika Sharma- Fashion Brands: ‘నేల టికెట్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది మాళవిక శర్మ. చేసిన కొద్ది సినిమాల్లోనే వైవిధ్యమైన పాత్రలు పోషించి నటన పట్ల తనకున్న అభిరుచిని చాటుకుంది. ఫ్యాషన్ పట్లా తన టేస్ట్ భిన్నమైనదేనని తెలుస్తోంది ఆమె ఫాలో అవుతున్న ఈ బ్రాండ్స్‌ను చూస్తుంటే! స్తోత్రం సంప్రదాయ కట్టుకు పాశ్చాత్య సౌందర్యాన్ని తీసుకు రావడంలో ‘స్తోత్రం’ పెట్టింది పేరు. అంతేకాకుండా అల్లికలు, కుందన్ వర్క్స్‌తో అందమైన డిజైన్స్ రూపొందించడంలోనూ ఈ బ్రాండ్‌ది ప్రత్యేక ముద్ర. దీని డిజైన్స్‌కు విదేశాల్లోనూ మంచి డిమాండే ఉంది. అయినా సరసమైన ధరల్లోనే లభిస్తాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. PC: Malavika Sharma Instagram ఫైన్ షైన్ జ్యూయెలరీ చెన్నైకి చెందిన అనిల్ కొఠారి .. తొలుత తన కెరీర్‌ను ‘బ్రౌన్ ట్రీ – యువర్ హెల్త్ ఫుడ్ స్టోర్ ’ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా మొదలుపెట్టాడు. కొద్ది నెలల్లోనే అదే కంపెనీకి సీఈఓగా ఎదిగి సక్సెస్ఫుల్ బిజినెస్‌మన్‌గా నిలిచాడు. తర్వాత అతని దృష్టి ఫ్యాషన్ రంగం మీదకు మళ్లింది. అప్పుడే ఈ ‘ఫైన్ షైన్ జ్యూయెలరీ’ని ప్రారంభించాడు. అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు తన బ్రాండ్ నగలను స్పాన్సర్ చేశాడు. ప్రధాన కస్టమర్లు సెలబ్రిటీలే. అందుకే వీటి ధరలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. PC: Malavika Sharma Instagram బ్రాండ్ వాల్యూ చీరబ్రాండ్: స్తోత్రం ధర: రూ. 68,500 జ్యూయెలరీ బ్రాండ్: ఫైన్ షైన్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అందుకే లాయర్ కావాలనుకున్నా.. నల్లరంగు అంటే చాలా ఇష్టం. అందుకే లాయర్ కావాలనుకున్నా.. – మాళవిక శర్మ -దీపిక కొండి చదవండి: Kajol: 48 ఏళ్ల వయసులోనూ ఆకట్టుకునే రూపం.. ఈ మూడు పాటించడం వల్లే అంటున్న కాజోల్ -
Fashion: అందానికే అందంలా అల్లు స్నేహారెడ్డి! ఆ చీర ధర ఎంతంటే!
Allu Arjun Wife Allu Sneha Reddy- Fashion Brands: ట్రెండ్‌ను ఫాలో అవుతూ స్టైల్ మెయింటైన్ చేయడంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి స్టైలిష్ స్టార్‌కు సరిజోడు అనిపించుకుంటోంది అల్లు స్నేహారెడ్డి. ఫంక్షన్ అయినా.. పార్టీ అయినా.. ఔటింగ్ అయినా.. తనకు నప్పే అవుట్ ఫిట్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అలా తనను ఎలివేట్ చేసే లుక్ కోసం స్నేహారెడ్డి డిపెండ్ అయ్యే ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. లేబుల్ క్షితిజ్ జలోరీ క్షితిజ్.. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో టెక్స్టైల్ కోర్సు పూర్తి చేశాడు. తర్వాత కొంత కాలం వివిధ ప్రాంతాల్లో పర్యటించి దేశ సంస్కృతీసంప్రదాయాలను ప్రేరణగా తీసుకొని 2018లో ‘లేబుల్ క్షితిజ్ జలోరీ’ని ప్రారంభించాడు. దేశీ సంప్రదాయ నేత కళ, వరల్డ్ ట్రెండ్స్ అండ్ స్టయిల్స్‌ను పడుగుపేకలుగా పేర్చి డిజైన్స్‌ను క్రియేట్ చేస్తున్నాడు. అతివలు నచ్చే.. మెచ్చే చీరలు, దుపట్టాలు, లెహంగాలను డిజైన్ చేయడంలో ఈ బ్రాండ్‌కి సాటి లేదు. అయితే వీటి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఖన్నా జ్యూయెలర్స్ నగల వ్యాపారంలో డెబ్భై ఏళ్లకు పైగా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ఈ ఖన్నా జ్యూయెలర్స్ను స్వర్గీయ శ్రీ వజీర్ చంద్ ఖన్నా ప్రారంభించారు. చిక్, లష్ పోల్కిస్ – ఫ్యూజన్ స్టైల్స్ బంగారు ఆభరణాలు ఈ బ్రాండ్ ప్రత్యేకత. ప్రస్తుతం ఢిల్లీతోపాటు చెన్నై, కోయంబత్తూర్లలో ఈ జ్యూయెలర్స్కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: లేబుల్ క్షితిజ్ జలోరీ ధర: రూ. 59,800 జ్యూయెలరీ బ్రాండ్: ఖన్నా జ్యూయెలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అలా ఏం లేదు.. నాకు సపరేట్ స్టైల్ అంటూ లేదు. అకేషన్‌కి తగ్గట్టు రెడీ అవడమే! – అల్లు స్నేహా రెడ్డి. -దీపికా కొండి చదవండి: Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్ అదే! Varsha Bollamma: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 9500! జైరా బ్రాండ్ ప్రత్యేకత అదే! సామాన్యులకు కూడా View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 9500! జైరా బ్రాండ్.. సామాన్యులకు కూడా!
‘మిడిల్ క్లాస్ మెలోడిస్’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తార.. వర్ష బొల్లమ్మ. సాదాసీదా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ.. తన సహజమైన నటనతో మురిపించిన ఆమె ఫ్యాషన్ అభిరుచిని తెలిపే బ్రాండ్స్ ఏంటో చూద్దాం... జైరా ‘ఎవరి అందం వారిదే. ఆ అందాన్ని రెట్టింపు చేయడమే నా బ్రాండ్ లక్ష్యం’ అంటోంది కేరళకు చెందిన జైరా. ఫ్యాషన్ పై ఉన్న ప్యాషన్‌తో చదువు పూర్తయిన వెంటనే తన పేరు మీదే ఓ బోటిక్ ప్రారంభించింది. అందమైన డిజైన్స్‌తో అనతికాలంలోనే ఫ్యాషన్ ప్రపంచంలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె డిజైన్స్‌కు సెలబ్రిటీలు కూడా వీరాభిమానులయ్యారు. అయినా సామాన్యులూ కొనగొలిగే స్థాయిలోనే జైరా బ్రాండ్ ధరలు ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.. అడోర్.. ఇదొక ఆన్లైన్ స్టోర్. ఢిల్లీకి చెందిన ప్రియాంక, సుధీర్ కుమార్ అనే ఇద్దరు స్నేహితులు స్థాపించిన ఈ బ్రాండ్.. అతి తక్కువ సమయంలోనే కస్టమర్–సెంట్రిక్ కంపెనీగా నిలిచింది. తక్కువ ధరలకే చక్కటి డిజైన్లలో సహజమైన రాతి ఆభరణాలను అందిస్తున్నారు. అదే వీరి బ్రాండ్ వాల్యూ. కేవలం ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేసే వీలుంది. లైట్ అప్ సోల్.. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్‌తో ఫుట్‌వేర్ అందించడం ‘లైట్ అప్ సోల్’ స్పెషాలిటీ. అంతేకాకుండా అందమైన హ్యాండ్ మేడ్ బ్యాగులు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇవన్నీ సరసమైన ధరల్లోనే దొరుకుతాయి. కానీ ఆన్లైన్ స్టోర్‌లో మాత్రమే! బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: జైరా ధర: రూ. 9,500 జ్యూయెలరీ బ్రాండ్: అడోర్ ధర: రూ. 395 ఫుట్‌వేర్ బ్రాండ్: లైట్ అప్ సోల్ ధర: రూ. 999 -దీపిక కొండి చదవండి: పర్పుల్ కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ‘వింక్ బ్యూటీ’! డ్రెస్ ధర ఎంతంటే! Floral Designer Wear: ఈవెనింగ్ పార్టీల్లో ఫ్లోరల్ డిజైనర్ వేర్‌తో మెరిసిపోండిలా! -
పెళ్లి కూతురి కలెక్షన్స్‌కు పెట్టింది పేరు! ఈ నటి ధరించిన డ్రెస్ ధర ఎంతంటే
నటిగా తన అభినయాన్ని.. నిర్మాతగా తన అభిరుచిని చూపిస్తూ ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఐశ్వర్య లక్ష్మి. ఆ స్టయిల్‌ను తాను అనుసరించే ఫ్యాషన్‌కూ వర్తింపచేసుకుంటోంది. అలా ఆమెకు స్పెషల్ అపియరెన్స్ ఇస్తున్న బ్రాండ్స్ ఇవే.. జేడ్ బై మోనికా అండ్ కరిష్మా పెళ్లి కూతురి కలెక్షన్స్‌కు పెట్టింది పేరు ఈ బ్రాండ్. తమ ఫ్యాషన్ అభిరుచికి, భారతీయ హస్తకళల పట్ల తమకున్న గౌరవాసక్తులకు ప్రతీకగా దీన్ని స్థాపించారు మోనికా షా, కరిష్మా స్వాలి. సంప్రదాయ నేతకు ఆధునిక డిజైన్స్, హంగులను జోడిస్తున్నారు. దేశీ బ్రాండే అయినా ఫ్యాషన్ రంగంలో అంతర్జాతీయ కీర్తిని అద్దుకుంటోంది. ధరలూ అదే స్థాయిలో ఉంటాయి. ఆన్లైన్లో లభ్యం. అటెలియర్ మోన్ తల్లీ, బిడ్డ.. మోనికా శర్మ, మెహెర్ రోహత్గీ కలసి ప్రారంభించిన బ్రాండే ఈ ‘అటెలియర్ మోన్’. తొలుత ఒక్క ఢిల్లీలో మాత్రమే వీళ్లకు స్టోర్ ఉండేది. కానీ ఇప్పుడు.. వీరి సింపుల్, నేచురల్, ఫెంటాస్టిక్ డిజైన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా రిటైల్ స్టోర్లు వెలిశాయి. బాలీవుడ్ స్టార్స్ ప్రియాంక చోప్రా, దీపికా పడుకోణ్, సోనమ్ కపూర్ వంటి సెలబ్రిటీలు ఈ బ్రాండ్‌కి వీరాభిమానులు. లేబుల్ వోగ్, హార్పర్స్ బజార్, కాస్మోపాలిటన్, గ్రాజియా వంటి ఫ్యాషన్ మ్యాగజీన్లలోనూ ఈ బ్రాండ్ ఆర్టికల్స్ అచ్చవుతుంటాయి. ధర.. అందుబాటులోనే. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: జేడ్ బై మోనికా అండ్ కరిష్మా ధర: రూ. 1,82,600 జ్యూయెలరీ: బ్రాండ్: అటెలియర్ మోన్ ధర: రూ. 2,650 ఓ నటిగా విభిన్న పాత్రలు చేసేందుకు సిద్ధం. నటించే పాత్రను త్వరగా అర్థం చేసుకుని వెంటనే ఆ పాత్రలోకి వెళ్లిపోగలను. అయితే ఇప్పుడే నెగటివ్ రోల్స్ మాత్రం చేయాలనుకోవడం లేదు. – ఐశ్వర్య లక్ష్మీ -దీపికా కొండి చదవండి: Winter Sweater Trendy Designs: శీతాకాలం.. ఆధునికతకు అద్దం పట్టేలా ఊలుదారాల అల్లికలు Manchu Laxmi: డి బెల్లె బ్రాండ్ సారీలో లక్ష్మీ మంచు! చీర ధర ఎంతంటే View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
Fashion: సోనాలీ బింద్రే ధరించిన ఈ త్రీ పీస్ డ్రెస్ ధర 78 వేల పైమాటే! స్పెషాలిటీ?
‘అలనాటి రామచంద్రుడి’ అంటూ సీతలా సిగ్గుల మొగ్గ అయిన సోనాలీ బింద్రే ‘మురారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇన్నేళ్లయినా ఇప్పటికీ అదే గ్రేస్‌ను మెయిన్టైన్ చేస్తోంది. ఆ క్రెడిట్ అంతా ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌దే! చంద్రిమా.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. ముంబైలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది చంద్రిమా అగ్నిహోత్రి. అబూ జానీ, సందీప్ ఖోస్లా, రోహిత్ బాల్ వంటి ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసిన తర్వాత, 2019లో సొంత లేబుల్ ‘చంద్రిమా’ను ప్రారంభించింది. చేనేత, హస్తకళల సమ్మేళనంతో వైవిధ్యమైన, ఆధునిక డిజైన్స్‌ను క్రియేట్ చేస్తోంది. ష్యాషన్ డిజైనింగ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటోంది. అందుకే వీటి ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఆన్లైన్లో లభ్యం. లారా మొరాఖియా... మలబార్ ప్రాంతంలో పుట్టి పెరిగిన లారాకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ రంగంపై ఆసక్తి. 2018లో తన పేరుతోనే ‘లారా మొరాఖియా’ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ దేశ పురాతన కళాకళాఖండాల డిజైన్స్‌నే ప్రేరణగా.. స్ఫూర్తిగా తీసుకుని వెండి , బంగారు లోహాల్లో ముత్యాలు, వజ్రాలను పొదుగుతూ అందమైన ఆభరణాలను అందిస్తోంది. ఈ నగలకు దేశంలోనే కాదు విదేశాల్లోనూ డిమాండ్ ఎక్కువే. ఈ బ్రాండ్‌కు ప్రస్తుతం న్యూయార్క్, ముంబైలో మాత్రమే స్టోర్స్ ఉన్నాయి. ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. హానికారకం కాదుకదా! ‘నచ్చి చేసే తప్పుల్లో నాకు నచ్చేది అందంగా కనిపించాలనే ఆలోచన’ అని హాలీవుడ్ స్టార్ అల్పచీనో అన్న మాటతో నేను ఏకీభవిస్తాను. అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు? అందంగా కనిపించాలనుకోవడమేమీ హానికారకం కాదుకదా! కాకపోతే మనకేది నప్పుతుందో చూసుకోవడం కూడా ముఖ్యమే. – సోనాలీ బింద్రే బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ బ్రాండ్: లారా మొరాఖియా ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. డ్రెస్: త్రీ పీస్ సెట్ బ్రాండ్: చంద్రిమా ధర: లెహంగా: రూ. 39,990 టాప్: రూ. 6,990 జాకెట్: రూ. 31,990 -దీపిక కొండి -
Fashion: జెట్ బ్లాక్ చీరలో మృణాల్! సారీ ధర ఎంతంటే..!
