HCL
-
అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టం
భారతదేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతూ ఉంది. వీరిలో చాలా మంది లెక్కకు మించిన డబ్బు సంపాదించడమే కాకుండా.. ఉదారంగా దాతృత్వ కార్యక్రమాలకు మద్దతిస్తూ.. వేలకోట్లు దానం చేస్తుంటారు. ఇందులో చెప్పుకోదగ్గ వ్యక్తి బిలియనీర్ 'శివ్ నాడార్' (Shiv Nadar). అయితే ఈయన హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ షేర్స్ మంగళవారం 9 శాతం క్షీణించాయి. దీంతో ఒక్క రోజులోనే రూ. 46,485 కోట్లు నష్టం వాటిల్లింది.హెచ్‌సీఎల్ టెక్ మార్కెట్ విలువభారతదేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో ఒకటైన హెచ్‌సీఎల్.. డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫమయ్యాయి. దీంతో సంస్థ స్టాక్ ధరలో కూడా భారీ క్షీణత కనిపించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో కంపెనీ షేర్లు 8.63% పతనమై, ఒక్కో షేరుకు రూ.1,813.95 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో, స్టాక్ మొత్తం 9.41% క్షీణతను ప్రతిబింబిస్తూ రూ. 1,798.40 కనిష్ట స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో షేరు 8.51 శాతం క్షీణించి రూ.1,819.95 వద్ద ముగిసింది. ఫలితంగా జనవరి 14 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది.శివ్ నాడార్ నికర విలువఒక్క రోజులో వేలకోట్ల నష్టం వాటిల్లినప్పటికీ.. శివ్ నాడార్ నికర విలువ ఫోర్బ్స్ ప్రకారం 39.4 బిలియన్ డాలర్లు లేదా రూ. 3,40,793 కోట్లుగా ఉంది. ఇది ఆయన బలమైన పునాదిని & ఐటీ రంగంలో కంపెనీ బలానికి నిదర్శనం అని తెలుస్తోంది.అత్యంత ఉదార దాతశివ్ నాడార్ కేవలం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో ఒకరుగా మాత్రమే కాకుండా.. అత్యంత ఉదారమైన పరోపకారిగా కూడా గుర్తింపు పొందారు.శివ్ నాడార్ దాతృత్వంలో అంబానీ, అదానీని కూడా మించిపోయారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 2,153 కోట్లు విరాళమిచ్చారు. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. దీంతో ఎడెల్‌గివ్ హురున్ వితరణశీలుర లిస్టులో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు.ఇదీ చదవండి: ఐటీ కంపెనీల్లో ఇదీ పరిస్థితి: ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అస్థిరత ఫలితంగా హెచ్‌సీఎల్ టెక్ వాల్యుయేషన్‌లో తాత్కాలిక తగ్గుదల ఏర్పడినప్పటికీ, భారతదేశ ఐటీ రంగానికి శివ్ నాడార్ చేసిన కృషి, అతని దాతృత్వ ప్రయత్నాల కారణంగా అతనిని నిజమైన మార్గదర్శకుడిగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ తరాలకు రోల్ మోడల్‌గా నిలిపింది. -
Roshni Nadar: దిగ్గజ ఐటీ కంపెనీ వారసురాలు.. మోస్ట్ పవర్ఫుల్ మహిళ! (ఫొటోలు)
-
హెచ్‌సీఎల్ టెక్ లాభం అప్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ క్యూ2లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 4,235 కోట్లుగా నమోదైంది. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్ల నుంచి రూ. 28,862 కోట్లకు చేరింది. రెవెన్యూ వృద్ధితో పాటు లాభదాయకత కూడా మెరుగ్గా ఉందని సంస్థ సీఈవో సి. విజయ్ కుమార్ తెలిపారు. వార్షికంగా ఆదాయ వృద్ధి 3.5–5.0 శాతంగా ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచి్చంది. క్యూ2లో 780 మంది ఉద్యోగులను తగ్గించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,18,621కి చేరింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి గాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 12 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. సోమవారం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేరు స్వల్పంగా ఒక్క శాతం పెరిగి రూ. 1,856 వద్ద క్లోజయ్యింది. -
ఆఫీసుల్లోనే ఆగిపోతున్న గుండెలు.. మరో టెకీ మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని, మృతుడిని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్ మైఖేల్ (40) గా గుర్తించామని పోలీసులు తెలిపారు.శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని వాష్‌రూమ్‌కి వెళ్లిన మైఖేల్ ఎంతకీ బయటకు రాలేదని, సోనెగావ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి తెలిపారు. అతని సహచరులు వెంటనే అతనిని నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌కు తరలించగా పరశీలించిన వైద్యులు అతను మృతిచెందినట్లు ప్రకటించారు.సోనేగావ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు. ప్రాథమిక శవపరీక్షలో ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు తేలిందని పోలీసు అధికారి తెలిపారు. మైఖేల్‌కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిసింది.ఇటీవల కార్పొరేట్ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లక్నోలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
హెచ్‌సీఎల్ మరో క్యాంపస్.. అదనంగా 5 వేల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నగరంలోని హైటెక్ సిటీలో త్వరలో కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త క్యాంపస్ ద్వారా మరో 5 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్నీ నాడర్ మల్హోత్రా శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. కొత్త క్యాంపస్ ప్రారంపోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వనించారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్.. విద్యార్థులకు మెరుగైన శిక్షణ, విద్యావనరుల విస్తరణ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి పనిచేయాల్సిందిగా హెచ్సీఎల్ను కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్‌సీఎల్ చేస్తున్న కృషిని సీఎం అభినందించారు. హెచ్‌సీఎల్‌కు తగినంత సహకారం అందిస్తామని చెప్పారు. నైపుణ్య శిక్షణ ద్వారా యువత సాధికారత కోసం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామని రోష్నీ నాడర్ హామీ ఇచ్చారు. స్కిల్స్ యూనివర్సిటీతోపాటు హెచ్‌సీఎల్ విద్యాకార్యక్రమాలను రాష్ట్రంలోని ఇతర వర్సిటీలకు విస్తరిస్తామన్నారు. -
'నో ఆఫీస్.. నో లీవ్స్'.. టెక్ దిగ్గజం కొత్త మంత్రం!
కరోనా వ్యాప్తి తీవ్రతరమైంది సమయంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాయి. అయితే కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా కొంతమంది ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ససేమిరా అంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని హెచ్‌సీఎల్‌టెక్ కొత్త పాలసీని అందుబాటులో తీసుకురానుంది.ఆఫీసులకు వచ్చినవారికి మాత్రమే లీవ్స్ అందింస్తామని, ఆఫీసులకు రాకుండా లీవ్ తీసుకుంటే శాలరీలో కోతలు ఉంటాయని హెచ్‌సీఎల్‌టెక్ వెల్లడించింది. మహమ్మారి తర్వాత ఉద్యోగులను తిరిగి క్యాంపస్‌కు తీసుకురావడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగులు వారానికి మూడు రోజులు, నెలలో కనీసం 12 రోజులు ఆఫీసులో ఉండాలి. హైబ్రిడ్ వర్క్ మోడల్‌కి మారిన ఐదు నెలల తర్వాత హెచ్‌సీఎల్‌టెక్ ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాలని కోరింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఉద్యోగులకు ఈ మెయిల్స్ ద్వారా వెల్లడించాయి. -
టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలు
టెక్ కంపెనీలు జనరేటివ్ ఏఐపై దూకుడుగా పనిచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో వీటిలో అపార అవకాశాలున్నట్లు గుర్తించి ఆదిశగా ముందుకుసాగుతున్నాయి. తాజాగా జనరేటివ్ ఏఐలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కృత్రిమమేధ రంగంలో కంపెనీ చాలా మందికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే సుమారు 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఏడాదిలో ట్రెయినింగ్ పూర్తి చేస్తామన్నారు. గడిచిన త్రైమాసికంలో కొత్తగా 2700 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపారు. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగిగే కనీసం 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామన్నారు. భవిష్యత్తులో ఏదైనా మార్పులు ఏదురైతే నియామకాల సంఖ్యలోనూ తేడాలుండవచ్చని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థకంపనీ మార్చి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి రేటు 5.4%గా నమోదైంది. టెక్ కంపెనీలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీలపై క్లౌడ్, జనరేటివ్‌ఏఐ ప్రాజెక్టులు పెరుగుతాయని విజయ్ అంచనా వేశారు. అయితే ఆర్థిక సేవల విభాగంలో మాత్రం కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ ఆధారిత సైబర్ భద్రత, డేటా, క్లౌడ్ ఇమిగ్రేషన్, ప్రైవేటు ఏఐ స్టాక్‌ల నిర్మాణం తదితర విభాగాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
టీసీఎస్ బాటలో హెచ్‌సీఎల్ - అయోమయంలో ఐటీ ఉద్యోగులు..
కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా చాలామందికి ఇంటి నుంచే ఉద్యోగం చేయడానికి సుముఖత చూపుతూ.. ఆఫీసులకు రావడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్ కంపెనీ తమ ఉద్యోగులకు ఫైనల్ వార్ణింగ్ ఇచ్చేసింది. ఈ బాటలో ఇప్పుడు హెచ్‌సీఎల్ అడుగులు వేస్తోంది. హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ ఇప్పుడు తమ ఉద్యోగులను తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. హెచ్‌సీఎల్ ఉద్యోగి ఎవరైనా వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది. కొత్త నిబంధనలు 2024 ఫిబ్రవరి 19 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ స్పష్టంగా చేసింది. దీంతో ఉద్యోగులు 19వ తేదీ నుంచి తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసుకు వెళ్లాల్సిందే. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయాలని ఆదేశించాయి. అన్ని విభాగాల్లోని ఉద్యోగులు హోదాతో సంబంధం లేకుండా ఆఫీసుకు రావాలని హెచ్‌సీఎల్ టెక్ పీపుల్స్ ఫంక్షన్స్ గ్లోబల్ హెడ్ వికాస్ శర్మ ఆదేశిస్తూ.. ఈ నెల 14న మెయిల్స్ పంపినట్లు సమాచారం. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే జీతం లేకుండా సెలవు తీసుకున్నట్లు (లాస్ ఆఫ్ పే) ప్రకటించే అవకాశం ఉన్నట్లు మేనేజ్మెంట్ హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ! ఆఫీసులకు రావడమే కాకుండా ఉత్పాదక కూడా పెంచాలని యాజమాన్యం ఆదేశిస్తున్నట్లు సమాచారం. అంటే ఉద్యోగులు రోజుకు సగటున కనీసం 8 గంటలు పనిచేయాలని చెబుతున్నారు. 8 గంటలపాటు ల్యాప్‌టాప్ యాక్టివిటీ నమోదు కాని సందర్భంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
మొన్న విప్రో.. నేడు హెచ్‌సీఎల్ - ఎందుకిలా?
భారతదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన 'హెచ్‌సీఎల్ టెక్నాలజీ' (HCL Technology) బెంగళూరులోని తన కార్యాలయం ఆస్తులను విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. హెచ్‌సీఎల్ కంపెనీ, బెంగళూరు జిగానీ పారిశ్రామిక ప్రాంతంలోని సుమారు 27 ఎకరాల స్పెషల్ ఎకనామిక్ జోన్ క్యాంపస్ విక్రయించాలని చూస్తోంది. ఈ ప్రాపర్టీ విలువ సుమారు రూ. 550 కోట్లు వరకు ఉంటుందని అంచనా. అనవసర ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే హెచ్‌సీఎల్ తన ఆస్తులను విక్రయించాలనుకుంటున్నట్లు కొందరు చెబుతున్నారు. నాన్ కోర్ రియల్ ఎస్టేట్ అసెట్స్ మానిటైజే చేసేందుకు, కార్యకలాపాల్ని క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: వేగానికి చెక్ పెట్టే గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ - ఎలా పనిచేస్తుందంటే? హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిణీ నాడార్, కంపెనీని వేగంగా అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రంగాల్లో అడుగుపెట్టడానికి కూడా యోచిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో సెమీకండక్టర్ చిప్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఏకంగా 400 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. -
ఐటీ కంపెనీలు అంతంతే.. మళ్లీ నిరాశాజనకమే!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలకు సాధారణంగా రెండో త్రైమాసికం పటిష్టమైనదే అయినప్పటికీ ఈసారి మాత్రం ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండనున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల స్థూల ఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు నెలకొనడంతో క్లయింట్లు తమ వ్యయాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుండటం... ఐటీ సంస్థలకు ప్రతికూలంగా ఉండనుంది. పరిస్థితులు మెరుగుపడతాయనేందుకు అర్థవంతమైన సంకేతాలేమీ లేకపోవడంతో క్యూ1లో కనిపించిన బలహీనత రెండో త్రైమాసికంలోనూ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 11న టీసీఎస్‌తో మొదలుపెట్టి ఐటీ దిగ్గజాలు రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్టోబర్ 12న ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, 18న విప్రో ఫలితాలు వెలువడనున్నాయి. ‘సాధారణంగా ఐటీ కంపెనీలకు రెండో త్రైమాసికం పటిష్టంగానే ఉంటుంది. కానీ త్రైమాసికాలవారీగా టాప్ అయిదు కంపెనీల వృద్ధి చూస్తే మైనస్ 1 శాతం (టెక్ మహీంద్రా), ప్లస్ 1.9 శాతం (హెచ్‌సీఎల్ టెక్) మధ్య ఉండొచ్చు‘ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నోట్లో తెలిపింది. పెద్ద ఐటీ కంపెనీలు ఒక మోస్తరుగానే ఉన్నా.. మధ్య స్థాయి సంస్థలు మాత్రం మెరుగ్గానే రాణించనున్నాయి. తగ్గనున్న వృద్ధి వేగం .. ఐటీ సేవల రంగం జులై–సెప్టెంబర్ క్వార్టర్లో త్రైమాసికాల వారీగా సగటున 1.5 శాతం, వార్షికంగా 5.7 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. దశాబ్దకాలంలో నమోదైన అత్యంత తక్కువ వృద్ధి రేట్లలో ఈ క్వార్టర్ ఒకటి కాగలదని పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణం, వినియోగదారులు ఖర్చు పెట్టడం తగ్గించుకుంటూ ఉండటం వంటి పరిణామాలతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా, రిటైల్, హై–టెక్, కమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో మందగమనం కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. వ్యయాల తగ్గింపు, కన్సాలిడేషన్‌కు సంబంధించిన భారీ డీల్స్‌తో ద్వితీయార్ధంలో ప్రథమ శ్రేణి కంపెనీల వ్యాపారం సాధారణ స్థాయికి తిరిగి రాగలదని, 2025 ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడటానికి బాటలు వేయగలవని షేర్‌ఖాన్ వివరించింది. -
ఇంటర్‌తో సాఫ్ట్వేర్ ఉద్యోగం..!
అనకాపల్లి రూరల్ : నేటి యువత ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలే లక్ష్యంగా విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించేందుకు కార్యాచరణ రూపొందించింది. భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలను అందిస్తోంది ప్రభుత్వం. హెచ్‌సీఎల్ టెక్ బీ పేరుతో అమలు చేస్తున్న ఈ అసాధారణ కార్యక్రమంపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా మంగళవారం అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు హెచ్‌సీఎల్ సంస్థ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశాన్ని జిల్లా వృత్తి విద్యాధికారిణి బి. సుజాత ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఇలాంటి మంచి అవకాశంపై విద్యార్థులందరికీ కళాశాలల ప్రిన్సిపాళ్లు వివరించి అవగాహన కల్పించాలన్నారు. చిన్న వయసులోనే సాఫ్ట్వేర్ కొలువులతోపాటుగా ఉన్నత విద్య చదువుకునే వీలుంటుందన్నారు. దీనిని విద్యార్థులంతా సద్వినియోగపర్చుకునేలా చూడాలని ప్రిన్సిపాళ్లను ఆమె కోరారు. హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రాం గురించి సంస్థ రాష్ట్ర మేనేజర్ అనిల్, ఉత్తరాంధ్ర క్లస్టర్ మేనేజర్ యుగేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. 2023, 2024 సవత్సరాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు హెచ్‌సీఎల్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంకు అర్హులని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తొలుత నిర్వహించే ఆన్లైన్లో పరీక్షలో ఎంపికై న వారికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికై న విద్యార్థులు హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రాంలో చేరడానికి ఆఫర్ లెటర్ పొందుతారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత ఏడాది కాలపరిమితితో టెక్ బీ ట్రైనింగ్ ఉంటుంది. విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరుల్లో హెచ్‌సీఎల్ క్యాంపస్‌లకు వెళ్లి ఒక నెల శిక్షణ తీసుకోవాలి. అనంతరం మరో ఐదు నెలలు ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ శిక్షణ పొందవచ్చు. ఇందుకోసం అభ్యర్థులకు ల్యాప్ ట్యాప్‌తో పాటు ఇంటర్నెట్ ఛార్జీలు సంస్థ ఇస్తుంది. అనంతరం ప్రారంభంలోనే రూ.10 వేల స్టైఫండు ఆరు నెలలు చెల్లిస్తారు. తర్వాత ప్రతిభా ఆధారంగా సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాల కోసం తమ సంస్థ దేశంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎంలతో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంఏఎల్ కళాశాల ప్రిన్సిపాల్ జయబాబు, జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
రూ. 600 జీతం.. ఐఏఎస్ కొడుకు - ఎవరీ అజయ్ చౌదరి!
HCL Co Founder Ajai Chowdary Success Story: ఈ రోజు మనకు 'ఫాదర్ ఆఫ్ హార్డ్‌వేర్ ఇన్ ఇండియా' అని చెప్పగానే 'అజయ్ చౌదరి' గుర్తుకు వస్తారు. అయితే ఈయన ఎవరు? ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి ఎదగటానికి చేసిన కృషి ఏమిటి? ఆయన సంపాదన వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రూ. 600 జీతానికి.. నిజానికి 'అజయ్ చౌదరి' ఒక ఐఏఎస్ అధికారి కొడుకు, ఇతడు ఒకప్పుడు రూ. 600 జీతానికి ఉద్యోగం చేసాడు. అయితే ఈ రోజు భారతదేశ ఐటి రంగంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. HCL టెక్నాలజీస్ వ్యవస్థాపక సభ్యులలో ఈయన కూడా ఒకరు కావడం గమనార్హం. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చి శరణార్థి శిబిరంలో నివసించిన కుటుంబానికి చెందిన అజయ్ చౌదరి ఈ రోజు కోటీశ్వరుల జాబితాలో ఒకరుగా నిలిచారు. జబల్పూర్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చౌదరి తన కెరీర్‌ను ప్రారంభించాడు. మైక్రో కాంప్ ప్రారంభం.. భారతీయ సాంకేతిక విప్లవంలో అతిపెద్ద వాటాదారులలో ఒకరుగా ఎదిగిన చౌదరి DCM డేటా ఉత్పత్తుల విక్రయాలలో వృత్తిని ప్రారంభించిన తరువాత నాడార్ & మల్హోత్రాతో ఏర్పడ్డ పరిచయం ఈయన జీవితాన్ని మార్చివేసింది. వీరు మొదటి స్టార్ట్ చేసిన కంపెనీకి 'మైక్రో కాంప్' అని పేరుపెట్టారు. ఆ తరువాత వీరు 1970లో హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్‌కి మరింత చిన్నగా 'HCL' అని నామకరణం చేశారు. ఇదీ చదవండి: ఆలోచన ఏదైనా ఇట్టే పట్టేస్తుంది.. మైండ్ రీడింగ్ టెక్నాలజీలో ఏఐ ముందడుగు! అంతర్జాతీయ విస్తరణ.. కేవలం రూ. 1.8 లక్షలతో ప్రారంభమైన హెచ్‌సీఎల్ నేడు ఏకంగా రూ. 3,20,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. మొదట్లో విక్రయాలకు సంబంధించి చౌదరి నాయకత్వం వహించారు. ఆ తరువాత అనతి కాలంలోనే అంతర్జాతీయంగా విస్తరించారు. ఇదీ చదవండి: ఆధార్ ఉన్నవారికి హెచ్చరిక.. యూఐడీఏఐ కీలక ప్రకటన పద్మభూషణ్.. 1999 - 2012 మధ్య హెచ్‌సిఎల్ ఛైర్మన్‌గా కూడా అజయ్ చౌదరి పనిచేశారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ పాట్నా వంటి సంస్థల బోర్డుల్లో పనిచేశారు. అంతే కాకుండా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) ఛైర్మన్‌గా.. ఐటీ మంత్రిత్వ శాఖ కోసం సెమీకండక్టర్ల సలహా బోర్డులో సభ్యుడుగా కూడా పనిచేశాడు. 2011లో భారత ప్రభుత్వం ఈయన సేవలకుగాను పద్మభూషణ్ అవార్డుని అందించింది. -
టాప్ ఐటీ కంపెనీ సీఈవో జీతం ఢమాల్! ఏకంగా 80 శాతం..
HCL Tech CEO Vijayakumar Pay Drops: దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ వేతనం 2023 ఆర్థిక సంవత్సరంలో భారీగా పడిపోయింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. సీఈవో విజయకుమార్ 2023 ఆర్థిక సంవత్సరంలో 3.46 మిలియన్ డాలర్లు (రూ. 28.4 కోట్లు) అతి తక్కువ వేతనాన్ని పొందారు. ఇందులో మూల వేతనం 2 మిలియన్ డాలర్లు, పర్ఫామెన్స్ బోనస్ 1.43 మిలియన్ డాలర్లు, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు 0.03 మిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న 16.5 మిలియన్ డాలర్లు (రూ. 130 కోట్లు) కంటే దాదాపు 80 శాతం తక్కువ గమనార్హం. కారణం ఇదే.. హెచ్‌సీఎల్ కంపెనీ సీఈవో విజయ్‌కుమార్ వేతనం ఈ ఏడాది భారీగా తగ్గిపోవడానికి కారణం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు లేదా ఎల్టీఐ లేకపోవడం అని తెలుస్తోంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఈ దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను ఎల్‌టీఐని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మైలురాళ్లు లేదా బోర్డు నిర్దేశించిన లక్ష్యాల సాధన ఆధారంగా చెల్లిస్తారు. 2022 ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ ఎల్టీఐ రూపంలో 12.50 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఇదీ చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులు ఇక ఇంటికే..! అయితే 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎల్‌టీఐని ఆయన 2024లో అందుకోనున్నారు. అయినప్పటికీ సీఈవో విజయకుమార్ 2023లో అందుకున్న జీతం అదే కంపెనీలో మొత్తం ఉద్యోగుల సగటు వేతనం కంటే 253.35 రెట్లు ఎక్కువ. గత మార్చి 31 నాటికి హెచ్‌సీఎల్ కంపెనీకి చెందిన 60 దేశాల్లోని 210 డెలివరీ కేంద్రాలలో మొత్తం 2,25,944 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇతర కంపెనీల సీఈవోల జీతాలు.. గత ఏడాది వరకు భారతదేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా ఉన్న విజయకుమార్.. ఈ ఏడాది ఇతర కంపెనీల సీఈవోలతో పోల్చితే చాలా తక్కువ వేతనం పొందారు. 2023 ఆర్థిక సంవత్సరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ రూ.29.16 కోట్లు, టెక్ మహీంద్రా అవుట్గోయింగ్ సీఈవో సీపీ గుర్నానీ రూ.30.14 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 56.44 కోట్లు, విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే రూ.82 కోట్లు వేతనాలు అందుకున్నట్లు ఆయా కంపెనీల వార్షిక నివేదిక ద్వారా తెలుస్తోంది. -
‘పాపం సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. జాబులు పోయి బైక్ ట్యాక్సీలు నడుపుకుంటున్నారు’
ఒక పక్క మాంద్యం భయాలకు తోడు.. వ్యయాలు తడిసిమో పెడవుతుండంతో టెక్నాలజీ కంపెనీలు గత ఏడాది నుంచే కొలువుల కోతకు తెరతీశాయి. ప్రపంచ టాప్ టెక్నాలజీ కంపెనీలన్నీ ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకగా.. వాటి సంఖ్య ఇంకా కొనసాగుతుంది. దీంతో కోవిడ్ -19 సంక్షోభంలో రెండు చేతులా సంపాదించిన ఐటీ ఉద్యోగులకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి పుండుమీద కారంలా తయారైంది. వ్యయ నియంత్రణ పేరుతో కంపెనీలు ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. దీంతో చేసేదీ లేక లేఆఫ్స్ గురైన ఉద్యోగులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారిలో మరి కొందరు మాత్రం కోరుకున్న రంగంలో నచ్చిన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే బైక్ ట్యాక్సీలను నడుపుకుంటున్నారు. తాజాగా, బెంగళూరుకు చెందిన హిందుస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) జావా డెవలపర్ బైక్ ట్యాక్సీ డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆర్ధికమాంద్యం దెబ్బకు ఉన్న ఉద్యోగం ఊడిపోయి.. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బైక్ ట్యాక్స్ నడుపుతున్నట్లు తేలింది. ఆ బైక్ ట్యాక్సీని లవ్నీష్ ధీర్ బుక్ చేసుకున్నాడు. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ మార్గమధ్యలో తన ర్యాపిడో డ్రైవర్ గురించి తెలుసుకొని లవ్నీష్ ఆశ్చర్యపోయాడు. ‘తాను సెప్టెంబర్ 2020లో హెచ్‌సీఎల్‌లో జావా డెవలపర్‌గా చేరినట్లు.. ఆర్ధిక అనిశ్చితి కారణంగా ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగం పోగొట్టుకున్నట్లు తెలిపారు. తన అనుభవానికి తగ్గట్లు మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాని, ర్యాపిడోలో పనిచేస్తే ఎక్కడ, ఏ సంస్థలో ఓపెనింగ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చని ఈ పనిచేస్తున్నట్లు లవ్నీష్కు తన స్టోరీని వివరించారు. అంతే లవ్నీష్ సదరు బైక్ ట్యాక్సీ డ్రైవర్‌కు ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. వెంటనే డ్రైవర్ స్టోరీతో పాటు అతని రెజ్యూమ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇతను హెచ్‌సీఎల్ ఉద్యోగి. జావా డెవలపర్‌గా పనిచేశారు. మీకు తెలిసిన కంపెనీల్లో ఎక్కడైనా జావా డెవలపర్ ఓపెనింగ్స్ ఉంటే నాకు చెప్పండి. అతని వివరాలను మీకు డైరెక్ట్ మెసేజ్ చేస్తాను అని ట్వీట్ చేశాడు. ఆపోస్ట్ వైరల్ కావడంతో బైక్ ట్యాక్సీ ఉద్యోగి గురించి నెటిజన్లు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. My Rapido guy is a Java developer recently laid off from HCL driving rapido to get leads for any java developer openings. I have his cv. DM if you have any relevant openings. My @peakbengaluru moment 🤯 pic.twitter.com/PUI7ErdKoU — Loveneesh Dhir | Shardeum 🔼 (@LoveneeshDhir) June 22, 2023 చదవండి👉 వెయ్యి 'రెజ్యుమ్'లు పంపిస్తే.. ఒక్క ఉద్యోగం దొరకలే.. ఐటీ ఉద్యోగి ఆవేదన! -
క్లౌడ్ కంప్యూటింగ్‌తో కాల్ డ్రాప్స్‌కు చెక్
బార్సెలోనా: కాల్ అంతరాయాల (డ్రాప్స్) సమస్య పరిష్కారించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు మూడు ఉన్నాయని హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కల్యాణ్ కుమార్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత టెలికం నెట్వర్క్, ఇళ్లకు చేరువలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం, నెట్‌వర్క్‌ను వర్చువల్ విధానానికి మార్చడం ఇందుకు సహాయపడగలదని ఆయన పేర్కొన్నారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా కుమార్ ఈ విషయాలు వివరించారు. కరోనా మహమ్మారి తర్వాత డేటాకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, టెల్కోలు తమ నెట్‌వర్క్‌ల నిర్వహణ కోసం క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ వైపు మళ్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నోకియా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్‌లో గత అయిదేళ్లలో మొబైల్ డేటా ట్రాఫిక్ 3.2 రెట్లు పెరిగింది. అయితే, టెల్కోల నెట్వర్క్ సాఫ్ట్వేర్ వినియోగం ఆ స్థాయిలో పెరగలేదని కుమార్ చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ను, క్లౌడ్ సాంకేతికతలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు!
300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విప్రో మూన్‌లైటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయంటూ మరో బడా ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులకు హెచ్చరిక మూన్‌లైటింగ్ అనైతికమని, దీన్ని ఆమోదించబోమంటూ స్పష్టం చేసిన అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం స్వల్ప లాభాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే ఉద్యోగులు కెరీర్‌నే రిస్కులో పెట్టుకుంటున్నారంటూ పేర్కొన్న టీసీఎస్. ఇలా దిగ్గజ ఐటీ కంపెనీలను ఇంతగా ప్రభావితం చేస్తున్న మూన్‌లైటింగ్ తప్పా, ఒప్పా అంటూ ఓ వైపు చర్చలు కొనసాగుతుండగా.. మరో వైపు మూన్‌లైటింగ్ పాల్పుడుతున్న ఉద్యోగుల్ని సంస్థలు విధుల నుంచి తొలగిస్తున్నాయి. నియామకాల్ని నిలిపివేసి.. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు ఈ అంశం ఉద్యోగులకు, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉద్యోగం సంపాదించిన అభ్యర్ధుల్ని కలవరానికి గురి చేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు జల్లెడ పడుతున్నాయి. మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను, తప్పుడు పత్రాలతో చేరిన సిబ్బందిని ఏరివేస్తున్నాయి. అభ్యర్థులకు ప్రత్యక్షంగా మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు బ్యాంక్, ప్రావిడెంట్ ఫండ్ స్టేట్మెంట్లను ఉద్యోగుల సమక్షంలో, లైవ్‌లో తనిఖీ చేస్తున్నాయి. స్నేహితులు, సీనియర్ల సహకారంతో గతంలో ఇంటర్వ్యూలు గట్టెక్కినవారు.. ఈ ఇంటర్యూల్లో నోరెళ్లబెడుతున్నారట. కొందరు ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తున్నట్టు బయటపడింది. బెంచ్ మీద ఉన్నవారిని క్లయింట్లు స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండడం కొసమెరుపు. ఈ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తేనే వేతనం. లేదంటే ఇంటిదారి పట్టాల్సిందే. నియామకాలు చేపట్టవద్దని.. మూడు నెలల నుంచే జల్లెడ పట్టే కార్యక్రమాన్ని కంపెనీలు ప్రాధాన్యతగా చేపట్టాయి. తప్పుడు అనుభవం, వేతన ధ్రువపత్రాలతో వందలాది మంది చేరినట్టు తేలిందని పరిశ్రమ వర్గాల సమాచారం. విధుల్లో మరొకరి సాయం తీసుకున్నట్టు కొందరిని గుర్తించారు. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేంత వరకు ఫ్రెషర్ల నియామకాలు చేపట్టవద్దని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పటికీ చేరిక తేదీని ఐటీ సంస్థలు వాయిదా వేస్తున్నాయని స్మార్ట్‌స్టెప్స్ కో–ఫౌండర్ నానాబాల లావణ్య కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆఫర్ లెటర్లను రద్దు చేస్తే పరిశ్రమలో తప్పుడు సంకేతం వెళుతుందన్నారు. కాగా.. విప్రో, ఇన్ఫీ, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా బయటపడింది.. మహమ్మారి కాలంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానం, మరికొన్ని పూర్తిగా కార్యాలయం నుంచి విధులను అమలులోకి తెచ్చాయి. కొందరు ఆఫీస్‌కు రాలేమని పట్టుపట్టారు. సిబ్బంది ఎందుకు ఇలా చేస్తున్నారనే అంశంపై కంపెనీలు లోతుగా పరిశీలించాయి. వీరు మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నట్టు తేలింది. కంపెనీలు పట్టుపట్టడంతో అధికంగా జీతం ఇచ్చే సంస్థల్లో ఇటువంటివారు చేరారు. ఆఫీస్‌లో ప్రత్యక్షంగా పని చేయాల్సి రావడంతో తప్పుడు అనుభవంతో చేరినవారు సాంకేతిక పరిజ్ఞానం లేక చేతులెత్తేశారు. మోసపూరితంగా చేరినవారిని రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందిగా కంపెనీలు ఆదేశిస్తున్నాయి. చదవండి👉 డెలివరీ బాయ్‌లను చులకనగా చూస్తున్నారా! -
క్యూ2 ఫలితాలు, గణాంకాలపై కన్ను
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం కార్పొరేట్ ఫలితాలు, ఆర్థిక గణాంకాల ఆధారంగా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. సోమవారం(10న) సాఫ్ట్వేర్ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీఎస్ జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(12న), ఇన్ఫోసిస్(13న), ద్విచక్ర వాహన బ్లూచిప్ కంపెనీ బజాజ్ ఆటో(14న), ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్(15న).. క్యూ2 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి, సెప్టెంబర్ నెలకు రిటైల్ ధరల(సీపీఐ) గణాంకాలు 12న, సెప్టెంబర్ టోకు ధరల (డబ్ల్యూపీఐ) వివరాలు 14న వెలువడనున్నాయి. రూపాయి ఎఫెక్ట్ క్యూ2 ఫలితాల సీజన్ ప్రారంభంకానుండగా.. మరోపక్క ఆర్థిక గణాంకాలూ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 82ను తాకింది. చమురు దేశాల(ఒపెక్) సరఫరా కోతలతో బ్రెంట్ చమురు ధర మళ్లీ 100 డాలర్లకు చేరువైంది. ఇక డాలరు ఇండెక్స్ కొంతవెనకడుగు వేసినప్పటికీ ఫెడ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టిపెట్టే అవకాశముంది. వీటికితోడు ఇటీవల విదేశీ ఇన్వెస్ట ర్లు దేశీ స్టాక్స్‌లో అమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్య భయాలు కొనసాగుతుండటంతో ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నీ దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు అంతర్జాతీయంగా చూస్తే యూఎస్ సీపీఐ గణాంకాలు 11న విడుదల కానున్నాయి. ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ గత పాలసీ మినిట్స్ 12న, కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెల్లడికానున్నాయి. వారం రోజులపాటు ఐఎంఎఫ్ సాధారణ వార్షిక సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా కదలనున్నట్లు నిపుణులు వివరించారు. గత వారం మూడు వారాల డౌన్‌ట్రెండ్‌కు చెక్ పెడుతూ గత వారం దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైనప్పటికీ సెన్సెక్స్ 764 పాయింట్లు జమ చేసుకుని 58,191 వద్ద నిలవగా.. నిఫ్టీ 220 పాయింట్ల ఎగసి 17,315 వద్ద స్థిరపడింది. ఫలితంగా ప్రధాన ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 58,000– 17,000 స్థాయిలకు ఎగువనే స్థిరపడ్డాయి. -
హెచ్‌సీఎల్ గ్రూప్ చేతికి గువి
న్యూఢిల్లీ: టెక్నికల్ కోర్సులను అందించే వెర్నాక్యులర్ ఎడ్యుటెక్ ఫ్లాట్ ఫామ్ గువి(జీయూవీఐ)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఐతే డీల్ విలువను వెల్లడించలేదు. ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్ మద్దతుతో ఏర్పాటైన కంపెనీ వెబ్ డెవలప్మెంట్, ఏఐ మాడ్యూల్, ఎస్‌క్యూఎల్ తదితర పలు సాంకేతిక కోర్సులను అందిస్తోంది. పారిశ్రామిక నిపుణుల ద్వారా రూపొందించిన విభిన్న కోర్సులను సైతం వెర్నాక్యులర్ లాంగ్వేజీలలో అందిస్తోంది. విద్యార్ధులు, యూనివర్శిటీలు, ఉద్యోగులకు అనువైన(టైలర్‌మేడ్) కోర్సులను సైతం రూపొందిస్తోంది. తాజా పెట్టుబడి ద్వారా దేశ, విదేశాలలో టెక్ వృత్తి నిపుణులను సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ తెలియజేసింది. -
హెచ్‌సీఎల్ టెక్ కొత్త లోగో
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన లోగోను, బ్రాండ్ ఐడెంటిటీని విడుదల చేసింది. క్లయింట్లు, ప్రజలు, కమ్యూనిటీల విషయంలో కంపెనీ వైఖరిని ప్రతిబింబించే విధంగా ‘సూపర్ చార్జింగ్ ప్రోగ్రెస్’ అంటూ లోగో పక్కన క్యాప్షన్‌ను పెట్టింది. లోగోలో రాకెట్ సింబల్‌ను చేర్చింది. నిత్యం తమ క్లయింట్ల డిజిటల్ పరివర్తనాన్ని వేగవంతం చేసే విధంగా కొత్త లోగోకు రూపకల్పన చేసినట్టు కంపెనీ తెలిపింది. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
హెచ్‌సీఎల్ ఉద్యోగులకు భారీ షాక్!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. హెచ్‌సీఎల్ సంస్థ మైక్రోసాఫ్ట్ న్యూస్ విభాగానికి చెందిన ప్రొడక్ట్‌పై వర్క్ చేస్తోంది. ఈ తరుణంలో ఆ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్‌లపై వర్క్ చేస్తున్నాం. భవిష్యత్‌లో ఎలాంటి ప్రాజెక్ట్‌లపై వర్క్ చేయబోతున్నామనే అంశాలపై చర్చించేందుకు హెచ్‌సీఎల్ ఉద్యోగులతో టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించింది. ఆ సమావేశంలో ఉద్యోగుల తొలగింపులపై ప్రకటన చేసినట్లు సమాచారం. ఇక హెచ్‌సీఎల్ తొలగించిన ఉద్యోగులు భారత్, గ్వాటెమాల, ఫిలిప్పీన్స్ తో పాటు ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఉద్యోగులకు కంపెనీలో చివరి రోజైన సెప్టెంబర్ 30 నాటికి ప్రతి ఉద్యోగికి వేతనాన్ని అందించనున్నట్లు హెచ్‌సీఎల్ తెలిపిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో తొలగించిన ఉద్యోగులు మాట్లాడుతూ..మా సంస్థకు..మైక్రోసాఫ్ట్‌కు క్వాలిటీ ఆఫ్ వర్క్ విషయంలో విభేదాలు తలెత్తాయి. మేం భారత్,యూరప్,యూఎస్ వంటి దేశాల నుండి మైక్రోసాఫ్ట్ న్యూస్ ప్లాట్‌ఫారమ్ ఎంఎస్ఎన్ కోసం కంటెంట్‌ను పర్యవేక్షించడం, క్యూరేట్ చేయడం, సవరించడంలాంటి వర్క్స్ చేస్తుంటాం.అయితే ఇటీవల మైక్రోసాఫ్ట్ గ్లోబల్ న్యూస్ మానిటరింగ్ కోసం మైక్రోసాఫ్ట్ ఆటోమెషిన్‌ను వినియోగించడం ప్రారంభించింది. మేం వర్క్ చేయడానికి ముందు జర్మనీకి చెందిన హుబెర్ట్ బుర్దా మీడియా ఈ సైట్‌ను నిర్వహించేది. బింగ్‌లో ట్రెండింగ్, జియోపొలిటికల్ న్యూస్ క్యూరేషన్, కామెంట్ మోడరేషన్, టాబ్లాయిడ్ హిట్ యాప్‌లను పర్యవేక్షించేది' అని చెప్పారు. హెచ్‌సీఎల్‌కు గుడ్‌బై మైక్రోసాఫ్ట్- హెచ్‌సీఎల్ మధ్య కాంట్రాక్ట్ ముగిసిందని,ఆ కారణం చేతనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ ఈ కాంట్రాక్ట్‌ను వేరే సంస్థకు అప్పగించాలని భావిస్తున్నట్లు..హెచ్సీఎల్ను కాదనుకొని యాక్సెంచర్‌కు తన ప్రాజెక్ట్ కట్టబెట్టాలని మైక్రోసాఫ్ట్ మంతనాలు నిర్వహిస్తుంది. ఇతర టెక్ కంపెనీల బాటలో హెచ్‌సీఎల్ సైతం ఇతర టెక్ కంపెనీల బాటలో చేరింది.ఇటీవల యాపిల్,మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర టెక్ కంపెనీలు ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగుల్ని, పలు విభాగాల్ని పూర్తి స్థాయిలో తొలగించింది. అదే సమయంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులు 100 శాతం వర్క్ ప్రొడక్టవిటీపై దృష్టిసారించాలని కోరడం చర్చాంశనీయంగా మారింది. -
ఏపీ వైపు ‘ఐటీ’ చూపు
సాక్షి, అమరావతి: ఇన్ఫోసిస్, అసెంచర్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుండటంతో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐటీ పెట్టుబడులకు అనువైనవిగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను ప్రమోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పెద్ద ఐటీ కంపెనీలు విశాఖ, విజయవాడలను ఎంచుకుంటుండగా, చిన్న స్థాయి కంపెనీలు తిరుపతి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ ఆధారిత సేవలు అందించే ఏడు కంపెనీలు తాజాగా తిరుపతిలో తమ కార్యాలయాలను ప్రారంభించడానికి ముందుకు వచ్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. ఐజెన్ అమెరికన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, కాన్‌ఫ్లక్స్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్, లోమా ఐటీ సొల్యూషన్స్, మాగంటి సాఫ్ట్వేర్, సాగర్ సాఫ్ట్వేర్, నెట్ ల్యాబ్ వంటి సంస్థలు కార్యాలయాలను ప్రారంభించనున్నాయి. ఫ్రెంచ్కు చెందిన రాన్‌స్టాండ్ అనే కన్సల్టెన్సీ సంస్థ విశాఖ, తిరుపతిలో కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. మొత్తం ఈ ఎనిమిది కార్యాలయాల ద్వారా 4,720 మందికి ఉపాధి లభించనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కంపెనీలు కార్యాలయాలు ప్రారంభించడానికి అవసరమైన వాణిజ్య సముదాయాలను ఏపీ టక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్) సమకూరుస్తోంది. ఈ పరిణామాల పట్ల నిరుద్యోగులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఐటీ పార్కులు రాష్ట్రానికి చెందిన ఐటీ రంగ నిపుణులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ చర్యలపై కంపెనీలకు నమ్మకం పెరగడంతో ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయి. యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానంగా విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలు అనువుగా ఉంటాయి. ఈ మూడు చోట్ల అన్ని మౌలిక వసతులతో కూడిన ఐటీ పార్కులను అభివృద్ధి చేయనున్నాం. త్వరలోనే ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖలో ఒక సదస్సు నిర్వహించనున్నాం. – ఎం.నంద కిషోర్, ఎండీ, ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్) -
శ్రీలంక ఉద్యోగుల పనితీరు భేష్! హెచ్‌సీఎల్ ప్రశంసల వర్షం!
న్యూఢిల్లీ: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో వ్యాపార కార్యకలాపాల కొనసాగింపునకు తగిన ప్రణాళికలున్నట్లు ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. అదనపు పనిభారాన్ని నిర్వహించేందుకు ఇండియా, తదితర ప్రాంతాలలోని ఉద్యోగులకు అవసరమైనంత అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలియజేసింది. శ్రీలంకలో కంపెనీ తరఫున 1,500 మంది విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ సమస్యలున్నప్పటికీ సర్వీసులు కొనసాగిస్తున్నట్లు కంపెనీ సీఈవో విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకు మద్దతుగా దేశీ బృంద సభ్యులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సవాళ్ల నేపథ్యంలోనూ శ్రీలంకలోని ఉద్యోగులు సక్రమంగా బాధ్యతలు నెరవేరుస్తున్నట్లు ప్రశంసించారు. -
విడుదలైన క్యూ1 ఫలితాలు,వేల కోట్ల లాభాలతో పుంజుకున్న హెచ్‌పీసీఎల్!
న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (క్యూ1) నికర లాభం 2.4% పుంజుకుని రూ.3,283 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం మరింత అధికంగా 17 శాతం ఎగసి రూ. 23,464 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–14 శాతం స్థాయిలో వృద్ధి చూపగలదని కంపెనీ తాజాగా అంచనా(గైడెన్స్) వేసింది. కరెన్సీలో నిలకడ ప్రాతిపదికన గైడెన్స్ ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. డీల్స్ జోరు: ప్రస్తుత ఏడాదిని పటిష్టంగా ప్రారంభించినట్లు హెచ్‌సీఎల్ టెక్ సీఈవో, ఎండీ సి.విజయ్ కుమార్ పేర్కొన్నారు. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తంగా 2.7 శాతం వృద్ధిని అందుకున్నట్లు తెలియజేశారు. సర్వీసుల బిజినెస్ వార్షికంగా 19 శాతం పురోగతిని సాధించినట్లు వెల్లడించారు. డిజిటల్ ఇంజనీరింగ్, అప్లికేషన్ల సర్వీసులు, క్లౌడ్ వినియోగం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు వివరించారు. భారీ, మధ్యతరహా డీల్స్‌తో కొత్త బుకింగ్స్ 23.4 శాతం అధికంగా 2.04 బిలియన్ డాలర్లకు చేరినట్లు పేర్కొన్నారు. 17 శాతం నిర్వహణా మార్జిన్లను సాధించగా.. 6,023 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకున్నట్లు తెలియజేశారు. గతేడాది క్యూ4లో ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 21.9% కాగా.. తాజాగా 23.8 శాతానికి పెరిగింది. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఎన్ఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేరు దాదాపు 2% క్షీణించి రూ. 926 వద్ద ముగిసింది. -
విశాఖ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్!
సాక్షి, విశాఖపట్నం : ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశాఖలో ఏర్పాటుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. నగరంలో ఇన్ఫోసిస్ సంస్థకు కావలసిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందిస్తోంది. మరో రెండు నెలల్లో విశాఖలో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉండడంతో అందుకు అవసరమైన చర్యలు మొదలయ్యాయి. ఒక పక్క ఇన్ఫోసిస్, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పనులు వేగవంతం చేస్తున్నాయి. విశాఖలో ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటు ప్రకటన వెలువడిన తరువాత నుంచి నగరంలో సరైన స్థలం కోసం అన్వేషణ జరుగుతోంది. నగరంలో కొన్ని ప్రాంతాలను పరిశీలించినా అవి అనుకూలంగా ఉండవన్న నిర్ధారణకు వచ్చారు. దీంతో ప్రాథమికంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో సంస్థ కార్యకలపాలు మొదలు పెట్టడానికి వీలుగా రుషికొండ సమీపంలోని ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లక్ష చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) విస్తీర్ణం ఉన్న భవనాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకుని కార్యకలాపాలు ప్రారంభిస్తారు. భవిష్యత్తులో ఇన్ఫోసిస్ సొంత భవనం సమకూర్చుకునే వరకు అక్కడే నడుపుతారు. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ‘సాక్షి’తో చెప్పారు. ఆరంభంలో వెయ్యి మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ విశాఖ యూనిట్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. మున్ముందు ఆ సంఖ్యను దశల వారీగా 2,500 నుంచి 3,000 మంది వరకు పెంచనుంది. త్వరలో హెచ్‌సీఎల్ కూడా.. మరోవైపు ఇన్ఫోసిస్‌తో పాటు మరో ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ కూడా విశాఖపట్నంలో తమ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. టైర్–2 నగరాల్లో విశాఖపట్నం ప్రథమ స్థానంలో ఉండడంతో ఇంకా మరికొన్ని ఐటీ సంస్థలు విశాఖలో తమ యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో బహుళ జాతి ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది. ఇప్పటికే మరో ప్రఖ్యాత సంస్థ అదానీ.. మధురవాడ సమీపంలో 130 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.14,634 కోట్లు వెచ్చిస్తోంది. కాగా విశాఖలో ప్రస్తుతం ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు 150 వరకు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, ఐటీ రంగానికున్న అనుకూలతల నేపథ్యంలో రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని ఐటీ సంస్థలు ఏర్పాటుకు ముందుకొస్తాయని, ఫలితంగా విరివిగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. (క్లిక్: మేడిన్ ఇండియా కాదు.. మేక్ ఫర్ వరల్డ్) -
Ap: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 25న హెచ్‌సీఎల్ ‘వాక్ ఇన్ డ్రైవ్’
సాక్షి, అమరావతి: టెక్బీ శిక్షణ కోసం ఏపీ నుంచి ఈ ఏడాది 1,500 మంది ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 25న విజయవాడలో వాక్ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరామన్ తెలిపారు. ఈ వివరాలను గురువారం విజయవాడలో ఆయన మీడియాకు వెల్లడించారు. 2021లో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్‌తో 12వ తరగతి(ఇంటర్మీడియట్) పూర్తి చేసినవారు.. అలాగే 2022లో 12వ తరగతికి హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వాక్ ఇన్ డ్రైవ్‌లో ఎంపికైన విద్యార్థులకు 12 నెలల పాటు శిక్షణ అందించడంతో పాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పారు. టెక్బీ శిక్షణ పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ.1.70 లక్షల నుంచి రూ.2.20 లక్షల వేతనంతో ఉద్యోగం లభిస్తుందన్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వద్ద పనిచేస్తూనే బిట్స్ పిలానీ, శాస్త్ర, అమిటీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అర్హత కలిగిన వారు ఆన్లైన్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(హెచ్‌సీఎల్ క్యాట్)కు హాజరవ్వాల్సి ఉంటుందని, ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రూ.లక్ష ఫీజు ఉంటుందని, దీనికి పన్నులు అదనమని పేర్కొన్నారు. ఫీజును నెలవారీ వాయిదాల్లో తీర్చే విధంగా రుణ సౌకర్యం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. 2017లో ప్రారంభించిన టెక్బీ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 7,000 మంది విద్యార్థులకు ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. మరింత సమాచారం కోసం www.hcltechbee.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. -
స్వఛ్చందసేవకు ఆసరాగా...హెచ్‌సీఎల్
విద్య, ఆరోగ్యం, పర్యావరణం ఈ మూడింటిలో పనిచేస్తున్న ఎన్జీఓలకు ఆర్ధికంగా సాయం చేసేందుకు ప్రత్యేక గ్రాంట్ ఏర్పాటు చేశామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి పుందిర్ తెలిపారు. హెచ్‌సీఎల్ గ్రాంట్ 8వ ఎడిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... మూడేళ్ల పాటు ఆర్ధిక సాయం... హెచ్‌సిఎల్ ఫౌండేషన్‌లో భాగంగా హెచ్‌సీఎల్ గ్రాంట్ ను 2015లో లాంచ్ అయింది. మా సాయం పొందేందుకు ఒక ఎన్జీఓ ప్రారంభించి కనీసం మూడేళ్లు పూర్తి చేసుకుని ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. సంస్థల నిర్వహణ, అందిస్తున్న సేవల్లో పారదర్శకత వంటివి చూసి కేటగిరీల వారీగా ఎంపిక చేస్తాం. మా ప్రాధామ్యాల పరంగా సరితూగే సంస్థలను నిపుణుల జ్యూరీ ఎంపిక చేస్తుంది. కేటగిరీ వారీగా 3 ఫైనలిస్ట్స్‌ను ఎంపిక చేశాక ఏడాదికి మొత్తం రూ. 16.5 కోట్లు చొప్పున అందిస్తాం. మరో 30 ఎన్జిఓ సంస్థల గురించి ఒక పుస్తకం ప్రచురిస్తాం. ప్రస్తుతం 6వ వాల్యూమ్ ప్రచురించనున్నాం. అది ప్రభుత్వ శాఖలు, దాతలకు చేరుతుంది. వాళ్ల కార్యక్రమాల శైలులు అందరికీ తెలుస్తాయి. దరఖాస్తులకు ఆహ్వానం... ఇది 8వ ఎడిషన్. ఇటీవలే అప్లికేషన్స్ ఓపెన్ చేశాం. ఏవైనా అనివార్య కారణాలు ఉంటే తప్ప సాధారణంగా 60 రోజులు ఓపెన్ చేసి ఉంచుతాం. కేవలం ఆన్లైన్ ద్వారా తప్ప మరే విధంగాననూ దరఖాస్తులు స్వీకరించం. ఏ రాష్ట్రం నుంచైనా, ఏ నగరం, జిల్లా,గ్రామం నుంచైనా దీనికి దరఖాస్తు చేయవచ్చు. వీలైనన్ని ఎక్కువ ఎన్జిఓ సంస్థలు దీని గురించి తెలుసుకోవాలనేదే మా ఉద్ధేశ్యం. అందుకే నగరాల వారీగా సింపోజియమ్స్ నిర్వహిస్తున్నాం. ఎన్జీఓలు వాటికి అర్హతలు ఉన్నా లేకున్నా దీనికి హాజరు కావచ్చు. సీఎస్ఆర్ చట్టాలు,, ప్రాంతీయ అంశాలు, ఉపయుక్తమైన సమాచారం తెలుసుకోవడానికి ఈ సదస్సులు ఉపకరిస్తాయి. విభిన్న మార్గాల ద్వారా ఎన్జీఓలు సాయం పొందే అవకాశాలు కూడా తెలుస్తాయి. చదవండి: ఉక్రెయిన్ కోసం గూగుల్.. సుందర్ పిచాయ్ డేరింగ్ స్టెప్. -
‘బోనస్‌లు తిరిగి ఇచ్చేయండి’.. ఉద్యోగులకు కంపెనీ షాక్!
దేశంలోనే నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీని ఏడాది మధ్యలో వీడుతున్న ఉద్యోగులను.. బోనస్ కింద చెల్లించిందంతా తిరిగి ఇచ్చేయమంటూ వేధిస్తోందన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు ప్రకటన ఇచ్చుకుంటున్నప్పటికీ.. అది ఉద్యోగులకు పూర్తి ఊరట ఇచ్చేదిగా లేదని తెలుస్తోంది!. తాజాగా భారత ఐటీ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెసీఎల్పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజైన్లు చేసి కంపెనీని వీడుతున్న ఉద్యోగులను ‘పర్ఫార్మెన్స్ బోనస్’ ఇచ్చిందంతా.. తిరిగి చెల్లించాకే బయటకు వెళ్లాలని కోరుతోంది. ఈ మేరకు హెచ్ఆర్ పాలసీలోని రూల్‌ను చూపించడంతో ఉద్యోగులు ఖంగుతింటున్నారు. ఈ విషయంపై ఐటీ ఎంప్లాయిస్ యూనియన్లను ఉద్యోగులు ఆశ్రయించినట్లు సమాచారం. లేబర్ మినిస్టర్ భూపేందర్ యాదవ్‌కి, హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్‌కి సైతం లేఖలు రాశారు పుణే ఐటీ యూనియన్ ప్రతినిధి హర్మీత్ సలూజ. డబ్బులు తిరిగి చెల్లించని ఉద్యోగుల ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్లు, రిలీవింగ్ లెటర్లు ఇవ్వకుండా కంపెనీ వేధిస్తోందని సలూజ ఆ లేఖలో ప్రస్తావించారు. హెచ్‌సీఎల్ ప్రకటన అయితే హెచ్‌సీఎల్ మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతోంది. ఉద్యోగులకు తెలియకుండా తామేం చేయట్లేదని పేర్కొంది. మంత్లీ బేసిస్ మీద చెల్లించే అడ్వాన్స్ విషయంలో హెచ్ఆర్ పాలసీ ప్రకారం.. అదీ ఉద్యోగులు సంతకాలు చేసిన కాలమ్ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేసింది. నవంబర్ 2021న ఉద్యోగులకు పంపిన మెయిల్ ప్రకారం.. సెప్టెంబర్ 1, 2021 నుంచి మార్చ్ 31, 2022 మధ్య కంపెనీని వీడే ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ల నుంచి.. ఎంప్లాయి పర్ఫార్మెన్స్ బోనస్ (EFB) రికవరీ చేస్తామని తెలిపింది. ఇక వివాదాస్పదం కావడంతో ఆఘమేఘాల మీద ఆ పాలసీని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. వెనక్కి తగ్గలేదు! వివాదాస్పద ఈ పాలసీ విషయంలో హెచ్‌సీఎల్ ఒక స్పష్టమైన ప్రకటనంటూ ఇవ్వకపోవడం గమనార్హం. దశాబ్దానికి పైగా జూనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు జీతం కాకుండా.. అడ్వాన్స్‌గా చెల్లింపులు అందుకుంటున్నారు. అలాగే ఇకపై కంపెనీ మా ఉద్యోగుల కోసం ముందస్తు వేరియబుల్ చెల్లింపును కొనసాగిస్తుంది. అంతేకాదు డిసెంబర్ 22, 2021 నుంచి రికవరీలను కూడా మాఫీ చేసిందని హెచ్‌సీఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఇక్కడే గందరగోళం నెలకొంది. ఈఎఫ్‌బీ రికవరీ పాలసీని మాత్రమే హెచ్‌సీఎల్ వెనక్కి తీసుకుందని.. ఏపీఎంబీ (Advance Monthly Performance Bonus) విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సలూజ చెప్తున్నారు. ఈఎఫ్‌బీ అనేది ఉద్యోగులందరికీ వర్తించే బోనస్ కాగా.. ఏఎంపీబీ మాత్రం ప్రత్యేకించి ప్రాజెక్టుల కోసం పని చేసే ఉద్యోగులందరికీ జారీ చేస్తున్న బోనస్. సో.. రిజైన్ చేసిన ఉద్యోగులు ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న మాట!. -
మన విజయగాథకు ఇదే మూలం!
