టాప్ 5 రిక్రూట్మెంట్ సంస్థలివేనట!
ముంబయి: ప్రఖ్యాత ఐఐటీ ముంబైలో భారీగా రిక్రూట్మెంట్స్ చేసిన సంస్థలో టాప్ లో 5 కంపెనీలు నిలిచాయి. ముఖ్యంగా ఇంటెల్ టెక్నాలజీస్ 29 మంది విద్యార్థులను, శాంసంగ్ ఆర్ అండ్ డి 28మంది , సిటీ కార్పోరేషన్ 20మంది , గోల్డ్మన్ సాచ్స్ 15, క్వాల్కమ్ 13మంది ఐఐటీ విద్యార్థులను ఎంపిక చేశాయి. అలాగే అంతర్జాతీయ ఆఫర్లు పరంగా అతిపెద్ద రిక్రూటర్లుగా యాహూ, ఎన్ఈసీ, మురత, మైక్రోసాఫ్ట్ నిలిచాయని ఐఐటీ ముంబై విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
అత్యధిక ప్యాకేజీలు
అమెరికా సంస్థలు చెల్లించనున్న అత్యధిక వేతన ప్యాకేజీలు ఉబెర్ 110,000డాలర్లు, మైక్రోసాఫ్ట్ 106,000డాలర్లు, ఒరాకిల్ 100,000 డాలర్లు గా ఉన్నాయి. జపనీస్ సంస్థలు వర్క్స్ అప్లికేషన్ ఏడాదికి రూ .60 లక్షలు , యాహూ రూ 37,52 లక్షలు, రాకుటేన్ 37. 20 లక్షలు, టోయో ఇంజనీరింగ్ రూ 35,16 లక్షలు చెల్లించనున్నాయి. దేశీయ కంపెనీల గరిష్ట ప్యాకేజీలు బ్లాక్ స్టోన్ రూ .35 లక్షలు, స్క్లూమ్బర్గర్ రూ 28 లక్షలు, వరల్డ్ క్వాంట్ రూ 25.2 లక్షలు, జిరాక్స్ రీసెర్చ్ రూ .22 లక్షలు గా ఉన్నాయి.
అనేక రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్, కన్సల్టింగ్, ఫినాన్స్ అండ్ సాఫ్ట్ వేర్ సహా అన్ని రంగాలు సంస్థలు తమ విద్యార్థులను ఎంపిక చేసినట్టు తెలిపింది. ఉబెర్, పేటీఎం, ఓలా లాంటి స్టార్ట్ అప్ ల నుంచి కూడా నియామకాలు జరిగాయనీ, మరికొన్ని ప్రఖ్యాత విద్యాసంస్థలు , యూనివర్శిటీలు ఈ వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఐఐటీ ముంబై వివరించింది.