‘లవ్ సోనియా’తో బాలీవుడ్లో మెరిసిన తార మృణాల్ ఠాకూర్. తాజాగా ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. స్క్రీన్ మీద తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నట్టే ఫ్యాషన్‌లోనూ తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది మృణాల్. ఆ స్టయిల్ క్రియేషన్‌లో ఈ బ్రాండ్స్ కూడా భాగమే! పిచ్చిక నెమలి పింఛంలోని ఈకలను తలపించేంత మృదువైన ఫాబ్రిక్స్, ప్రకృతిని మరపించేన్ని రంగులు, డిజైన్లు పిచ్చిక లేబుల్ ప్రత్యేకతలు. ఆ డిజైన్స్ అన్నీ కూడా జైపూర్ హ్యాండ్ పెయింటింగ్స్, హ్యాండ్ ప్రింట్స్, ఎంబ్రాయిడరీలే. తన కళాత్మక దృష్టితో ఈ లేబుల్‌కు వన్నెలు అద్దిన డిజైనర్ ఊర్వశి సేథీ. ఈ బ్రాండ్ దుస్తులు ఆన్లైన్లో లభ్యం. ధరలు ఓ మోస్తరు రేంజ్లో ఉంటాయి. ఓలియో ఆష్నా సింగ్, స్నేహా సక్సేనా అనే ఇద్దరు స్నేహితులు కలసి ఏర్పాటుచేసిన బ్రాండ్ ‘ఓలియో’. ఈ జ్యూవెలరీ బ్రాండ్‌ను స్థాపించక ముందు ఆష్నా మీమ్స్ క్రియేటర్‌గా పాపులర్. స్నేహా.. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిగ్రీ చేసింది. దుస్తులు, యాక్సెసరీస్, జ్యూవెలరీ డిజైనింగ్‌లో దిట్ట. ఈ ఇద్దరూ కలసి సొంతంగా ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ను స్టార్ట్ చేయాలనుకుని 2015లో ‘ఓలియో’కు రూపమిచ్చారు. స్నేహ.. డిజైనింగ్ చూసుకుంటే, ఆష్నా.. బ్రాండ్ వ్యవహార బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఓలియో జ్యూవెలరీ ఆన్లైన్లో లభ్యం. ధరలూ అందుబాటులోనే. బ్రాండ్ వాల్యూ జెట్ బ్లాక్ చీర బ్రాండ్: పిచ్చిక ధర: రూ. 21,500 ఇయర్ రింగ్స్ బ్రాండ్: ఓలియో ధర: రూ. 8,050 ఇండియన్ కర్దాషియాన్ అని పిలిచారు నటిగా కొనసాగాలంటే ఫిట్నెస్ అవసరమని అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు అక్కడ నన్నంతా ఇండియన్ కర్దాషియాన్ అని పిలిచారు. నాలాంటి శరీరాకృతి తెచ్చుకోవడానికి వాళ్లు లక్షల్లో డబ్బు ఖర్చు పెడతారట. ఆ మాట విన్నాక నా మీద నాకు ఎక్కడలేని కాన్ఫిడెన్స్ పెరిగింది – మృణాల్ ఠాకూర్. -దీపికా కొండి చదవండి: Fashion-Velvet Long Jacket: సింపుల్ లుక్‌ను ‘రిచ్’గా మార్చేయగల వెల్వెట్ లాంగ్ జాకెట్! Nazriya Nazim Saree Cost: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! స్పెషాలిటీ? -
Fashion Tips: ఈ హీరోయిన్ ధరించిన అంగ్రఖా కుర్తా ధర 32వేలు! ప్రత్యేకత?
కేథరీన్ త్రెస్సా.. అవును .. సరైనోడు కథానాయిక. సంఖ్యాపరంగా టాలీవుడ్లో ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. తెచ్చుకున్న పేరు.. సంపాదించుకున్న అభిమానం మాత్రం ఘనమే. ఇటీవల ‘భళా తందనానా’ తో తెలుగు స్క్రీన్ మీద ఆమె మళ్లీ కనిపించింది. ఆమెను సెలబ్రిటీని చేసిన నటన సరే.. ఆమెను యూనిక్‌గా నిలిపిన ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.. దీప్ థీ.. బ్రాండ్ సృష్టికర్త.. దీప్తి పోతినేని. తనదైన డిజైన్స్‌తో సినిమా స్టార్స్ ఫ్యాషన్ సిగ్నేచర్‌ను మార్చేసింది దీప్తి. ఫ్యాషన్ ప్రేమికుల అభిరుచి, ఫ్యాషన్‌తో వాళ్లు చేయాలనుకున్న ప్రయోగాలను గమనించి.. వాళ్లు నచ్చే.. మెచ్చేలా తన దీప్ థీని తీసుకొచ్చింది. దాన్నే తన బ్రాండ్ వాల్యూగా స్థిరపర్చుకుంది. ఆ వాల్యూ వల్లే దీప్తీ నేడు సినిమా స్టార్స్‌కు ఫేవరెట్ డిజైనర్‌గా మారింది. ఆ క్రేజ్ ఆమెనూ ఓ సెలబ్రిటీగా మార్చింది. డిజైన్, ఫాబ్రిక్ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ అంగ్రఖా కుర్తా బ్రాండ్: దీప్థీ ధర: రూ. 32,800 జ్యూయెలరీ ఇయర్ రింగ్స్ అండ్ ఉంగరం బ్రాండ్: అమ్రపాలి ధర: డిజైన్, నాణ్యతను బట్టి ఉంటుంది. జీవితంలో జరిగే పరిణామాలను మంచి, చెడులుగా చూడను. అలాగే నా కెరీర్‌ను కూడా అలా విభజించలేను. వచ్చిన.. నచ్చిన అవకాశాన్ని స్వీకరిస్తా. నా వంతు కృషి చేస్తా.. సినిమా అయినా.. జీవితమైనా! – కేథరీన్ త్రెస్సా -దీపిక కొండి -
Fashion: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర రూ. 79,500! స్పెషాలిటీ?
లైట్ పర్పుల్ కలర్ లెహెంగాలో .. అంతకన్నా లైట్ మేకప్‌తో .. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మెరిసిపోతున్న ఆ సెలబ్రిటీని గుర్తుపట్టారా? రుక్సర్ థిల్లాన్ అంటున్నారు కదా యూత్ అంతా ముక్త కంఠంతో. కరెక్ట్! గతేడాది ఆమె సోదరి పెళ్లి వేడుకలోని ఆ దృశ్యం. రుక్సర్ను పరిచయం చేయడానికి ఆమె నటించిన తెలుగు సినిమాల పేర్లు .. ఆకతాయి, కృష్ణార్జున యుద్ధం! తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం! ఈ ఫంక్షన్లో ఆమె అటైర్గా మారిన బ్రాండ్స్ వివరాల మీదకూ చూపు మరల్చండి.. వివాణి ‘మనం వేసుకునే దుస్తులు మన అభిరుచినే కాదు మన ఐడెంటినీ వ్యక్తపరుస్తాయి’ అంటారు వాణి వాట్స్. అనడమే కాదు నమ్ముతారు కూడా. ఆ నమ్మకంలోంచి వచ్చిందే మహిళల డ్రెస్ డిజైన్ బ్రాండ్ వివాణి. 2015లో ప్రారంభించింది. ప్రాచీన భారతీయ ఎంబ్రాయిడరీ కళకు మోడర్న్ ఫ్యాషన్ జోడించి సరికొత్త డిజైన్స్‌ను రూపొందించడమే వివాణి వాల్యూ. కాబట్టే ఆ బ్రాండ్ ఇప్పుడు భారతీయ హస్తకళా రాజసానికి పర్యాయంగా ప్రాచుర్యం పొందుతోంది. చిన్నప్పటి నుంచి ఆమెకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, హస్తకళలు, ఆర్కిటెక్చర్ అంటే ఆసక్తి. ఆ ఆసక్తే కొద్దే పర్ల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్స్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. వివాణిని సృష్టించింది. ది చాంద్ స్టూడియో ఏమ్‌బీఏ చదివిన అన్న దేవేశ్, ఎమ్మే సైకాలజీ చేసిన చెల్లి రిమ్ఝిమ్ల కలల ప్రాజెక్టే ‘ది చాంది స్టూడియో’ జ్యూయెలరీ. 1990లో రత్నాలు, వెండి నగల ఎగుమతితో ప్రారంభమైంది ఆ అన్నాచెల్లెళ్ల ఈ ప్రయాణం. వెండి నగల పట్ల ఈ ఇద్దరికీ ఉన్న అభిరుచి.. ఆ నగలకు మార్కెట్లో ఉన్న డిమాండ్, ఈ వ్యాపారంలో వాళ్లు గడించిన అనుభవం.. ఈ మూడు ‘ది చాంద్ స్టూడియో’ ఏర్పాటుకు ప్రేరణనిచ్చాయి. ఆకట్టుకునే డిజైన్స్, అందుబాటు ధరలు ఈ బ్రాండ్ యూఎస్పీ. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ : లెహెంగా బ్రాండ్: వివాణి ధర: రూ. 79,500 జ్యూయెలరీ: ఇయర్ రింగ్స్ ధర: రూ.2,800 మాంగ్ టీకా బ్రాండ్: ది చాంది స్టూడియో ధర: రూ.4,800 సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలనుంది. అంతేకాదు ప్రతిభావంతులైన ఎంతోమంది డైరెక్టర్స్ వస్తున్నారు. వాళ్లందరితోనూ పనిచేయాలనుంది. – రుక్సర్ థిల్లాన్ చదవండి👉🏾Varsha Mahendra: అక్కడ కేవలం బ్లవుజులే! ఒక్కో దాని ధర రెండున్నర వేల నుంచి 20 వేల వరకు.. -
Kohli: అప్పుడు ‘కెప్టెన్’కు ఏడాదికి 180 కోట్లు.. ఒక్కో పోస్టుకు 5 కోట్లు.. మరి ఇప్పుడు
Virat Kohli Quit Test Captaincy: టీమిండియా ‘కెప్టెన్’గా.. స్టార్ బ్యాటర్‌గా విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రన్‌మెషీన్‌గా పేరొందిన కింగ్ కోహ్లి బ్రాండ్ వాల్యూ కూడా ఎక్కువే. సంపన్న బోర్డుకు చెందిన సారథిగా అతడికి అభిమానుల్లో ఉన్న చరిష్మా దృష్ట్యా పలు వాణిజ్య సంస్థలు కోహ్లిని అంబాసిడర్ నియమించుకున్నాయి. ఇందుకు కోట్లలో పారితోషికం చెల్లిస్తున్నాయి. మరి.. ఇప్పుడు కింగ్ కోహ్లికి ‘కెప్టెన్’ అన్న ట్యాగ్ లేదు. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తనకు తానుగా తప్పుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. ఇక దక్షిణాఫ్రికా చేతిలో భంగపాటు నేపథ్యంలో కోహ్లి స్వయంగా టెస్టు కెప్టెన్సీని వదులుకున్నాడు. బ్యాటర్‌గా కూడా కోహ్లి ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ ‘పరుగుల యంత్రం’ సెంచరీ చేసి ఎన్నాళ్లయ్యిందో!! మరి ఇప్పుడు కూడా కోహ్లి బ్రాండ్ వాల్యూ మునుపటిలాగే ఉంటుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఏడాదికి 180 కోట్లు.. పారిశ్రామిక వర్గాల అంచనా ప్రకారం వివిధ బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోహ్లి 2021 ఏడాదికి గానూ 180- 200 కోట్ల రూపాయల మేర ఆర్జించాడు. సుమారు 30 బ్రాండ్లకు ప్రచాకర్తగా వ్యవహరిస్తున్న అతడు ఈ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి వల్ల సదరు కంపెనీలకు చేకూరిన ప్రయోజనాల గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం. కానీ... అతడి క్రేజ్‌ను క్యాష్ రూపంలోకి మలచుకోవడంలో సదరు కంపెనీలు సఫలమయ్యాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కెప్టెన్‌గా వైదొలిగినా... ఆటగాడిగా కొనసాగుతానన్న కోహ్లి ప్రకటన కారణంగా ఇప్పుడప్పుడే అవి అతడితో బంధాన్ని తెంచుకోవు. ముందు కుదిరిన ఒప్పందాల పరంగానైనా కోహ్లితో కలిసి ముందుకు సాగాల్సిందే. కాబట్టి టెస్టు కెప్టెన్సీ వదులుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు కోహ్లికి వచ్చే నష్టమేమీ లేదు. అతడి ఇమేజ్ వల్లే! ఈ విషయాల గురించి స్పోర్టీ సెల్యూషన్స్ సీఈఓ ఆశిష్ చద్దా ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దూకుడైన ఆటగాడిగా కోహ్లికి ఉన్న క్రేజ్ కంపెనీలకు వరంలాంటిదే. తను భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ధోని చాలా కాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. మరి అతడి బ్రాండ్ వాల్యూ తగ్గలేదు కదా. కోహ్లి విషయంలోనూ అంతే. యువతరానికి కోహ్లి ఐకాన్ లాంటివాడు. తను టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తాడు. కాబట్టి కంపెనీలు అతడిని వదులుకునే అవకాశం లేదు’’ అని చెప్పుకొచ్చారు. మరో అనలిస్టు సంతోష్ దేశాయ్ మాట్లాడుతూ.. ‘‘కోహ్లికి ఉన్న అశేష అభిమానుల కారణంగా అతడు ఎండార్స్ చేసే కంపెనీలు కోట్లలో లాభాలు ఆర్జించాయి. ఇప్పుడు కూడా కోహ్లి చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. కాబట్టి బ్రాండింగ్‌లో అతడి హవా కొనసాగుతుంది’’అని అభిప్రాయపడ్డారు. ఎండార్స్మెంట్ల ద్వారా కోహ్లి సంపాదన (అంచనా) 2021లో ఎండార్స్మెంట్ల ద్వారా కోహ్లి సంపాదించిన మొత్తం: 179 కోట్ల రూపాయలు. ఒక్కరోజు ఎండార్స్ చేయడానికి కోహ్లి ఫీజు: 7- 8 కోట్లు. ఇప్పటి వరకు కోహ్లి దాదాపు 30 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నాడు. ఒక్కో ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా కోహ్లి ఆర్జించే మొత్తం: 5 కోట్లు. డఫ్స్ అండ్ ఫెల్్ప్స డేటా ప్రకారం కోహ్లి బ్రాండ్ వాల్యూ: 237.7 మిలియన్ డాలర్లు చదవండి: India New Test Captain: భారత టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా అతడే!.. అప్పుడే బీసీసీఐ ప్రకటన -
ఈ ఏడాది బైజూస్ ఆదాయం ఎంతో తెలుసా?
ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్‌గా మొదలైన బైజూస్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బైజూస్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కంపెనీ ప్రతీ అడుగు ఓ విశేషంగానే నిలిచింది. తాజాగా మరో సంచలన విషయం ప్రకటించారు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్. వేల కోట్ల ఆదాయం ఈ ఏడాది బైజూస్ సంస్థ రెవిన్యూ రూ. 10,000 కోట్ల రూపాయలు ఉండవచ్చంటూ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ పేర్కొని సంచలనం సృష్టించారు. ఎడ్యుటెక్‌కి సంబంధించి తాము అనేక కొత్త కంపెనీలను కొనుగోలు చేశామని, అవన్నీ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే రూ, 10,000 కోట్ల రెవిన్యూపై 20 నుంచి 23 శాతం మార్జిన్ ఉంటుందని చెప్పారు. దీంతో బైజూస్ సంస్థ ఆదాయం రూ. 2,000 కోట్ల నుంచి రూ. 2,3,00 కోట్ల మధ్యన ఉండవచ్చంటూ అంచనా వేశారు. బ్రాండ్ వాల్యూలోనూ రికార్డ్ కంపెనీ ఆదాయ వివరాలే కాదు బ్రాండ్ వాల్యూలో కూడా మిగిలిన కంపెనీలకు అందనంత జెట్ స్పీడ్‌తో బైజూస్ దూసుకుపోతుందని రవీంద్రన్ అంచనా వేశారు. రాబోయే రెండేళ్లలో అంటే 2023 నాటికి బైజూస్ సంస్థల బ్రాండ్ విలువ రూ. 30,000 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. చదవండి: భారత్‌పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు -
నచ్చితే రూ.100ల టీషర్ట్ అయినా వేసుకుంటా : నటి
రెజీనా.. ఆన్ స్క్రీన్ అయినా.. ఆఫ్ స్క్రీన్ అయినా సహజంగా కనిపించడానికే ఇష్టపడుతుంది. అదే ఆమె స్టయిల్ అయింది. ఆ శైలిని ట్రెండ్‌గా మార్చేసిన బ్రాండ్స్ ఏవంటే.. ఫారిన్ ఫ్యాషన్స్‌కు స్వదేశీ టచ్ అనుశ్రీ బ్రహ్మభట్.. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ప్రపంచంలోనే పెరిగింది. తల్లి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కాకపోయినా చక్కటి టైలర్. అందమైన డిజైన్స్‌తో దుస్తులు కుట్టేది. దీంతో అనుశ్రీకి ఫ్యాషన్‌పై మక్కువ పెరిగింది. లండన్ ఎస్ఎస్డీటీ యూనివర్సిటీలో చదివి, ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది. 2015లో ముంబైలో ‘లేబుల్ అనుశ్రీ’ పేరుతో సంస్థ స్థాపించింది. ఫారిన్ ఫ్యాషన్స్‌ను ఆనుసరించి స్వదేశీ డిజైన్స్ చేయడం ఈమె ప్రత్యేకత. ఎక్కువగా సంప్రదాయ చేనేత కళకు ప్రాధాన్యం ఇస్తుంది. కస్టమర్ అభిరుచి, బడ్జెట్‌కు తగ్గట్టుగా రూ. వేల నుంచి లక్షల వరకు డిజైన్ చేయగలదు. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ అనుశ్రీ కలెక్షన్స్ లభిస్తాయి. నియతి డిజైన్స్.. నియతి అంటే సంస్కృతంలో విధి. పేరుకు తగ్గట్టుగానే స్థాపించిన కొన్ని రోజుల్లోనే ఆ బ్రాండ్ రాత మారిపోయింది.. ఆకర్షణీయమైన డిజైన్స్ వల్ల. ఇక్కడ లభించే ప్రతి ఆభరణాన్నీ చేత్తోనే తయారు చేస్తారు. అదీ ప్రత్యేకమైన పాత పద్ధతులను అవలంబించి. అదే నియతి బ్రాండ్ వాల్యూ. దీనిద్వారా అంతరించి పోతున్న గిరిజనకళా నైపుణ్యాన్ని కాపాడుతున్నారు. సాధారణంగా ఈ ఆభరణాల కోసం రాగి, వెండి లోహాలను ఉపయోగిస్తారు. అయితే ఈ బ్రాండ్ జ్యూయెలరీలో వాడే మెటల్ కన్నా వాటి కళాత్మకమైన డిజైన్స్‌కే విలువ ఎక్కువ. కొన్ని ఆభరణాలు రూ. లక్షల్లో కూడా ఉంటాయి. కేవలం నియతి ఒరిజిన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్, స్టోర్స్‌లో మాత్రమే వీటిని కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ బ్రాండ్: నియతి హారం: పరమ కలెక్షన్స్ ట్రైబల్ నెక్‌పీస్ ధర: రూ. 29,000 డ్రెస్.. మస్డడ్ లెహంగా అండ్ ఆర్గంజా నాటెడ్ షర్ట్ బ్రాండ్: లేబుల్ అనుశ్రీ ధర: రూ. 22,000 కమ్మలు అద్వితీయ కలెక్షన్స్ ఇయరింగ్స్ ధర: రూ. 5,290 ఫలానా బ్రాండ్ నుంచి ఇది లాంచ్ చేశారు. వెంటనే దానిని కొనాలి, వేసుకోవాలి అని నాకు ఎప్పుడూ ఉండదు. వంద రుపాయల టీషర్ట్ అయినా సరే.. నాకు నచ్చితే వేసుకుంటా– రెజీనా ∙దీపిక కొండి -
మళ్లీ టాప్‌లో ముంబై.. రెండో స్థానంలో చెన్నై
ముంబై: గతేడాది ఐపీఎల్ టోర్నీని ఆలస్యం చేసిన కరోనా మహమ్మారి చివరకు ఆపలేకపోయింది. మెరుపుల లీగ్ యూఏఈలో విజయవంతమైంది. అయితే ఐపీఎల్ బ్రాండ్ విలువపై మాత్రం కోవిడ్ ప్రభావం చూపింది. 2019 సీజన్‌తో పోలిస్తే 2020 ఐపీఎల్ విలువ 3.6 శాతం తగ్గింది. 2019లో ఐపీఎల్ క్రితం సీజన్ కంటే 7 శాతం పెరుగుదల నమోదు చేసి రూ. 47,500 కోట్లకు లీగ్ విలువను పెంచుకుంది. కానీ గత సీజన్ కరోనా దెబ్బ వల్ల రూ.45,800 కోట్లకు తగ్గింది. ఫ్రాంచైజీల్లో వరుసగా ఐదో ఏడాది కూడా ముంబై ఇండియన్స్ అత్యధిక బ్రాండ్ విలువను కలిగి వుంది. స్వల్పంగా 5.9 శాతం క్షీణించినా... అపర కుబేరుడు అంబానీ టీమ్ రూ.761 కోట్లతో టాప్‌లో ఉంది. తర్వాత చెన్నై, కోల్‌కతాలు వరుసగా రూ.611 కోట్లు, రూ.543 కోట్లతో టాప్–3లో నిలిచాయి. -
అనిల్ అంబానీ కంపెనీల పతనం
సాక్షి, న్యూఢిల్లీ : వ్యాపార దిగ్గజ సోదరులుగా ఘనతకెక్కిన ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాల మనుగడ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ముకేష్ అంబానీ కంపెనీల బ్రాండ్ విలువ పెరుగుతూ పోతుంటే మరోపక్క అనిల్ అంబానీ కంపెనీల బ్రాండ్ విలువ రోజు రోజుకు తరుగుతూ వస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయెన్స్ గ్రూప్ బ్రాండ్ విలువ గతేడాది కన్నా ఈ ఏడాది మరింత పడిపోయింది. ఇప్పుడు ఈ బ్రాండ్ విలువ 65 శాతం తగ్గి 3, 848 రూపాయలకు పడిపోయింది. దాంతో అనిల్ అంబానీ కంపెనీల గ్రూప్ బాండ్ భారత్‌లో 56వ స్థానానికి చేరుకుంది. 2018లో ఉన్న స్థానంతో పోలిస్తే ఏకంగా 28 ర్యాంకులు తగ్గింది. లండన్‌లోని ‘ఇండిపెండెంట్ స్ట్రాటజీ కన్సల్టెంట్’ ఇటీవల విడుదల చేసిన ‘బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా–100’ జాబితాలో మొదటి స్థానాన్ని టాటా గ్రూప్ దక్కించుకుంది. రిలయెన్స్ కమ్యూనికేషన్స్ సహా రిలయెన్స్ గ్రూపులోని అన్ని కంపెనీల బ్రాండ్ విలువ పడిపోతుండడంతో మొత్తం కంపెనీల గ్రూప్‌పై దాని ప్రభావం పడుతోంది. ప్రస్తుతం రిలయెన్స్ కమ్యూనికేషన్లలో చెల్లింపుల పర్వం కొనసాగుతోంది. ‘నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్’ ముందు ఈ కంపెనీ ఎన్నో కేసులను ఎదుర్కొంటున్నది. స్వీడన్ టెలికమ్ పరికరాల కంపెనీ ‘ఎరిక్సన్’కు బకాయిలను చెల్లించడంలో ముకేష్ అంబాని సహకరించి ఉండక పోయినట్లయితే అనిల్ అంబానీ జైలుకు కూడా వెళ్లేవాడు. అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ‘ఆర్ పవర్’ విద్యుత్ సంస్థ, ‘రిలయెన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్’, ‘రిలయెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ సంస్థలన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఇందుకు పూర్తి భిన్నంగా ముకేష్ అంబానీ సారథ్యంలోని ‘రిలయెన్స్ జియో’ 360 కోట్ల డాలర్ల బ్రాండ్ విలువతోని ‘బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా–100’ జాబితాలో 14వ స్థానాన్ని ఆక్రమించుకుంది. అతి తక్కువ ధర వ్యూహంతోనే ఆ కంపెనీ అతి ఎక్కువ బ్రాండ్ విలువను పెంచుకోగలిగింది. టాటా గ్రూప్ వరుసగా రెండో ఏడు కూడా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 1960 కోట్ల డాలర్ల విలువతో ఇది అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత స్థానాల్లో ఎల్ఐసీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, మహీంద్రా సంస్థలు కొనసాగుతున్నాయి. -
చెన్నై సూపర్ కింగ్సే టాప్!
లండన్: స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కారణంగా రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది సీజన్లో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగి ఆరంభం నుంచి గొప్ప ప్రదర్శన చేసి ఆఖరికి కప్పు ఎగరేసుకుపోయింది. తద్వారా తన ఐపీఎల్ టైటిల్స్ సంఖ్యను సీఎస్కే మూడుకు పెంచుకుంది. దాంతో పాటు ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ విలువలో కూడా గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది చెన్నై సూపర్‌కింగ్స్ బ్రాండ్ విలువ రూ. 445కోట్లకు పైగా చేరుకుంది. దాంతో ఇప్పటివరకూ ఐపీఎల్లో అత్యంత విలువైన బ్రాండ్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ అధిగమించింది. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.425కోట్ల బ్రాండ్ వాల్యూతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక మూడో స్థానంలో రూ. 370 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉండగా, తర్వాత స్థానాల్లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీ, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లు ఉన్నాయి. ఈ మేరకు లండన్‌కు చెందిన వాల్యుయేషన్ కంపెనీ బ్రాండ్ ఫినాన్స్ ఒక నివేదికను విడుదల చేసింది. 2010, 2013లో బ్రాండ్ విలువలో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై... ఈ ఏడాది కూడా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. మరొకవైపు ఐపీఎల్ బ్రాండ్ విలువ 5.3 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. లీగ్ ఆరంభంలో ఐపీఎల్ విలువ 3 బిలియన్ డాలర్లు ఉండగా, అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఇక పదకొండో సీజన్లో ఐపీఎల్ బ్రాండ్ విలువ 37శాతం పెరిగినట్లు సదరు కంపెనీ తెలిపింది. -
అమాంతం పెరిగిన పీవీ సింధు బ్రాండ్ వాల్యూ
మొన్నటివరకు వర్ధమాన షట్లర్గానే ఉన్న పీవీ సింధు.. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ స్టార్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి సింధుకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. సన్మానాలు చేశారు. ఉద్యోగాలు ప్రకటించారు. రియోలో రజతపతకం సాధించాక ఈ తెలుగుతేజం కెరీర్ మారిపోయింది. సింధు బ్రాండ్ వాల్యూ ఎన్నో రెట్లు పెరిగింది. ఆమెతో వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు చేసుకోవడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సింధు బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతుందని, ఒప్పందాలు చేసుకోవడంలో తొందరపడబోమని ఆమె ఎండార్స్మెంట్ వ్యవహారాలను చూస్తున్న బ్రాండ్ మేనేజ్మెంట్ సంస్థ బేస్‌లైన్ వెంచర్స్ భావిస్తోంది. సింధుతో రెండు ఎండార్స్మెంట్ ఒప్పందాలను త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం. బేస్‌లైన్ వెంచర్స్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణన్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు ముందు ఈ ఎండార్స్మెంట్ ఒప్పందాలు జరిగాయని, సింధు సన్నాహకాల్లో తీరికలేకుండా ఉండటంతో ప్రకటించలేదని చెప్పారు. ఇవి జాతీయ స్థాయిలో మేజర్ ఎండార్స్మెంట్స్ అని చెప్పారు.