న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 38 శాతం అధికంగా రూ.4.5 లక్షల కోట్ల మేర ఉంటాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ అంచనా వేసింది. లగ్జరీ ఇళ్లకు అధిక డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. 2022లో ఏడు పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల విలువ రూ.3.26 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది తొమ్మిది నెలల్లో (సెపె్టంబర్ వరకు) అమ్మకాలు క్రితం ఏడాది మొత్తం అమ్మకాలతో పోల్చి చూసినా, 7 శాతం వృద్ధితో రూ.3,48,776 కోట్లుగా ఉన్నాయి.
‘‘ఈ ఏడాది తొమ్మిది నెలల అమ్మకాలు గతేడాది మొత్తం అమ్మకాలను మించి ఉండడం, ఖరీదైన ఇళ్లకు డిమాండ్ పెరగడాన్ని సూచిస్తోంది. ఇళ్ల ధరలు సగటున 8–18 శాతం మధ్య ప్రముఖ పట్టణాల్లో ఈ ఏడాది పెరిగాయి. కనుక గతేడాది అమ్మకాలతో కచి్చతంగా పోల్చి చూడలేం’’అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో ఏడు పట్టణాల్లో రూ.1,12,976 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడుపోగా, తర్వాతి మూడు నెలల్లో (జూన్ త్రైమాసికం) ఒక శాతం అధికంగా, సెపె్టంబర్ త్రైమాసికంలో 8 శాతం అధికంగా విక్రయాలు నమోదైనట్టు చెప్పారు.
పండుగల్లో జోరుగా విక్రయాలు
పండుగల సీజన్‌లో ఇళ్ల అమ్మకాలు ప్రముఖ పట్టణాల్లో బలంగా ఉన్నట్టు అనుజ్ పురి వెల్లడించారు. కనుక మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది చివరికి రూ.4.5 లక్షల కోట్లకు చేరతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో ఏడు పట్టణాల్లో 3.49 లక్షల ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్ చివరి వరకు చూసుకుంటే సుమారుగా 4.5 లక్షల ఇళ్లు అమ్మడవుతాయన్నది అంచనాగా ఉంది. 2022 మొత్తం మీద అమ్ముడైన యూనిట్లు 3.65 లక్షలుగా ఉన్నాయి.
హైదరాబాద్‌లో 43 శాతం అధికం
► ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు, 43 శాతం పెరిగి రూ.35,802 కోట్లుగా ఉంది.
► పుణెలో 96 శాతం అధికంగా రూ.39,945 కోట్ల విక్రయాలు కొనసాగాయి.
► చెన్నైలో 45 శాతం వృద్ధితో రూ.11,374 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.
► బెంగళూరు మార్కెట్లో అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు 42 శాతం పెరిగి రూ.38,517 కోట్లుగా ఉంది.
► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 41 శాతం పెరిగి రూ.1,63,924 కోట్ల విలువైన అమ్మకాలు నమోదయ్యాయి.
► ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో 29 శాతం వృద్ధితో 50,188 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి.
► కోల్‌కతాలో అమ్మకాల విలువ 19 శాతం పెరిగి రూ.9,025 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment