Build Your Personal Brand- Tips: ఆన్‌లైన్‌లో మీరు పోస్ట్ చేసినదాని వాల్యూని లైక్స్, కామెంట్స్, రివ్యూస్ ద్వారా కొలుస్తారు. మిమ్మల్ని తప్పుదారి పట్టించే, హాని కలిగించే కంటెంట్, పుకార్లు, ఫొటోలు, రివ్యూలు లేదా సమస్యాత్మకమైన సైట్‌ల నుండి తెలియని పోస్ట్‌లు సోషల్ మీడియా సెర్చింగ్‌లో కనిపిస్తే ఏం జరుగుతుంది?!
తమకు కావల్సిన వారి వివరాలను సేకరించడానికి సోషల్ మీడియా ప్రొఫైల్‌లను తనిఖీ చేయడం అనేది ఈ రోజుల్లో రొటీన్‌గా మారింది కాబట్టి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటం అవసరం. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఏదైనా బ్రాండ్ లేదా సెలబ్రిటీల విషయాలను బయటకు తీసుకురావడానికి తప్పనిసరిగా కొంత టైమ్, కృషిని పెట్టుబడిగా పెడతారు.
సోషల్ ప్లాట్‌ఫారమ్‌లను వినోదం లేదా సామాజిక నెట్‌వర్క్ కోసం ఉపయోగించడంలో తప్పు లేదు కానీ బ్రాండ్, సెలబ్రిటీల విషయాలను ఆన్‌లైన్ సరిగ్గా నిర్వహించడంలో అవగాహన మాత్రం తప్పనిసరి.
నోటిఫికేషన్ నిర్వహణ
సోషల్ మీడియా గెయిన్ గ్రూప్‌లు, కమ్యూనిటీలలో భాగం కావాలి. ఇన్‌ఫ్లుయెన్సర్ /ఫ్యాన్స్/పోటీదారులు మిమ్మల్ని అనుసరిస్తున్నారో లేదో చెక్ చేస్తుండాలి. మీ ఫ్రెండ్స్ జాబితాలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో చెక్ చేసుకోవాలి. అలాగే, కంటెంట్ షేర్ చేయడంలో, పోస్ట్ చేయడంలో చురుగ్గా ఉండాలి. ప్రతికూల కంటెంట్‌ను సమర్థంగా అణిచివేయగలగాలి.
►విశ్లేషించడం, ప్రచారం చేయడం, ప్రతికూల పోస్ట్‌ల కారణంగా జరిగిన నష్టాన్ని సవరించుకోవాలి. కంటెంట్ నియంత్రణకు డూప్లికేట్, కాపీరైట్ ఉల్లంఘన, ఇతర విషయాల జాడలను తొలగించాలి. మీ డిజిటల్ బ్రాండ్ గుర్తింపు, విజిబిలిటీ, విశ్వసనీయతను సరిగ్గా నిర్వహించడం ద్వారా ఆన్‌లైన్‌లో బ్రాండ్ లేదా సెలబ్రిటీగా నిలబెడుతుంది. పోటీ నుండి వేరు చేస్తుంది.
►మీ ఆన్‌లైన్ బ్రాండ్‌ను సెట్ చేయడానికి అన్ని సోషల్ మీడియా ఛానెల్‌లలో స్థిరమైన, పాజిటివ్ కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నారని నిర్ధారించుకోండి. మీ ఆన్‌లైన్ ప్రేక్షకులను పెంచడంలో మీకు సహాయపడే సానుకూల కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి కొత్త సైట్‌లు, సమూహాలను కనుక్కోండి.
►ఇంటర్నెట్‌లో మీ ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండాలంటే ప్రతికూల వ్యాఖ్యలు, పోస్ట్‌లకు త్వరగా ప్రతిస్పందించాలి.
►మీ ఫోన్, ఇతర పరికరాల జిపిఎస్ నుండి మీకు అనుకూలమైన ప్రకటనల ప్రచారాలు, ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి కంపెనీలు మీరున్న ప్లేస్‌ను ట్రాక్ చేస్తాయి. అందుకని, గోప్యతా సెట్టింగ్స్ చేసుకోండి.
ఆన్‌లైన్‌లో దాడి
ఫాలోవర్స్ నుండి అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు, పరువు నష్టం కలిగించే తప్పుడు ప్రకటనలు, మీ బ్రాండ్ లేదా సెలబ్రిటీ ఆన్‌లైన్ ఇమేజ్ అవమానపరిచేలా వెబ్ పేజీలు సెటప్ చేసి ఉంటాయి.
మంచి మార్గం
సోషల్ మీడియాలో మీ కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ముందు వార్తాపత్రికలు, వార్తా సైట్‌లు, పరిశోధన పత్రాలు, రేడియో, టెలివిజన్ ప్రకటనలు, పత్రికా ప్రకటనల నుంచి సమాచారం సేకరించుకోవాలి.
ఉనికికి చిట్కాలు
►మీ పోస్ట్‌లను షెడ్యూల్ చేయడానికి క్యాలెండర్‌ను సృష్టించండి.
►ప్రసిద్ధ హ్యాష్‌ట్యాగ్‌లను గుర్తించండి.
►ఇంటర్వ్యూల కోసం ప్రెస్, ఏజెన్సీల మద్దతు తీసుకోండి. ఇంటర్నెట్ ఎప్పటికీ మరచిపోదు, మీరు పోస్ట్ చేసిన వాటిని తిరిగి మీకు చూపుతుంది.
Locobuzz, Reputology, Mention, Reputation Defender వంటి ప్రసిద్ధ ORM టూల్స్ ఉపయోగించండి. మీ బ్రాండ్ ఇమేజ్‌ని లోతుగా సెర్చ్ చేసి, మీ డిజిటల్ ఆస్తులతో పాటు నష్టాలు ఏమున్నాయో చెక్ చేయండి.
ఇన్‌పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
చదవండి: Skin Care: నల్లటి మచ్చలు మాయం, చర్మ నిగారింపు.. ఎన్నో ఉపయోగాలు! ఈ డివైజ్ ధర?
Comments
Please login to add a commentAdd a comment