top recruiters
-
బిగ్ డేటా, ఎనలిస్టులకు బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన నేపథ్యంలో భారీగా ఉద్యోగాలు రానున్నాయనే అంచనాలు ఊరట నిస్తున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేల ఉద్యోగాలు రానున్నాయని ఆన్లైన్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ ఏడాదిలో అత్యధిక సంఖ్యలో అమెజాన్, సిటీ, హెచ్‌సీఎల్, గోల్డ్ మాన్ సాచ్స్ , ఐబిఎం లాంటి ప్రముఖ సంస్థల్లో ఈ ఎనలిటిక్స్ ఉద్యోగాలకు మంచి ఓపెనింగ్స్ ఉండనున్నాయని పేర్కొంది. ఎనలటిక్స్, బిగ్ డేటా ,డేటా సైన్స్ ప్లాట్‌ఫాం, ఎనలటిక్స్ అండ్ మ్యాగజైన్ , ఆన్లైన్ ఎనలిటిక్స్ శిక్షణా సంస్థ ఎడ్వాన్సెర్ ఎడ్యూవెంచర్స్ సంయుక్తంగా ది ఎనలటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇండియా జాబ్స్ 2017 పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది. భారతదేశంలో ఎనలిస్టులు, డేటా సైన్స్, బిగ్ డేటాలో నియామకాలు పెరుగుతాయని ఈ అధ్యయనం తేల్చింది. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో డేటా ఎనలిస్టులు ఉద్యోగాలు లభించనున్నాయిని అనలాటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇండియా జాబ్స్ స్టడీ 2017 ప్రకారం తేలింది. దాదాపు 50వేల ఎనలిస్టు జాబ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఐటీలో తగ్గిన నియామకాలకారణంగా కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆందోళనలో ఉన్నారు. తక్కువ ఐటి నియామకం ఈ 42 శాతం మంది బీఈ / బీటెక్ గ్రాడ్యుయేట్లకు కేటాయిస్తుండగా, మరో 40 శాతం ఎంబీఏ, ఎంటెక్ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు కోసం చూస్తున్నారట. దీంతో ఈ ఉద్యోగ నియామకాల్లో టైర్ -బి నగరాల్లో 2016 లో 5 శాతం నుంచి ఈ ఏడాది 7 శాతం వరకు పెరిగిందిని ఈ సర్వే తెలిపింది. అమెరికా తరువాత ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణ మరియు డేటా సైన్స్ ఉద్యోగాల్లో అవకాశాలలో 12 శాతం వాటాతో ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద విశ్లేషణ కేంద్రంగా ఉంది. వీటిల్లో అమెజాన్, సీటీ, ఐబీఎం , హెచ్‌సీఎల్ లాంటివి ఎక్కువ సంఖ్యలో ఎనలిక్స్ ఉద్యోగాలను కల్పించాయి. నగరాల పరంగా, బెంగళూరు అన్ని ఎనలిటిక్స్ ఉద్యోగాల్లో దాదాపు 25 శాతం ఉద్యోగాలతో టాప్ లోనూ, ఢిల్లీలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇక ఫెషర్స్ విషయానికి వస్తే , చెన్నై మొత్తం ఓపెనింగ్స్‌లో టాప్ లోఉంది. 2-7 సంవత్సరాల అనుభవం ఉన్నవారిలో దాదాపు 50 శాతం ఉద్యోగాలు అన్ని నగరాల్లోనూ ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. అంతేకాదు ఈ ఎనలిటిక్స్, డేటా సైన్స్ ఉద్యోగాల్లో సంవత్సరానికి సగటు జీతం రూ. 10.5 లక్షలు. దాదాపు 40 శాతం ఉద్యోగాల్లో సంవత్సరానికి రూ.10 లక్షల ఎక్కువ జీతం లభిస్తోంది. తద్వారా ఇది అత్యధిక వేతనం చెల్లిస్తున్న రంగాలలో ఒకటిగా నిలిచింది. వివిధ పరిశ్రమల్లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో దేశంలో నైపుణ్యం కలిగిన విశ్లేషకుల నిపుణుల డిమాండ్ పెరిగిందని ఎనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ స్థాపకుడు, సీఈవో భాస్కర్ గుప్తా చెప్పారు. ఎడ్వాన్సెర్ ఎడ్యూవెంచర్స్ స్థాపకుడు, సీఈవో ఆతాష్ షా మాట్లాడుతూ డేటా సైన్స్, ఎనలిటిక్స్ విభాగం ఉద్యోగాల్లో దాదాపు 100 శాతం వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ బూం ను అందిపుచ్చుకోవాడానికి ఐటీ ఉద్యోగులు డేటా సైన్స్ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. -
టాప్ 5 రిక్రూట్మెంట్ సంస్థలివేనట!
ముంబయి: ప్రఖ్యాత ఐఐటీ ముంబైలో భారీగా రిక్రూట్మెంట్స్ చేసిన సంస్థలో టాప్ లో 5 కంపెనీలు నిలిచాయి. ముఖ్యంగా ఇంటెల్ టెక్నాలజీస్ 29 మంది విద్యార్థులను, శాంసంగ్ ఆర్ అండ్ డి 28మంది , సిటీ కార్పోరేషన్ 20మంది , గోల్డ్‌మన్ సాచ్స్ 15, క్వాల్కమ్ 13మంది ఐఐటీ విద్యార్థులను ఎంపిక చేశాయి. అలాగే అంతర్జాతీయ ఆఫర్లు పరంగా అతిపెద్ద రిక్రూటర్లుగా యాహూ, ఎన్ఈసీ, మురత, మైక్రోసాఫ్ట్ నిలిచాయని ఐఐటీ ముంబై విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధిక ప్యాకేజీలు అమెరికా సంస్థలు చెల్లించనున్న అత్యధిక వేతన ప్యాకేజీలు ఉబెర్ 110,000డాలర్లు, మైక్రోసాఫ్ట్ 106,000డాలర్లు, ఒరాకిల్ 100,000 డాలర్లు గా ఉన్నాయి. జపనీస్ సంస్థలు వర్క్స్ అప్లికేషన్ ఏడాదికి రూ .60 లక్షలు , యాహూ రూ 37,52 లక్షలు, రాకుటేన్ 37. 20 లక్షలు, టోయో ఇంజనీరింగ్ రూ 35,16 లక్షలు చెల్లించనున్నాయి. దేశీయ కంపెనీల గరిష్ట ప్యాకేజీలు బ్లాక్ స్టోన్ రూ .35 లక్షలు, స్క్లూమ్బర్గర్ రూ 28 లక్షలు, వరల్డ్ క్వాంట్ రూ 25.2 లక్షలు, జిరాక్స్ రీసెర్చ్ రూ .22 లక్షలు గా ఉన్నాయి. అనేక రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్, కన్సల్టింగ్, ఫినాన్స్ అండ్ సాఫ్ట్ వేర్ సహా అన్ని రంగాలు సంస్థలు తమ విద్యార్థులను ఎంపిక చేసినట్టు తెలిపింది. ఉబెర్, పేటీఎం, ఓలా లాంటి స్టార్ట్ అప్ ల నుంచి కూడా నియామకాలు జరిగాయనీ, మరికొన్ని ప్రఖ్యాత విద్యాసంస్థలు , యూనివర్శిటీలు ఈ వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఐఐటీ ముంబై వివరించింది.