టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. టెక్ యుగంలో ల్యాప్‌టాప్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగంలో సేవలందిస్తున్న హెచ్‌పీ(HP) కంపెనీ కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES)-2025లో వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇవి కృత్రిమమేధ సాయంతో పని చేస్తాయని కంపెనీ తెలిపింది. దాంతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంది. 2025వ సంవత్సరానికిగాను సీఈఎస్ లాస్‌వెగాస్‌లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది.
హెచ్‌పీ ఎలైట్ బుక్ అల్ట్రా జీ1ఐ: ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 ప్రాసెసర్‌తో 48 టాప్స్ ఎన్‌పీయూ టెక్నాలజీతో వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సమర్థంగా పనిచేసే ఏఐ బిజినెస్ నోట్ బుక్ అని కంపెనీ తెలిపింది.
హెచ్‌పీ జెడ్ బుక్ అల్ట్రా జీ 1ఎ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 14 అంగుళాల ల్యాప్‌టాప్ ఇది. ఏంఎడీ ప్రాసెసర్‌తో వచ్చే ఈ డివైజ్‌తో హై-పెర్ఫార్మెన్స్ వర్క్ ఫ్లోలకు ఎంతో సమర్థంగా నిర్వహించవచ్చని కంపెనీ పేర్కొంది.
హెచ్‌పీ జెడ్2 మినీ జీ1ఏ: ఏఎండీ రైజెన్ ఏఐ మ్యాక్స్ ప్రో ప్రాసెసర్లు, 6-కోర్/12-థ్రెడ్ నుంచి 16-కోర్/32-థ్రెడ్ కాన్ఫిగరేషన్లతో దీన్ని ఆవిష్కరించారు. ఏఎండీ రేడియన్ 8060ఎస్, 8050ఎస్, 8040ఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సదుపాయం ఉండేలా దీన్ని తయారు చేశారు.
ఇదీ చదవండి: మడిచే స్క్రీన్.. వాక్ చేయించే షూస్!
హెచ్‌పీ జెడ్ క్యాప్టిస్: మెటీరియల్స్ డిజిటలైజ్ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి దీన్ని రూపొందించారు. ఏఐ(AI) ఆధారిత డిజిటల్ మెటీరియల్ క్యాప్చర్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ఇది ఎన్‌వీడియోకు చెందిన జెట్సన్ ఏజీఎక్స్ జేవియర్ మాడ్యూల్, ఫోటోమెట్రిక్ కంప్యూటర్ విజన్ సిస్టమ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.
హెచ్‌పీ థండర్ బోల్ట్ 4 అల్ట్రా జీ6 డాక్: ఇది డాకింగ్ స్టేషన్‌గా పని చేస్తుంది. రెండు వెర్షన్లలో ఒకటి 180 వాట్లు, మరొకటి 280 వాట్ల శక్తిని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment