Online Brand
-
సోషల్ మీడియా పోస్ట్ వాల్యూకి ఇవే కొలమానం! ఈ చిట్కాలు పాటిస్తే..
Build Your Personal Brand- Tips: ఆన్లైన్లో మీరు పోస్ట్ చేసినదాని వాల్యూని లైక్స్, కామెంట్స్, రివ్యూస్ ద్వారా కొలుస్తారు. మిమ్మల్ని తప్పుదారి పట్టించే, హాని కలిగించే కంటెంట్, పుకార్లు, ఫొటోలు, రివ్యూలు లేదా సమస్యాత్మకమైన సైట్ల నుండి తెలియని పోస్ట్‌లు సోషల్ మీడియా సెర్చింగ్‌లో కనిపిస్తే ఏం జరుగుతుంది?! తమకు కావల్సిన వారి వివరాలను సేకరించడానికి సోషల్ మీడియా ప్రొఫైల్‌లను తనిఖీ చేయడం అనేది ఈ రోజుల్లో రొటీన్‌గా మారింది కాబట్టి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటం అవసరం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా బ్రాండ్ లేదా సెలబ్రిటీల విషయాలను బయటకు తీసుకురావడానికి తప్పనిసరిగా కొంత టైమ్, కృషిని పెట్టుబడిగా పెడతారు. సోషల్ ప్లాట్‌ఫారమ్‌లను వినోదం లేదా సామాజిక నెట్వర్క్ కోసం ఉపయోగించడంలో తప్పు లేదు కానీ బ్రాండ్, సెలబ్రిటీల విషయాలను ఆన్లైన్ సరిగ్గా నిర్వహించడంలో అవగాహన మాత్రం తప్పనిసరి. నోటిఫికేషన్ నిర్వహణ సోషల్ మీడియా గెయిన్ గ్రూప్‌లు, కమ్యూనిటీలలో భాగం కావాలి. ఇన్ఫ్లుయెన్సర్ /ఫ్యాన్స్/పోటీదారులు మిమ్మల్ని అనుసరిస్తున్నారో లేదో చెక్ చేస్తుండాలి. మీ ఫ్రెండ్స్ జాబితాలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో చెక్ చేసుకోవాలి. అలాగే, కంటెంట్ షేర్ చేయడంలో, పోస్ట్ చేయడంలో చురుగ్గా ఉండాలి. ప్రతికూల కంటెంట్‌ను సమర్థంగా అణిచివేయగలగాలి. ►విశ్లేషించడం, ప్రచారం చేయడం, ప్రతికూల పోస్ట్‌ల కారణంగా జరిగిన నష్టాన్ని సవరించుకోవాలి. కంటెంట్ నియంత్రణకు డూప్లికేట్, కాపీరైట్ ఉల్లంఘన, ఇతర విషయాల జాడలను తొలగించాలి. మీ డిజిటల్ బ్రాండ్ గుర్తింపు, విజిబిలిటీ, విశ్వసనీయతను సరిగ్గా నిర్వహించడం ద్వారా ఆన్లైన్లో బ్రాండ్ లేదా సెలబ్రిటీగా నిలబెడుతుంది. పోటీ నుండి వేరు చేస్తుంది. ►మీ ఆన్లైన్ బ్రాండ్‌ను సెట్ చేయడానికి అన్ని సోషల్ మీడియా ఛానెల్‌లలో స్థిరమైన, పాజిటివ్ కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నారని నిర్ధారించుకోండి. మీ ఆన్లైన్ ప్రేక్షకులను పెంచడంలో మీకు సహాయపడే సానుకూల కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి కొత్త సైట్లు, సమూహాలను కనుక్కోండి. ►ఇంటర్నెట్లో మీ ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండాలంటే ప్రతికూల వ్యాఖ్యలు, పోస్ట్‌లకు త్వరగా ప్రతిస్పందించాలి. ►మీ ఫోన్, ఇతర పరికరాల జిపిఎస్ నుండి మీకు అనుకూలమైన ప్రకటనల ప్రచారాలు, ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి కంపెనీలు మీరున్న ప్లేస్‌ను ట్రాక్ చేస్తాయి. అందుకని, గోప్యతా సెట్టింగ్స్ చేసుకోండి. ఆన్లైన్లో దాడి ఫాలోవర్స్ నుండి అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు, పరువు నష్టం కలిగించే తప్పుడు ప్రకటనలు, మీ బ్రాండ్ లేదా సెలబ్రిటీ ఆన్లైన్ ఇమేజ్ అవమానపరిచేలా వెబ్ పేజీలు సెటప్ చేసి ఉంటాయి. మంచి మార్గం సోషల్ మీడియాలో మీ కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ముందు వార్తాపత్రికలు, వార్తా సైట్లు, పరిశోధన పత్రాలు, రేడియో, టెలివిజన్ ప్రకటనలు, పత్రికా ప్రకటనల నుంచి సమాచారం సేకరించుకోవాలి. ఉనికికి చిట్కాలు ►మీ పోస్ట్‌లను షెడ్యూల్ చేయడానికి క్యాలెండర్‌ను సృష్టించండి. ►ప్రసిద్ధ హ్యాష్‌ట్యాగ్‌లను గుర్తించండి. ►ఇంటర్వ్యూల కోసం ప్రెస్, ఏజెన్సీల మద్దతు తీసుకోండి. ఇంటర్నెట్ ఎప్పటికీ మరచిపోదు, మీరు పోస్ట్ చేసిన వాటిని తిరిగి మీకు చూపుతుంది. Locobuzz, Reputology, Mention, Reputation Defender వంటి ప్రసిద్ధ ORM టూల్స్ ఉపయోగించండి. మీ బ్రాండ్ ఇమేజ్‌ని లోతుగా సెర్చ్ చేసి, మీ డిజిటల్ ఆస్తులతో పాటు నష్టాలు ఏమున్నాయో చెక్ చేయండి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Skin Care: నల్లటి మచ్చలు మాయం, చర్మ నిగారింపు.. ఎన్నో ఉపయోగాలు! ఈ డివైజ్ ధర? -
ఆన్లైన్ బ్రాండ్ బోట్‌కు భారీ నిధులు
సాక్షి, బెంగళూరు : ఇయర్ ఫోన్స్, స్పీకర్లు తదితర ఉత్పత్తులను విక్రయించే కన్జూమర్ బ్రాండ్ బోట్(బీవోఏటీ) తాజాగా 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 730 కోట్లు) నిధులను అందుకుంది. గ్లోబల్ పీఈ కంపెనీ వార్బర్గ్ పింకస్ తాజాగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఆన్లైన్ బ్రాండ్ కంపెనీ బోట్ విలువ 30 కోట్ల డాలర్లను(రూ. 2,200 కోట్లు) తాకినట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేశాయి. కన్జూమర్ బ్రాండ్లను విక్రయించే బోట్ ప్రధానంగా చైనా తదితర విదేశీ కంపెనీల నుంచి పోటీని ఎదుర్కొంటోంది. తాజాగా లభించిన నిధులతో దేశీయంగా తయారీని పటిష్ట పరచుకోవడంతోపాటు.. వృద్ధి అవకాశాలను పెంచుకునేందుకు వినియోగించనున్నట్లు బోట్ ప్రమోటర్లు అమన్ గుప్తా, సమీర్ మెహతా వెల్లడించారు. (కొత్త కెమెరా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ల సందడి) ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాభాల ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకానికి అనుగుణంగా ప్రొడక్టులను తయారు చేసే యోచనలో ఉన్నట్లు బోట్ ప్రమోటర్లు తెలియజేశారు. దేశీయంగా స్మార్ట్ వేరబుల్స్ ప్రొడక్టులను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. దేశీ తయారుదారులకు పీఎల్ఐ పథకం పోటీ నుంచి రక్షణ కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి ప్రాథమిక దశలో ఉన్నామని, రెండు.. మూడు త్రైమాసికాలలోగా మేడిన్ ఇండియా ప్రొడక్టులను విడుదల చేయగలమని వెల్లడించారు. ఔట్సోర్సింగ్, సొంత తయారీ ద్వారా 50-60 శాతం ప్రొడక్టులను రూపొందించే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు. కోవిడ్-19, సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా నుంచి ప్రొడక్టుల దిగుమతులకు విఘాతం ఏర్పడినట్లు తెలియజేశారు. కాగా.. ఇవే ప్రతికూలతలతో ఇటీవల ఐవేర్ ప్రొడక్టుల సంస్థ లెన్స్‌కార్ట్ సైతం దేశీ తయారీవైపు దృష్టి సారించినట్లు నిపుణులు పేర్కొన్నారు. (చైనా పేమెంట్ యాప్‌లకు ట్రంప్ చెక్) రూ. 1,000 కోట్లు 2020 మార్చితో ముగిసిన గతేడాదిలో బోట్ రూ. 700 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,000 కోట్ల అమ్మకాలు నమోదు చేయగలదని అంచనా వేస్తోంది. అమెజాన్ ఇండియాలో ఆన్లైన్ బ్రాండుగా ప్రారంభమైన బోట్ నాణ్యతగల ఉత్పత్తులతో వేగంగా వృద్ధి సాధిస్తున్నట్లు గుప్తా పేర్కొన్నారు. వినియోగదారులకు చేరువయ్యే బాటలో సొంత ప్లాట్‌ఫామ్‌ను సైతం ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆఫ్‌లైన్ ద్వారా కూడా 20 శాతం అమ్మకాలను సాధిస్తున్నట్లు చెప్పారు. కంపెనీ తొలినాళ్లలో 30 లక్షల డాలర్లు ఇన్వెస్ట్ చేసిన ఫైర్‌సైడ్ వెంచర్స్ కొంతమేర వాటాను వార్‌బర్గ్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. -
నటి రమ్యకు కాంగ్రెస్ కీలక పదవి
న్యూఢిల్లీ : ప్రముఖ కన్నడ సినీ నటి, మాజీ ఎంపీ రమ్యకు కాంగ్రెస్ కు కీలక పదవికి కట్టబెట్టేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ డిజిటల్ కమ్యూనికేషన్స్ కు కొత్త అధినేతగా, సోషల్ మీడియా, ఐటీ బాధ్యతలను రమ్యను అప్పజెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కన్నడ సినిమాల్లో ప్రముఖ నటిగా రమ్యకు పేరుంది. 2012లో రమ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత మాండ్య నియోజకవర్గానికి ఎంపీగా బాద్యతలు నిర్వర్తించారు. ట్విట్టర్ లో రమ్యకు 4,83,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఐటీ వింగ్ ను స్థాపించి, ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతున్న దీపిందర్ హూడా స్థానంలో రమ్యను నియమించనున్నట్టు తెలుస్తోంది. ముందస్తు కంటే కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రదర్శన మెరుగుపడిందని, దాన్ని ఇంకా పుంజుకునేలా చేయాలని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దానికి సరియైన వ్యక్తి హూడా కాదని తెలిపాయి. మరింత దూకుడుగా, వూహ్యత్మకంగా ఉండేవారిని సోషల్ మీడియా చీఫ్ గా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటుందని, దీనికి రమ్య సరైన వ్యక్తిగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రమ్య చేస్తున్న ట్వీట్లు ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే, ఇరకాటంలో పడేసేవి ఉంటున్నాయి. గత నెల చత్తీస్ ఘడ్ లో సుక్మాలో జరిగిన నక్సల్స్ దాడిలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై రమ్య చేసిన ట్వీట్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. హోమంత్రి పదవిలో ఉన్నారా? లేరా? ఇంటెల్ ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వంతో ఎవరూ సురక్షితంగా లేరు. ఆర్మీ కానీ, ప్రజలు కానీ, కనీసం ఆధార్ వివరాలు కూడా భద్రంగా లేవంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ రమ్య 2017 ఏప్రిల్ 24న ఓ ట్వీట్ చేశారు. గతేడాది ఆగస్టులో కూడా ఆమె వివాదాస్పదమైన ట్వీట్ చేసి, దుమారం రేపింది. పాకిస్తాన్ నరకం కాదని, అది మంచి దేశమని పేర్కొంటూ రక్షణ మంత్రి పారికర్ కామెంట్లను తోసిపుచ్చిన రమ్య చేసిన ట్వీట్ పై రాజద్రోహం కేసు కూడా నమోదైంది.