దేశంలోని నాలుగు దిగ్గజ ఐటీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో లక్షమందికి పైగా ప్రొఫెషనల్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పించాయి. యువతీయువకులను కొత్తగా పెద్ద సంఖ్యలో నియమించుకుంటున్నారంటేనే ఈ కంపెనీల లాభాలు వేగంగా పెరుగుతున్నాయని అర్థం. భారతీయ ఐటీ పరిశ్రమ అసాధారణ వేగంతో ముందుకు సాగుతోందనటానికి ఈ నియామకాలు తిరుగులేని సంకేతం. కానీ ప్రతికూల వార్తలకు, నిరాశా నిస్పృహలకు మాత్రమే విలువనిచ్చే మన సమాజం ఇలాంటి అద్భుతమైన సానుకూల వార్తను పట్టించుకోదు. మన ఐటీ కంపెనీలు కోవిడ్ మహమ్మారి కాలంలోనూ ఇంత ఘన విజయం సాధించడానికి బలమైన నాయకత్వం, పోటీతత్వమే కారణమని గ్రహించాలి. దురదృష్టవశాత్తూ, భారతదేశంలో సానుకూల వార్తలకు ఈరోజుల్లో చాలా తక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. వాటిగురించి మాట్లాడేది కూడా తక్కువేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అలాంటి వార్తలు కాస్త ముందుకొచ్చినా, అవి వెంటనే మాయమైపోతుంటాయి. మరుగున పడుతుంటాయి. ప్రస్తుతం నిరాశావాదాన్ని ప్రేరేపించే నిస్పృహ కలి గించే వార్తలపై అధికంగా దృష్టి సారించే అలవాటు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇదే ఇప్పటి ఫ్యాషన్ అని చెప్పాలి. ప్రస్తుతం దేశ ముఖచిత్రం నుంచి ఒక గొప్ప ఉదాహరణను పరిశీలిద్దాం. దేశంలోని నాలుగు ప్రముఖ ఐటీ సంస్థలు – టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో లక్షమందికి పైగా వృత్తినిపుణులైన యువతను ఉద్యోగాల్లో నియమించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 రెట్లు ఎక్కువ. భారతీయ ఐటీ పరిశ్రమ అసాధారణ ముందంజలో సాగుతోందనటానికి ఈ నియామకాలు తిరుగులేని సంకేతం. టీసీఎస్‌లో ప్రస్తుతం 5 లక్షలమంది వృత్తి నిపుణులు పనిచేస్తున్నారు. పైన పేర్కొన్న ఇతర ఐటీ సంస్థలు కూడా లక్షలాదిమందిని ఉద్యోగాల్లో నియమించాయి. వీటిలో పనిచేసిన ప్రొఫెషనల్స్ మంచి అవకాశాలు రాగానే ఇతర కంపెనీలకు కూడా తరలి వెళ్లారు. గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సిబ్బందిలో 20 శాతం మంది రాజీనామా చేశారు. ఇన్ఫోసిస్ వంటి సుప్రసిద్ధ కంపెనీని వదిలి ఉద్యోగులు వెళ్లిపోతున్నారంటే, వారికి మరింత మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని అర్థం. మన ఐటీ రంగంలోని కంపెనీలు అభివృద్ధి, పురోగతికి సంబంధించిన అన్ని రికార్డులను ఎలా బద్దలు చేశాయో చూపడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. యువతీయువకులను కొత్తగా పెద్ద సంఖ్యలో నియమించుకుంటున్నారంటేనే ఈ కంపెనీల లాభాలు వేగంగా పెరుగుతున్నాయని అర్థం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టీసీఎస్ ఒక్కటే రూ. 9,624 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ 9,800 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇక ఇన్ఫోసిస్ తన వంతుగా ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 5,500 కోట్ల లాభాన్ని ఆర్జించగా, విప్రో, హెచ్‌సీఎల్ కూడా అసాధారణమైన ఫలితాలను సాధించాయి. ఇంత భారీ ముందంజ వేసినప్పటికీ ఇలాంటి అద్భుతమైన వార్తల పట్ల దేశం ఎలాంటి ప్రత్యేక స్పందనలను వ్యక్తీకరించడం లేదు. ఈ రోజు హింస ఎక్కడ జరిగింది, దేశం కోలుకోలేని విధంగా ఎక్కడ నష్టపోయింది వంటి వార్తలకే ప్రాధాన్యముండటం విచారకరం. అయితే, టాటా గ్రూప్ ఇటీవలే ఎయిర్ ఇండియాను రూ. 18 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడానికి దాని కీలక సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆర్జించిన అపారమైన లాభాలే కారణమని జనాం తికంగా చెప్పుకుంటున్నారు. టీసీఎస్ రెండు త్రైమాసికాల ఫలితాల దన్నుతో టాటా గ్రూప్ సులువుగా ఎయిర్ ఇండియాను కొనేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు సాధించిన అద్భుత విజయాల వెలుగులో, ఏ కంపెనీ లాభాలు ఆర్జించడంలో అగ్రస్థానంలో ఉంది, మార్కెట్లో ఏ కంపెనీకి ఎక్కువ పరపతి ఉంది అనే అంశాలపై మీరెన్నడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ఏమంత కష్టమైన పని కాదు. ఉత్తమ నాయకత్వం, సరైన మార్గదర్శకత్వం కారణంగానే ఇంతటి పురోగతి సాధ్యపడింది. ఇప్పుడు టీసీఎస్‌ని ఉదాహరణగా తీసుకుందాం. ప్రస్తుతం ఆ కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ గోపీనాథ్ టీసీఎస్ పగ్గాలు చేపట్టడానికి ముందే టీసీఎస్ ప్రపంచస్థాయి కంపెనీగా మారింది. ఈ ఘనత మొత్తంగా ప్రస్తుత టాటా కంగ్లామరేట్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కే దక్కాల్సి ఉంది. ఈయన 2009లో టీసీఎస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. వృత్తిపరంగా తన కెరీర్‌ను కూడా టీసీఎస్‌తోనే మొదలెట్టారు. టీసీఎస్ వ్యవహారాలను అద్భుతంగా పర్యవేక్షించి, నిర్వహించారు. నాయకత్వ నైపుణ్యాలను టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా, టీసీఎస్ వ్యవస్థాపక చైర్మన్ ఫకీర్‌చంద్ కోహ్లీ నుండి చంద్రశేఖరన్ నేర్చుకున్నారు. ఈరోజు సమాచార సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ఒక నిగూఢ శక్తిగా యావత్ ప్రపంచం గుర్తిస్తోంది. భారత ఐటీ రంగం విలువ 190 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఘనత మాత్రం ఫకీర్ చంద్ కోహ్లీకే దక్కాలి. దేశంలోనే ఐటీ రంగానికి పునాది వేసిన వ్యక్తి ఈయన. అలాంటి కోహ్లీ, రతన్ టాటాలతో కలిసి పనిచేసిన చంద్రశేఖరన్ ఒక సృజనాత్మక సంస్కృతిని, ప్రతిభాపాటవాలను నేర్చుకున్నారు. ఇకపోతే శివ్ నాడార్ గురించి మాట్లాడుకుందాం. ఈయన తమిళనాడు లోని తంజావూర్ నుంచి వచ్చారు. ఒంటిచేత్తో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ని ఏర్పర్చారు. తన సుదీర్ఘ నాయకత్వంలో హెచ్‌సీఎల్‌ని అతి గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీగా మార్చారు. తమ గుహల్లోంచి బయటకు వచ్చి ఏదైనా విభిన్నంగా ఆలోచించాల్సిందిగా తన కంపెనీ సీఈఓలను, మేనేజర్లను ఆయన ప్రభావితం చేశారని ప్రతీతి. నాడార్ ఎల్లప్పుడూ తన ఉద్యోగులకు దన్నుగా నిలిచారు. అందుకే ఆయన కింద పనిచేసే మేనేజర్లు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ఈ రోజు ఈ కంపెనీ కనీసం అరడజన్ పైగా దేశాల్లో ఉనికిలో ఉంటూ వంద ఆఫీసులను తెరిచింది. లక్షమంది ప్రొఫెషనల్ ఇంజనీర్లు ఈ సంస్థతో ముడిపడి ఉన్నారు. జేఆర్డీ టాటాలోని పోరాటస్ఫూర్తి, చురుకైన వ్యాపార తత్వం శివ్ నాడార్లో కనిపిస్తాయి. విద్య, జాతీయ నిర్మాణం పట్ల వీరిద్దరి విశ్వాసాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఇక ఇన్ఫోసిస్ లిమిటెడ్. దీని ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్. చరిత్ర ప్రసిద్ధుడైన నారాయణమూర్తి ఈ సంస్థకు పునాది వేశారు. ఈ క్రమంలో నందన్ నీలేకని వంటి సహచరుల సహాయం ఈయనకు లభించింది. నందన్ నీలేకని ఇప్పటికీ ఇన్ఫోసిస్ వర్కింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తన జీవితంలోని ప్రతి క్షణాన్ని అర్థవంతంగా మల్చుకోవడంలో నారాయణ మూర్తి తీరిక లేకుండా ఉంటారు. మానవ జీవితం క్షణభంగురమే కావచ్చు, కానీ మనం చేసే సత్కార్యాల ద్వారా మన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకునే అవకాశాన్ని భగవంతుడు మనకు అందిస్తాడు. అంధకారమనే సామ్రాజ్యం ఎంత పెద్దదైనా కావచ్చు కానీ చిన్న దీపం తాను ఆరిపోయేంతవరకు ఆ అంధకారంతో పోరాటం సాగిస్తూనే ఉంటుంది. అలాగే పూల జీవిత కాలం చాలా చిన్నదే కావచ్చు కానీ తమలోని పరిమళాన్ని చివరివరకూ వెదజల్లే ధర్మాన్ని నిర్వరిస్తూనే ఉంటాయి. నారాయణమూర్తి తెలిసిగానీ, తెలీకగానీ తన జీవితాన్ని పైన పేర్కొన్న దీపం, పూవుల్లాగే మలుచుకున్నారు. మునుపెన్నడూ చేయని మంచిపనులను చేస్తూ పోవాలని ఆయన ఆకాంక్ష. అందుకే ఆయన జీవితం మచ్చలేకుండా నడిచింది. తన కంపెనీకి కొత్త దిశను కల్పిస్తూ సామాజిక శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున విరాళాలు ఇస్తూపోయారు. అందుకే తనతోపాటు తన కంపెనీ ఇన్ఫోసిస్ నిరంతరం విజయసాధనను కొనసాగిస్తూ వచ్చింది. వీరందరి లాగే విప్రో లిమిటెడ్ చైర్మన్ అజీం ప్రేమ్‌జీ జీవితం కూడా. తనది అసాధారణ స్వభావం. అత్యున్నత విద్యాప్రమాణాలు, ర్యాంకింగ్ కలిగిన గొప్ప మేనేజర్లను ఆయన సంస్థలో చేర్చుకున్నారు. ప్రతిభాపాటవాల ప్రాతిపదికనే విప్రోలో కీలకమైన స్థానాల్లో ప్రొఫెషనల్స్‌ని నియమించుకున్నారు. ఈ ప్రతిభా మార్గదర్శకత్వ ఫలితంగానే విప్రో దేశంలోనే అగ్రగామి కంపెనీగా అవతరించింది. కాబట్టే, భారత ఐటీ కంపెనీల శరవేగ పురోగతితో అసంఖ్యాక యువతకు ఉద్యోగ అవకాశాలు రావడమే కాదు, దేశం భారీ మొత్తంలో ఆదాయ పన్నును, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. అయితే ఈ కంపెనీలు అసాధారణ విజయాన్ని పొందటానికి బలమైన, స్ఫర్ధాస్వభావం కలిగిన నాయకత్వమే కారణమని గ్రహించాలి. -ఆర్కే సిన్హా వ్యాసకర్త సీనియర్ ఎడిటర్, మాజీ రాజ్యసభ సభ్యుడు -
వర్క్ ఫ్రమ్ హోమ్‌పై దిగ్గజ ఐటీ కంపెనీల కీలక నిర్ణయం...!
TCS Wipro Infosys HCL Tech Following These Plans To Call Employees Back: కోవిడ్-19 రాకతో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. కరోనా తీవ్రత తగ్గుతుండంతో వర్క్ ఫ్రమ్ హోమ్‌పై పలు దిగ్గజ ఐటీ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండడంతో, కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు క్రమంగా ఎండ్కార్ట్ పలకాలని చూస్తోన్నట్లు తెలుస్తోంది. తమ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించేందుకు పలు ఐటీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. భారత్‌లోని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఉద్యోగులను హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను ఫాలో అవ్వనున్నట్లు తెలుస్తోంది.దీంతో వర్క్ ఫ్రమ్ హోంకు ఎండ్‌కార్డ్ పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. చదవండి: టెస్లా కార్లలో ‘కలకలం..!’ పాత దానినే వాడండి..! ఈ ఏడాది చివరలో..! పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోసం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. భారత ఐటీ నెంబర్ వన్ కంపెనీ.. టీసీఎస్ తన కంపెనీ ఉద్యోగుల్లో సుమారు 70 శాతం మేర వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసనట్లు తెలుస్తోంది. కంపెనీలో సుమారు 95 శాతం మందికి కనీసం ఒక డోస్ పడింది. ఈ ఏడాది చివరి నాటికి 90 శాతం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు టీసీఎస్ ప్లాన్ చేస్తోంది. 2022 ఏడాది ప్రారంభంలోనైనా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని చూస్తోంది. అయితే 2025 నాటికి తమ ఉద్యోగుల్లో 25 శాతం వర్క్ ఫ్రమ్ చేయవచ్చునని టీసీఎస్ పేర్కొనడం గమనార్హం. హైబ్రిడ్ వర్క్ మోడల్‌కు సై..! ప్రముఖ ఐటీ ఇన్ఫోసిస్ హైబ్రిడ్ వర్క్ మోడల్‌కు సై అంటోంది. కరోనా మహమ్మారి సమయంలో హైబ్రిడ్ వర్క్ మోడల్ పాపులర్ అయింది. వీటితో పాటు మారికో, విప్రో వంటి ఐటీ కంపెనీలు కూడా హైబ్రిడ్ వర్క్ మోడల్ దిశగా సాగుతున్నాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగుల్లో 86 శాతం మంది కనీసం ఒక డోస్ వేసుకున్నారు. 18 నెలల వర్క్ ఫ్రమ్ హోమ్ అనంతరం వ్యాక్సినేషన్ పూర్తైన ఉద్యోగులు వారానికి రెండుసార్లు కార్యాలయానికి వస్తోన్నట్లు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తెలిపారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీలో సీనియర్ ఉద్యోగులు వారానికి రెండు రోజులు కార్యాలయాలకు వస్తున్నారు. ఈ ఏడాదిలోపు గరిష్ట సంఖ్యలో ఉద్యోగులను పిలిచే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ వీవీ అప్పారావు అభిప్రాయపడ్డారు. చదవండి: చైనాపై విమర్శ..! జాక్ మా కొంపముంచింది..! -
HCL TECH Bee 2021: ఇంటర్‌తోనే ఐటీ జాబ్
సాఫ్ట్వేర్ జాబ్స్ అనగానే.. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సులు పూర్తిచేసుకొని.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలుంటేనే సాధ్యమని భావిస్తారు. కాని ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు.. చిన్న వయసులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ ద్వారా.. ఎంట్రీ లెవెల్ ఐటీ జాబ్స్‌కు అవసరమైన శిక్షణను అందిస్తోంది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో పూర్తి స్థాయి ఉద్యోగ నియామకం లభిస్తుంది. ఇటీవల హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, ఫీజులు, శిక్షణ, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం.. టెక్ బీకి అర్హతలు ► హెచ్‌సీఎల్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సును 2020,2021లో పూర్తిచేసి ఉండాలి. ► ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మ్యాథమెటిక్స్/బిజినెస్ మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ► ఇంటర్/10+2లో మార్కులు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా నిర్దేశించారు. ఐటీ సర్వీసెస్‌కు దరఖాస్తుచేసుకునే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 85శాతానికిపైగా, సీబీఎస్సీ, ఐసీఎస్సీ అభ్యర్థులకు 80శాతానికిపైగా ఉండాలి. అసోసియేట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే..60 శాతానికి పైగా మార్కులు తప్పనిసరి. ఎంపిక విధానం ► దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్ కెరీర్ అప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి.. ఫైనల్ ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థి వ్యక్తిత్వం, ఇతర విద్యా ప్రమాణాలను పరిశీలిస్తారు. (యూజీసీ–నెట్ 2021: కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్.. ఇక్కడ క్లిక్ చేయండి) ఎంపికైతే శిక్షణ ► హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్‌ను ఇంటర్మీడియట్తోనే ఐటీ పరిశ్రమలో చేరేలా ప్రోత్సహించేందుకు రూపొందించారు. ఎంపికైన వారికి లక్నో, నోయిడా, మధురై, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, నాగపూర్‌ల్లో శిక్షణ కేంద్రాలున్నాయి. ► శిక్షణ ‘ఐటీ సర్వీసెస్, అసోసియేట్’ అని రెండు విభాగాలుగా ఉంటుంది. ► ఈ ప్రోగ్రామ్ ద్వారా ఐటీ రంగంలో పూర్తిస్థాయి ఉద్యోగాలకు అవసరమైన శిక్షణనిస్తారు ► ఆన్లైన్/ఆఫ్‌లైన్ అసెస్మెంట్లు, చర్చలు, కేస్ బేస్డ్ సబ్మిషన్స్ వంటివి ఉంటాయి ► ట్రైనింగ్..ఫౌండేషన్,టెక్నాలజీ/డొమైన్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ అని మూడు దశల్లో ఉంటుంది ఫీజు మినహాయింపు ► టెక్ బీ–2021 ప్రోగ్రామ్‌లో ఐటీ సర్వీసెస్, అసోసియేట్ శిక్షణ ఏడాది కాలం పాటు ఉంటుంది. ఈ ఏడాది కాలానికి ఐటీ సర్వీసెస్‌కు రూ.2 లక్షలు, అసోసియేట్ ట్రైనింగ్‌కు రూ.లక్ష ఫీజుగా చెల్లించాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువగా ఉంటే.. వారు బ్యాంక్ నుంచి సాయం పొందవచ్చు. ► శిక్షణలో 90 శాతం,అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన అభ్యర్థులకు నూరు శాతం ప్రోగ్రామ్ ఫీజు నుంచి మినహాయింపు; 85 శాతం నుంచి 90 శాతం స్కోరు చేసినవారికి 50 శాతం ఫీజు రాయితీ ఇస్తారు. (యూనియన్ బ్యాంకులో.. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు) ఉద్యోగం–ఉన్నత విద్య ► విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పూర్తికాల ఉద్యోగులుగా నియమించుకుంటారు. ► కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు అభ్యర్థికి నెలకు రూ.10 వేల చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తారు. పూర్తిస్థాయి ఉద్యోగిగా ఎంపికైతే.. ప్రారంభ వార్షిక వేతనం 1.70 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు చెల్లిస్తారు. ► హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూనే.. బిట్స్ పిలానీ, శాస్త్ర యూనివర్సిటీలో ఉన్నత విద్య కోర్సులో చేరే అవకాశం కూడా ఉంది. ► పూర్తి వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్‌కు: https://registrations.hcltechbee.com -
ఐటీ సంస్థల్లో, మహిళలకు బంపర్ ఆఫర్
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో కొలువుల జాతర మొదలైంది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల్లో సుమారు 60వేల ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 60వేల ఉద్యోగాల నియామకం అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుందని ఆయా దిగ్గజ కంపెనీలు చెబుతున్నాయి. టార్గెట్ 2030 •ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. 2030 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 45శాతం మంది మహిళలే విధులు నిర్వహించేలా ఇన్ఫోసిస్ భారీ ఎత్తున ప్రణాళికను సిద్ధం చేసింది. •టీసీఎస్ సైతం 40వేల మంది మహిళా గ్రాడ్యూయేట్ లలో 15 వేల నుంచి 18వేల లోపు మహిళా ఉద్యోగుల నియమాకం కోసం కసరత్తు. •రాబోయే రోజుల్లో మహిళలు - పురుషుల ఉద్యోగుల సంఖ్య సమానంగా ఉండేలా హెచ్‌సీఎల్ నియామకం చేపట్టనుంది. ఇందుకోసం 60 శాతం మహిళా ఉద్యోగుల్ని ఆయా క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది. •విప్రో ఉద్యోగుల్లో 50శాతం మంది మహిళలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 30వేల మందిని ఎంపిక చేసేలా డ్రైవ్ నిర్వహించనుంది. -
భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ
ఆమె భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ... హెచ్‌సిఎల్ కంపెనీ సిఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. విద్యాజ్ఞాన్ చైర్పర్సన్... ఆమె రోష్నీ నాడార్ మల్హోత్రా... శివ్ నాడార్ ఏకైక కుమార్తె. భారతదేశంలో విజయాలు సాధించిన మహిళల గురించి మాట్లాడుకునేటప్పుడు రోష్నీ నాడార్ మల్హోత్రా గురించి తప్పక చెప్పాలి. కోవిడ్ – 19 మహమ్మారి సమయంలో సమర్థమైన నాయకత్వ లక్షణాలు చూపించిన 25 మంది పారిశ్రామిక వేత్తలలో రోష్నీ పేరు కూడా ఉంది. 38 సంవత్సరాల రోష్నీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ అయ్యారు. అంతకు ముందు భారతీయ ఐటీ కంపెనీని నడిపించిన మొట్టమొదటి మహిళగా మరో విజయం సాధించిన గుర్తింపు పొందారు. చిన్నతనంలోనే... సాంకేతిక దిగ్గజం, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అయిన శివ్ నాడార్కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో జన్మించిన రోష్నీ వసంత్ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, కెలాగ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబిఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్‌లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా కెరీర్ ప్రారంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్‌సిఎల్‌లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ సిఈవో బాధ్యతలు కూడా చేపట్టారు. విచిత్రమేమిటంటే, ఆమెకు సాంకేతిక రంగం మీద అస్సలు ఆసక్తి లేదు. వార్తా మాధ్యమం నుంచి ఆమె ప్రయాణం సాంకేతిక రంగం వైపుకి మళ్లింది. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలంటే, పని మీద పూర్తిగా దృష్టి పెట్టాలని అర్థం చేసుకుని, తన రంగాన్ని అలా మార్చుకున్నారు. తక్షణం భారతదేశానికి తిరిగివచ్చి తన ఫ్యామిలీ బిజినెస్ మీద పనిచేయటం ప్రారంభించారు. సాంకేతిక రంగం మీద అవగాహన లేకపోయినప్పటికీ, రోష్నీ చూపిన శ్రద్ధ, అంకితభావం కారణంగా ఆ కంపెనీ ఆర్థికంగా, పరిపాలనా పరంగా బాగా ఎదిగింది. తండ్రి శివ్ నాడార్‌తో రోష్నీ నాడార్ మల్హోత్రా సంగీత సేవా కార్యక్రమాలలో.. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు, యోగా మీద ఆసక్తి ఎక్కువ. హెచ్‌సిఎల్‌లో చేరటానికి ముందు రోష్నీ ‘శివ నాడార్ ఫౌండేషన్’లో ట్రస్టీగా సేవలు అందించారు. ఈ సంస్థ లాభాపేక్ష లేకుండా ‘శ్రీశివసుబ్రమణ్య నాడార్ ఇంజినీరింగ్ కాలేజీ’ ని చెన్నైలో నడుపుతోంది. విద్యాజ్ఞాన్ సంస్థకు అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు రోష్నీ. ఈ సంస్థలో.. ఆర్థికంగా వెనుకబడినవారికి, ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణ ప్రజలకు మాత్రమే ప్రవేశం. గ్రామీణ భారతం నుంచి నాయకులను తయారు చేయాలనేదే ఆమె కోరిక. వన్యప్రాణి పరిరక్షణ రోష్నీ నాడార్కు వన్యప్రాణి సంరక్షణ అంటే చాలా ఇష్టం. వాటిని సంరక్షించటంతోపాటు పరిరక్షించటమంటే మరీ ఇష్టం. 2018లో హ్యాబిటేట్స్ ట్రస్ట్‌ను స్థాపించి, ఈ సంస్థ ద్వారా భారతదేశానికి చెందిన ప్రాణులను పరిరక్షిస్తుంటారు. వివిధ వన్యప్రాణి సంస్థలతో కలిసి వన్యప్రాణి సమతుల్యతకు కృషి చేస్తున్నారు. హోండా కంపెనీలో పనిచేస్తున్న శిఖర్ మల్హోత్రాను 2009లో వివాహమాడారు. వివాహానంతరం హెచ్‌సిఎల్‌లో చేరి, ప్రస్తుతం ‘హెచ్‌సిఎల్ హెల్త్‌కేర్’లో వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం అర్మాన్, జహాన్. ఆమె సాధించిన విజయాలకు అనేక అవార్డులు అందుకున్నారు. -
కోవిడ్-19 విపత్తు వేళ ఉద్యోగులకు అండగా కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్-19 విపత్తు వేళ ఉద్యోగులు, వారి కుటుంబాలకు కంపెనీలు అండగా నిలుస్తున్నాయి. వైరస్ బారినపడ్డ సిబ్బందికి టెలి హెల్త్‌కేర్, వ్యాక్సినేషన్, వైద్యానికయ్యే ఖర్చుల చెల్లింపు, వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడంతోపాటు కోవిడ్–19 కేర్ సెంటర్లను ఏర్పాటు చేసిన సంస్థలు ఒక అడుగు ముందుకేశాయి. కోవిడ్–19తో ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి మేమున్నామంటూ పెద్ద మనసుతో ముందుకొస్తున్నాయి. ఆర్థిక సాయం, వేతనం చెల్లించడంతోపాటు కుటుంబ సభ్యులకు కొన్నేళ్లపాటు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నాయి. ఆధారపడ్డ పిల్లల చదువు పూర్తి అయ్యే వరకు ఆ బాధ్యతను భుజాన వేసుకుంటున్నాయి. మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఉపాధి కల్పించేందుకు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. కంపెనీలు ఎలాంటి సాయం చేస్తున్నాయంటే.. టాటా స్టీల్: బాధిత కుటుంబం/నామినీకి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు వేతనం, వైద్యం, హౌజింగ్ సౌకర్యం. పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు సాయం. సన్ ఫార్మా: రెండేళ్ల వేతనం, పిల్లల గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు ఆర్థిక తోడ్పాటు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: ఉద్యోగులకు రూ.30 లక్షల బీమా. ఉద్యోగి మరణిస్తే బీమా మొత్తాన్ని కుటుంబానికి చెల్లింపు. ఒక ఏడాదికి సమానమైన వేతనం. అమెజాన్: వైరస్ బారినపడ్డ ఫ్రంట్‌లైన్ బృంద సభ్యుడు హోం క్వారంటైన్లో ఉంటే రూ.30,600ల గ్రాంట్. బీమా కవరేజ్ మించి ఆసుపత్రి బిల్లు అయితే అదనంగా రూ.1.9 లక్షల వరకు రీఇంబర్స్. బజాజ్ ఆటో: మరణించిన ఉద్యోగి కుటుంబానికి రెండేళ్ల వరకు ఆర్థిక మద్దతు. పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు సాయం. కుటుంబ సభ్యులందరికీ అయిదేళ్లపాటు ఆరోగ్య బీమా. టెక్ మహీంద్రా: కోవిడ్ సపోర్ట్ పాలసీ కింద అదనపు ప్రయోజనాలు. అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు. నైపుణ్య శిక్షణ. 12వ తరగతి వరకు పిల్లల చదువుకు అయ్యే ఖర్చును తిరిగి చెల్లిస్తారు. బజాజ్ అలియాంజ్: బీమాకు అదనంగా రూ.1 కోటి వరకు ఆర్థిక సాయం. గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు ఇద్దరు పిల్లలకు ఏటా రూ.2 లక్షల వరకు చెల్లింపు. అయిదేళ్ల వరకు ఆరోగ్య బీమా. సీమెన్స్: రూ.25 లక్షల ఆర్థిక సాయం. ఒక ఏడాది వేతనం. ఆరోగ్య బీమా, పిల్లల చదువుకు తోడ్పాటు. మహీంద్రా అండ్ మహీంద్రా: అయిదేళ్లపాటు వేతనం. రెండింతల వార్షిక పరిహారం. 12వ తరగతి వరకు ఇద్దరు పిల్లలకు ఏటా చెరి రూ.2 లక్షల వరకు చెల్లింపు. టీవీఎస్ మోటార్: గరిష్టంగా మూడింతల వార్షిక స్థూల వేతనం చెల్లింపు. ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ అదనం. మూడేళ్లపాటు ఆరోగ్య బీమా. ఇద్దరు పిల్లలకు అండర్ గ్రాడ్యుయేషన్ వరకు విద్య. ఓయో: ఎనమిది నెలల వేతనం, మూడేళ్ల వార్షిక వేతనానికి సమానమైన టెర్మ్ ఇన్సూరెన్స్. అయిదేళ్లపాటు పిల్లల చదువు. అయిదేళ్లపాటు రూ.3 లక్షల వరకు ఆరోగ్య బీమా. బోరోసిల్: రెండేళ్లపాటు వేతనం, పిల్లల చదువుకు తోడ్పాటు. ముతూట్ ఫైనాన్స్: మూడేళ్లకుపైగా పనిచేసిన ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి రెండేళ్ల వేతనం చెల్లిస్తారు. మూడేళ్లలోపు ఉంటే ఒప్పంద ఉద్యోగులకూ ఒక ఏడాది వేతనం ఇస్తారు. అదనంగా వన్ టైం చెల్లింపు సైతం ఉంది. సొనాలికా: డీలర్లు, వారి ఉద్యోగుల కోవిడ్–19 చికిత్స కోసం రూ.25,000 వరకు వైద్య ఖర్చులు. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.50 వేల వార్షిక వైద్య, విద్య ఖర్చులకు ఇది అదనం. మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.2 లక్షల సాయం. చదవండి: అలర్ట్: జూన్ 30లోగా ఎఫ్డీ దారులు ఈ ఫామ్‌లు నింపాల్సిందే -
కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు
న్యూఢిల్లీ: కనిష్ట స్థాయిల వద్ద మెటల్, ఫైనాన్స్, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. సెనెక్స్ 255 పాయింట్లు పెరిగి 39,983 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 11,762 వద్ద స్థిరపడ్డాయి. మునుపటి రోజు మార్కెట్ భారీ పతనంతో ప్రధాన షేర్ల వ్యాల్యుయేషన్లు దిగివచ్చాయి. అలాగే ధరలు గరిష్టస్థాయిల నుంచి కనిష్టాలకు చేరుకున్నాయి. ఇదే అదనుగా భావించిన ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. అయితే ఐటీ, మీడియా షేర్లు మాత్రం స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లకుగానూ 24 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఐఐలు, డీఐఐలు ఇరువురూ శుక్రవారం నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఎఫ్ఐఐలు రూ.479 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.430 కోట్ల షేర్లను విక్రయించారు. ఈ వారంలో సెనెక్స్ 526.51 పాయింట్లు(1.29 శాతం), నిఫ్టీ 157.75 పాయింట్లను కోల్పోయాయి. రెండోదశ కరోనా కేసుల విజృంభణతో అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వైఖరి నెలకొని ఉంది. మెరిసిన మెటల్ షేర్లు–ఐటీలో అమ్మకాలు... కొన్ని రోజులుగా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్న మెటల్ షేర్లలో శుక్రవారం అనూహ్య ర్యాలీ చోటుచేసుకుంది. టాటా స్టీల్ (5.5 శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (6.7 శాతం) షేర్ల అండతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం లాభంతో ముగిసింది. అయితే ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగడంతో ఈ రంగ షేర్లు ఆరంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్‌తో పాటు బ్యాంకింగ్, ఫార్మా, ఫైనాన్స్ షేర్లలో ర్యాలీ కూడా బెంచ్‌మార్క్ సూచీలకు కలిసొచ్చింది. ఒక దశలో సెన్సెక్స్ 398 పాయింట్లు పెరిగి 40,126 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు లాభపడి 11,790 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ‘నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌లో 11,500 వద్ద బలమైన మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. రెండో త్రైమాసిక ఫలితాలు, ఉద్దీపన ప్యాకేజీ ప్రణాళికల వార్తలు రానున్న రోజుల్లో మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. ఐటీ, టెలికం, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లోని సానుకూలతల దృష్ట్యా రానున్న రోజుల్లో ఈ షేర్లు రాణించే అవకాశం ఉంది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ‘నిఫ్టీలో కన్సాలిడేషన్ జరిగేందుకు అవకాశం ఉన్నట్లు సంకేతాలు సూచిస్తున్నాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని., ఇరువైపుల పొజిషన్లను మెయిన్టైన్ చేసుకోవాలని మా కస్టమర్లకు సలహానిస్తున్నాము’ అని రెలిగేర్ బ్రోకింగ్ చైర్మన్ అజిత్ మిశ్రా తెలిపారు. ► హెచ్‌సీఎల్ టెక్ షేరు 3% క్షీణించింది. ► క్యూ2 ఆదాయ వృద్ధి మందగించడంతో మైండ్ ట్రీ షేరు 7 శాతం నష్టాన్ని చవిచూసింది. ► అనుబంధ సంస్థ ఆడిటర్ రాజీనామా తో యూపీఎల్ షేరు 8% క్షీణించింది. ► ఎన్ఎస్ఈలో 89 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 18% అప్
న్యూఢిల్లీ: వివిధ వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరు కనపర్చడంతో జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం 18.5 శాతం వృద్ధి చెందింది. రూ. 3,142 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 2,651 కోట్లు. మరోవైపు, ఆదాయం 6 శాతం పెరిగి రూ. 17,528 కోట్ల నుంచి రూ. 18,594 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘కొత్త ఆర్డర్లు భారీగా వచ్చాయి. గత క్వార్టర్‌తో పోలిస్తే 35 శాతం పెరిగాయి‘ అని సంస్థ సీఈవో సీ విజయకుమార్ వెల్లడించారు. త్రైమాసికాలవారీగా చూస్తే ఒప్పందాల సంఖ్య ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో నమోదైందని వివరించారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా తదితర మార్కెట్లలో పెట్టుబడులను పెంచనున్నట్లు విజయకుమార్ చెప్పారు. మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆదాయ వృద్ధి సగటున 1.5–2.5 శాతం ఉండగలదని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచ్చింది. హెచ్–1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వ ఆంక్షల అంశం మీద స్పందిస్తూ తమ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది స్థానికులే ఉన్నారని విజయకుమార్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యయాలపరంగా తమపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, వచ్చే ఏడాది మాత్రం కొంత ఉండవచ్చని తెలిపారు. షేరు డౌన్..: లాభాల స్వీకరణతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు దాదాపు 4 శాతం తగ్గింది. బీఎస్ఈలో ఒక దశలో 4.47% క్షీణించి రూ. 821 స్థాయిని కూడా తాకింది. చివరికి 3.76 శాతం క్షీణతతో రూ. 827.10 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈ 30లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఎన్ఎస్ఈలో 3.48 శాతం తగ్గి రూ. 830.05 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 7.23 లక్షలు, ఎన్ఎస్ఈలో 2.89 కోట్ల షేర్లు చేతులు మారాయి. వేతనాల పెంపు.. అక్టోబర్ 1, జనవరి 1 నుంచి వర్తించేలా దశలవారీగా వివిధ స్థాయిల ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు విజయకుమార్ చెప్పారు. కరోనా వైరస్ పరిణామాల కారణంగా వేతనాల పెంపు గతంలో వాయిదా పడింది. దేశీయంగా ఉన్న ఉద్యోగులకు గతేడాది తరహాలోనే సగటున 6 శాతం స్థాయిలో పెంపు ఉండొచ్చని అంచనా. సెప్టెంబర్ ఆఖరు నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,53,085గా ఉంది. ఐటీ సేవల విభాగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 12.2 శాతంగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 1,500 పైచిలుకు ఫ్రెషర్స్‌ను కంపెనీ రిక్రూట్ చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో సుమారు 7,000 నుంచి 9,000 వేల మంది దాకా ఫ్రెషర్లను తీసుకోవాలని యోచిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అప్పారావు వీ తెలిపారు. క్యూ1, క్యూ2లో 3,000 మంది దాకా ఫ్రెషర్లను తీసుకున్నట్లు వివరించారు. -
ఐటీ శాఖ మంత్రిని కలిసిన హెచ్‌సీఎల్ ప్రతినిధులు
సాక్షి, అమరావతి : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో హెచ్‌సీఎల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. నైపుణ్య శిక్షణ గురించి సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ అందించే విధివిధానాలను, కొత్త కోర్సులు, సదుపాయాల వంటి విషయాలను హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా హెచ్‌సీఎల్ క్యాంపస్‌ని సందర్శించాలంటూ సంస్థ ప్రతినిధులు మంత్రి గౌతమ్ రెడ్డికి ఆహ్వానం పలికారు. హెచ్‌సీఎల్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'టెక్ బీ' కార్యక్రమం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, శిక్షణ అందించాలన్న మంత్రి ప్రతిపాదనకు ప్రతినిధులు అంగీకారం తెలిపారు. వచ్చే జనవరి నుంచి హెచ్‌సీఎల్ ప్రారంభించనున్న శిక్షణాపరమైన కార్యక్రమాలను సందర్శించాలని హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవిశంకర్ మంత్రిని కోరారు. యువతకు శిక్షణ అందించేందుకు వసూలు చేసే ఖర్చు తగ్గించాలని మంత్రి కోరారు. అందుకు ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. చర్చలో భాగంగా, నైపుణ్య రంగంలో శిక్షణాపరమైన అంశాలలో ప్రభుత్వంతో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లు హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. తనతో జరిగిన భేటీలోని చర్చ సారాంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి మేకపాటి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రవిశంకర్ పాల్గొన్నారు. వస్త్ర పరిశ్రమలో యంత్రాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన మంత్రి గుంటూరు : మంగళగిరిలో నిర్వహించిన '23వ ప్రాడక్ట్ కమ్ కాటలాగ్ షో' కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వస్త్ర పరిశ్రమలో వివిధ రాష్ట్రాల్లో వినియోగించే వినూత్న యంత్రాల ప్రదర్శనను మంత్రి తిలకించారు.ఇండియన్ టెక్స్టైల్ యాక్ససరీస్, యంత్రాల తయారీ సంఘం' (ఐటీఏఎమ్ఎమ్ఏ) ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం హాయ్ ల్యాండ్ రిసార్ట్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ మార్కెట్ లో వస్త్ర పరిశ్రమలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలను పెంచే విధంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించి ప్రత్యేక పాలసీ తీసుకు రానున్నామని మంత్రి మేకపాటి వెల్లడించారు. అధునాతన యంత్రాల వినియోగంతో ఉత్పత్తి చేసే విషయంలో భారతదేశం అగ్రశ్రేణి దేశాలలో ముందుందని అన్నారు. 4.5 కోట్ల మంది ప్రత్యక్ష్యంగా ఉపాధి పొందుతున్న వస్త్ర పరిశ్రమ అభివృద్ధి ఎంతో కీలకమన్నారు. ప్రపంచంలోనే వస్త్ర ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉందన్నారు. ప్రత్యేకించి వస్త్ర పరిశ్రమకు మూలాధారమైన పత్తి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలోఉందన్నారు. వస్త్రాలను నాణ్యమైన రీతిలో ఆకర్షణగా తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్ కళాకారుల నైపుణ్యం ప్రత్యేకంగా కొనియాడదగినదన్నారు. నాణ్యమైన వస్త్ర ఉత్పత్తి, సాంకేతిక పద్ధతుల ద్వారా కృషి చేస్తే వస్త్ర పరిశ్రమ మరింతగా విస్తరించే అవకాశముందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్ అసోసియేషన్, మహారాష్ట్రకు చెందిన వస్త్ర పరిశ్రమలు, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వస్త్ర పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం రయ్..
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన లాభాలు నమోదు చేసింది. రూ. 2,611 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ. 2,194 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మరోవైపు, సంస్థ ఆదాయం సుమారు 23 శాతం వృద్ధితో రూ. 12,808 కోట్ల నుంచి రూ. 15,699 కోట్లకు చేరింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌సీఎల్ రూ. 2 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయాలు 5.6 శాతం మేర పెరిగాయని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సి. విజయకుమార్ తెలిపారు. ‘ప్రధాన వ్యాపార విభాగం (మోడ్ 1) స్థిరంగా వృద్ధి చెందుతోంది. ఇక డిజిటల్ (మోడ్ 2), ఐపీ ఆధారిత వ్యాపార సేవల విభాగం (మోడ్ 3) కూడా రాణిస్తుండటంతో.. మొత్తం ఆదాయాల్లో ఈ రెండింటి వాటా 29 శాతానికి చేరింది. భారీ డీల్స్‌ను సక్రమంగా పూర్తి చేయగలగడం.. ఆదాయ వృద్ధికి ఊతమిస్తోంది‘ అని ఆయన తెలిపారు. డాలర్ మారకంలో చూస్తే డిసెంబర్ క్వార్టర్లో నికర లాభం 7 శాతం పెరిగి 364 మిలియన్ డాలర్లుగా నమోదు కాగా, ఆదాయం సుమారు 11% వృద్ధితో 2.2 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా విభాగం 12.9%, యూరప్ విభాగం 14.5%, భారత్ మినహా మిగతా ప్రపంచ దేశాల మార్కెట్ విభాగం 12.1% మేర వృద్ధి నమోదు చేశాయి. ఆదాయం మెరుగ్గా ఉండటం, పన్ను భారం తగ్గడం వంటి అంశాల కారణంగా హెచ్‌సీఎల్ టెక్ అంచనాలు మించే స్థాయిలో లాభాలు ప్రకటించిందని బ్రోకరేజి సంస్థ షేర్‌ఖాన్ రీసెర్చ్ విభాగం ఏవీపీ సంజీవ్ హోతా చెప్పారు. గైడెన్స్‌పై ధీమా..: స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో ముందుగా ఇచ్చిన గైడెన్స్ ప్రకారం 9.5–11.5% శ్రేణిలో ఆదాయ వృద్ధి ఎగువ స్థాయిలోనే ఉంటుందని విజయకుమార్ చెప్పారు. క్యూ3లో 17 డీల్స్ కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. క్యూ3లో స్థూలంగా 13,191 మంది ని రిక్రూట్ చేసుకుంది. డిసెంబర్ చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,32,328కి చేరింది. ఐటీ విభాగంలో అట్రిషన్ రేటు 17.8%గా ఉంది. విదేశీ కార్యాలయాలకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2,000 మందిని రిక్రూట్ చేసుకోవాలని హెచ్‌సీఎల్ యోచిస్తోంది. ఇందులో సింహభాగం నియామకాలు అమెరికాలోనే ఉండనున్నాయి. ఇక భారత్‌లో 10,000 మంది ఫ్రెషర్స్‌ని తీసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా 134 డెలివరీ సెంటర్స్.. అంతర్జాతీయంగా సాఫ్ట్వేర్ సేవల్లో స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా వివిధ దేశాల్లో 134 డెలివరీ సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నామని విజయకుమార్ చెప్పారు. రాజకీయ, భౌగోళిక, ఆర్థిక ప్రతిబంధకాల కారణంగా డిమాండ్, సరఫరాపరమైన సమస్యల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. -
టీసీఎస్.. ప్రపంచంలో టాప్–3
న్యూఢిల్లీ: ఐటీ సేవల్లో భారత కంపెనీలు ప్రతిభ మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఈ రంగంలో టీసీఎస్ ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను యాక్సెంచర్, ఐబీఎం మొదటి రెండు స్థానాల్లో నిలవగా, టీసీఎస్ మూడో స్థానంలో ఉన్నట్టు ‘బ్రాండ్ ఫైనాన్స్’ రిపోర్ట్ తెలియజేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది. భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో సైతం టాప్–10లో చోటు సంపాదించుకోవడం గమనార్హం. 26.3 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో యాక్సెంచర్ మొదటి స్థానంలో నిలిచింది. క్రితం ఆర్థిక సంవత్సరం నివేదికలో ఐబీఎం మొదటి స్థానంలో ఉండగా, దాన్ని వెనక్కి నెట్టి యాక్సెంచర్ మొదటి స్థానానికి చేరుకుంది. 20.4 బిలియన్ డాలర్లతో ఐబీఎం రెండో స్థానానికి పరిమితమైంది. 12.8 బిలియన్ డాలర్లతో టీసీఎస్ మూడో స్థానం దక్కించుకుంది. సంస్థ మార్కెట్ విలువ క్రితం నివేదికతో పోలిస్తే 23 శాతం పెరిగినట్టు బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక తెలిపింది. జపాన్ మార్కెట్లో విజయం సాధించిన తొలి భారత ఐటీ కంపెనీ టీసీఎస్ అని ప్రస్తావించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ఆటోమేషన్ సహా అన్ని రకాల కస్టమర్ సేవలను అందించడంలో లీడర్‌గా నిలిచినట్టు వివరించింది. టాప్–10లో తొలిసారిగా విప్రో విప్రో తొలిసారి ఈ జాబితాలో టాప్–10లో చోటు దక్కించుకుంది. డిజిటల్ సామర్థ్యాల పెంపు, కీలకమైన కొనుగోళ్లపై కంపెనీ చేసిన గణనీయమైన పెట్టుబడులతో ఈ విభాగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మూడో కంపెనీగా విప్రో నిలిచినట్టు పేర్కొంది. అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ (8.7 బిలియన్ డాలర్లు) నాలుగు, ఇన్ఫోసిస్ (6.5 బిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో నిలిచాయి. క్యాప్‌జెమిని, డీఎక్స్‌సీ టెక్నాలజీ, ఎన్టీటీ డేటా టాప్–10లో నిలిచిన ఇతర సంస్థలు. నైపుణ్య ఉద్యోగులు, ప్రపంచ స్థాయి సదుపాయాలు, వసతులు వంటివి భారత్‌ను ఆకర్షణీయమైన ప్రదేశంగా, ప్రపంచానికి చోదకంగా నిలుపుతున్నాయని బ్రాండ్ ఫైనాన్స్ సీఈవో డేవిడ్హేగ్ పేర్కొన్నారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 2,540 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.2,540 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.2,188 కోట్లతో పోలిస్తే 16 శాతం వృద్ధి సాధించామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం 6 శాతం పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్‌కుమార్ చెప్పారు. గత క్యూ2లో రూ.12,434 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 20 శాతం వృద్ధితో రూ.14,861 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 7 శాతం ఎగసిందని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ. 2 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఆదాయ వృద్ధి 10–12 శాతం రేంజ్లో.. ఆదాయం, మార్జిన్ల వృద్ధి అంశాల్లో సీక్వెన్షియల్‌గా పటిష్టమైన వృద్ధిని సాధిస్తున్నామని విజయ్‌కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే జోరును కొనసాగించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. డాలర్ల పరంగా చూస్తే, ఈ క్యూ2లో నికర లాభం 5 శాతం వృద్ధితో 35.67 కోట్ల డాలర్లకు, ఆదాయం 9 శాతం వృద్ధితో 209 కోట్ల డాలర్లకు పెరిగాయని చెప్పారు. నిర్వహణ మార్జిన్ 9 శాతం వృద్ధితో రూ.2,966 కోట్లకు చేరిందని వివరించారు. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10–12 శాతం వృద్ది సాధించగలదన్న అంచనాలను ఆయన వెల్లడించారు. ఈ క్యూ2లో 11,683 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, దీంతో తమ కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,27,875కు పెరిగిందని వివరించారు. అట్రిషన్ రేటు 17.1 శాతంగా ఉందని వివరించారు. 25.8 శాతానికి ఆర్ఓఈ రన్–రేట్ ప్రాతిపదికన(పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే) నికర లాభం రూ.10,000 కోట్లు దాటేసిందని కంపెనీ సీఎఫ్ఓ ప్రతీక్ అగర్వాల్ పేర్కొన్నారు. రూ.4,000 కోట్ల షేర్ల బైబ్యాక్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, దీంతో తమ రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 25.8 శాతానికి పెరిగిందని వివరించారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్వహణ మార్జిన్ 20–21 శాతం రేంజ్లో ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 2.7 శాతం నష్టంతో రూ.953 వద్ద ముగిసింది. -
ఏపీలో హెచ్‌సీఎల్ రూ.750 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న రెండు ఫెసిలిటీలకు రూ.750 కోట్లు వెచ్చిస్తున్నట్టు వెల్లడించింది. తద్వారా వచ్చే 10 ఏళ్లలో 7,500 ఉద్యోగావకాశాలు ఉంటాయని పేర్కొంది. రెండు దశల్లో విస్తరణ ఉంటుందని కంపెనీ వివరించింది. గన్నవరం సమీపంలో కేసరపల్లి వద్ద రూ.400 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు నేడు (సోమవారం) భూమి పూజ జరుగనుంది. ఏడేళ్లలో పూర్తి కానున్న తొలి దశ ప్రాజెక్టులో 4,000పైగా ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి లభించనుంది. రెండో దశలో అమరావతిలో రూ.350 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల్లో క్యాంపస్ రానుంది. అయిదేళ్లలో ఇక్కడ 3,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని హెచ్‌సీఎల్ తెలిపింది. -
స్టాక్స్ వ్యూ
యాక్సిస్ బ్యాంక్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.574 టార్గెట్ ధర: రూ.670 ఎందుకంటే: కొత్త తరం ప్రైవేట్ బ్యాంక్‌లకు సంబంధించి అతిపెద్ద బ్యాంక్‌ల్లో ఇది కూడా ఒకటి. ఈ ఏడాది మార్చి నాటికి 3,703 బ్రాంచ్‌లతో, 13,814 ఏటీఎమ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయ వృద్ధి నిలకడగా ఉండటంతో నికర లాభం రూ.701 కోట్లకు పెరిగింది. రుణ నాణ్యత ఒకింత మెరుగుపడింది. నికర వడ్డీ ఆదాయం 12 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా 9 శాతం) వృద్ధితో రూ.5,170 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 13 బేసిస్ పాయింట్లు పెరిగి 3.46 శాతానికి చేరింది. కార్పొరేట్ ఫీజు ఆదాయం 24 శాతం తగ్గగా, రిటైల్ ఫీజు ఆదాయం 18 శాతం ఎగసింది. మొత్తం మీద ఫీజు ఆదాయ వృద్ధి 5 శాతంగా నమోదైంది. రిటైల్ రుణాలు 21 శాతం, ఎస్ఎమ్ఈ రుణాలు 19 శాతం పెరగడంతో 14 శాతం రుణ వృద్ధి సాధించింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా డిపాజిట్లు 1 శాతం తగ్గగా, టర్మ్ డిపాజిట్లు 13 శాతం పెరిగాయి. స్థూల, నికర మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా తగ్గాయి. మార్చి క్వార్టర్లో 6.77 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ జూన్ క్వార్టర్లో 6.52 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 3.4 శాతం నుంచి 3.09 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 83 శాతానికి ఎగసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి రుణ వృద్ధి జోరుగా పెరగవచ్చని భావిస్తున్నాం. టైర్–1 మూలధనం 13.2 శాతంగా ఉండటంతో వృద్ధికి తగిన పెట్టుబడులు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. ఇతర కార్పొరేట్ బ్యాంక్‌లతో పోల్చితే రుణ నాణ్యత మెరుగుపడటం, మార్జిన్లు బాగా వచ్చే రిటైల్ రుణాలపై బ్యాంక్ దృష్టి పెట్టటం సానుకూలాంశాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.965 టార్గెట్ ధర: రూ.1,155 ఎందుకంటే: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. మెరుపులూ లేవు. అలాగని నిరాశాజనకంగానూ లేవు. అయితే డీల్స్ సాధించడం, భవిష్యత్తు ఆదాయ అంచనాలు ఆశావహంగా ఉన్నాయి. ఆదాయం 3 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 9 శాతం) వృద్ధితో 205.5 కోట్ల డాలర్లకు పెరిగింది. పన్ను రేట్లు తక్కువగా ఉండటంతో సవరించిన నికర లాభం రూ.2,403 కోట్లకు చేరింది. ఈ క్యూ1లో అత్యధిక డీల్స్(27) సాధించింది. కంపెనీ చరిత్రలో అత్యధిక డీల్స్ సాధించిన క్వార్టర్ ఇదే. మరిన్ని భారీ డీల్స్ రానున్న క్వార్టర్లలో సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగం మళ్లీ పుంజుకుంటోంది. డిజిటల్ విభాగం మంచి జోరు సాధించింది. హెల్త్‌కేర్, లైఫ్–సైన్సెస్, పబ్లిక్ సర్వీసెస్ విభాగాలు మినహా ఇతర విభాగాల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 9.6 శాతం నుంచి 11.5 శాతం రేంజ్లో ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. రెండేళ్లలో ఆదాయం 10 శాతం, షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. ఇబిట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19.7 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నాం. -
ఎల్ఐసీ చేతికి ఐడీబీఐ బ్యాంకు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం నియంత్రిత వాటాను ఎల్ఐసీ సొంతం చేసుకునేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హిందుస్తాన్ కాపర్ కంపెనీ తాజాగా 15 శాతం ఈక్విటీ జారీ ద్వారా రూ.900 కోట్ల సమీకరణకు కూడా అనుమతి తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న ఐడీబీఐ బ్యాంకు ఎల్ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడం ద్వారా నిధులను సమీకరిస్తుంది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి ఇప్పటికే 7.5 శాతం వాటా ఉంది. మిగిలిన మేర మెజారిటీ వాటాను ప్రిఫరెన్షియల్ షేర్ల రూపంలో సొంతం చేసుకోనుంది. ఈ విధానంలో ఐడీబీఐ బ్యాంకుకు రూ.10,000–13,000 కోట్ల మేర తాజా నిధులు అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరవు. ఇప్పటి వరకు కేంద్రం తన వాటాను ఎల్ఐసీకి విక్రయించడం ద్వారా ఖజానా నింపుకుంటుందని భావించారు. హెచ్‌సీఎల్ నిధుల సమీకరణ హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) 15 శాతం తాజా ఈక్విటీ జారీ చేయడం ద్వారా రూ.900 కోట్లను సమీకరించేందుకు కేబినెట్ ఆమోదించింది. దీంతో హెచ్‌సీఎల్ 13.87 కోట్ల షేర్లను(15%) జారీ చేయనుంది. దీంతో కేంద్రం వాటా 66.13 శాతానికి తగ్గిపోతుంది. ప్రస్తుతం ప్రభుత్వానికి 76.05 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చూస్తే తాజా షేర్ల జారీ ద్వారా కంపెనీకి రూ.900.6 కోట్లు సమకూరతాయి. క్యూఐపీ ద్వారా ఈ ప్రక్రియను కంపెనీ పూర్తి చేయనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల విస్తరణకు ఈ నిధుల్ని వెచ్చించనుంది. తాజా షేర్లను జారీ చేస్తుండడంతో కంపెనీ చెల్లించిన మూలధనం రూ.462.61కోట్ల నుంచి రూ.532కోట్లకు పెరుగుతుంది. ఏకకాలంలో అన్ని రకాల ఇంధనాల ఉత్పత్తి సంప్రదాయేతర ఇంధనాలైన కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం), షేల్ గ్యాస్‌తోపాటు సంపద్రాయ చమురు, సహజ వాయువులను ఏకకాలంలో వెలికితీసేందుకు కేంద్రం అనుమతించింది. లాభాల్లో 10% అదనపు చెల్లింపు ద్వారా అనుమతికి అవకాశం కల్పించింది. సంప్రదాయ ఇంధనాలైన చమురు, సహజ వాయువు ఉత్పత్తికి సంబంధించిన పర్మిట్‌తో ప్రస్తుతం షేల్ ఆయిల్, గ్యాస్, సీబీఎంల ఉత్పత్తికి అనుమతి లేదు. ఈ నిర్ణయంతో కొత్త పెట్టుబడులు, ఉత్పత్తి పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. -
హెచ్‌సీఎల్ టెక్ చేతికి జర్మనీ కంపెనీ
న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ... జర్మనీకి చెందిన ఐటీ, ఇంజినీరింగ్ సర్వీసుల కంపెనీ హెచ్ అండ్ డీ ఇంటర్నేషనల్ గ్రూప్‌ను కొనుగోలు చేసింది. జర్మనీలోని వోల్ఫోబర్గ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీని 3 కోట్ల యూరో(దాదాపు రూ.240 కోట్లు)లకు కొనుగోలు చేశామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. ఈ కంపెనీ కొనుగోలుతో జర్మనీ మార్కెట్లో తాము మరింతగా దూసుకుపోగలమని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్(కార్పొరేట్) అశిష్ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ ఆటోమోటివ్ రంగంలో తమ నైపుణ్యం మరింతగా మెరుగుపడగలదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి ఈ కంపెనీ కొనుగోలు పూర్తవ్వగలదని తెలిపారు. జర్మనీలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన హెచ్ అండ్ డీ ఇంటర్నేషనల్ గ్రూప్ అమెరికా, చెక్ రిపబ్లిక్, పోలండ్‌ల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఏడాది ఈ కంపెనీ ఆదాయం 7.41 కోట్ల యూరోలుగా ఉంది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేర్ 1 శాతం లాభంతో రూ.919 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ లాభం రూ. 2,194 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ డిసెంబర్ త్రైమాసికంలో రూ.2,194 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ.2,070 కోట్లతో పోలిస్తే ఇది 6 శాతం అధికం. మరోవైపు, మొత్తం ఆదాయం 8.4 శాతం వృద్ధితో రూ.11,814 కోట్ల నుంచి రూ.12,808 కోట్లకు పెరిగింది. సంస్థ.. ఒకో షేరుకు రూ.2 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు కనపర్చగలిగామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ సి.విజయకుమార్ ఈ సందర్భంగా చెప్పారు. సీక్వెన్షియల్‌గా 3.3 శాతం మేర, వార్షిక ప్రాతిపదికన 11.2 శాతం మేర వృద్ధి సాధించగలిగామని తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం గైడెన్స్‌కి సంబంధించి ఆదాయం కనిష్ట స్థాయిలో ఉన్నా... ఆదాయం, మార్జిన్లపరంగా ముందస్తు అంచనాలను అందుకోగలమన్నారు. కరెన్సీ మారక విలువ యథాతథ స్థితిలోనే కొనసాగిన పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం 10.5– 12.5 శాతం మేర, ఆపరేటింగ్ మార్జిన్ 19.5– 20.5 శాతం శ్రేణిలో ఉండగలదంటూ జూలైలో కంపెనీ గైడెన్స్ ఇచ్చింది. కొత్తగా 20 డీల్స్..: డిసెంబర్ త్రైమాసికంలో 20 డీల్స్ కుదుర్చుకున్నట్లు విజయకుమార్ చెప్పారు. క్లయింట్లంతా ఐటీకి మరింత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత ఆశావహంగా ఉండగలదని అభిప్రాయపడ్డారు. క్యూ3లో ఆర్థిక సేవల విభాగం ఆదాయాలు 11%, తయారీ 21%, లైఫ్‌సైన్సెస్.. హెల్త్‌కేర్ విభాగం సుమారు 10%, రిటైల్ 13% మేర పెరిగాయి. ఈ త్రైమాసికంలో నికరంగా 251 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,19,291కి చేరింది. బీఎస్ఈలో శుక్రవారం హెచ్‌సీఎల్ టెక్ షేరు 0.30% పెరిగి రూ. 958 వద్ద క్లోజయ్యింది. -
మార్కెట్లోకి హోండా ‘అమేజ్’ కొత్త వెర్షన్
ప్రారంభ ధర రూ.6.48 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ (హెచ్‌సీఐఎల్) తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘అమేజ్’లో ప్రివిలేజ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.48 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ధర రూ.7.73 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కొత్త లిమిటెడ్ వెర్షన్లో అడ్వాన్స్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అదిరిపోయే ఎక్స్టీరియర్ సహా ఏబీఎస్ (డీజిల్ వేరియంట్), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, పవర్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ‘కస్టమర్లకు ఉత్తమమైన ఫీచర్లను అందించడమే మా ప్రధాన లక్ష్యం. హోండా అమేజ్‌లో ప్రివిలేజ్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది’ అని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. -
బిగ్ డేటా, ఎనలిస్టులకు బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన నేపథ్యంలో భారీగా ఉద్యోగాలు రానున్నాయనే అంచనాలు ఊరట నిస్తున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేల ఉద్యోగాలు రానున్నాయని ఆన్లైన్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ ఏడాదిలో అత్యధిక సంఖ్యలో అమెజాన్, సిటీ, హెచ్‌సీఎల్, గోల్డ్ మాన్ సాచ్స్ , ఐబిఎం లాంటి ప్రముఖ సంస్థల్లో ఈ ఎనలిటిక్స్ ఉద్యోగాలకు మంచి ఓపెనింగ్స్ ఉండనున్నాయని పేర్కొంది. ఎనలటిక్స్, బిగ్ డేటా ,డేటా సైన్స్ ప్లాట్‌ఫాం, ఎనలటిక్స్ అండ్ మ్యాగజైన్ , ఆన్లైన్ ఎనలిటిక్స్ శిక్షణా సంస్థ ఎడ్వాన్సెర్ ఎడ్యూవెంచర్స్ సంయుక్తంగా ది ఎనలటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇండియా జాబ్స్ 2017 పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది. భారతదేశంలో ఎనలిస్టులు, డేటా సైన్స్, బిగ్ డేటాలో నియామకాలు పెరుగుతాయని ఈ అధ్యయనం తేల్చింది. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో డేటా ఎనలిస్టులు ఉద్యోగాలు లభించనున్నాయిని అనలాటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇండియా జాబ్స్ స్టడీ 2017 ప్రకారం తేలింది. దాదాపు 50వేల ఎనలిస్టు జాబ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఐటీలో తగ్గిన నియామకాలకారణంగా కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆందోళనలో ఉన్నారు. తక్కువ ఐటి నియామకం ఈ 42 శాతం మంది బీఈ / బీటెక్ గ్రాడ్యుయేట్లకు కేటాయిస్తుండగా, మరో 40 శాతం ఎంబీఏ, ఎంటెక్ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు కోసం చూస్తున్నారట. దీంతో ఈ ఉద్యోగ నియామకాల్లో టైర్ -బి నగరాల్లో 2016 లో 5 శాతం నుంచి ఈ ఏడాది 7 శాతం వరకు పెరిగిందిని ఈ సర్వే తెలిపింది. అమెరికా తరువాత ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణ మరియు డేటా సైన్స్ ఉద్యోగాల్లో అవకాశాలలో 12 శాతం వాటాతో ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద విశ్లేషణ కేంద్రంగా ఉంది. వీటిల్లో అమెజాన్, సీటీ, ఐబీఎం , హెచ్‌సీఎల్ లాంటివి ఎక్కువ సంఖ్యలో ఎనలిక్స్ ఉద్యోగాలను కల్పించాయి. నగరాల పరంగా, బెంగళూరు అన్ని ఎనలిటిక్స్ ఉద్యోగాల్లో దాదాపు 25 శాతం ఉద్యోగాలతో టాప్ లోనూ, ఢిల్లీలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇక ఫెషర్స్ విషయానికి వస్తే , చెన్నై మొత్తం ఓపెనింగ్స్‌లో టాప్ లోఉంది. 2-7 సంవత్సరాల అనుభవం ఉన్నవారిలో దాదాపు 50 శాతం ఉద్యోగాలు అన్ని నగరాల్లోనూ ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. అంతేకాదు ఈ ఎనలిటిక్స్, డేటా సైన్స్ ఉద్యోగాల్లో సంవత్సరానికి సగటు జీతం రూ. 10.5 లక్షలు. దాదాపు 40 శాతం ఉద్యోగాల్లో సంవత్సరానికి రూ.10 లక్షల ఎక్కువ జీతం లభిస్తోంది. తద్వారా ఇది అత్యధిక వేతనం చెల్లిస్తున్న రంగాలలో ఒకటిగా నిలిచింది. వివిధ పరిశ్రమల్లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో దేశంలో నైపుణ్యం కలిగిన విశ్లేషకుల నిపుణుల డిమాండ్ పెరిగిందని ఎనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ స్థాపకుడు, సీఈవో భాస్కర్ గుప్తా చెప్పారు. ఎడ్వాన్సెర్ ఎడ్యూవెంచర్స్ స్థాపకుడు, సీఈవో ఆతాష్ షా మాట్లాడుతూ డేటా సైన్స్, ఎనలిటిక్స్ విభాగం ఉద్యోగాల్లో దాదాపు 100 శాతం వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ బూం ను అందిపుచ్చుకోవాడానికి ఐటీ ఉద్యోగులు డేటా సైన్స్ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. -
10 అతిపెద్ద సర్వీసు కంపెనీల్లో మనవి మూడు
బెంగళూరు : టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు మరోసారి తమ సత్తా చాటాయి. ప్రపంచంలో 10 అతిపెద్ద ఇంజనీరింగ్ సర్వీసుల కంపెనీల్లో భారత్ కు చెందిన ఈ టెక్ దిగ్గజాలు టాప్ లో నిలిచాయి. అమెరికాకు చెందిన హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం బిలియన్ డాలర్లకు పైగా రెవెన్యూలు ఆర్జిస్తూ ఇవి 10 అతిపెద్ద ఇంజనీరింగ్ సర్వీసు కంపెనీల్లో కొనసాగుతున్నట్టు తెలిసింది. 2015 అధ్యయనంలో టీసీఎస్, విప్రోలు బిలియన్ డాలర్లకు కొంచెం తక్కువగా రెవెన్యూలు ఆర్జించాయని హెచ్ఎఫ్ఎస్ అంచనావేసింది. కానీ ఈసారి ఈ మూడు టెక్ దిగ్గజాలు బిలియన్ డాలర్లకు పైగా రెవెన్యూలు ఆర్జిస్తున్నట్టు వెల్లడైంది. ఫ్రెంచ్ సంస్థలు ఆల్ట్రాన్, ఆల్టెన్ లు ఈ ర్యాంకింగ్స్ లో మళ్లీ టాప్ స్థానాలను దక్కించుకున్నాయి. హెచ్‌సీఎల్, టీసీఎస్, విప్రోలు ఐదు, ఏడు, ఎనిమిదవ స్థానాల్లో నిలిచినట్టు హెచ్ఎఫ్ఎస్ అధ్యయనం పేర్కొంది. గత ఆరేళ్ల డేటాతో పోలిస్తే 1బిలియన్ పైగా డాలర్ల క్లబ్ లో ఎనిమిది కంపెనీలు ఉన్నాయి. హెచ్ఎఫ్ఎస్ ప్రకటించిన అధ్యయనంలో హెచ్‌సీఎల్ రెవెన్యూలు 1.23 బిలియన్ డాలర్లు ఉన్నట్టు వెల్లడైంది. గతేడాది ర్యాంకింగ్ లో ఇది నాలుగో స్థానంలో ఉంది. -
ఆకర్షణీయ ధరలో హెచ్‌సీఎల్ టెక్ బైబ్యాక్
ఒక్కో షేరుకు రూ.1,000.. 17% అధికం న్యూఢిల్లీ: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన హెచ్‌సీఎల్ టెక్ షేర్ల బైబ్యాక్ ధరను ప్రకటించింది. మార్కెట్ ధర కంటే 17 శాతం ప్రీమియంతో ఒక్కో షేరును రూ.1,000 ధరకు బైబ్యాక్ చేయనున్నట్టు తెలియజేసింది. ప్రపోర్షనేట్ విధానంలో టెండర్ ఆఫర్ ద్వారా దీన్ని నిర్వహించనున్నట్టు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలిపింది. రూ.3,500 కోట్ల విలువైన షేర్లను కంపెనీ బైబ్యాక్ చేయనుంది. కంపెనీ ఈక్విటీలో ఇది 16.39 శాతానికి సమానం. బైబ్యాక్‌కు వెచ్చిస్తున్న నిధులు కంపెనీ రిజర్వ్ నిధుల్లో 13.62 శాతానికి సమానం. బుధవారం ఎన్ఎస్ఈలో కంపెనీ షేరు రూ.854.85 దగ్గర క్లోజ్ అయింది. బైబ్యాక్ ఆఫర్‌కు ఈ నెల 25ను రికార్డు తేదీగా కంపెనీ ఖరారు చేసింది. టీసీఎస్ రూ.16,000 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించగా, ఇన్ఫోసిస్ కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
హైస్కూల్ నుంచే ఉద్యోగుల నియామకం!
హైస్కూలు చదువుతూనే బుడతలు టెక్నాలజీలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలను తీసుకొస్తూ కంపెనీలను ఆశ్చర్యపరుస్తున్నారు. టెక్నాలజీలో అద్భుతమైన ఆవిష్కరణలు సృష్టిస్తుండటంతో, దేశంలో నాలుగో అతిపెద్ద హెచ్‌సీఎల్ టెక్నాలజీ డైరెక్ట్ గా హైస్కూలు పిల్లల్నే రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించింది. వారిని సంస్థలోకి నియమించుకుని, ట్రైనింగ్ ఇచ్చి, ఐటీ నిపుణులుగా తీర్చిదిద్దుతోంది. ఈ రిక్రూట్ మెంట్లో భాగంగా సైన్సు నేపథ్యమున్న 12వ క్లాస్ వారిని వార్షిక వేతనం రూ.1.8 లక్షలు ఆఫర్ చేస్తూ వీరిని తీసుకుంటోంది. టెక్ట్స్ యాప్స్ ను అభివృద్ధి చేయడానికి వీరి సేవలను వినియోగించుకుంటోంది. ఈ టెక్నాలజీ దిగ్గజం ఇటీవలే ఓ పైలెట్ ప్రొగ్రామ్ ను కూడా మధురైలో ప్రారంభించింది. ఈ ప్రొగ్రామ్ లో భాగంగా 100 మంది 12వ తరగతి విద్యార్థులను నియమించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. వీరికి తమ కోయంబత్తూరులోని క్యాంపస్ లో ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత సంస్థలోకి తీసుకోనున్నట్టు తెలిపింది. అయితే బోర్డు ఎగ్జామ్స్ లో 85 శాతం కంటే పైగా స్కోర్ వచ్చిన వారికే ఈ అవకాశం దక్కుతుందట. అంతేకాక సహకార వెంచర్ ఏర్పాటు చేసి, ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ద్వారా బీఎస్ఈ డిగ్రీ పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఎక్కువ అవకాశాలు చేతిలో లేని వారికి ఈ ట్రైనింగ్ ఎంతో సహకరిస్తుందని ఇండస్ట్రి నిపుణులంటున్నారు. రెగ్యులర్ కోర్సులు చేయలేని విద్యార్థులకు ఇది మంచి అవకాశమని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలిపారు. -
అమరావతికి టెక్ దిగ్గజం
అమరావతి : దేశంలోనే నాలుగో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేస్తోంది. తన అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్లలో ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించాలని ప్లాన్స్ వేస్తోంది. దీని కింద మొత్తం రూ.1000 కోట్ల పెట్టుబడులను హెచ్‌సీఎల్ టెక్ పెట్టనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఈ విషయంపై ఓ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటి అమరావతిలో దీన్ని నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఓ ఐటీ దిగ్గజం పెట్టబోతున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇదే.అయితే ఈ వార్తలపై హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ స్పందించడం లేదు. ఈ డెవలప్ మెంట్ సెంటర్ కోసం అమరావతి పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాలకు పైగా భూములు కావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. -
టీటీడీకి శివనాడర్ రూ.2 కోట్ల విరాళం
తిరుమల : హెచ్‌సీఎల్ కంపెనీ ఛైర్మన్ శివనాడర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు డీడీని తిరుమలలో టీటీడీ ఈవో డి. సాంబశివరావుకు అందజేశారు. బర్డ్ ట్రస్ట్‌కు విరాళం అందించారు. -
వారే ఇక మా ఉద్యోగులంటున్న హెచ్‌సీఎల్
న్యూఢిల్లీ : ట్రంప్ భయానికి ఐటీ దిగ్గజాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి దిగొస్తున్నాయి. క్వార్టర్ ఫలితాల్లో అదరగొట్టిన దేశీయ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్, హెచ్-1బీ వీసాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించేస్తుందట. అమెరికాలో క్యాంపస్, ఎంట్రీ లెవల్లో ఉద్యోగాలు చేపడుతూ అక్కడి స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని పేర్కొంది. వచ్చే త్రైమాసికాల్లో ఎక్కువ ఉద్యోగులను స్థానికులనే తీసుకోనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఈ కంపెనీ అక్కడి స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పీఠమెక్కిన దగ్గర్నుంచి దేశీయ ఐటీ కంపెనీల్లో తీవ్ర భయాందోళనలు పట్టుకున్నాయి. హెచ్-1బీ, ఎల్1 వీసాలపై మార్పులపై ట్రంప్ ఎక్కువగా దృష్టిపెట్టారు.ఇది భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఈ కంపెనీల 60 శాతం రెవెన్యూలు అమెరికా నుంచే వస్తున్నాయి. కంపెనీ గ్రోత్‌కు మద్దతుగా అమెరికాలో ఎంట్రీ లెవల్, క్యాంపస్‌లలో ఉద్యోగ నియామకాలు చేపడతామని హెచ్‌సీఎల్ తెలిపింది. వచ్చే క్వార్టర్లలో ఆ ఫలితాలను చూస్తారని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈవో సి. విజయకుమార్ పేర్కొన్నారు. గత 3-4 ఏళ్లలో కంపెనీ సగటున 1000 కంటే తక్కువగానే వీసాలను అప్లయ్ చేసిందని చెప్పారు. ఈ సంఖ్యను మరింత తగ్గిస్తామని తెలిపారు. అయితే కంపెనీలో స్థానికులు ఎంతమంది ఉన్నారన్నది విజయకుమార్ తెలుపలేదు. 55 శాతానికి పైగా అమెరికాలో నియామకాలు చేపడతామని మాత్రం పేర్కొన్నారు. -
హెచ్‌సీఎల్ చేతికి వోల్వో ఐటీ కంపెనీ
డీల్ విలువ రూ.895 కోట్లు! న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన వోల్వో గ్రూప్ ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. ఈ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.895కోట్లకు అంతా నగదులోనే కొనుగోలు చేసిందని సమాచారం. అంతేకాకుండా వోల్వో కంపెనీకి ఐదేళ్ల పాటు ఐటీ సేవలు అందించేందుకు అవుట్ సోర్సింగ్ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. భారత ఐటీ కంపెనీలు సాధించిన అతి పెద్ద డీల్స్‌లో ఇదొకటి. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం..,వోల్వో కంపెనీకి చెందిన ఐటీ కంపెనీ కొనుగోలుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్‌లోనే రెండు కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఐటీ కంపెనీ కొనుగోలు వల్ల యూరోప్‌లోని నార్డిక్, ఫ్రాన్స్ ప్రాంతాల్లో 40 కొత్త వినియోగదారులు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు లభిస్తారు. -
గతవారం బిజినెస్
నియామకాలు ♦ ఐటీ శాఖ కార్యదర్శి రామ్ సేవక్ శర్మను ట్రాయ్ చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ♦ ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్‌గా గౌర గ్రూప్ ఎండీ గౌర శ్రీనివాస్ నియమితులయ్యారు. మార్కెట్ విస్తరణ దిశగా ఉబెర్ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ భారత్‌లో కార్యకలాపాలు భారీ ఎత్తున విస్తరించడానికి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం వచ్చే 6-9 నెలల వ్యవధిలో భారత్‌లో సుమారు రూ.6,400 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. భారత్‌లో జనరల్ మోటార్స్ పెట్టుబడులు అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ కంపెనీ భారత్‌లో దాదాపు రూ.6,400 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. 20 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, తగినంత మార్కెట్ వాటా సాధించలేకపోయిన ఈ కంపెనీ తాజాగా ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయనున్నది. టర్న్అరౌండ్ ప్రణాళికలో భాగంగా ఐదేళ్లలో దేశీయంగా తయారయ్యే పది మోడళ్లను అందిస్తామని జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బర్రా చెప్పారు. 100 విమానాల కొనుగోలు దిశగా స్పైస్‌జెట్ దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికల్లో భాగంగా విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా సుమారు 100 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని యోచి స్తోంది. ఇందుకోసం విమానాల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్ మొదలైన వాటితో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ సీఎఫ్‌వో కిరణ్ కోటేశ్వర్ వెల్లడించారు. బొంబార్డియర్, ఏటీఆర్, ఎంబ్రేయర్ లాంటి చిన్న విమానాల కోసం చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. హెచ్‌సీఎల్‌లో వాటా విక్రయ దిశగా కేంద్రం డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)లో 15 శాతం వాటాను విక్రయించనుంది. హెచ్‌సీఎల్‌లో కేంద్రం వాటా 89.95 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ద్వారా రూ.69,500 కోట్ల నిధుల సమీకరణను లక్ష్యంగా నిర్దేశించుకుంది. 7 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం కేంద్రప్రభుత్వం రూ.981 కోట్ల విలువైన ఏడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. వీటిలో హాత్వే కేబుల్ అండ్ డేటా కామ్, హైదరాబాద్‌కు చెందిన సీలన్ ల్యాబొరేటరీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, లాలియా ట్రేడింగ్ తదితర కంపెనీల ప్రతిపాదనలు ఉన్నాయి. 17 మంది పన్ను బకాయిలు.. 2 లక్షల కోట్లు దేశంలో 17 మంది వ్యక్తులు రూ.2.14 లక్ష ల కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీరిలో ప్రతి ఒక్కరూ రూ.1,000 కోట్లపైన పన్ను బకాయి పడినవారే. దేశంలోని 35 కంపెనీలు రూ.1,000 కోట్ల పైబడి కట్టాల్సిన మొత్తం పన్ను బకాయిలు రూ.90,568 కోట్ల కన్నా సంబంధిత 17 మంది వ్యక్తులు చెల్లించాల్సింది దాదాపు రెట్టింపు. ఐసీఐసీఐ లాభం రూ.2,976 కోట్లు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2015-16,క్యూ1)లో స్టాండెలోన్ ప్రాతిపదికన(బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే) రూ.2,976 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,655 కోట్లతో పోలిస్తే లాభం 12 శాతం ఎగసింది. టెక్ మహీంద్రా లాభం రూ.676 కోట్లు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రై మాసికంలో రూ.676 కోట్ల నికర లాభం ఆర్జించింది.అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ. 631కోట్లు)తో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా పేర్కొంది. రూపాయి క్షీణతతో లాభాలు పెరిగాయని వివరించింది. ఐటీసీ నికర లాభం రూ.2,265 కోట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ... ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.2,265 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.2,186 కోట్లు)తో పోల్చితే 4% వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. సిగరెట్ల అమ్మకాలపై ఒత్తిడి, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండ్ అంతంత మాత్రంగా ఉండడం వల్ల నికర లాభంలో స్వల్ప వృద్ధి నమోదయ్యింది. మారుతీ సుజుకీ లాభం 56 శాతం అప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం (స్టాండెలోన్ ప్రాతిపదికన) ఏకంగా 56 శాతం పెరిగి రూ. 1,193 కోట్లుగా నమోదైంది. వాహన విక్రయాలు పెరగడం, విదేశీ మారక విలువలు సానుకూలంగా ఉండటంతో పాటు వ్యయ నియంత్రణ చర్యలు సత్ఫలితాలిస్తుంటడం దీనికి దోహదపడినట్లు సంస్థ తెలిపింది. సహారా మ్యూచువల్ ఫండ్ లెసైన్స్ రద్దు సహారా గ్రూప్‌కు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మంగళవారం మరో షాక్ ఇచ్చింది. ఆ సంస్థ మ్యూచువల్ ఫండ్ లెసైన్సును రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. ఈ వ్యాపారం చేయడానికి సహారాకు తగినంత పటిష్ఠత లేదని పేర్కొంది. మరో ఫండ్ హౌస్‌కు సహారా మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలను బదిలీ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చింది. విండోస్ 10 వచ్చేసింది.. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బుధవారం తమ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 10’ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఢిల్లీ సహా ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో దీన్ని ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్.. సుమారు 190 దేశాల్లో విండోస్ 10ను బుధవారం నుంచే అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లోకి విడుదలైన రెండు రోజుల్లోనే విండోస్ 10 ఓఎస్‌పై పనిచేస్తున్న కంప్యూటర్ల సంఖ్య 1.4 కోట్లకు చేరింది. అమెరికా జీడీపీ వృద్ధి 2.3 శాతం అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఈ ఏడాది 2వ క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో సానుకూల రీతిలో 2.3 శాతంగా నమోదయ్యింది. వినియోగ వ్యయం పెరగడం(అమెరికా ఆర్థిక క్రియాశీలతలో ఈ విభాగం వాటా దాదాపు 70 శాతం), ఎగుమతుల్లో వృద్ధి వంటి అంశాలు దీనికి కారణమని వాణిజ్య శాఖ గురువారం పేర్కొంది. డీల్స్.. ఇజ్రాయెల్ ఫార్మా దిగ్గజం తెవా.. అంతర్జాతీయ ఔషధ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. ఐర్లాండ్ సంస్థ అలెర్గాన్ జనరిక్స్‌ను ఏకంగా 40.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో 33.75 బిలియన్ డాలర్లు నగదు రూపంలో, మిగతాది (6.75 బిలియన్ డాలర్లు) తెవా షేర్ల రూపంలో అలెర్గాన్ జనరిక్స్ మాతృ సంస్థ అలెర్గాన్ పీఎల్‌సీకి లభిస్తాయి. జ్యూయలరీ సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన పసిడి రిఫైనరీ సంస్థ వాల్కాంబీని కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద ం విలువ సుమారు రూ. 2,560 కోట్లు. దివాలా తీసిన అమెరికన్ సంస్థ ఎరిక్ బ్యుయెల్ రేసింగ్ (ఈబీఆర్)కి సంబంధించిన కొన్ని వ్యాపారాలను దేశీ ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్ 2.8 మిలియన్ డాలర్లకు దక్కించుకోనుంది. దేశీ బ్రోకరేజి సంస్థ షేర్‌ఖాన్‌ను ఫ్రెంచ్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్పీ పారిబా కొనుగోలు చేయనుంది. డీల్ విలువ సుమారు రూ. 2,000 కోట్లు ఉండొచ్చని అంచనా. -
బ్యాంకింగ్ సేవలకు హెచ్‌సీఎల్, సీఎస్సీ జట్టు
న్యూఢిల్లీ : బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, సేవలు అందించే దిశగా ఐటీ దిగ్గజాలు సీఎస్సీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కలిసి జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. అయితే, ఇందులో ఎంత పెట్టుబడి పెడుతున్నది, ఏ సంస్థకు ఎంత వాటాలు ఉన్నది వెల్లడి కాలేదు. డేటా అనలిటిక్స్ సర్వీసులు మొదలైన వాటికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ క్లయింట్లకు అవసరమైన అత్యాధునిక సేవలు అందించడంపై ఈ జేవీ దృష్టి పెడుతుందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ అనంత్ గుప్తా తెలిపారు. -
హెచ్‌సీఎల్ మూసివేతకు నోటీసులు
నేడు ఢిల్లీలో కార్మికుల రిలే నిరాహార దీక్ష హైదరాబాద్: ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) మూసివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు శనివారం రాత్రి డిపార్టుమెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ నుంచి హెచ్‌సీఎల్ యూనియన్ అధ్యక్షుడికి నోటీసులు వచ్చాయి. దీంతో కార్మికుల్లో కలకలం మొదలైంది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు గుండెపోటుతో ఆసుపత్రిపాలయ్యారని తెలిసింది. కేంద్రంచర్యతో 600 మంది కార్మిక కుటుంబాలు వీధినపడ్డాయని హెచ్‌సీఎల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి.సుబ్బారావు. జి.దామోదర్‌రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా జీతాలు లేకున్నా కంపెనీని కాపాడుకునేందుకు సర్దుకుపోయామన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు పునాదులు వేసిన హెచ్‌సీఎల్ కంపెనీని కాపాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుబ్బారావు కోరారు. హెచ్‌సీఎల్ మూసివేత నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం ఢిల్లీలో ఉద్యోగ సంఘాలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేస్తున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. కేంద్రం మొండివైఖరిని ప్రదర్శిస్తే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 10 నుంచి 20 ఏళ్ల సర్వీస్ గల ఉద్యోగులు 60 శాతానికిపైగా ఉన్నారని పేర్కొంది. హెచ్‌సీఎల్ మూసివేసి ప్రైవేటుపరం చేయడాన్ని అడ్డుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివారం కేంద్రమంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. -
అత్యంత విలువైన భారత్ బ్రాండ్.. టాటా
న్యూఢిల్లీ: భారత అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ నిలిచింది. 2,100 కోట్ల డాలర్ల విలువతో తన అగ్రస్థానాన్ని టాటా గ్రూప్ ఈ ఏడాది కూడా నిలుపుకుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తాజా నివేదిక వెల్లడించింది. భారత టాప్ 100 బ్రాండ్ల విలువ మొత్తం 9,260 కోట్ల డాలర్లని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం వెల్లడించిన మరికొన్ని వివరాలు... ఏడాదికాలంలో టాటా బ్రాండ్ విలువ 300 కోట్ల డాలర్లు పెరిగింది. టాటా గ్రూప్ అంతర్జాతీయ వివిధీకరణ వ్యూహం, గ్రూప్ ప్రధాన ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. టాప్ 50 బ్రాండ్ల విలువ గత ఏడాది విలువతో పోల్చితే 10 శాతం పెరిగింది. టాటా, గోద్రేజ్, హెచ్‌సీఎల్, ఎల్ అండ్ టీ ల బ్రాండ్ విలువ చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బ్రాండ్ విలువ 51 శాతం పెరిగింది. బలహీనమైన రుణ నియంత్రణ నిబంధనలు, నిర్వహణ తీరు సరిగ్గా లేనందున ప్రభుత్వ బ్యాంక్‌ల బ్రాండ్ విలువ తగ్గింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ విలువ 190 కోట్ల డాలర్లు తగ్గింది. ఆదాయ అంచనాలు బాగా లేకపోవడం, మొండి బకాయిలు బ్రాండ్ విలువ తగ్గడంలో ప్రభావం చూపాయి. భారత అగ్రశ్రేణి 100 బ్రాండ్లకు సంబంధించి బ్రాండ్ విలువ, వ్యాపార విలువకు ఉన్న నిష్పత్తి సగటున 12%గా ఉంది. కొన్ని భారీ ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ నిష్పత్తి 3 శాతంగా ఉంది. -
మీసేవ.. మా ఇష్టం!.
కేంద్రాల్లో అనర్హులు - కేటాయింపులో నిబంధనలు బేఖాతరు - బినామీల నిర్వహణతో అస్తవ్యస్తం - పల్లెల పేరిట మంజూరు.. పట్టణాల్లో ఏర్పాటు - 60 కేంద్రాల్లో ఒక్క కంప్యూటరే దిక్కు - సేవల్లో జాప్యంతో ప్రజల బేజారు కర్నూలు(కలెక్టరేట్): మీసేవ కేంద్రాల్లో బినామీలు పాగా వేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఉద్దేశించిన ఈ కేంద్రాల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 287 మీసేవ కేంద్రాలను నిర్వహిస్తుండగా అధిక శాతం ఎలాంటి అర్హత లేని వ్యక్తుల చేతుల్లో ఉండటం గమనార్హం. పలుకుబడి.. పైరవీలతో దక్కించుకున్న కేంద్రాలను చాలా మంది లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం డిగ్రీ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన నిరుద్యోగులకే వీటిని కేటాయించాల్సి ఉంది. అయితే 10వ తరగతి చదివి కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం లేని వ్యక్తులకు సైతం మీసేవ కేంద్రాలను కట్టబెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హెచ్‌సీఎల్‌కు సంబంధించి అర్బన్‌లో 12, ఇతర ప్రాంతాల్లో 54 కేంద్రాలు ఉండగా.. 10 సెంటర్లను బినామీలకు కట్టబెట్టారు. సీఎంఎస్ నిర్వహణలోని మీసేవ కేంద్రాలు 178 ఉండగా.. 50 వరకు ఇతరుల చేతుల్లో ఉన్నట్లు సమాచారం. ఏపీ ఆన్‌లైన్‌కు సంబంధించిన కేంద్రాలు 55 ఉండగా.. సగం వరకు బినామీలే నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మీసేవ కేంద్రాలు ఏ గ్రామానికి మంజూరైతే అక్కడే ఏర్పాటు చేయాలనే నిబంధనను కాలరాశారు. గ్రామాల పేరుతో అనుమతి పొంది పట్టణాల్లో నిర్వహిస్తుండటంతో గ్రామీణులకు నిరాశే ఎదురవుతోంది. ఆదోని మండలంలోని సాదాపురం, బసాపురం గ్రామాలకు మీసేవ కేంద్రాలు మంజూరు కాగా.. వీటిని ఆదోని పట్టణంలో ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇలాంటి అక్రమాలు అనేకం చోటు చేసుకున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇక మీసేవ కేంద్రాల్లో తగినంత మంది ఆపరేటర్లను నియమించకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. హెచ్‌సీఎల్‌కు చెందిన అర్బన్ కేంద్రాల్లో పని ఒత్తిడి అధికంగా ఉన్నా అందుకు తగినట్లుగా ఆపరేటర్లను నియమించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ఆన్లైన్, సీఎంఎస్ సెంటర్లలోనూ తగినన్ని కంప్యూటర్లు లేకపోవడంతో సేవల్లో జాప్యం జరుగుతోంది. ఒకే సిస్టంతో పని చేస్తున్న మీసేవ కేంద్రాలు జిల్లాలో 60 వరకు ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
ఎన్నికలపైనే మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం మార్కెట్లలో పరిమితస్థాయి కదలికలే నమోదుకావచ్చునని స్టాక్ నిపుణులు అంచనా వేశారు. సోమవారం(7) నుంచి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలుకానున్న నేపథ్యంలో భారీ పొజిషన్లు తీసుకునేందుకు వెనకాడే అవకాశమున్నదని తెలిపారు. గత కొద్ది రోజులుగా రికార్డులు సృష్టిస్తూ సాగిన ర్యాలీ చివర్లో కొంతమేర చల్లబడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. వీటికితోడు కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్న బీజేపీ పార్టీ 7న మేనిఫెస్టోను విడుదల చేయనుంది. పోలింగ్ సరళితోపాటు, బీజేపీ మేనిఫెస్టోపై ట్రేడర్ల దృష్టి ఉంటుందని నిపుణులు తెలిపారు. అస్సాం, త్రిపురల్లో గల ఆరు లోక్‌సభ స్థానాల కోసం పోలింగ్ మొదలుకానున్న రోజునే వెలువడనున్న బీజేపీ మేనిఫెస్టో ఓటర్లను ఆకట్టుకునే బాట లో సాగవచ్చునని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. క్యాడ్ ప్రభావం: ఈ గురువారం(10న) వాణిజ్య(ఎగుమతి, దిగుమతుల) గణాంకాలు వెలువడనుండగా, 11న పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వివరాలు వెల్లడికానున్నాయి. కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) కట్టడితోపాటు, ఐఐపీ పుంజుకుంటే సెంటిమెంట్‌కు బలమొస్తుందని నిపుణులు తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల కారణంగా గత 2 వారాల్లో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటం తెలిసిందే. దేశీ కరెన్సీ సైతం 8 నెలల్లో తొలిసారి 60 దిగువకు చేరింది. కాగా, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏదొక రాజకీయ పార్టీకి తగిన మెజారిటీ లభిస్తుందని, ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలను పెంచుతుందని గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. వచ్చే వారం కీలకం: ఈ వారం వాణిజ్య, పారిశ్రామికోత్పత్తి గణాంకాలే వెలువడనుండగా, వచ్చే వారం రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. వీటితోపాటు ట్రెండ్‌పై ప్రభావం చూపగల ఆర్థిక ఫలితాల సీజన్ మొదలుకానుంది. ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ మార్చి క్వార్టర్(క్యూ4) ఫలితాలను విడుదల చేయనున్నాయి. -
ఐటీలో నీలమ్ విమన్ బ్రాండ్!
విజయం హెచ్‌సీఎల్ ఆఫీస్ వేళల్లో మినహాయిస్తే.. ఓ సాధారణ గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించే నీలమ్.. మహిళలకు స్వేచ్ఛనిస్తే ఏదైనా సాధిస్తారంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో అమ్మాయిలు లేని కంపెనీలు కనిపిస్తాయా..? అయినా ప్రస్తుతం దేశంలో సాఫ్ట్వేర్ రంగంలోని అమ్మాయిల సంఖ్య 20 శాతమే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. పాతికేళ్ల క్రితం సంగతి ఆలోచించండి! అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ అప్పట్లో ఐటీ గురించి తెలిసింది అంతంతమాత్రం! కానీ ఆ రోజుల్లోనే ఐటీలో అడుగుపెట్టిందో అమ్మాయి. అడుగు పెట్టడమే కాదు.. ఆ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి.. హెచ్‌సీఎల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల్ని నడిపించింది. ఇప్పుడు హెచ్‌పీ సంస్థకు ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. భారత ఐటీ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ముఖ్య పాత్ర పోషించిన ఆ మహిళా శక్తి నీలమ్ ధావన్! మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చే ఆమె గాథ తెలుసుకుందాం రండి! ఓ సంస్థలో కీలక బాధ్యత పోషిస్తున్న వ్యక్తి.. రాజీనామా చేసి మరో కంపెనీకి వెళ్తుంటే పాత కంపెనీకి చెందిన యాజమాన్యం ఆ వ్యక్తి గురించి సానుకూలంగా మాట్లాడటం అరుదు! కానీ ఐదేళ్ల క్రితం మెక్రోసాఫ్ట్ ఎండీ పదవికి రాజీనామా చేసినపుడు ఆ సంస్థ ఓ ప్రకటనలో.. ‘‘నీలమ్ సేవల్ని కోల్పోతున్నందుకు చాలా బాధపడుతున్నాం. ఒక గొప్ప నాయకురాలు మాకు దూరమవుతోంది. మూడేళ్ల పదవీ కాలంలో ఆమె భారత్‌లో మైక్రోసాఫ్ట్ మూలాల్ని పటిష్టం చేశారు. ఆమె హెచ్‌పీ సంస్థను కూడా ఇలాగే నడిపించాలి’’ అని పేర్కొంది. ఈ ప్రకటనను బట్టే నీలమ్ ఎంతటి సమర్థురాలో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో ఐటీ రంగం గురించి అందరికీ తెలిసింది... ఆ రంగం అమోఘమైన వృద్ధి సాధించింది గత ఒకటిన్నర దశాబ్దంలోనే. ఐతే ఐటీ రంగంలో నీలమ్ అనుభవం పాతికేళ్లు. ఈ కాలంలో ఆమె ఎన్నో విజయాలు సాధించారు. ఐటీ రంగంలో ఎన్నో మార్పులకు సాక్షిగా నిలిచారు. ప్రధాన కంపెనీల ఎదుగుదలలో ఆమె పాత్ర కీలకం. ఢిల్లీకి చెందిన ఓ ఎగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నీలమ్.. సెయింట్స్టీఫెన్స్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీ యూనివర్శిటీలో ఎంబీఏ చేశారు. ఐటీ రంగం అంటే తెలియని రోజుల్లో.. అందులోనూ అమ్మాయిలు అసలే అటువైపు చూడని రోజుల్లో నీలమ్ హెచ్‌సీఎల్‌లో ఓ ఉద్యోగిగా చేరారు. ఆ సంస్థలో నీలమ్ ప్రస్థానం పద్నాలుగేళ్లు సాగింది. మార్కెటింగ్ విభాగంలో ఉన్నత స్థానానికి ఎదిగారు. దేశంలో సామాన్యులకు అందనంత స్థాయిలో ఉన్న పీసీల ధరలు దిగి రావడంలో నీలమ్ది కీలకపాత్ర. ధరలు తగ్గించడం ద్వారా అమ్మకాలు పెంచి లాభాల్లో కోత పడకుండా చూశారామె. హెచ్‌సీఎల్ పీసీలు ఈఎంఐల్లో అమ్మడం కూడా ఆమె నిర్ణయమే. హెచ్‌సీఎల్ తర్వాత నీలమ్ ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ లీవర్ సంస్థల్లో పని చేశారు. ఐతే ఈ సంస్థలు మార్కెటింగ్ విభాగాల్లో మహిళలకు కీలక బాధ్యతలు ఇవ్వడానికి నిరాకరించడంతో నీలమ్ ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. తర్వాత ఐబీఎం, కాంపాక్ సంస్థల్లో కీలక బాధ్యతల్లో పనిచేశారు. ఆపై మైక్రోసాఫ్ట్ వైస్‌ప్రెసిడెంట్‌గా చేరారు. 2005లో ఆమె మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ అయ్యారు. మూడేళ్ల కాలంలో ఆమె సంస్థను ఎంతో వృద్ధికి తీసుకెళ్లారు. 2008లో ఆమె హెవ్లెట్-ప్యాకర్డ్ (హెచ్‌పీ) సంస్థకు ఎండీ అయ్యారు. అప్పటి నుంచి ఆ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఐటీ రంగంలో ఓ సాధారణ ఉద్యోగిగా చేరి, దిగ్గజ సంస్థల్ని నడిపించే స్థాయికి చేరిన నీలమ్.. ఈ ఘనతంతా తన కుటుంబానిదే అంటారు. తన తల్లిదండ్రులు అమ్మాయినన్న వివక్ష లేకుండా, తన అన్నతో సమానంగా చూడటం వల్లే తానీ స్థాయిలో ఉన్నానని.. తర్వాత తన భర్త, అత్త కూడా తనకు అండగా నిలిచారని చెబుతారామె. ఆఫీస్ వేళల్లో మినహాయిస్తే.. ఓ సాధారణ గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించే నీలమ్.. మహిళలకు స్వేచ్ఛనిస్తే ఏదైనా సాధిస్తారంటారు. ‘‘జీవితంలో మనకు మనం పరిమితులు పెట్టుకోకూడదు. ఏదో ఇబ్బంది ఎదురైందని అక్కడితో ప్రయత్నం మానకూడదు. మహిళలు ముందు వారిని వారు నమ్మాలి. కుటుంబ ప్రోత్సాహం కూడా తోడైతే మన ఎదుగుదలకు ఆకాశమే హద్దు’’ అంటారామె. - ప్రకాష్ చిమ్మల -
విప్రో బాటలోనే HCL టెక్నాలజీస్