ఒకవైపు సెమీకండక్టర్ల కొరతతో ఆటోమొబైల్ రంగం, డివైజ్ తయారీ రంగం ఘోరంగా దెబ్బ తిన్నాయి. కొత్త మోడల్స్ సంగతి ఏమోగానీ.. ప్రొడక్టివిటీని పెద్ద మొత్తంలో చేయలేకపోతున్నాయి. ఈ తరుణంలో ఈ గ్యాప్‌లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ దూసుకొచ్చింది. ఏకంగా చిప్ దిగ్గజం ‘ఇంటెల్’కు ఎసరు పెట్టి.. తొలి స్థానాన్ని అధిగమించింది.
2021లో లాజిక్ ఐసీ, మెమరీ చిప్ సెగ్మెంట్‌లలో ఉత్పత్తి అధికంగా జరగడంతో శాంసంగ్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ టెక్నాలజీలో ఉపయోగించే డైనమిక్ ర్యాన్‌డమ్-యాక్సెస్ మెమరీ (DRAM), NAND ఫ్లాష్ మార్కెట్ ఫర్‌ఫార్మెన్స్ సైతం ఇంటెల్ కంటే మెరుగైన బిజినెస్ చేయడం విశేషం. వాస్తవానికి కిందటి ఏడాది రెండో త్రైమాసికం వద్దే ఇంటెల్‌ను శాంసంగ్ అధిగమించింది. అయితే అది కొన్ని విభాగాల్లో మాత్రమే కావడం గమనార్హం.
ఇప్పుడు పూర్తి కేటగిరీల్లో ఇంటెల్‌ను శాంసంగ్ డామినేట్ చేసేసింది. స్మార్ట్‌ఫోన్ ఎస్‌వోసీ (సిస్టమ్ ఆన్ చిప్), జీపీయూ అమ్మకందారులు కూడా యాభై శాతం అధిక ఆదాయాన్ని చవిచూసినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. తద్వారా అమెరికన్ సెమీకండక్టర్ కంపెనీ ఇంటెల్‌ను.. దక్షిణ కొరియా శాంసంగ్ అన్నింటా అధిగమించినట్లయ్యింది. ఈ పోటీలో శాంసంగ్‌ను ఇంటెల్ ఇప్పట్లో అధిగమించకపోవచ్చనే భావిస్తున్నారు నిపుణులు.
అదనంగా టాప్ 15 అమ్మకందారుల్లో.. 27 శాతం ఆదాయ వృద్ధిని గమనించినట్లు రీసెర్చ్ అనలిస్ట్ విలియమ్ లీ వెల్లడించారు. ఇదిలా ఉంటే చిప్ కొరత సమస్య 2023 వరకు తీరేది కాదని ఇంటెల్ సీఈవో పాట్ గెల్‌సింగర్ చెప్తున్నారు. మరోవైపు చిప్ కొరతను క్యాష్ చేసుకునే ఉద్దేశంలో శాంసంగ్ ఉంది. సుమారు 17 బిలియన్‌ల డాలర్లతో సెమీకండక్టర్ కంపెనీని ఆస్టిన్ బయట నెలకొల్పుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
సంబంధిత వార్త: చిప్ ఎఫెక్ట్.. శాంసంగ్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్
Comments
Please login to add a commentAdd a comment