High Demand
-
ఈ ఏఐ స్కిల్‌కి క్రేజీ డిమాండ్.. రూ.లక్షల్లో జీతాలు!
కృత్రిమ మేధకు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అన్నింటా ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై అనేక భయాలు, సందేహాలు, ఆందోళనలు నెలకొన్నాయి. ఏఐ మన భవిష్యత్తును ఎలా మార్చబోతోంది.. దానికి సిద్ధంగా ఉన్నామా.. వెనుకబడిపోతామా అన్న భయంతో అవసరమైన ఏఐ నైపుణ్యం కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో గ్లోబల్ టెక్నాలజీ ఇన్నోవేటర్ ఐబీఎం ఎగ్జిక్యూటివ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం, దాదాపు 96 శాతం మంది కంపెనీల అధినేతలు తమ సంస్థల నిర్వహణలోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. 2024 మార్చిలో స్లాక్ వర్క్‌ఫోర్స్ ల్యాబ్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. మూడింట రెండు వంతుల మంది కార్యాలయ ఉద్యోగులు తాము ఎప్పుడూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేయలేదని అంగీకరిస్తున్నారు.ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవడం మానేసే వారు కెరీర్ పురోగతిని కోల్పోతారని ఐబీఎం గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడింట్ లిడియా లోగాన్ హెచ్చరిస్తున్నారు. అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యం ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌ను నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ స్కిల్ నేర్చుకోవడానికి బ్యాచిలర్ డిగ్రీ కూడా అక్కర్లేదని ఆమె చెబుతున్నారు.అంత డిమాండ్ ఎందుకంటే..ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన ఏఐ సాధనాలలో ఒకటైన చాట్‌జీపీటీని మీరు ఉపయోగించినట్లయితే, మీ ప్రాంప్ట్ లు ఎంత కచ్చితమైనవి అయితే, ప్రతిస్పందనలు అంత మెరుగ్గా ఉంటాయని మీరు గమనించే ఉంటారు. అందుకే బోల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కు ఇంత డిమాండ్ ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ తన ఎంప్లాయర్ లేదా క్లయింట్లకు విలువైన సమాచారాన్ని పొందడానికి చాట్‌జీపీటీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) వంటి ఏఐ చాట్బాట్లకు సరైన ప్రశ్నలు లేదా సూచనలను రూపొందిస్తారు. ఈ జాబ్ కోసం బ్యాచిలర్ డిగ్రీ కూడా అవసరం లేకపోవచ్చు. ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లు వంటి సరికొత్త ఉద్యోగాలకు సాంప్రదాయ డిగ్రీల కంటే టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్‌కే ప్రాధాన్యత ఉంటుందని లోగాన్ వివరించారు.ప్రాంప్ట్ ఇంజనీర్‌కు భారత్‌లో జీతాలు ఇలా..లింక్డ్ఇన్, జాబ్-సెర్చ్ సైట్ ఇన్డీడ్లోని లిస్టింగ్స్ ప్రకారం కంపెనీలు ప్రాంప్ట్ ఇంజనీర్‌కు సంవత్సరానికి రూ .93 లక్షల నుంచి రూ .16 లక్షల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. భారత్‌లో 2-5 ఏళ్ల అనుభవం ఉన్న ఇంజినీర్ ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు సంపాదించవచ్చు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ ఇంజనీర్లకు వార్షిక వేతనం రూ .12 లక్షలు దాటి రూ .20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. -
ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు ఎంతంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 38 శాతం అధికంగా రూ.4.5 లక్షల కోట్ల మేర ఉంటాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ అంచనా వేసింది. లగ్జరీ ఇళ్లకు అధిక డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. 2022లో ఏడు పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల విలువ రూ.3.26 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది తొమ్మిది నెలల్లో (సెపె్టంబర్ వరకు) అమ్మకాలు క్రితం ఏడాది మొత్తం అమ్మకాలతో పోల్చి చూసినా, 7 శాతం వృద్ధితో రూ.3,48,776 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఈ ఏడాది తొమ్మిది నెలల అమ్మకాలు గతేడాది మొత్తం అమ్మకాలను మించి ఉండడం, ఖరీదైన ఇళ్లకు డిమాండ్ పెరగడాన్ని సూచిస్తోంది. ఇళ్ల ధరలు సగటున 8–18 శాతం మధ్య ప్రముఖ పట్టణాల్లో ఈ ఏడాది పెరిగాయి. కనుక గతేడాది అమ్మకాలతో కచి్చతంగా పోల్చి చూడలేం’’అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో ఏడు పట్టణాల్లో రూ.1,12,976 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడుపోగా, తర్వాతి మూడు నెలల్లో (జూన్ త్రైమాసికం) ఒక శాతం అధికంగా, సెపె్టంబర్ త్రైమాసికంలో 8 శాతం అధికంగా విక్రయాలు నమోదైనట్టు చెప్పారు. పండుగల్లో జోరుగా విక్రయాలు పండుగల సీజన్లో ఇళ్ల అమ్మకాలు ప్రముఖ పట్టణాల్లో బలంగా ఉన్నట్టు అనుజ్ పురి వెల్లడించారు. కనుక మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది చివరికి రూ.4.5 లక్షల కోట్లకు చేరతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో ఏడు పట్టణాల్లో 3.49 లక్షల ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్ చివరి వరకు చూసుకుంటే సుమారుగా 4.5 లక్షల ఇళ్లు అమ్మడవుతాయన్నది అంచనాగా ఉంది. 2022 మొత్తం మీద అమ్ముడైన యూనిట్లు 3.65 లక్షలుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 43 శాతం అధికం ► ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు, 43 శాతం పెరిగి రూ.35,802 కోట్లుగా ఉంది. ► పుణెలో 96 శాతం అధికంగా రూ.39,945 కోట్ల విక్రయాలు కొనసాగాయి. ► చెన్నైలో 45 శాతం వృద్ధితో రూ.11,374 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ► బెంగళూరు మార్కెట్లో అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు 42 శాతం పెరిగి రూ.38,517 కోట్లుగా ఉంది. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 41 శాతం పెరిగి రూ.1,63,924 కోట్ల విలువైన అమ్మకాలు నమోదయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 29 శాతం వృద్ధితో 50,188 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ► కోల్‌కతాలో అమ్మకాల విలువ 19 శాతం పెరిగి రూ.9,025 కోట్లుగా ఉంది. -
ఖరీదైన ఇళ్లకు గిరాకీ
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఖరీదైన ఇళ్లు జోరుగా అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో విలాసవంతమైన ఇళ్లకు అధిక డిమాండ్ నెలకొంది. రూ.4 కోట్లకు పైగా విలువ చేసే ఇళ్ల అమ్మకాలు సెపె్టంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 97 శాతం పెరిగి 9,200 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 4,700 యూనిట్లుగానే ఉన్నాయి. టాప్–7 పట్టణాల్లో సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాల వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా ‘ఇండియా మార్కెట్ మానిటర్ క్యూ3, 2023’ నివేదిక రూపంలో విడుదల చేసింది. ప్రధానంగా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్ విలావంత ఇళ్ల అమ్మకాల్లో టాప్–3గా ఉన్నాయి. సెపె్టంబర్ క్వార్టర్లో మొత్తం విక్రయాల్లో 90 శాతం ఈ మూడు పట్టణాల్లోనే నమోదయ్యాయి. 9,200 యూనిట్ల అమ్మకాల్లో 37 శాతం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. ముంబై వాటా 35 శాతం, హైదరాబాద్ వాటా 18 శాతం, పుణె వాటా 4 శాతం చొప్పున ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం జూలైతో ముగిసిన త్రైమాసికంలోనూ లగ్జరీ ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 19 శాతం పెరిగి 2,400 యూనిట్లుగా ఉన్నాయి. జూలై త్రైమాసికంలోనూ లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్ టాప్–3 మార్కెట్లుగా ఉండడం, కొనుగోలుదారులకు ఇవి ప్రాధాన్య మార్కెట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. పండుగల జోష్ ఈ ఏడాది పండుగల సీజన్లో ఇళ్ల అమ్మకాలు 2021 నుంచి చూస్తే అత్యధికంగా ఉంటాయని సీబీఆర్ఈ అంచనా వేసింది. 2021 పండుగ సీజన్లో 1,14,500 యూనిట్లు అమ్ముడుపోగా, 2022 పండుగల సీజన్లో 1,47,300 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఏడాది పండుగల సీజన్లో ఇళ్ల అమ్మకాలు 1,50,000 యూనిట్లు మైలురాయిని దాటిపోవచ్చని సీబీఆర్ఈ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి నుంచి సెపె్టంబర్ మధ్య ఏడు పట్టణాల్లో అన్ని రకాల ధరల విభాగాల్లో 2,30,000 ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 2,20,000 యూనిట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో నూతన ప్రాజెక్టుల ప్రారంభం విషయంలో ముంబై, పుణె, హైదరాబాద్‌లో మెరుగైన వృద్ధి కనిపించింది. ఈ మూడు పట్టణాలు మొత్తం నూతన ప్రాజెక్టుల ప్రారంభంలో 64 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
వెరైటీ పుచ్చకాయలు
-
గృహ విక్రయాలు: పశ్చిమ, ఉత్తరాదిలోనే జోరు!
సాక్షి, సిటీబ్యూరో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఫలితంగా హైదరాబాద్‌లో పశ్చిమ, ఉత్తరాది ప్రాంతాలలో ఇళ్ల కొనుగోళ్లు, సరఫరా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ (క్యూ3)లో నగరంలో 11,650 గృహాలు విక్రయం కాగా.. ఇందులో ఈ రెండు జోన్ల వాటానే 92 శాతంగా ఉంది. అలాగే 15,500 యూనిట్లు లాంచింగ్ కాగా.. వెస్ట్, నార్త్ జోన్ల వాటా 91 శాతంగా ఉందని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది మూడో త్రైమాసికంలో విక్రయమైన గృహాలలో భాగ్యనగరం వాటా 13 శాతంగా ఉంది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది 4 శాతం వృద్ధి. వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలలో హైదరాబాద్‌లో రికార్డ్ స్థాయిలో 73 శాతం వృద్ధి నమోదయింది. జోన్ల వారీగా చూస్తే.. క్యూ3లో నగరంలో అమ్ముడైన ఇళ్లలో అత్యధికం వెస్ట్ జోన్లోనే జరిగాయి. గచ్చిబౌలి, కొండాపూర్, తెల్లాపూర్, మణికొండ, కూకట్పల్లి, కోకాపేట, పటాన్చెరు వంటి ప్రాంతాలు ఉండే ఈ జోన్ వాటా 49 శాతంగా ఉంది. మియాపూర్, బాచుపల్లి, నిజాంపేట, యాప్రాల్, షామీర్పేట వంటి ప్రాంతాలు ఉండే నార్త్ జోన్ 43 శాతం అమ్మకాల వాటా కలిగి ఉంది. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే మాత్రం ఈ రెండు జోన్లలో విక్రయాలు 1 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో తూర్పు, సెంట్రల్ జోన్లలో విక్రయాలు 1 శాతం మేర పెరిగాయి. క్యూ3లోని హైదరాబాద్‌లోని గృహ విక్రయాలలో హబ్సిగూడ, నాచారం, ఉప్పల్, ఘట్కేసర్, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ఈస్ట్ జోన్ వాటా 3 శాతం, అమీర్‌పేట, పంజగుట్ట, సోమాజిగూడ, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాలు ఉండే సెంట్రల్ జోన్ వాటా 1 శాతం, శంషాబాద్, ఆదిభట్ల, మహేశ్వరం, షాద్‌నగర్, రాజేంద్రనగర్ వంటి సౌత్ జోన్ 3శాతం వాటాతో ఉన్నాయి. నగరానిది 17 శాతం వాటా.. గృహ ప్రారంభాలలోనూ హైదరాబాద్ హవా కొనసాగింది. క్యూ3లో ఏడు ప్రధాన నగరాలలోని లాంచింగ్స్‌లో 17 శాతం వాటాతో నగరం రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే మాత్రం నగరంలో లాంచింగ్స్ 2 శాతం తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన మాత్రం 6 శాతం వృద్ధిలో ఉంది. నివాస ప్రారంభాలలోనూ పశ్చిమ జోన్‌దే జోరు. క్యూ3లో హైదరాబాద్‌లో జరిగిన లాంచింగ్స్‌లో ఈ జోన్ వాటా 53 శాతం. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 2 శాతం క్షీణత. అలాగే క్యూ2తో పోలిస్తే నార్త్ జోన్లో లాంచింగ్స్ 6 శాతం వృద్ధి రేటుతో 32 శాతం నుంచి 38 శాతానికి పెరిగాయి. సౌత్ జోన్ 5 శాతం, ఈస్ట్ జోన్ 4 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కొత్తగా ప్రారంభమైన గృహాలలే లగ్జరీవే అత్యధికం. క్యూ3లో ప్రారంభమైన ఇళ్లలో 54 శాతం ఈ తరహా నివాసాలే. 30 శాతం వాటా మధ్యస్థాయి గృహాలున్నాయి. అఫర్డబుల్ ఇళ్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. క్యూ2లో లాంచింగ్స్‌లో అందుబాటు గృహాల వాటా 3 శాతం కాగా.. క్యూ3 నాటికి 1 శాతానికే పరిమితమయ్యాయి. -
పెట్రో ప్రొడక్టులకు డిమాండ్
న్యూఢిల్లీ: ఈ క్యాలండర్ ఏడాది(2022)లో దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టులకు ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ కనిపించనున్నట్లు చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల(ఒపెక్) నెలవారీ నివేదిక పేర్కొంది. పెట్రోల్, డీజిల్ తదితరాల డిమాండులో 7.73 శాతం వృద్ధి కనిపించనున్నట్లు అంచనా వేసింది. వెరసి 2021లో నమోదైన రోజుకి 4.77 మిలియన్ బ్యారళ్ల(బీపీడీ) నుంచి 5.14 మిలియన్ బ్యారళ్ల(బీపీడీ)కు డిమాండు పుంజుకోనున్నట్లు తెలియజేసింది. ఇది అంతర్జాతీయంగా రికార్డ్‌కాగా.. చైనా డిమాండుతో పోలిస్తే 1.23 శాతం, యూఎస్‌కంటే 3.39 శాతం, యూరప్కంటే 4.62 శాతం అధికమని నివేదిక తెలియజేసింది. అయితే 2023లో దేశీ డిమాండు 4.67 శాతం వృద్ధితో 5.38 శాతానికి చేరనున్నట్లు అంచనా వేసింది. ఇది చైనా అంచనా వృద్ధి 4.86 శాతంతో పోలిస్తే తక్కువకావడం గమనార్హం! ప్రపంచంలోనే చమురును అత్యధికంగా దిగుమతి చేసుకోవడంతోపాటు.. వినియోగిస్తున్న దేశాల జాబితాలో అమెరికా, చైనా తదుపరి ఇండియా మూడో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వృద్ధి అండ పటిష్ట వృద్ధి(7.1 శాతం)ని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థ దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టుల డిమాండుకు దన్నునివ్వనున్నట్లు ఒపెక్ నివేదిక పేర్కొంది. కా గా.. ఈ ఏడాది మూడో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో రుతుపవనాల కారణంగా చమురుకు డిమాండ్ మందగించే వీలున్నదని, అయినప్పటికీ తదుపరి పండుగల సీజన్‌తో ఊపందుకోనున్నట్లు వివరించింది. ఇటీవల పరిస్థితులు (ట్రెండ్) ఆధారంగా ఈ ఏడాది ద్వితీయార్థం డిమాండులో డీజిల్, జెట్ కిరోసిన్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు పేర్కొంది. కోవిడ్–19 ప్రభావంతో వీటికి గత కొంతకాలంగా డిమాండు క్షీణించిన విషయం విదితమే. -
డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్, జావా టెక్నాలజీల నిపుణులకు ఫుల్ డిమాండ్
ముంబై: డిజిటల్ టెక్నాలజీల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డేటా అనలిటిక్స్, జావా వంటి టెక్నాలజీల్లో ’అత్యంత ప్రత్యేక’ నైపుణ్యాలు ఉన్న ప్రొఫెషనల్స్‌కి భారీగా డిమాండ్ ఉంటోందని కన్సల్టెన్సీ సంస్థ క్వెస్ ఒక నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రిక్రూటర్లు ఎక్కువగా ఈ రెండింటితో పాటు క్లౌడ్ ఇన్ఫ్రా టెక్నాలజీలు, యూజర్ ఇంటర్ఫేస్ మొదలైన సాంకేతికతల్లో అత్యంత నైపుణ్యాలున్న వారిని తీసుకునేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్‌కు అత్యధికంగా బెంగళూరులో (40 శాతం), హైదరాబాద్‌లో (30 శాతం) డిమాండ్ నెలకొనగా .. జావా టెక్నాలజీల నిపుణులకు పుణె (40 శాతం), బెంగళూరులో (25 శాతం) డిమాండ్ కనిపించింది. అలాగే క్లౌడ్ ఇన్ఫ్రా సాంకేతికత నిపుణులపై ఎక్కువగా బెంగళూరులో (60 శాతం), చెన్నైలో (15 శాతం) ఆసక్తి కనిపించింది. టెక్నాలజీ నియామకాల మార్కెట్లో కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ బాగానే ఉందని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్ తెలిపారు. కంపెనీలు డిజిటల్, క్లౌడ్ సేవల వైపు మళ్లుతుండటంతో ఈ విభాగాల్లో హైరింగ్ పెరుగుతోందని పేర్కొన్నారు. ఐటీ మెట్రో హబ్‌లలోనే టాప్ డిజిటల్ నిపుణుల నియామకాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు. సింహభాగం డిమాండ్ హైదరాబాద్‌లో (34 శాతం) నమోదైంది. బెంగళూరు (33 శాతం), ముంబై (12 శాతం), పుణె (9 శాతం), చెన్నై (5 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆయా హోదాలకు అర్హులైన ఉద్యోగార్థులను మదింపు చేసే అల్గోరిథమ్ ఆధారిత గణాంకాల ద్వారా క్వెస్ ఈ నివేదికను రూపొందించింది. -
అమ్మో.. అరటిపండు.. డజన్ రూ.80 పైమాటే.. ఎందుకంటే?
కడప కల్చరల్(వైఎస్సార్ జిల్లా): అమ్మో... అరటిపండు!.. ఆ మాటెత్తితే సామాన్యుడు ఉలిక్కిపడుతున్నాడు. మొన్నటివరకు సామాన్యుడి పండుగా పేరుగాంచిన అరటి ధర నేడు చుక్కలనంటుతోంది. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు, పూజల్లో అరటి పండు ప్రధానపాత్ర వహిస్తోంది. విందు భోజనాల్లో ఎన్ని రకాలు వడ్డించినా చివరగా అరటిపండు లేకపోతే తృప్తిగా ఉండదంటారు. చదవండి: సీమ బిడ్డల సినిమా కథ.. 60 సినిమాలు, 100కు పైగా సీరియళ్లు.. ‘పోలీస్’ దావూద్ అలాంటి పండు ధర క్రమంగా రెండు నెలలుగా కొండెక్కి కూర్చొంది. డజన్ రూ. 20గా ఉన్న పండ్లు నేడు రూ. 80 లకు పైగా అమ్ముతున్నారు. కాస్త పెద్ద సైజు పండైతే రూ. 100 వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు, శుభకార్యాలు లేకపోయినా అరటిపండ్ల ధర ఈ స్థాయిలో ఉంటే ఈనెల 29వ తేది నుంచి శ్రావణమాసం రావడం, నెలాఖరు వరకు వరుస ముహూర్తాలు ఉండడంతో మరింత ప్రియం అయ్యే అవకాశం ఉంది. ధర ‘పండు’తోంది ఏప్రిల్ వరకు డజన్ రూ. 20గా ఇంటింటికి తిరిగిన అరటిపండ్ల వ్యాపారులు మే నుంచి క్రమంగా కనుమరుగయ్యారు. కేవలం కడప నగరంలోనే 400కు పైగా ఉన్న అరటిపండ్లు విక్రయించే బండ్లు నేడు నాలుగో శాతానికి పడిపోయాయి. ముఖ్యంగా కూడళ్లలో అరటి పండ్ల వ్యాపారాలే అధికంగా కనిపించేవి. ప్రస్తుతం బండ్లు కిక్కిరేసి ఉండే పాత బస్టాండు లాంటి ప్రాంతంలో కూడా నాలుగైదుకు మించి అరటిపండ్ల బండ్లు కనిపించడం లేదు. కొనుగోలుదారుడు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా కూడా పండ్లలో నాణ్యత కనిపించదు. ఇంతకుమించి మంచి సరుకు రావడం లేదని, అసలు తోటల నుంచి దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని, ఒకటి, రెండు మినహా సాగు, తోటలు తగ్గాయని విక్రయదారుడు పేర్కొంటున్నారు. ఈ పాతికేళ్లలో రూ.50కి మించి అరటిపండ్ల ధర లేదని, ఇప్పుడు ఒక్కసారిగా రూ. 80లుగా తిష్ట వేసుకుని కూర్చొవడం తమకు కూడా ఇబ్బందిగా ఉందని, రోజూ 200–400 డజన్ల పండ్లు అమ్మే తాము ఇప్పుడు 25 డజన్లు కూడా అమ్మలేక పోతున్నామని, అమ్ముదామన్నా బండి నిండుగా కూడా సరుకు లభించడం లేదని వాపోతున్నారు. వ్యాపారం మానేశాం ! గత 20 ఏళ్లుగా హౌసింగ్‌బోర్డు సెంటర్లో అరటిపండ్లను విక్రయిస్తున్నాను. ఒకటిన్నర నెలగా సరుకు లేక ఉన్నా...అంత ధర పెట్టి కొనేవారు రాకపోవడంతో ఈ వ్యాపారం మానేశాను. పరిస్థితి ఇంకా ఒకటి, రెండు నెలలు ఇలాగే కొనసాగితే అందరికీ కష్టమే. – విజయుడు, అరటిపండ్ల వ్యాపారి, కడప -
ఆ రెండూ దొరకట్లేదు..
సాక్షి, హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్‌ను కట్టడి చేసేందుకు దోహదం చేసే మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్, డెటాల్ తదితర ఉత్పత్తుల రేట్లు గణనీయంగా పెరిగాయి. మరోవైపు కృతిమ కొరత కూడా సృష్టిస్తూ రేట్లు పెంచి యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారనే ప్రచారంతో రక్తపోటు, మధుమేహానికి సంబంధించిన మాత్రలు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఇక అజిత్రోమైసిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. అజిత్రోమైసిన్ మాత్ర రూ.22 ఉండగా, ఇప్పుడు రూ.30–32 వరకు పలుకుతోంది. మాస్కులకు కటకట.. కరోనా మహమ్మారి విశ్వరూపం చూపుతుండటం.. వైరస్ నియంత్రణకు నిరంతరం చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు, ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. దీంతో మార్కెట్లో మాస్కులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇక ఎన్–95 మాస్కుల ధరలకైతే రెక్కలొచ్చాయి. నెల రోజుల క్రితం వరకు రూ.75 ఉన్న ఈ మాస్కు ధర ప్రస్తుతం రూ.350 నుంచి 400కు చేరింది. మామూలు మాస్కుల ధర రూ.3–5 నుంచి 25–30 వరకు పెరిగింది. ఇక హ్యాండ్‌వాష్‌లు అంతంతగానే లభ్యమవుతున్నాయి. హ్యాండ్‌వాష్‌కు ఉపయోగించే శానిటైజర్లు, డెటాల్, శావిలియన్ సబ్బులు కూడా దొరకడంలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నకిలీ శానిటైజర్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కరోనా భయంతో ఉన్న ప్రజలను మోసగించేందుకు నకిలీ శానిటైజర్ల తయారీ ముఠాలు రంగంలోకి దిగాయి. పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో నకిలీ శానిటైజర్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ శానిటైజర్ల వాడకంతో చేతులకు బొబ్బలు వస్తున్నట్లు గుర్తించినందున జాగ్రత్త వ్యవహరించాలని సూచించింది. మరోవైపు ప్రముఖ కంపెనీలు విక్రయించే శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు లాక్‌డౌన్‌తో సరుకు రవాణా నిలిచిపోవడం, ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపడంతో ప్రస్తుతం మార్కెట్లో శానిటైజర్లు మచ్చుకైనా కనిపించట్లేదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ అమ్మకాలు బంద్ హైడ్రాక్సీ క్లోరోక్విన్, హెచ్సీక్యూఎస్ టాబ్లెట్ల అమ్మకాలను ప్రభుత్వం దాదాపు నిలిపేసింది. శ్వాసకోస, మలేరియా రోగుల కోసం వినియోగించే ఈ మాత్రలే ప్రస్తుతం కరోనా బాధితుల కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉపద్రవం ముంచుకొస్తే ఈ మాత్రల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే హోల్‌సేల్ డీలర్ల నుంచే కాకుండా మెడికల్ షాపుల నిర్వాహకుల వద్ద ఉన్న ఈ మాత్రలను వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచారం. పైగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు విచ్చలవిడిగా వాడితే గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని, డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుండగా, బీపీ, షుగర్ పేషెంట్లు మాత్రం ముందుచూపుతో మూడు నెలలకు సరిపడా మందులు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ రోగుల మాత్రలు ఇట్టే అమ్ముడుపోతున్నట్లు మందుల దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే.. కండోమ్‌ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. లాక్డౌన్ నేపథ్యంలో 15 రోజులు ఎవరూ గడప దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి లేకపోవడంతో అంతా ఇంటికి పరిమితమయ్యారు. కరోనాకు ముందు మార్కెట్లో కండోమ్‌ల అమ్మకాలు విరివిగా ఉండేవి. ప్రస్తుతం వీటిని అడిగేవారే కరువయ్యారని ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడు చెప్పారు. -
తెలంగాణలో ఉల్లి @170
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ‘ఉల్లి బాంబ్’ పేలింది! గత కొంతకాలంగా సామాన్యులను బెంబేలెత్తిస్తూ ఎగబాకుతున్న ధర తాజాగా ‘ఆల్‌టైం హై’ను తాకింది. ఇప్పటివరకు సెంచరీ మార్కుకు అటు ఇటుగా పలికిన ధర గురువారం ఒక్కసారిగా ఆకాశాన్నం టింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనం తగా మొదటి రకం ఉల్లి హోల్‌సేల్‌లో క్వింటాలుకు ఏకంగా రూ.14,500 పలికింది. అంటే హోల్‌సేల్‌లోనే కిలో రూ. 145కు చేరింది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు మరింతగా రేట్లను పెంచడంతో రిటైల్ మార్కెట్లో ధర రూ. 160 నుంచి రూ.170 మధ్య పలుకుతూ మధ్యతరగతి ప్రజలు ఉల్లి పేరెత్తాలంటేనే జంకేలా చేస్తోంది. రెండో రకం ఉల్లి కిలో రూ. 120, మూడో రకం ఉల్లి రూ. 80 పలుకుతుండగా నాసిరకం ఉల్లి సైతం రూ.70 పలుకుతోంది. దీంతో కిలో నుంచి 2కిలోల వరకు ఉల్లి కొందామని మార్కె ట్‌కు వెళ్తున్న వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. గతేడాది ఇదే సీజన్లో ఉల్లి ధరలు రూ.30 దాటలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతుండటం గమనార్హం. ఈసారి దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి రాకకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ధర ఇప్పట్లో దిగొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీనికితోడు మహారాష్ట్ర వ్యాపారులతో స్థానిక వ్యాపారులు కుమ్మక్కు కావడం, నిల్వలపై నిఘా కొరవడడం మార్కెట్లో మరింతగా రేట్ల అగ్గిని రాజేస్తోంది. పొరుగున తగ్గిన సాగు వల్లే ఉల్లి ఘాటు... తెలంగాణలో ఉల్లిసాగు ఎక్కువగా లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలపైనే రాష్ట్రం ఆధార పడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్,కర్ణాటక రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రత్యేకించి మహారాష్ట్ర నుంచి వచ్చే దిగుమతులే రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి. దేశంలో 60–70 శాతం ఉల్లి దిగుబడికి మహారాష్ట్రే కేంద్రంకాగా అక్కడ ఈసారి సాగు గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది 4 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా ఈ ఏడాది కేవలం రెండున్నర లక్షల హెక్టార్లకు సాగు పడిపోయింది. దీనికితోడు ఆగస్టు నుంచి మూడు నెలలపాటు కురిసిన భారీ వర్షాలతో వేసిన పంటంతా దెబ్బతిన్నది. దీంతో ప్రస్తుత ముంబై, పుణేలోనే ఉల్లి కిలో గత 2–3 నెలలుగా రూ. 90 నుంచి రూ. 100 మధ్య పలుకుతోంది. సాధారణంగా మహారాష్ట్రలో ఉల్లి కొరత ఉంటే అక్కడి వ్యాపారులు పాకిస్తాన్, ఈజిప్ట్, చైనా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే ప్రస్తుతం పాక్ నుంచి ఉల్లి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో అక్కడి నుంచి సరఫరా ఆగిపోయింది. బంగ్లాదేశ్‌ను ముంచెత్తిన వరదల కారణంగా అక్కడి నుంచి సరఫరా లేదు. దీంతో ఈజిప్ట్, టర్కీ నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటున్నారు. ఉల్లి దిగుమతి కోసం కిలోకు రూ. 6–8 ఖర్చు వస్తుండటంతో మహారాష్ట్రలోనే కిలో రూ. 110 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మరోవైపు కర్ణాటక నుంచి సైతం ఉల్లి రాకపోవడంతో ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఈ నెల 2న 6,471 క్వింటాళ్ల మేర ఉల్లి రాష్ట్రానికి రాగా గురువారానికి అది 3 వేల క్వింటాళ్లకు తగ్గింది. దీంతో మూడు నాలుగు రోజుల కిందటి వరకు కిలో ఉల్లి రూ. 90–100 మధ్య ఉండగా గురువారం మలక్‌పేట మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉల్లి క్వింటాల్ ధర రూ.14,500 పలికింది. ఇది బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి రూ.160 నుంచి రూ.170కి విక్రయిస్తున్నారు. కర్నూలు ఉల్లికి పెరిగిన డిమాండ్... రాష్ట్రానికి కర్నూలు జిల్లా నుంచి కూడా ఉల్లి దిగుమతి జరుగుతోంది. కర్నూలులో ఏటా 87,500 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తుండగా ఈ ఏడాది అది 50 వేల ఎకరాలకు పడిపోయింది. దీనికితోడు ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో పంట పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు సాగు చేసిన పంటలోనూ ఎకరానికి 60 క్వింటాళ్ల మేర రావాల్సిన దిగుబడి 35–40 క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో అక్కడే ధరలు అమాంతం పెరిగాయి. సెప్టెంబర్‌లో క్వింటాల్ ధర గరిష్టంగా రూ. 4,500కు, అక్టోబర్‌లో రూ. 4,600కు నవంబర్‌లో రూ. 5,250 పలికింది. సాగు, దిగుబడులు తగ్గడం, స్థానిక డిమాండ్ అధికంగా ఉండటంతో కర్నూలు మార్కెట్‌కు గతంలో రోజూ 5–6 వేల క్వింటాళ్ల ఉల్లి పంట వచ్చేది. కానీ ప్రస్తుతం అది రోజుకు వెయ్యి క్వింటాళ్లకు తగ్గింది. దీంతో అక్కడి నుంచి రాష్ట్ర అవసరాల మేరకు ఉల్లి రావట్లేదు. మరోవైపు ప్రజలకు రాయితీపై కిలో ఉల్లి రూ. 25కే సరఫరా చేసేందుకు ఎంత ధరకైనా కొనుగోళ్లు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు సూచించడంతో మార్కెట్ యార్డు అధికారులు, వ్యాపారులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఉల్లి ధరలకు అమాంతం డిమాండ్ పెరిగి ధరలు నింగినంటుతున్నాయి. కర్నూలు మార్కెట్లో గత బుధవారం మధ్యాహ్నానికి క్వింటాలు ఉల్లి ధర గరిష్టంగా రూ. 12,510 పలికింది. ఈ ప్రభావం తెలంగాణపై పడి ఇక్కడి ధరల పెరుగుదలకు కారణమైంది. ‘మహా’ సిండికేట్... రాష్ట్రంలో డిమాండ్ తగ్గట్టుగా లేని ఉల్లి సరఫరాను వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలో ఉల్లి నిల్వలకు కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో పూర్తిగా మహారాష్ట్రపై ఆధారపడుతున్న రాష్ట్ర వ్యాపారులు అక్కడి వ్యాపారులతో సిండికేట్ అయ్యారు. కొనుగోలు చేసిన ఉల్లిని రాష్ట్రానికి తీసుకురాకుండా అక్కడే నిల్వ చేసి కృతిమ కొరత సృష్టిస్తున్నారు. అదీగాక తక్కువ బరువు తూగే పాత స్టాక్‌కు ధర ఉండదన్న ఉద్దేశంతో దాన్ని తీసుకురాకుండా ఎక్కువ బరువుండే తాజా స్టాక్‌నే తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర నుంచి 10 లారీలు వస్తుంటే అందులో 3 పాత స్టాక్ లారీలయితే 7 కొత్త స్టాక్వి ఉంటున్నాయి. కొత్త స్టాక్‌కు ధర పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. ఉల్లి అక్రమ నిల్వలను అరికట్టేందుకు రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్‌సేల్ వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి నిల్వ చేసుకోరాదని కేంద్రం స్పష్టం చేసినా ఎక్కడా దీనిపై నిఘా ఉన్నట్లు కనిపించట్లేదు. ఈజిప్టు ఉల్లే దిక్కు.. దేశంలో ఆకాశాన్నంటిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం గత నెల చివరి వారంలో టర్కీ నుంచి 11 వేల మెట్రిక్ టన్నులు, ఈజిప్ట్ నుంచి 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈజిప్ట్ ఉల్లి ఈ నెల రెండో వారానికల్లా ముంబై చేరుతుందని కేంద్రం ప్రకటించింది. ఈజిప్ట్ ఉల్లిలోంచి తమకు వారానికి 100 టన్నులకు తగ్గకుండా సరఫరా చేయాలని ఇప్పటికే రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసింది. ఈజిప్ట్ నుంచి వచ్చే స్టాక్ ఈ నెల 10కల్లా ముంబై పోర్టుకు చేరే అవకాశం ఉందని, ఆ తర్వాత మూడు రోజుల్లో రాష్ట్రానికి ఉల్లి చేరొచ్చని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కనీసం 500 టన్నుల ఈజిప్టు ఉల్లి తెలంగాణకు దిగుమతి అవుతుందని, అప్పడే ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. రాష్ట్రంలో నారాయణఖేడ్ సహా ఇతర ప్రాంతాల్లో సాగు చేసిన ఉల్లి పంట ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో మార్కెట్లోకి వస్తుందని, అప్పటివరకు ధరాఘాతం తప్పదని చెబుతున్నారు. ఆనియన్ దోశ.. పకోడిలు బంద్! ఉల్లి ధరల దెబ్బకు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఉల్లి సంబంధిత వంటకాలను హోటళ్లు, తోపుడు బండ్లపై వ్యాపారులు చాలా వరకు తగ్గించేశారు. ముఖ్యంగా ఉల్లి దోశ, పకోడి, మిర్చి, పానీపూరీల్లో ఉల్లి వాడకంపై స్వీయ ఆంక్షలు పెట్టుకున్నారు. తోపుడు బండ్ల వద్ద ‘ఉల్లి మళ్లీ అడగరాదు’ అని బోర్డులు పెడుతున్నారు. ఇక బిర్యానీల్లో ఉల్లి వాడకం జరుగుతున్నా వాటితోపాటు ఇచ్చే సలాడ్‌లో ఉల్లి స్థానంలో కీరా, క్యారెట్లను ఇస్తున్నారు. వినియోగదారులు ఉల్లి అడిగితే సలాడ్‌కు రూ. 20–30 వసూలు చేస్తున్నారు. ఈ ప్రభావం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపైనా పడుతోంది. హైదరాబాద్‌లోని 10 రైతు బజార్లకు మలక్‌పేట మార్కెట్ నుంచి 30 క్వింటాళ్లను కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఉల్లి ధర తగ్గే వరకు రైతు బజార్లకు ఉల్లి సరఫరా చేస్తామని చెప్పారు. -
కూరగాయలు సెంచరీ కొట్టేశాయ్‌గా..
సాక్షి, బాపట్ల(గుంటూరు) : కూరగాయల సంచిలో ధరల కుంపటి రగులుతోంది. రూ. 500 తీసుకెళ్తే సగం సంచి కూడా నిండని పరిస్థితుల్లో వంటింటిలో ధరల మంటలు చెలరేగుతున్నాయి. కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు దిగిరానుంటున్నాయ్. నిత్యావసరాలు సెంచరీ కొట్టేశాయ్. వర్షాభావ పరిస్థితులు ఓ కారణమైతే.. కృత్రిమ కొరత చూపిస్తున్న వ్యాపారులు సామాన్యుడి జీవితంతో చెలగాటమాడుతున్నారు. ఏంకొనేట్లు లేదు...ఏంతినేట్లులేదంటూ సగటు జీవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. కూరగాయల ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంకేసి దూసుకుపోతూ సామాన్యుడికి భారమవుతున్నాయి. ఈ ఏడాది వార్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినడంతో ఆహారోత్పత్తులు అందుబాటులో లేవనే సాకు చూపి వ్యాపారులు రోజురోజుకూ ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజల ఇంట్లో పప్పులుడకడం లేదు. గంజినీళ్ళతో కడుపు నింపేసుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కందిపప్పు రూ.100 నాటౌట్.. కందిపప్పు ధర చుక్కల్ని తాకుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.70 ఉన్న కందిపప్పు ప్రస్తుత ధర రూ.100కు చేరుకుంది. రోజురోజుకీ ధర పెరుగుతోందే తప్ప కిందికి దిగడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో నెలలోపే రూ.150 కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో పాటు మిగిలిన నిత్యావసర సరుకుల ధరలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. బహిరంగ మార్కెట్లో గతంలో రూ.80 నుంచి రూ.90 ఉన్న మినపపప్పు ప్రస్తుతం కిలో రూ.140 నుండి రూ.160 ల వరకు చేరింది. చింతపండు ధర కిలో రూ.150 దాటింది. ఇక నూనెలు సలసల కాగుతున్నాయి. శనగనూనె కిలో రూ.85ల నుండి రూ.90 ల వరకు ఉంది. విడిగా కిలో నూనె రూ.95కి చేరింది. నిత్యావసరాల్లో ఏది కొనాలన్నా వంద రూపాయలపైనే ఉంటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలదీ అదే తీరు.. నిత్యావసర వస్తువుల ధరలకు ఏమాత్రం తీసిపోనట్లుగా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎండల ధాటికి కూరగాయల పంటలు ఎండిపోవడంతో దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ప్రభావం ధరలపై పడి సామాన్యులు కొనలేని స్థితికి చేరుకున్నాయి. టమోటా కిలో రూ.60, బెండకాయలు కిలో రూ.40, బంగాళాదుంపలు కిలో రూ.40, పచ్చిమిరపకాయలు కిలో రూ.80 లుగా ఉన్నాయి. ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.30 కంటే దిగువన ఉండటం లేదు. దీంతో.. ఉన్న వాటితో సర్దుకుపోతున్నామని వినియోగదారులు చెబుతున్నారు. 500 రూపాయలు బజారుకు తీసుకెళ్తే కనీసం నాలుగు రోజులకు సరిపడా కూరగాయలు కూడా రావడంలేదని ఆవేదన చెందుతున్నారు. -
టీ అమ్ముతూ నెలకు 12 లక్షలు
పుణె: చాయ్ అమ్ముతూ నెలకు ఎంత సంపాదించొచ్చు? వ్యాపారం బాగా జరిగినా రోజుకు వెయ్యి రూపాయలు ఆదాయం పొందడం గగనం. అలాంటిది పుణెలో ఓ వ్యక్తి మాత్రం చాయ్ అమ్మి ఏకంగా నెలకు రూ. 12 లక్షలు ఆర్జిస్తున్నాడు. అతనే నవ్‌నాథ్ యేవలే. పుణెలో టీకి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ప్రఖ్యాత టీ బ్రాండ్లు, ఔట్లెట్లు ఏవీ లేవని 2011లో యేవలే గుర్తించారు. ఆ తర్వాత తాను ఆ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని తన టీ రుచి ఎలా ఉండాలనే దానిపై నాలుగేళ్లు పరిశోధనలు చేశారు. అనంతరం మరికొందరిని భాగస్వాములుగా చేర్చుకుని తన పేరుమీదనే చాయ్ దుకాణం తెరిచారు. కొద్దిరోజుల్లోనే ఆయన టీకి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పుణెలోనే మరో రెండు చోట్ల యేవలే ఔట్లెట్లను తెరిచారు. ఇప్పుడు ఒక్కో ఔట్లెట్లో 12 మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నారు. రోజుకు దాదాపు 4 వేల కప్పుల చాయ్ అమ్ముడుపోతోంది. త్వరలోనే యేవలే టీ స్టాల్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాననీ, మరో వంద టీ స్టాల్స్ ఏర్పాటు చేసి మరింత మందికి ఉద్యోగాలిస్తానని ఆయన చెబుతున్నారు. పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించడంతో దానిపై తీవ్ర చర్చ జరగడం తెలిసిందే. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘పకోడా వ్యాపారంలా కాకుండా మేం చాయ్ అమ్మి ఉపాధి కూడా కల్పిస్తున్నాం’ అని నవ్‌నాథ్ అన్నారు. -
కోనసీమ కొబ్బరికాయలకు పెరిగిన డిమాండ్
-
బిగ్ డేటా, ఎనలిస్టులకు బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన నేపథ్యంలో భారీగా ఉద్యోగాలు రానున్నాయనే అంచనాలు ఊరట నిస్తున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేల ఉద్యోగాలు రానున్నాయని ఆన్లైన్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ ఏడాదిలో అత్యధిక సంఖ్యలో అమెజాన్, సిటీ, హెచ్‌సీఎల్, గోల్డ్ మాన్ సాచ్స్ , ఐబిఎం లాంటి ప్రముఖ సంస్థల్లో ఈ ఎనలిటిక్స్ ఉద్యోగాలకు మంచి ఓపెనింగ్స్ ఉండనున్నాయని పేర్కొంది. ఎనలటిక్స్, బిగ్ డేటా ,డేటా సైన్స్ ప్లాట్‌ఫాం, ఎనలటిక్స్ అండ్ మ్యాగజైన్ , ఆన్లైన్ ఎనలిటిక్స్ శిక్షణా సంస్థ ఎడ్వాన్సెర్ ఎడ్యూవెంచర్స్ సంయుక్తంగా ది ఎనలటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇండియా జాబ్స్ 2017 పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది. భారతదేశంలో ఎనలిస్టులు, డేటా సైన్స్, బిగ్ డేటాలో నియామకాలు పెరుగుతాయని ఈ అధ్యయనం తేల్చింది. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో డేటా ఎనలిస్టులు ఉద్యోగాలు లభించనున్నాయిని అనలాటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇండియా జాబ్స్ స్టడీ 2017 ప్రకారం తేలింది. దాదాపు 50వేల ఎనలిస్టు జాబ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఐటీలో తగ్గిన నియామకాలకారణంగా కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆందోళనలో ఉన్నారు. తక్కువ ఐటి నియామకం ఈ 42 శాతం మంది బీఈ / బీటెక్ గ్రాడ్యుయేట్లకు కేటాయిస్తుండగా, మరో 40 శాతం ఎంబీఏ, ఎంటెక్ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు కోసం చూస్తున్నారట. దీంతో ఈ ఉద్యోగ నియామకాల్లో టైర్ -బి నగరాల్లో 2016 లో 5 శాతం నుంచి ఈ ఏడాది 7 శాతం వరకు పెరిగిందిని ఈ సర్వే తెలిపింది. అమెరికా తరువాత ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణ మరియు డేటా సైన్స్ ఉద్యోగాల్లో అవకాశాలలో 12 శాతం వాటాతో ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద విశ్లేషణ కేంద్రంగా ఉంది. వీటిల్లో అమెజాన్, సీటీ, ఐబీఎం , హెచ్‌సీఎల్ లాంటివి ఎక్కువ సంఖ్యలో ఎనలిక్స్ ఉద్యోగాలను కల్పించాయి. నగరాల పరంగా, బెంగళూరు అన్ని ఎనలిటిక్స్ ఉద్యోగాల్లో దాదాపు 25 శాతం ఉద్యోగాలతో టాప్ లోనూ, ఢిల్లీలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇక ఫెషర్స్ విషయానికి వస్తే , చెన్నై మొత్తం ఓపెనింగ్స్‌లో టాప్ లోఉంది. 2-7 సంవత్సరాల అనుభవం ఉన్నవారిలో దాదాపు 50 శాతం ఉద్యోగాలు అన్ని నగరాల్లోనూ ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. అంతేకాదు ఈ ఎనలిటిక్స్, డేటా సైన్స్ ఉద్యోగాల్లో సంవత్సరానికి సగటు జీతం రూ. 10.5 లక్షలు. దాదాపు 40 శాతం ఉద్యోగాల్లో సంవత్సరానికి రూ.10 లక్షల ఎక్కువ జీతం లభిస్తోంది. తద్వారా ఇది అత్యధిక వేతనం చెల్లిస్తున్న రంగాలలో ఒకటిగా నిలిచింది. వివిధ పరిశ్రమల్లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో దేశంలో నైపుణ్యం కలిగిన విశ్లేషకుల నిపుణుల డిమాండ్ పెరిగిందని ఎనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ స్థాపకుడు, సీఈవో భాస్కర్ గుప్తా చెప్పారు. ఎడ్వాన్సెర్ ఎడ్యూవెంచర్స్ స్థాపకుడు, సీఈవో ఆతాష్ షా మాట్లాడుతూ డేటా సైన్స్, ఎనలిటిక్స్ విభాగం ఉద్యోగాల్లో దాదాపు 100 శాతం వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ బూం ను అందిపుచ్చుకోవాడానికి ఐటీ ఉద్యోగులు డేటా సైన్స్ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.