బిగ్‌ డేటా, ఎనలిస్టులకు బంపర్‌ ఆఫర్‌ | Big Data Jobs In High Demand; Amazon, HCL, IBM Among Top Recruiters: Study | Sakshi
Sakshi News home page

బిగ్‌ డేటా, ఎనలిస్టులకు బంపర్‌ ఆఫర్‌

Published Wed, Jul 5 2017 11:58 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

బిగ్‌ డేటా, ఎనలిస్టులకు బంపర్‌ ఆఫర్‌

బిగ్‌ డేటా, ఎనలిస్టులకు బంపర్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ:  ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన  నేపథ్యంలో  భారీగా  ఉద్యోగాలు రానున్నాయనే అంచనాలు  ఊరట నిస్తున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేల ఉద్యోగాలు  రానున్నాయని ఆన్‌లైన్‌ సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ ఏడాదిలో అత్యధిక సంఖ్యలో  అమెజాన్, సిటీ, హెచ్‌సీఎల్, గోల్డ్‌ మాన్‌ సాచ్స్ , ఐబిఎం  లాంటి ప్రముఖ సంస్థల్లో  ఈ ఎనలిటిక్స్‌ ఉద్యోగాలకు  మంచి  ఓపెనింగ్స్‌ ఉండనున్నాయని పేర్కొంది. ఎనలటిక్స్‌, బిగ్‌ డేటా  ,డేటా సైన్స్‌ ప్లాట్‌ఫాం,  ఎనలటిక్స్‌ అండ్‌  మ్యాగజైన్‌ , ఆన్‌లైన్‌  ఎనలిటిక్స్‌ శిక్షణా సంస్థ ఎడ్వాన్సెర్‌ ఎడ్యూవెంచర్స్ సంయుక్తంగా ది ఎనలటిక్స్‌ అండ్‌  డేటా సైన్స్‌  ఇండియా జాబ్స్‌ 2017  పేరుతో ఈ  అధ్యయనం నిర్వహించింది.

భారతదేశంలో ఎనలిస్టులు,  డేటా సైన్స్‌, బిగ్‌ డేటాలో  నియామకాలు పెరుగుతాయని ఈ అధ్యయనం తేల్చింది. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు  సంఖ్యలో  డేటా ఎనలిస్టులు ఉద్యోగాలు లభించనున్నాయిని అనలాటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇండియా జాబ్స్ స్టడీ 2017 ప్రకారం  తేలింది.  దాదాపు 50వేల  ఎనలిస్టు జాబ్స్‌ అందుబాటులో ఉంటాయని తెలిపింది.  
 ఐటీలో తగ్గిన నియామకాలకారణంగా కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు  ఆందోళనలో ఉన్నారు. తక్కువ ఐటి నియామకం ఈ 42 శాతం మంది బీఈ / బీటెక్  గ్రాడ్యుయేట్లకు కేటాయిస్తుండగా,  మరో 40 శాతం ఎంబీఏ, ఎంటెక్‌ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు కోసం చూస్తున్నారట.  దీంతో ఈ ఉద్యోగ నియామకాల్లో  టైర్ -బి నగరాల్లో  2016 లో 5 శాతం నుంచి ఈ ఏడాది 7 శాతం వరకు పెరిగిందిని ఈ సర్వే తెలిపింది.

అమెరికా తరువాత  ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణ మరియు డేటా సైన్స్ ఉద్యోగాల్లో అవకాశాలలో 12 శాతం వాటాతో ఇండియా  ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద విశ్లేషణ కేంద్రంగా ఉంది. వీటిల్లో అమెజాన్‌,  సీటీ, ఐబీఎం ,  హెచ్‌సీఎల్‌ లాంటివి  ఎక్కువ సంఖ్యలో  ఎనలిక్స్‌ ఉద్యోగాలను కల్పించాయి.  నగరాల పరంగా, బెంగళూరు అన్ని ఎనలిటిక్స్ ఉద్యోగాల్లో దాదాపు 25 శాతం ఉద్యోగాలతో టాప్‌ లోనూ, ఢిల్లీలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇక  ఫెషర్స్  విషయానికి వస్తే , చెన్నై మొత్తం ఓపెనింగ్స్‌లో టాప్‌ లోఉంది.   2-7 సంవత్సరాల అనుభవం ఉన్నవారిలో  దాదాపు 50 శాతం ఉద్యోగాలు అన్ని నగరాల్లోనూ ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది.


అంతేకాదు ఈ ఎనలిటిక్స్‌, డేటా సైన్స్‌ ఉద్యోగాల్లో  సంవత్సరానికి సగటు జీతం  రూ. 10.5 లక్షలు. దాదాపు 40 శాతం ఉద్యోగాల్లో సంవత్సరానికి రూ.10 లక్షల ఎక్కువ జీతం లభిస్తోంది. తద్వారా ఇది అత్యధిక  వేతనం చెల్లిస్తున్న రంగాలలో ఒకటిగా నిలిచింది.

వివిధ పరిశ్రమల్లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో  దేశంలో నైపుణ్యం కలిగిన విశ్లేషకుల నిపుణుల డిమాండ్ పెరిగిందని ఎనలిటిక్స్‌ ఇండియా మ్యాగజైన్‌   స్థాపకుడు, సీఈవో  భాస్కర్ గుప్తా చెప్పారు.  ఎడ్వాన్సెర్‌ ఎడ్యూవెంచర్స్  స్థాపకుడు, సీఈవో ఆతాష్ షా మాట్లాడుతూ డేటా  సైన్స్‌, ఎనలిటిక్స్‌ విభాగం ఉద్యోగాల్లో దాదాపు 100 శాతం  వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ బూం ను అందిపుచ్చుకోవాడానికి ఐటీ  ఉద్యోగులు డేటా సైన్స్‌ నైపుణ్యాన్ని పెంచుకోవాలని  సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement