ప్రతీకాత్మక చిత్రం
Samsung Texas Chip Factory: కరోనా వైరస్-లాక్‌డౌన్ ప్రభావాల వల్ల స్మార్ట్ డివైజ్‌లు, వాహనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు.. చిప్ కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు ఏకంగా సొంతంగా చిప్ తయారీకి పూనుకుంటున్నాయి ఫోన్ కంపెనీలు. ఈ క్రమంలో శాంసంగ్ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది.
చిప్ ఫ్యాక్టరీల నిర్మాణానికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే గూగుల్, యాపిల్ కంపెనీలు రంగంలోకి దిగగా.. ఇప్పుడు శాంసంగ్ వాటి ప్రాజెక్టులను తలదన్నేలా భారీ ప్రణాళికకు ముందడుగు వేసింది. ఏకంగా 17 బిలియన్ డాలర్ల(17 X ఏడువేల కోట్ల రూపాయలు) భారీ ఖర్చుతో సెమీకండక్టర్ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈ మేరకు టెక్సాస్ ఆస్టిన్ నగరం శివారులో జెయింట్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్లు ఈ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం అధికారికంగా ప్రకటించింది కూడా. గత కొన్నేళ్లుగా టెక్ కంపెనీలకు అడ్డాగా మారుతున్న టెక్సాస్‌లో ఈ రేంజ్‌లో ఓ విదేశీ కంపెనీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుండడం విశేషం. వచ్చే ఏడాది నుంచి బిల్డింగ్ నిర్మాణం.. 2024 నుంచి చిప్ తయారీ పనులు ప్రారంభించాలని శాంసంగ్ ప్రణాళిక వేసుకుంది.
చదవండి: గూగుల్.. చిప్ చిచ్చు రాజుకుందా?
లాక్‌డౌన్ ప్రభావంతో చిప్ ఫ్యాక్టరీలు మూతపడగా.. ప్రస్తుతం చిప్ షార్టేజ్ సమస్య ప్రపంచం మొత్తం కొనసాగుతోంది. అమెరికా లాంటి అగ్రదేశాలు.. చైనా, తైవాన్ లాంటి ఆసియా దేశాల మీద చిప్ కోసం ఆధారపడి ఉన్నాయి. కానీ, ముందు ఆసియా దేశాల కొరత తీర్చాకే బయటి దేశాలకు ఉత్పత్తి చేసే ఉద్దేశంలో ఉన్నాయి చిప్ తయారీ కంపెనీలు.
Comments
Please login to add a commentAdd a comment