Intel
-
హెచ్‌పీ సీఈఎస్‌లో ఏఐ ఆధారిత ఆవిష్కరణలు
టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. టెక్ యుగంలో ల్యాప్‌టాప్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగంలో సేవలందిస్తున్న హెచ్‌పీ(HP) కంపెనీ కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES)-2025లో వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇవి కృత్రిమమేధ సాయంతో పని చేస్తాయని కంపెనీ తెలిపింది. దాంతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంది. 2025వ సంవత్సరానికిగాను సీఈఎస్ లాస్‌వెగాస్‌లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది.హెచ్‌పీ ఎలైట్ బుక్ అల్ట్రా జీ1ఐ: ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 ప్రాసెసర్‌తో 48 టాప్స్ ఎన్పీయూ టెక్నాలజీతో వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సమర్థంగా పనిచేసే ఏఐ బిజినెస్ నోట్ బుక్ అని కంపెనీ తెలిపింది.హెచ్‌పీ జెడ్ బుక్ అల్ట్రా జీ 1ఎ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 14 అంగుళాల ల్యాప్‌టాప్ ఇది. ఏంఎడీ ప్రాసెసర్‌తో వచ్చే ఈ డివైజ్‌తో హై-పెర్ఫార్మెన్స్ వర్క్ ఫ్లోలకు ఎంతో సమర్థంగా నిర్వహించవచ్చని కంపెనీ పేర్కొంది.హెచ్‌పీ జెడ్2 మినీ జీ1ఏ: ఏఎండీ రైజెన్ ఏఐ మ్యాక్స్ ప్రో ప్రాసెసర్లు, 6-కోర్/12-థ్రెడ్ నుంచి 16-కోర్/32-థ్రెడ్ కాన్ఫిగరేషన్లతో దీన్ని ఆవిష్కరించారు. ఏఎండీ రేడియన్ 8060ఎస్, 8050ఎస్, 8040ఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సదుపాయం ఉండేలా దీన్ని తయారు చేశారు.ఇదీ చదవండి: మడిచే స్క్రీన్.. వాక్ చేయించే షూస్!హెచ్‌పీ జెడ్ క్యాప్టిస్: మెటీరియల్స్ డిజిటలైజ్ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి దీన్ని రూపొందించారు. ఏఐ(AI) ఆధారిత డిజిటల్ మెటీరియల్ క్యాప్చర్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ఇది ఎన్వీడియోకు చెందిన జెట్సన్ ఏజీఎక్స్ జేవియర్ మాడ్యూల్, ఫోటోమెట్రిక్ కంప్యూటర్ విజన్ సిస్టమ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.హెచ్‌పీ థండర్ బోల్ట్ 4 అల్ట్రా జీ6 డాక్: ఇది డాకింగ్ స్టేషన్‌గా పని చేస్తుంది. రెండు వెర్షన్లలో ఒకటి 180 వాట్లు, మరొకటి 280 వాట్ల శక్తిని అందిస్తుంది. -
ఇంటెల్ ఉద్యోగుల కోసం మాజీ సీఈవో ఉపవాసం..
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ ఉద్యోగుల కోసం దాని మాజీ సీఈవో పాట్ గెల్సింగర్ ఉపవాసం ఆచరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. ఉపవాసంలో తనతో చేరాలని సహోద్యోగులనూ కోరుతున్నారు. ఇంతకీ ఉపవాసం ఎందుకు చేస్తున్నారు.. ఇంటెల్ ఉద్యోగులకు ఏమైంది.. ఈయన ఏం చెప్పారన్నది ఇప్పుడు చూద్దాం..ఇంటెల్ సంస్థ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ సీఈవో పాట్ గెల్సింగర్.. సంస్థలో పనిచేస్తున్న లక్ష మందికి పైగా ఉద్యోగుల శ్రేయస్సు, వారి భవిష్యత్తు కోసం లోతైన ఆందోళనను వ్యక్తం చేస్తూ తాను ఆచరిస్తున్న ప్రార్థన, ఉపవాసంలో తనతో చేరాలని సహోద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరుకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు."నేను ప్రతి గురువారం 24 గంటలపాటు ప్రార్థన, ఉపవాసం ఆచరిస్తున్నాను. క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న లక్ష మంది ఇంటెల్ ఉద్యోగుల కోసం ప్రార్థనలు, ఉపవాసం చేయడంలో నాతో చేరాలని ఈ వారం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంటెల్, దాని సిబ్బంది పరిశ్రమకు, యూఎస్ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది" అని గెల్సింగర్ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే తీపి కబురుచిప్ మార్కెట్లో ఇంటెల్ ప్రభ తగ్గిపోవడం, మరోవైపు ఎన్విడియా పుంజుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కంపెనీ బోర్డ్ విశ్వాసాన్ని కోల్పోయిన జెల్సింగర్ ఉద్వాసనకు గురయ్యారు. ఇంటెల్ సంస్థను నడిపించడం తనకు లభించిన జీవితకాల గౌరవమని తన పదవీ విరమణ సందర్భంగా గెల్సింగర్ పేర్కొన్నారు.ఇంటెల్‌లో ఇటీవల గణనీయమైన పునర్వ్యవస్థీకరణ మార్పులు సంభవించాయి. 15% సిబ్బందిని తొలగించింది. 10 బిలియన్ డాలర్ల మేర ఖర్చును తగ్గించుకుంది. కంపెనీ ఇటీవలే ఒక్కో షేరుకు 0.46 డాలర్ల చొప్పున నష్టపోయింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 6.2% క్షీణించి 13.28 బిలియన్ డాలర్లకు తగ్గింది. జెల్సింగర్ నిష్క్రమణ తరువాత డేవిడ్ జిన్స్నర్, మిచెల్ జాన్స్టన్ హోల్తాస్లు తాత్కాలికంగా సహ సీఈవోలుగా నియమితులయ్యారు. శాశ్వత సీఈవో కోసం ఇంటెల్ తీవ్రంగా అన్వేషిస్తోంది.Every Thursday I do a 24 hour prayer and fasting day . This week I'd invite you to join me in praying and fasting for the 100K Intel employees as they navigate this difficult period. Intel and its team is of seminal importance to the future of the industry and US.— Pat Gelsinger (@PGelsinger) December 8, 2024 -
హెచ్‌సీఎల్ నుంచి డేటా ట్రస్ట్ షీల్డ్
న్యూఢిల్లీ: ఐటీ రంగ సంస్థ హెచ్‌సీఎల్‌టెక్ తాజాగా యూఎస్‌కు చెందిన చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ సహకారంతో డేటా ట్రస్ట్ షీల్డ్ పేరుతో ఎంటర్ప్రైస్ డేటా సెక్యూరిటీ సర్వీసులను ప్రారంభించింది. క్లౌడ్ వ్యవస్థలో సున్నిత సమాచార రక్షణను ఇది మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది.ఇంటెల్ ట్రస్ట్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ (ఇంటెల్ టీడీఎక్స్), ఇంటెల్ ట్రస్ట్ అథారిటీ వంటి విశ్వసనీయ సాధనాలను ఉపయోగించడం ద్వారా క్లౌడ్ కార్యకలాపాల సమయంలో సున్నిత సమాచారాన్ని భద్రపరచడానికి డేటా ట్రస్ట్ షీల్డ్ రూపొందించినట్టు వివరించింది. ఈ సొల్యూషన్ గూగుల్ క్లౌడ్‌లో పరీక్షించామని, భవిష్యత్తులో ఇతర భారీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లతో అనుసంధానిస్తామని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్సిగ్నల్ఈ సేవలు డేటా భద్రతలో ఒక ప్రధాన ముందడుగు అని, అధిక స్థాయి రక్షణను అందిస్తుందని హెచ్‌సీఎల్‌టెక్ ఈవీపీ ఆనంద్ స్వామి వివరించారు. ఇంటెల్ అధునాతన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఈ సొల్యూషన్ డిజిటల్ ఆస్తులను సురక్షితం చేస్తుందని, క్లౌడ్ వ్యవస్థపై విశ్వాసం పెంచుతుందని అన్నారు. -
ఇంటెల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ సౌకర్యాలు మళ్లీ..
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సిబ్బందికి ఉచితంగా కాఫీ, టీ వంటి పానీయాలు అందించే సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. శ్రామికశక్తిని ఉత్తేజపరిచే ఈ నిర్ణయం అంతర్గత సందేశాల ద్వారా షేర్ చేసినట్లు తెలుస్తోంది.వ్యయ నియంత్రణ, నిర్వహణ సమస్యలతో సతమవుతున్న ఇంటెల్ దాదాపు ఏడాది తర్వాత తమ కార్యాలయ సంస్కృతిని మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రోజువారీ జీవితంలో చిన్న సౌకర్యాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు అంతర్గత సందేశంలో ఇంటెల్ పేర్కొంది."ఇంటెల్ ఇప్పటికీ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, చిన్న సౌకర్యాలు మన దినచర్యలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మేము అర్థం చేసుకున్నాము. ఇది ఒక చిన్న అడుగు అని మాకు తెలుసు, కానీ మన కార్యాలయ సంస్కృతికి మద్దతు ఇవ్వడంలో ఇది అర్ధవంతమైనదని మేము ఆశిస్తున్నాము." అని వివరించింది.ఫ్రీ ఫ్రూట్స్‌కు నోఉచిత పానీయాల సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నప్పటికీ, ఒకప్పుడు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఉచితంగా పండ్లు అందించే సౌలభ్యాన్ని మాత్రం కంపెనీ పునఃప్రారంభించడం లేదు. కంపెనీ నిరంతర వ్యయ-తగ్గింపు ప్రయత్నాలలో భాగంగా ఈ వసతిని మళ్లీ కల్పించేందుకు ఇంటెల్ సిద్ధపడలేదు. -
ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!
ప్రముఖ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ తమ ఉద్యోగులకు అందిస్తున్న ఉచిత సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. పని ప్రదేశాల్లో సిబ్బందికి అందించే టీ, కాఫీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఈ పరిణామంతో సంస్థలో పని చేస్తున్న మరింత మంది తమ కొలువులను కోల్పోయే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇజ్రాయెల్‌లోని ఇంటెల్ కంపెనీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు టీ, కాఫీ, పండ్లు వంటి సర్వీసులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. కాస్ట్‌కటింగ్ పేరిట ఇప్పటికే దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు కొలువుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రకటనతో కంపెనీ పరిస్థితిపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఉద్యోగులకు కాంప్లిమెంటరీగా అందించే కాఫీ, టీ, పండ్లకు పెద్దగా ఖర్చవ్వదు. అలాంటిది సంస్థ వాటిని అందించేందుకు కూడా ఇంతలా ఆలోచిస్తుందంటే పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. రానున్న రోజుల్లో మరింత మందికి లేఆఫ్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. ఇప్పటికే కంపెనీలోని మొత్తం శ్రామికశక్తిలో 15 శాతానికిపైగా ఉద్యోగులను కాస్టకటింగ్ పేరిట లేఆఫ్స్ పేరుతో తొలగించారు.కొత్తగా మళ్లీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన లేఖలను జారీ చేయడానికి మేనేజర్లు సమావేశాలను షెడ్యూల్ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ వారం నుంచి తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీలను సైతం అందించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!ఇదిలా ఉండగా, సిస్కో కంపెనీ సుమారు 6000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగులలో 7శాతంగా ఉంది. సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ మీద దృష్టిపెట్టాలని యోచిస్తోంది. ఇది కంపెనీని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుందని సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ గతంలో వెల్లడించారు. ఐబీఎం కంపెనీ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను చైనా నుంచి ఉపసంహరించుకున్న తరువాత సుమారు 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను తొలగించింది. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియన్ కూడా 14000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ఇదే బాటలు డెల్, షేర్‌చాట్ వంటి దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నాయి. -
15 వేల మంది తొలగింపు ప్రకటన.. షేర్లు భారీ పతనం
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పోరేషన్ భారీగా నష్టపోయింది. భారీ వృద్ధి అంచనాతో 15,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే ఆ కంపెనీ షేర్లు 40 సంవత్సరాలలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి.శుక్రవారం న్యూయార్క్‌లో ట్రేడింగ్ ప్రారంభించిన తర్వాత షేర్లు 26% పైగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 32 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం, కనీసం 1982 నుంచి కంపెనీ స్టాక్ అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని ఇది సూచిస్తోంది.ప్రస్తుత త్రైమాసికంలో అమ్మకాలు 12.5 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లుగా ఉంటాయని కంపెనీ గురువారం తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం విశ్లేషకులు సగటున 14.38 బిలియన్ డాలర్లు అంచనా వేశారు. కానీ ఇంటెల్ ఒక్కో షేరు 3 సెంట్ల చొప్పున నష్టపోయాయి. ఇంటెల్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 15% మందికిపైగా తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇంటెల్ తాజాగా తెలిపింది. -
భారీ ఉద్యోగాల కోత!.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం
2024లో కూడా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ చిప్ తయారీ సంస్థ 'ఇంటెల్' (Intel) కూడా చేరింది.ఇంటెల్ లాభాలు గణనీయంగా తగ్గడం.. మార్కెట్ వాటాను కోల్పోయిన తర్వాత, ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ వారంలోనే వేలాదిమంది ఉద్యోగులను తొలగించున్నట్లు సమాచారం. అయితే ఎంతమందిని తొలగిస్తుందనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. ఉద్యోగుల తొలగింపులు ఈ వారంలోనే ఉండొచ్చని సమాచారం.ఇంటెల్ కంపెనీ సుమారు లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే ఇది అక్టోబర్ 2022 నుంచి డిసెంబర్ 2023 మధ్య భారీగా ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే.. కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌కు షోకాజ్ నోటీసు.. ఎందుకంటే?చిప్ తయారీ రంగంలో ఖర్చులను తగ్గించి రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఇంటెల్ పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఈఓ పాట్రిక్ పీ గెల్సింగర్ వెల్లడించారు. కంపెనీ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల కోసం చిప్‌లను తయారుబ్ చేస్తోంది. ఇతర కంపెనీల కోసం కూడా సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయడానికి ఫ్యాక్టరీలను నిర్మించడంపై దృష్టి సారించింది. సంస్థ ఇటీవల తన తయారీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నాగ చంద్రశేఖరన్‌ను నియమించుకుంది. -
డీప్‌ఫేక్ టెక్నాలజీకోసం ఇంటెల్‌తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ
యూఎస్ ఆధారిత సైబర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ అమెరికన్ చిప్ తయరీ సంస్థ ఇంటెల్ సహకారంతో డీప్‌ఫేక్ డిటెక్షన్ టెక్నాలజీను రూపొందిస్తుంది. మీడియా సంస్థల కథనం ప్రకారం.. మెకాఫీ డీప్‌ఫేక్ డిటెక్టర్ సింథటిక్ కంటెంట్‌ను గుర్తించడానికి ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లలోని న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్పీయూ)ను వాడుకుంటూ ఏఐ అల్గారిథమ్‌లను అమలు చేస్తుంది.డీప్‌ఫేక్ ప్రాసెసింగ్ కోసం వ్యక్తిగత డేటాను క్లౌడ్‌కు పంపాల్సిన అవసరం లేకుండా విశ్లేషణ మొత్తం డివైజ్‌లోనే జరుగుతుందని మెకాఫీ తెలిపింది. ఈ ప్రక్రియ వినియోగదారు గోప్యతకు ప్రధాన్యం ఇస్తుందని చెప్పింది. ఈ టెక్నాలజీ పనితీరును 300 శాతం మెరుగుపరిచేలా కొత్త విధానం ఉపయోగపడుతుందని తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో డీప్‌ఫేక్ సంబంధించిన వీడియోలను కనుగొనేందుకు మరిన్ని ల్యాంగ్వేజీలను వినియోగించనున్నట్లు చెప్పింది.మెకాఫీ డీప్ ఫేక్ డిటెక్టర్ ఏఐ ఆధారిత డిటెక్షన్ టెక్నిక్లను వినియోగిస్తుంది. ఏఐ ట్రాన్స్ఫామ్ ఆధారిత ‘డీప్ న్యూరల్ నెట్వర్క్’ మోడల్‌లతో ఇది పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా మెకాఫీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ స్టీవ్ గ్రోబ్‌మాన్ మాట్లాడుతూ..‘ఇంటెల్‌తో కలిసి పనిచేయడం గొప్పఅనుభవాన్నిస్తుంది. ఏఐ రూపొందించిన డీప్‌ఫేక్‌ల్లో నకిలీ వాటిని గుర్తించేలా కొత్త టెక్నాలజీను వాడుతున్నాం. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ టెక్నాలజీకు చెందిన ఎన్‌పీయూను ఉపయోగిస్తున్నాం. దాంతో వినియోగదారులకు శక్తివంతమైన ఏఐ డీప్‌ఫేక్ డిటెక్షన్ సామర్థ్యాలను అందించనున్నాం’ అన్నారు. -
ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ మృతి.. సైకిల్‌పై వెళ్తుండగా ఏమైందంటే..
ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ(68) మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్షిప్లో కన్నుముశారు. ఆయన సైకిల్‌పై వెళుతుండగా వేగంగా వచ్చిన క్యాబ్ ఢీకొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..బుధవారం తెల్లవారుజామున 5:50 గంటలకు సైనీ తన సహచరులతో కలిసి నెరుల్ ప్రాంతంలోని పామ్ బీచ్ రోడ్డులో సైకిల్‌పై వెళుతున్నారు. వేగంగా వస్తున్న క్యాబ్ సైనీ సైకిల్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే కిందపడిన సైకిల్ ఫ్రేం క్యాబ్ ముందు చక్రాల కింద ఇరుక్కుపోయిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో సైనీకి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తోటి సైక్లిస్టులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు చెప్పారు. ఇదీ చదవండి: ఆన్లైన్లో ఆవులు.. ఊరించిన ఆఫర్.. తీరా చూస్తే.. సైనీ ఇంటెల్ 386, 486 మైక్రోప్రాసెసర్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. కంపెనీ పెంటియమ్ ప్రాసెసర్ రూపకల్పనకు ఆయన నాయకత్వం వహించారు. ఇంటెల్ దక్షిణాసియా విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన సతీమణి మూడేళ్ల క్రితమే చనిపోయారు. కుమార్తె, కుమారుడు అమెరికాలో నివాసముంటున్నారు. సైనీ మృతిపై ఇంటెల్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. -
‘అప్పుడే అయిపోలేదు’..ఇంటెల్ ఉద్యోగులకు భారీ షాక్..!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. తాజాగా చేపట్టిన 5వ రౌండ్ తొలగింపుల్లో సుమారు 235 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్ధిక మాద్యం మందస్తు భయాలు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా సంస్థలు వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకుంటున్నాయి. ఇంటెల్ సైతం అదే దారిలో ఉన్నట్లు సమాచారం. అమెరికా కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటీలో రీసెర్చ్, డెవలప్మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది చిప్ తయారీ సంస్థ ఇంటెల్ 2025 నాటికి కాస్ట్ కటింగ్ చేసి సుమారు 10 బిలియన్ డాలర్లను ఆదా చేయాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఇందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ‘ఇంటెల్ సంస్థ పలు విభాగాల్లో ఉద్యోగుల తొలగింపుతో ఖర్చుల్ని తగ్గించుకునే వ్యూహంతో పనిచేస్తుందని’అని కంపెనీ ప్రతినిధి అడీ బర్ శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ నివేదికలో పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపులు అప్పుడే అయిపోలేదని.. వచ్చే ఏడాది మరిన్ని తొలగింపులు ఉండవచ్చని పేర్కొన్నారు. కాగా, గతంలో జరిగిన ఉద్యోగుల తొలగింపుల్లో ఇంటెల్ దాని ఫోల్సమ్ క్యాంపస్‌లో 549 మందికి పింక్ స్లిప్ జారీ చేసింది. -
భారత్‌లో ఆఫీస్‌ను అమ్మేస్తున్న ఇంటెల్.. వేలాది మంది ఉద్యోగుల్ని..
మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ వరకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ కంపెనీలకు భిన్నంగా టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్థిక మాంద్యం రాబోతుందన్న అంచనాల నేపథ్యంలో కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులకు అందించే జీత భత్యాల్లో ఇంటెల్ కోత విధించింది. తాజాగా, భారత్‌లోని బెంగళూరు ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 250,000 స్కైర్ ఫీట్ కార్యాలయాన్ని ఇంటెల్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. రూ.450 కోట్ల విలువైన ఆఫీస్ బిల్డింగ్‌ను అమ్మేందుకు కొనుగోలు దారుల్ని బిడ్డింగ్ ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్ల లీజ్‌కు అయితే, అమ్మకం పూర్తయిన త్వరాత అదే ఆఫీస్ కార్యాలయాన్ని మూడేళ్ల పాటు ఇంటెల్ లీజుకు తీసుకోనుంది. ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అమలు చేయనుంది. నిజమే.. అమ్ముతున్నాం బెంగళూరు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ఉన్న ఆఫీస్‌ను అమ్ముతున్నారనే నివేదికపై ఇంటెల్ ప్రతినిధులు స్పందించారు. అమ్మకం నిజమేనని, హైబ్రిడ్ ఫస్ట్ కంపెనీగా, మా ఉద్యోగులు ఆన్ సైట్లో పనిచేస్తున్నప్పుడు వారి కోసం వర్క్‌స్పేస్‌లను రూపొందించేలా స్పేస్ వినియోగాన్ని అంచనా వేస్తున్నాం. అదే సమయంలో ఖర్చుల్ని తగ్గించుకుంటున్నామని చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. 14,000 మంది ఉద్యోగులు బెంగళూరు ఇంటెల్ కార్యాలయంలో 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వారు ఉన్నారు. కంపెనీ చరిత్రలోనే భారీ నష్టం కోవిడ్-19 కారణంగా మహమ్మారి సంక్షోభ సమయంలో చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో పర్సనల్ కంప్యూటర్లకు గిరాకీ అమాంతం పెరిగింది. కంపెనీలు తిరిగి తెరుచుకుంటుండడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పీసీలకు గిరాకీ పడిపోయింది. వెరసీ ఆ ప్రభావం ఇంటెల్ క్యూ1 ఫలితాల పడింది. ఇంటెల్ ప్రతి షేర్ ఆదాయంలో 133 శాతం వార్షిక తగ్గింపు నమోదు కాగా, ఆదాయం సంవత్సరానికి దాదాపు 36 శాతం పడిపోయి 11.7 బిలియన్లకు పడిపోయిందని సీఎన్‌బీసీ నివేదిక తెలిపింది. ఈ పరిణామాలతో ఇంటెల్ ఎంత వీలైతే అంతే ఖర్చును తగ్గించుకుంటుంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న సొంత ఆఫీస్ బిల్డింగ్‌ను అమ్మేసి.. లీజుకు తీసుకుంటుందని సమాచారం. చదవండి👉 29 ఏళ్ల తర్వాత.. ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్ రాజీనామా! -
29 ఏళ్ల తర్వాత.. ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్ రాజీనామా!
ప్రముఖ టెక్ దిగ్గజం, అమెరికా చిప్ తయారీ సంస్థ ఇంటెల్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంటెల్ ఇండియా అధినేతగా, వివిధ హోదాల్లో 29 ఏళ్ల పాటు నిర్విరామంగా సేవలందించిన నివృతి రాయ్ ఇంటెల్‌కు రాజీనామా చేశారు. త్వరలో, ‘ఇన్వెస్ట్ ఇండియా’ అధినేతగా బాధ్యతలు చేపట్టనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కొంత కాలం క్రితం ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట్‌గా కొనసాగుతున్న దీపక్ బగ్లా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానాన్ని రాయ్ భర్తీ చేయనున్నారు. ఇక రాయ్ రాజీనామాని ఇంటెల్ యాజమాన్యం ధృవీకరించింది. ‘రాయ్ నాయకత్వంలో ఇంటెల్ ఇండియా గణనీయమైన వృద్దిని సాధించిందని కొనియాడింది. ఆర్ధిక సేవల విభాగంలో చేరడంపై అభినందనలు తెలిపింది. రాయ్ 1994లో అమెరికా ఇంటెల్‌లో డిజైన్ ఇంజినీర్‌గా తన కెరియర్ను ప్రారంభించారు. 2005లో భారత్‌కు తిరిగి వచ్చిన ఆమె ఆ సంస్థ చిప్సెట్ ఇంజినీరింగ్ అండ్ ఐపీ డెవెలప్మెంట్ గ్రూప్ సీనియర్ డైరెక్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. వ్యాపార మెళుకువలు, అపారమైన అనుభవం కారణంగా 2016 నాటికి ఇంటెల్ ఇండియా అధినేత స్థాయికి చేరుకున్నారు. తాజాగా, ఇంటెల్‌కు రాజీనామా చేసి ఇన్వెస్ట్ ఇండియాలో చేరనున్నారు. నారీ శక్తి పురస్కారం.. ఇంటెల్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే.. 2021 నుంచి ఇంటెల్ ఇండియా స్కిల్ ట్రైనింగ్, రూరల్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రయత్నాలను ప్రారంభించింది. ముఖ్యంగా, 20లక్షల మంది పిల్లలకు, 5,000 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులకు స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించింది.ప్రపంచ స్థాయిలో మహిళా వ్యవస్థాపకత, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన అత్యుత్తమ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమెకు నారీ శక్తి పురస్కారాన్ని అందజేశారు. Congrats to @rnivruti of @IntelIndia on being awarded the #NariShaktiPuraskar by Hon’ble President Shri Ramnath Kovind ji for developing power efficient semiconductor chips & new rural connectivity solutions for cost-effective & high-speed broadband connection.@rashtrapatibhvn https://t.co/e4AKR3rEHH — Basavaraj S Bommai (@BSBommai) March 8, 2022 రాజీనామా.. ఇంటెల్‌లో చర్చాంశనీయం కోవిడ్-19తో పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరగడం.. వర్క్ ప్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చిప్ కొరత నెలకొంది. చిప్‌లు, సెమీ కండక్టర్ల కొరతతో స్మార్ట్ ఫోన్ల లాంచింగ్, కార్ల ఆవిష్కరణలు.. జాప్యం అవుతున్నాయి. కార్ల డెలివరీ కూడా ఆలస్యం అవుతున్నది. ఇలా ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ విభాగాలతో పాటు మొత్తం 169 రకాల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఇంటెల్ లాంటి చిప్ తయారీ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ తరుణంలో నివృతి రాయ్ ఇంటెల్ ఇండియాకు రాజీనామా చేయడం చర్చాంశనీయంగా మారింది. చదవండి👉 మోదీ ‘హై - టెక్ హ్యాండ్ షేక్’.. భారత్‌కు పెట్టుబడుల వరద! -
విషాదం: ఇంటెల్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత
న్యూయార్క్: అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్, టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడుగోర్డాన్ మూరే (94)కన్నుమూశారు. శనివారం హవాయిలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఇంటెల్ కార్పొరేషన్ తన సహ వ్యవస్థాపకుడికి నివాళులర్పించింది. ఆయన చిరస్మరణీయం.. గొప్ప విజనరీని కోల్పోయమంటూ ట్వీట్ చేసింది. మూరే దూరదృష్టి హైటెక్ యుగానికి వేదికైంది అంటూ వ్యాపార వర్గాలు నివాళులర్పించాయి. యాపిల్, ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీలకు ఆగమనానికి ఆద్యుడు మూరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. Today, we lost a visionary. Gordon Moore, thank you for everything. pic.twitter.com/bAiBAtmd9K — Intel (@intel) March 25, 2023 మూరే ఎప్పుడూ 'యాక్సిడెంటల్ ఎంటర్ప్రెన్యూర్' అని తనను తాను పిలుచుకునేవారు. ఎందుకంటే ఆయన టీచర్ కావాలనుకునేవారట. కానీ ఎలక్ట్రానిక్స్‌ను ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమలలో ఒకటిగా మార్చి సరికొత్త విప్లవానికి నాంది పలికారు. మైక్రోచిప్ పరిశ్రమలో 500 డాలర్ల పెట్టుబడితో బిలియనీర్‌గా అవతరించారు. 1960లలో కంప్యూటర్ చిప్ సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన కాలిఫోర్నియా సెమీకండక్టర్ చిప్ మేకర్ ఇంటెల్.. సిలికాన్ వ్యాలీకి ఆ పేరు రావడానికి దోహదపడింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, గతంలో అమెరికన్ విస్తారమైన ఉక్కు పారిశ్రామిక ఆధిపత్యానికి బ్రేక్ వేసింది ఇంటెల్. ఇంటెల్ ఆవిష్కారం మూరే అతని దీర్ఘకాల సహచరుడు రాబర్ట్ నోయ్స్ జూలై 1968లో ఇంటెల్‌ను స్థాపించారు. వందల మిలియన్ల మందికి ల్యాప్‌టాప్ కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చిన ఘనత, టోస్టర్ ఓవెన్లు, బాత్రూమ్ స్కేల్స్ , టాయ్ ఫైర్ ట్రక్కుల నుండి టెలిఫోన్లు, ఆటోమొబైల్స్ ,ఎయిర్‌క్రాఫ్ట్ దాకా తమ మైక్రోప్రాసెసర్లతో అరుదైన ఘనతను మూరే దక్కించుకున్నారు. 1975లో ఇంటెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికంటేముందు మూరే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు 1979లో బోర్డ్ ఛైర్మన్, సీఈవోగా నియమితుడయ్యారు. 1987లో సీఈవోగా పదవి నుంచి వైదొలగి ఛైర్మన్‌గా ఉన్నారు. మరో విశేషమేమిటంటే, 1990ల నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన 80శాతం కంప్యూటర్లలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్లే. ఫలితంగా చరిత్రలో అత్యంత సంపన్నమైన సెమీ కండక్టర్ వ్యాపారంగా నిలిచింది. (ఇదీ చదవండి: బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్‌బర్గ్) గొప్ప దాత మూరే మూరే, అతని భార్య బెట్టీ మూరేతో కలిసి విస్తృత దానాలు చేశారు. 2001లో వీరిద్దరూ కలిస బెట్టీ మూరే ఫౌండేషన్‌ను స్థాపించారు. 175 మిలియన్ ఇంటెల్ షేర్లను విరాళంగా ఇచ్చారు. 2001లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 600 మిలియన్ డాలర్లతో ఒక విశ్వ విద్యాలయానికి అందించిన ఏకైక గొప్ప బహుమతినిచ్చిన గౌరవాన్ని దక్కించుకున్నారు. (శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) మూర్స్ లా కంప్యూటర్ విప్లవం ప్రారంభమవడానికి రెండు దశాబ్దాల ముందే కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్స్ ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతాయని మూరే ముందే ఊహించాడు. ఆ తర్వాత దీన్ని ప్రతి రెండేళ్లకు అని సవరించారు. దీన్నే మూర్స్ లా అని పిలుస్తారు. -
ఏపీ విద్యార్థికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ‘ఇంటెల్’లో ఉద్యోగం
ఆత్మకూరు రూరల్(నెల్లూరు జిల్లా): ఆత్మకూరు యువకుడికి యునైటెడ్ స్టేట్స్ ఇంటెల్ సంస్థలో వార్షిక ప్యాకేజీ రూ.1.2 కోట్లతో కొలువు దక్కింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాతజంగాలపల్లికి చెందిన ఈగా మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట సాయికృష్ణారెడ్డి ఖరక్‌పూర్ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఈ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్న సాయికృష్ణారెడ్డి వచ్చే మే నెలలో ఈ కోర్సు పూర్తి చేసుకుని, ఆగస్టులో యూఎస్‌కు వెళ్లి ఉద్యోగంలో చేరనున్నారు. ఈ సందర్భంగా మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతులు మాట్లాడుతూ కాయకష్టం చేసి రైతులుగా తాము సంపాదించిన సొమ్మంతా బిడ్డల భవిష్యత్ కోసమే వెచ్చిస్తున్నామని, వారు ఉన్నత స్థాయిలో ఉండడం కంటే తమకు వేరే కోరికలు లేవని భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు -
ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితుల ఆందోళన నేపథ్యంలో ఉద్యోగుల మెడపై ఉద్వాసనల కత్తి వేలాడుతోంది. తాజాగా చిప్‌మేకర్ ఇంటెల్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మూడు నెలల జీతం లేని సెలవులతో వేలాదిమంది పారిశ్రామిక కార్మికులను ఇంటికి పంపిస్తోంది. క్లిక్ చేయండి: పాన్-ఆధార్ లింక్ చేశారా? లేదంటే భారీ షాక్ తప్పదు! డెడ్‌లైన్ ఎపుడో తెలుసా? తాజా మీడియా నివేదికల ప్రకారం ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఇంటెల్ కాలిఫోర్నియాలో 201 మంది ఉద్యోగులపై వేటు వేసింది. "వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ల" ప్రకారం 111 మంది ఉద్యోగులను తొలగించగా, 90 మంది ఉద్యోగులను కంపెనీ హెడ్ క్వార్టర్ శాంటా క్లారా లొకేషన్ నుంచి బయటికి పంపింది. 2023 జనవరి 31 నుండి తొలగింపులు ప్రారంభం కానున్నాయి. 2025 చివరి నాటికి, ఇంటెల్ సంవత్సరానికి 8-10 బిలియన్ల డాలర్లమేర ఆదా చేయాలని భావిస్తోందట. (మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే..!) ప్రస్తుత వాతావరణానికి తగినట్టుగా ఖర్చులను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అక్టోబరులో కంపెనీ మూడవ త్రైమాసిక ఫలితాల కాల్ సందర్భంగా, ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ వెల్లడించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పీసీ విక్రయాలు పడిపోవడంతో ఇంటెల్ వేలాదిమందిని తొలగించనుందని గతంలోనే నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. (5జీ, ఇతర స్మార్ట్ఫోన్లపై అమెజాన్‌లో అదరిపోయే ఆఫర్లు) కాగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 853 కంప్యూటర్ వ్యాపార సంస్థలు దాదాపు 137,492 మంది కార్మికులను తొలగించాయి. రానున్న ఆర్థిక మాంద్యం ఆందోళనల మధ్య ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మెటా, ట్విటర్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సహా అనేక ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపులో ముందంజలో ఉన్నాయి. -
స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త
ఈ వారం టెక్నాలజీ మార్కెట్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు హాట్ టాపిగ్గా మారాయి. ముఖ్యంగా యాపిల్, శాంసంగ్ 5జీకి సపోర్ట్ చేసేలా తమ ఫోన్లలో సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తాయని ప్రకటించాయి. దీంతో పాటు మెటా సంస్థ తన క్వెస్ట్ ప్రో విఆర్ హెడెసెట్‌ను ఆవిష్కరించింది. హై-ఎండ్ విఆర్ యాక్సెసరీ మార్కెట్లో అడుగు పెడుతున్నట్లు హింట్ ఇచ్చింది. వీటితో పాటు మిగిలిన టెక్నాలజీ వార్త విశేషాల గురించి తెలుసుకుందాం. 40 శాతం డేటా గల్లంతు 40శాతం పైగా భారతీయ వినియోగదారుల డేటా ఆన్లైన్లో లీకైంది. దేశ ఐటీ వ్యవహారాలపై దృష్టి సారించిన అంతర్జాతీయ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఐఎస్ఎస్‌పీఏ) మన దేశానికి చెందిన 41 శాతం మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరస్తులు దొంగిలించినట్లు వెల్లడించింది. 5జీ అప్డేట్స్ దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన యాపిల్, శాంసంగ్‌తో పాటు ఇతర సంస్థలు 5జీ సపోర్ట్ చేసేలా తమ ఫోన్లలో ఓవర్-ది- ఎయిర్ సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తామని తెలిపాయి. ఉద్యోగులపై వేటు ద్రవ్యోల్బణం, సప్లయి అండ్ డిమాండ్ తగ్గిపోవడంతో టెక్ దిగ్గజం ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 113,000 మంది ఉద్యోగులు ఇంటెల్‌లో పనిచేస్తుండగా.. వారిలో 20 శాతం మంది ఉద్యోగులకు వేటు వేయనున్నట్లు బ్లూం బెర్గ్ నివేదించింది. వీఆర్ హెడ్సెట్ ఆవిష్కరణ సోషల్ మీడియా దిగ్గజం మెటా వీఆర్ యాక్సెసరీ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తన కొత్త క్వెస్ట్ ప్రో విఆర్ హెడ్‌సెట్‌ను ఆవిష్కరించింది. దీని ధర 1500 డాలర్లు ఉంది. ఈ ట్యాక్సీ గాల్లో ఎగురుతుంది చైనాకు చెందిన టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎక్స్ పెంగ్ దుబాయ్‌లో తన ఫ్లయింగ్ టాక్సీ మోడల్‌ను పరీక్షించింది. మానవరహిత విమానంపై ట్రయల్స్ నిర్వహించిన ఎక్స్‌పెంగ్.. గతంలో మానవ సహిత విమానాలను పరీక్షించినట్లు పేర్కొంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ టైప్- సీ పోర్టులను మార్కెట్లో విడుదల చేయనుంది.ఇందులో భాగంగా 2024 నాటికి ఎయిర్ పాడ్స్, మ్యాక్ యాక్ససరీస్‌కు సపోర్ట్ చేసేలా టైప్-సీ సపోర్ట్ పోర్టులను తయారు చేసి వాటిని అందుబాటులోకి తేనుంది. -
భారీగా ఉద్యోగులపై వేటు..ఇంటెల్ చరిత్రలోనే తొలిసారి!!
ప్రముఖ సెమీ కండక్టర్ తయారీ సంస్థ ఇంటెల్ ఊహించని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ డిమాండ్ తగ్గడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. బ్లూం బెర్గ్ విడుదల చేసిన జులై రిపోర్ట్‌లో ఇంటెల్ మొత్తం ఉద్యోగులు 113,700 మంది పనిచేస్తున్నారు. అయితే తాజాగా పీసీ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా ఇంటెల్ 20శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనున్నట్లు, వారిలో సేల్స్, మార్కెటింగ్ బృంద సభ్యులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నో కామెంట్ ఉద్యోగుల తొలగింపుపై ఇంటెల్ నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా.. జులై నెలలో ఆ సంస్థ ప్రకటించిన సేల్స్ గణాంకాలే కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాల ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్న ద్రవ్యోల్బణం, దీనికి తోడు కొనుగోలు సామర్ధ్యం తగ్గిపోవడం, స్కూల్స్ ఓపెన్ కావడం, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాల నుంచి విధులు నిర్వహించడం వంటి ఇతర కారణాల వల్ల పీసీల వినియోగం తగ్గిపోయింది. చదవండి👉 'మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా'..ఉద్యోగులకు సుందర్ పిచాయ్ వార్నింగ్! చైనా- ఉక్రెయిన్ వార్ సెమీ కండక్టర్ల తయారీ సంస్థలకు కీలకమైన పర్సనల్ కంప్యూటర్ల మార్కెట్ చైనాలో కోవిడ్-19 ఆంక్షలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సప్లయి చైన్ సమస్యలు డిమాండ్‌పై ప్రభావంపై పడింది.అందుకే మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఇంటెల్ కార్యకలాపాల్ని కొనసాగించాలని భావిస్తోంది. కాబట్టే ఉద్యోగుల్ని తొలగించడంపై దృష్టిసారించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 బెటర్‌డాట్ కామ్ సీఈవో, పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి! -
రూ.76వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వ పథకం, ప్రధాని మోదీతో ఇంటెల్ సీఈఓ భేటీ!
న్యూఢిల్లీ: గ్లోబల్ చిప్ దిగ్గజం ఇంటెల్ సీఈవో ప్యాట్ జెల్సింగర్తో సమావేశం సంతృప్తికరంగా సాగినట్లు కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. దేశీయంగా చేపట్టిన సెమీకండక్టర్ ప్రోగ్రామ్, మొబిలిటీ, టెక్నాలజీ, ఆటో ఇన్నోవేషన్లపై వ్యూహాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. జెల్సింగర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలసినట్లు పీఎంవో పేర్కొంది. టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నోవేషన్‌పై చర్చలు జరిగినట్లు తెలియజేసింది. కాగా.. జెల్సింగర్తో సమావేశంలో ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణా, జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సైతం హాజరైనట్లు రాజీవ్ వెల్లడించారు. సెమీకండక్టర్, డిస్ప్లే తయారీకి మద్దతుగా ప్రభుత్వం రూ.76,000 కోట్లతో పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇంటెల్ సీఈవో దేశీ పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడం ద్వారా హైటెక్ ప్రొడక్షన్‌కు గ్లోబల్ కేంద్రంగా ఆవిర్భవించాలని ప్రభుత్వం లక్షిస్తోంది. చిప్ తయారీ దిగ్గజాలను ఆకట్టుకునే యోచనలో ఉంది. -
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌ను లాంచ్ చేసిన ఇంటెల్..!
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డెస్క్‌టాప్( 12 జెన్ i9-12900KS) ప్రాసెసర్‌ను లాంచ్ చేసింది. ఇంటెల్ i9-12900KS ప్రాసెసర్ ఏకంగా 5.5GHz ఫ్రీక్వెన్సీతో పనిచేయనుంది. ఈ ప్రాసెసర్ మునుపటి i9 చిప్సెట్లకు కొనసాగింపుగా రానుంది. ఇంటెల్ i9-12900KS ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ ప్రాసెసర్ ఇంటెల్ థర్మల్ వెలాసిటీ బూస్ట్‌తో గరిష్టంగా 5.5 GHz వరకు టర్బో ఫ్రీక్వెన్సీతో పనిచేయనుంది. ఇది మెరుగైన గేమింగ్ పనితీరు కోసం ఇంటెల్ అడాప్టివ్ బూస్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. 30MB ఇంటెల్ స్మార్ట్ కాచీతో పాటు మొత్తం 16 కోర్స్, 24 థ్రెడ్స్‌ను కల్గి ఉంది. 150W ప్రాసెసర్ బేస్ పవర్, PCle Gen 5.0 అండ్ 4.0కి సపోర్ట్ చేస్తుంది. DDR5 4800 MT/s వరకు మరియు DDR4 3200 MT/s మద్దతును అందిస్తోంది. Intel కోర్ i9-12900KS ఇప్పటికే ఉన్న Z690 మదర్బోర్డులకు అనుకూలంగా ఉండనుంది. ధర ఏంతంటే...? ఇంటెల్ తన కొత్త i9-12900K ప్రాసెసర్‌ను ఏప్రిల్ 5, 2022 నుంచి అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాసెసర్ ధర 739 డాలర్లు(సుమారు రూ. 55,937)గా ఉంది. ఈ ప్రాసెసర్‌ను ప్రపంచవ్యాప్తంగా అన్ని రిటైలర్ల వద్ద బాక్స్డ్ ప్రాసెసర్‌గా కనుగొనవచ్చు. చదవండి: అమెరికాలో రికార్డు సృష్టించిన మోటరోలా -
ఇంటెల్‌కు షాక్.. శాంసంగ్ దెబ్బ మామూలుగా లేదు!
ఒకవైపు సెమీకండక్టర్ల కొరతతో ఆటోమొబైల్ రంగం, డివైజ్ తయారీ రంగం ఘోరంగా దెబ్బ తిన్నాయి. కొత్త మోడల్స్ సంగతి ఏమోగానీ.. ప్రొడక్టివిటీని పెద్ద మొత్తంలో చేయలేకపోతున్నాయి. ఈ తరుణంలో ఈ గ్యాప్‌లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ దూసుకొచ్చింది. ఏకంగా చిప్ దిగ్గజం ‘ఇంటెల్’కు ఎసరు పెట్టి.. తొలి స్థానాన్ని అధిగమించింది. 2021లో లాజిక్ ఐసీ, మెమరీ చిప్ సెగ్మెంట్లలో ఉత్పత్తి అధికంగా జరగడంతో శాంసంగ్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ టెక్నాలజీలో ఉపయోగించే డైనమిక్ ర్యాన్డమ్-యాక్సెస్ మెమరీ (DRAM), NAND ఫ్లాష్ మార్కెట్ ఫర్ఫార్మెన్స్ సైతం ఇంటెల్ కంటే మెరుగైన బిజినెస్ చేయడం విశేషం. వాస్తవానికి కిందటి ఏడాది రెండో త్రైమాసికం వద్దే ఇంటెల్‌ను శాంసంగ్ అధిగమించింది. అయితే అది కొన్ని విభాగాల్లో మాత్రమే కావడం గమనార్హం. ఇప్పుడు పూర్తి కేటగిరీల్లో ఇంటెల్‌ను శాంసంగ్ డామినేట్ చేసేసింది. స్మార్ట్‌ఫోన్ ఎస్వోసీ (సిస్టమ్ ఆన్ చిప్), జీపీయూ అమ్మకందారులు కూడా యాభై శాతం అధిక ఆదాయాన్ని చవిచూసినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. తద్వారా అమెరికన్ సెమీకండక్టర్ కంపెనీ ఇంటెల్‌ను.. దక్షిణ కొరియా శాంసంగ్ అన్నింటా అధిగమించినట్లయ్యింది. ఈ పోటీలో శాంసంగ్‌ను ఇంటెల్ ఇప్పట్లో అధిగమించకపోవచ్చనే భావిస్తున్నారు నిపుణులు. అదనంగా టాప్ 15 అమ్మకందారుల్లో.. 27 శాతం ఆదాయ వృద్ధిని గమనించినట్లు రీసెర్చ్ అనలిస్ట్ విలియమ్ లీ వెల్లడించారు. ఇదిలా ఉంటే చిప్ కొరత సమస్య 2023 వరకు తీరేది కాదని ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ చెప్తున్నారు. మరోవైపు చిప్ కొరతను క్యాష్ చేసుకునే ఉద్దేశంలో శాంసంగ్ ఉంది. సుమారు 17 బిలియన్ల డాలర్లతో సెమీకండక్టర్ కంపెనీని ఆస్టిన్ బయట నెలకొల్పుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత వార్త: చిప్ ఎఫెక్ట్.. శాంసంగ్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్ -
ఒమిక్రాన్ ఎఫెక్ట్..! మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం..! గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ బాటలోనే...
ప్రపంచదేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ దెబ్బకు కేసులు గణనీయంగా పెరగడంతో ఆయా దేశాలు లాక్ డౌన్‌ను విధించే ఆలోచనలో ఉన్నాయి. కాగా ఒమిక్రాన్ ప్రభావం దిగ్గజ టెక్ కంపెనీలపై కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ బాటలోనే..! 2022 జనవరి అమెరికా లాస్‌వెగాస్‌లో జరిగే టెక్ కాన్ఫరెన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ ఇప్పటికే పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. వారి బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా పయనిస్తోంది. సీఈఎస్-2022 షోలో పాల్గొనట్లేదని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా తాత్కలికంగా టెక్ కాన్ఫరెన్స్‌ను వాయిదా వేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. లాస్ వెగాస్‌లో జనవరి 5,6,7,8 తేదీల్లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జరగనుంది. 40కు పైగా కంపెనీలు లెనొవొ, టీ-మొబైల్స్, ఏటీ అండ్ టీ, మెటా, ట్విటర్, అమెజాన్, టిక్‌టాక్, పింట్రెస్ట్, ఆల్ఫాబెట్‌కు చెందిన వేమో వంటి 40కి పైగా బడా టెక్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ సదస్సుకు హాజరు కావాల్సి ఉండగా....వీరు కూడా సీఈఎస్-2022 షోలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ షోలో సుమారు 2200 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు పాల్గొనున్నాయి. అంతర్జాతీయ సదస్సులు వాయిదా..! అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇప్పటికే తెలిపింది.కాగా మరోవైపు ఒమిక్రాన్ అలజడితో జెనీవాలో జరగాల్సిన డబ్య్లూటీవో మినిస్టీరియల్ (ఎంసీ12) కూడా వాయిదా పడింది. చదవండి: చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్ మస్క్..! -
నో వ్యాక్సిన్.. నో శాలరీ.. నో జాబ్!
ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణతో వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగింపు డిమాండ్‌కు తలొగ్గుతున్న టెక్ దిగ్గజాలు.. ఉద్యోగుల వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు!. ఈ విషయంలో జీతాల కోతల నుంచి అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సైతం వెనకాడట్లేదు. తాజాగా వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగుల్ని.. ఇంటికి సాగనంపాలని గూగుల్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో పయనించేందుకు కంపెనీలన్నీ సిద్ధపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, ఇతర కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు అలర్ట్. వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. ఆ సర్టిఫికెట్‌ను కంపెనీల్లో సమర్పించండి. లేకుంటే జీతాల కట్టింగ్.. అవసరమనుకుంటే ఊస్టింగ్‌కు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ నిర్ణయం ప్రకటించాక.. తర్వాత మరో ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయమే ప్రకటించింది. సెమీకండక్టర్లు తయారు చేసే ఇంటెల్ కంపెనీ తాజాగా ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 4లోపు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్-వివరాల్ని సమర్పించాలని.. లేనిపక్షంలో వేతనం లేని సెలవుల మీద ఉద్యోగుల్ని పంపిస్తామని హెచ్చరించింది. ఇక వ్యాక్సినేషన్‌ను దూరంగా ఉంటున్న ఉద్యోగాలు మినహాయింపుల కోసం సరైన ధృవపత్రాల్ని సమర్పించాలని కోరింది. మెడికల్, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణిస్తామని, ఇతర కారణాలను అంగీకరించబోదని మెమోలో పేర్కొంది ఇంటెల్. ఇందుకోసం మార్చి 15, 2022 డెడ్‌లైన్ విధించారు. ఇక వ్యాక్సినేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. మూడు నెలలపాటు జీతాలు ఇవ్వమని, అప్పటికీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోతే తొలగింపు దిశగా ఆలోచిస్తామని ఇంటెల్ హెచ్ఆర్ హెడ్ క్రిస్టీ పాంబియాంచీ వెల్లడించారు. ఇక గూగుల్, ఇంటెల్ లాగే మరో 100 కంపెనీలు (మైక్రోసాఫ్ట్, మెటాలతో పాటు భారత్‌కు చెందిన కొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి) ఈ నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ! వ్యాక్సినేషన్‌కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశంలోని కంపెనీలు సైతం నిర్ణయించాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు, చిన్నాచితకా కంపెనీలు సైతం ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. కొన్ని కంపెనీలైతే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్న ఎంప్లాయిస్‌కు ‘హై రిస్క్’ ట్యాగ్‌ను తగిలిస్తుండడంతో.. సదరు ఉద్యోగులు అవమానభారంగా భావిస్తున్నారు. తద్వారా వ్యాక్సినేషన్లో పాల్గొంటున్నారు. నో రిక్రూట్మెంట్ ఇక ఉద్యోగాల విషయంలోనే కాదు.. వాటి భర్తీ విషయంలోనూ కఠినంగా వ్యాక్సినేషన్ రూల్స్ ఫాలో అవుతున్నారు. వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటే.. వాళ్లకు ఉద్యోగాలు కష్టంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఐటీ, కార్పొరేట్, రియల్టి, ఫ్యాకల్టీ రంగాల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పణ కాలం తప్పనిసరిగా ఉంటోంది. చాలా కంపెనీల్లో హెచ్ఆర్లు.. ఇంటర్వ్యూ ప్రాసెస్ మొదలుపెట్టే ముందే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అడుగుతుండడం విశేషం. చదవండి: ఒమిక్రాన్ అలజడి! భారత్‌ను కుదిపేయనుందా? -
టాటా గ్రూప్ భారీ ప్లాన్.. చైనాకు వేల కోట్ల నష్టం!
దేశంలో సెమీకండక్టర్ల తయారీ కోసం టాటా గ్రూప్ భారీ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చీప్ కొరత ఉంది. ఈ అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని టాటా చూస్తుంది. సెమీకండెక్టర్ల అసెంబ్లీ & టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 300 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి టాటా గ్రూప్ మూడు రాష్ట్రాలతో చర్చలు జరుపుతోందని సమాచారం. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల తెలిపాయి. సెమీకండెక్టర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు కొన్నాళ్ల క్రితం టాటా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్చలు గనుక సఫలం అయితే, ఈ 3 రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ & టెస్టింగ్ (ఓఎస్ఏటీ) ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ఓఎస్ఏటీ ప్లాంట్‌లో తయారైన సిలికాన్ వేఫర్లను అసెంబ్లింగ్, పరీక్షలు, ప్యాకింగ్ వంటివి చేస్తారు. ఇక్కడే అవి పూర్తి స్థాయి సెమీకండెక్టర్లు రూపొందుతాయి. వచ్చే నెల చివరి నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ప్రదేశాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని కొన్ని వర్గాలు తెలిపాయి. టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రాజెక్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' డ్రైవ్‌ను బలపరుస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల దక్షిణాసియా దేశాన్ని స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో రెండవ అతిపెద్ద సెమీకండెక్టర్స్ తయారీదారుగా మార్చడానికి సహాయపడింది. చైనాకు వేల కోట్లలో నష్టం ప్రస్తుతం చైనాలో భారీగా సెమీకండెక్టర్ చిప్స్ తయారు అవుతున్నాయి. ఇక్కడి నుంచి అనేక దేశాలకు చిప్స్ ఎగుమతి అవుతున్నాయి. అయితే, టాటా గ్రూప్ చేపట్టబోయే ప్రాజెక్టు వల్ల చైనాకు వేల కోట్లలో నష్టం కలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. టాటా ఓఎస్ఏటీ వ్యాపారం కోసం ఇంటెల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్(ఎఎమ్డి), ఎస్ టి మైక్రోఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలతో చర్చలు జరుపుతుంది. ఈ కర్మాగారం వచ్చే ఏడాది చివరలో కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, 4,000 మంది కార్మికులను నియమించుకొనున్నట్లు సమాచారం. -
భారత్ దెబ్బకు చైనా భారీగా నష్టపోనుందా?
Semiconductor Manufacturing: కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చైనాకు భారీగా నష్టాలు కలిగించే అవకాశాలు ఉన్నాయా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా సెమీకండక్టర్ చిప్‌ల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కొరతను అధిగమించడానికి భారత్ ప్రయత్నిస్తుంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి భారతదేశం మెగా మల్టీ-బిలియన్-డాలర్ క్యాపిటల్ సపోర్ట్, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చిప్ కొరత కారణంగా అన్నీ రంగాలలోని పరిశ్రమలు భారీ ఉత్పత్తి కోతలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. టీఓఐ నివేదికప్రకారం, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ), ఇంటెల్, ఎఎమ్‌డీ, యునైటెడ్ మైక్రోఎలక్ట్రానిక్స్ కార్ప్, ఫుజిట్సు వంటి కొన్ని అగ్ర సెమీకండక్టర్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నారు. సెమీకండక్టర్ తయారీదారులను వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలనే ప్రధానమంత్రి కార్యాలయం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. కంపెనీలను దేశంలోకి తీసుకురావడానికి ఆకర్షణీయమైన విధానంతో ముందుకు రావాలని బహుళ మంత్రిత్వ శాఖలు ఆదేశించింది. ప్రత్యేక ప్రోత్సాహకాలు సెమీకండక్టర్ తయారీదారులకు దిగుమతి వస్తువులపై సుంకం రాయితీ ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ & సెమీకండక్టర్(ఎస్ఎసీఎస్), తయారీని ప్రోత్సహించే పిఎల్ఐ స్కీం వంటి పథకాల నుంచి కూడా ప్రభుత్వం అదనపు ప్రయోజనాలను అందించాలని చూస్తుంది. దేశంలో సెమీకండక్టర్లను తయారు చేయకపోవడంతో దేశంలోని డిమాండ్ తీర్చడం కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. భారతదేశంలో సెమీకండక్టర్ల డిమాండ్ 2025 నాటికి ప్రస్తుతం ఉన్న 24 బిలియన్ డాలర్ల నుంచి సుమారు 100 బిలియన్ డాలర్లకు చేరుకొనున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. చైనాకు దెబ్బ సెమీకండక్టర్ తయారీదారులను దేశానికి ఆకర్షించడానికి ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, రక్షణ & ఆటో వంటి ఇతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అవసరాలు కంపెనీలను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పిస్తుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు దేశంలో పెట్టుబడులు వస్తే మాత్రం చైనాకు దెబ్బ పడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ల ఎగుమతి దేశంగా చైనా ఉంది. మన దేశంలో ఏర్పాటు కాబోయే ఈ పరిశ్రమ వల్ల ఆ దేశానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. -
డేటా ఆధారిత ల్యాబ్స్ ఏర్పాటులో ఇంటెల్
న్యూఢిల్లీ: పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఎలక్ట్రానిక్ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ వచ్చే ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా పలు కళాశాలల ప్రాంగణాల్లో డేటా ఆధారిత ల్యాబ్స్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 100 పైచిలుకు యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ’ఉన్నతి’ ప్రోగ్రాంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్ తెలిపారు. ఈ ల్యాబ్స్ ఏర్పాటుకయ్యే వ్యయాలను ఆయా విద్యా సంస్థలు భరించనుండగా, సాంకేతిక.. నాలెడ్జ్ భాగస్వామిగా ఇంటెల్ తోడ్పాటు అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉన్నతి ప్రోగ్రాం కింద జట్టు కట్టే విద్యా సంస్థలు తమ బడ్జెట్, సాంకేతిక, మౌలిక సదుపాయాల అవసరాలకు అనుగుణంగా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి ల్యాబ్‌లో ఇంటెల్ సూచించే హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, కోర్స్ కంటెంట్ మొదలైనవి ఉంటాయి. విద్యార్థులకు కో–బ్రాండెడ్ సరి్టఫికెట్లు లభిస్తాయి.