దేశంలో సెమీకండక్టర్ల తయారీ కోసం టాటా గ్రూప్ భారీ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చీప్ కొరత ఉంది. ఈ అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని టాటా చూస్తుంది. సెమీకండెక్టర్ల అసెంబ్లీ & టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 300 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి టాటా గ్రూప్ మూడు రాష్ట్రాలతో చర్చలు జరుపుతోందని సమాచారం. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల తెలిపాయి. సెమీకండెక్టర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు కొన్నాళ్ల క్రితం టాటా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ చర్చలు గనుక సఫలం అయితే, ఈ 3 రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ & టెస్టింగ్ (ఓఎస్ఏటీ) ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ఓఎస్‌ఏటీ ప్లాంట్‌లో తయారైన సిలికాన్ వేఫర్లను అసెంబ్లింగ్, పరీక్షలు, ప్యాకింగ్ వంటివి చేస్తారు. ఇక్కడే అవి పూర్తి స్థాయి సెమీకండెక్టర్లు రూపొందుతాయి. వచ్చే నెల చివరి నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ప్రదేశాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని కొన్ని వర్గాలు తెలిపాయి. టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రాజెక్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' డ్రైవ్‌ను బలపరుస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల దక్షిణాసియా దేశాన్ని స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో రెండవ అతిపెద్ద సెమీకండెక్టర్స్ తయారీదారుగా మార్చడానికి సహాయపడింది.
చైనాకు వేల కోట్లలో నష్టం
ప్రస్తుతం చైనాలో భారీగా సెమీకండెక్టర్ చిప్స్ తయారు అవుతున్నాయి. ఇక్కడి నుంచి అనేక దేశాలకు చిప్స్ ఎగుమతి అవుతున్నాయి. అయితే, టాటా గ్రూప్ చేపట్టబోయే ప్రాజెక్టు వల్ల చైనాకు వేల కోట్లలో నష్టం కలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. టాటా ఓఎస్ఏటీ వ్యాపారం కోసం ఇంటెల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్(ఎఎమ్‌డి), ఎస్ టి మైక్రోఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలతో చర్చలు జరుపుతుంది. ఈ కర్మాగారం వచ్చే ఏడాది చివరలో కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, 4,000 మంది కార్మికులను నియమించుకొనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment