అత్యంత విలువైన భారత్ బ్రాండ్.. టాటా | Tata Group tops Brand Finance list | Sakshi
Sakshi News home page

అత్యంత విలువైన భారత్ బ్రాండ్.. టాటా

Published Fri, Aug 8 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

అత్యంత విలువైన భారత్ బ్రాండ్.. టాటా

అత్యంత విలువైన భారత్ బ్రాండ్.. టాటా

 న్యూఢిల్లీ: భారత అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ నిలిచింది. 2,100 కోట్ల డాలర్ల విలువతో తన అగ్రస్థానాన్ని టాటా గ్రూప్ ఈ ఏడాది కూడా నిలుపుకుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్  తాజా నివేదిక వెల్లడించింది. భారత టాప్ 100 బ్రాండ్ల విలువ మొత్తం 9,260 కోట్ల డాలర్లని ఈ అధ్యయనం పేర్కొంది.

 ఈ అధ్యయనం వెల్లడించిన మరికొన్ని వివరాలు...
ఏడాదికాలంలో టాటా బ్రాండ్ విలువ 300 కోట్ల డాలర్లు పెరిగింది. టాటా గ్రూప్ అంతర్జాతీయ వివిధీకరణ వ్యూహం, గ్రూప్ ప్రధాన ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు.

టాప్ 50 బ్రాండ్‌ల విలువ గత ఏడాది విలువతో పోల్చితే 10 శాతం పెరిగింది.


టాటా,  గోద్రేజ్, హెచ్‌సీఎల్, ఎల్ అండ్ టీ ల బ్రాండ్ విలువ చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బ్రాండ్ విలువ 51 శాతం పెరిగింది.

బలహీనమైన రుణ నియంత్రణ నిబంధనలు, నిర్వహణ తీరు సరిగ్గా లేనందున ప్రభుత్వ బ్యాంక్‌ల బ్రాండ్ విలువ తగ్గింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ విలువ 190 కోట్ల డాలర్లు తగ్గింది. ఆదాయ అంచనాలు బాగా లేకపోవడం, మొండి బకాయిలు బ్రాండ్ విలువ తగ్గడంలో ప్రభావం చూపాయి.

భారత అగ్రశ్రేణి 100 బ్రాండ్లకు సంబంధించి బ్రాండ్ విలువ, వ్యాపార విలువకు ఉన్న నిష్పత్తి సగటున 12%గా ఉంది. కొన్ని భారీ ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ నిష్పత్తి 3 శాతంగా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement