కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా.. | Sakshi
Sakshi News home page

కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..

Published Sat, Apr 13 2024 3:21 PM

Famous AI Laptops With NPU Feature In The Market - Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం వాడుతున్న ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో చాలామార్పులు వస్తున్నాయి. ప్రధానంగా యూత్‌ ఎక్కువగా వినియోగించే ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం పెంచేందుకు కంపెనీలు చాలా మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా పనిచేయడం అనివార్యమైంది. దాంతో ఉద్యోగస్థులు, స్టూడెంట్లు ఇలాంటి వాటిపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. వీరి అవసరాలు దృష్టిలో ఉంచుకొని ల్యాప్‌టాప్‌ తయారీ కంపెనీలు వాటి వేగాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ల్యాప్‌టాప్‌లు మరింత వేగంగా, సమర్థంగా పనిచేయడానికి వాటిలో కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లనూ జోడిస్తున్నారు. అయితే అలా ఇంప్లిమెంట్‌ చేస్తున్న ఏఐల వర్క్‌లోడ్‌ ఒక్కోసారి అధికమై ప్రాసెసర్లపై భారం పడుతుంది. దాన్ని తగ్గించేందుకు కంపెనీలు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి.

ల్యాప్‌టాప్‌ల్లో ఏఐ వర్క్‌లోడ్స్‌ సాఫీగా, అంతరాయం లేకుండా పనిచేయటానికి న్యూరల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (ఎన్‌పీయూ) అమర్చుతున్నారు. సీపీయూ, జీపీయూతోపాటు ఎన్‌పీయూ సైతం వీటిలో వాడుతున్నారు. దాంతో ఎన్‌పీయూ ఉన్న ల్యాప్‌టాప్‌లు హైబ్రిడ్‌ వర్క్‌కల్చర్‌కు తగ్గట్టుగా వేగంగా, సమర్థంగా పనిచేస్తాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి. తాజాగా ప్రముఖ ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థ హెచ్‌పీ ఎన్‌పీయూ ఫీచర్‌ ఉన్న ఏఐ ఆధారిత గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ ఒమెన్‌ ట్రాన్సెండ్‌ 14, ఎన్‌వీఎక్స్‌ 360 14 మోడల్‌ను విడుదల చేసింది. ఇవి వేగంగా, సమర్థంగా పనిచేస్తూ వినియోగదారుల అవసరాలను తీరుస్తాయని హెచ్‌పీ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎండీ ఇప్సితా దాస్‌గుప్తా చెప్పారు. హెచ్‌పీతోపాటు మరిన్ని కంపెనీలు ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లో విడుదల చేశాయి. వాటికి సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

హెచ్‌పీ ఒమెన్‌ ట్రాన్సెండ్‌ 14

  • ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్‌ 11 హోమ్‌
  • ఇంటెల్‌ కోర్‌ ఆల్ట్రా 9 ప్రాసెసర్‌
  • 14 అంగుళాల డిస్‌ప్లే
  • 11.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌
  • 1.637 కేజీల బరువు
  • ఎన్‌వీడియా జీఈఫోర్స్‌ ఆర్‌టీఎక్స్‌ 4060 గ్రాఫిక్‌కార్డు
  • ప్రారంభ ధర అంచనా: రూ.1,74,999

హెచ్‌పీ ఎన్వీఎక్స్‌ 360 14

  • ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్‌ 11 హోమ్‌
  • గ్రాఫిక్ మెమరీ: జీడీడీఆర్‌6 
  • గ్రాఫిక్ మెమరీ కెపాసిటీ: 4 జీబీ
  • ప్రాసెసర్: ఇంటెల్ i7
  • ప్రాసెసర్ జనరేషన్: 13వ తరం
  • ఎస్‌ఎస్‌డీ: 1 టీబీ
  • ర్యామ్‌: 16 జీబీ
  • గ్రాఫిక్ ప్రాసెసర్: NVIDIA GeForce RTX 3050
  • ప్రారంభ ధర అంచనా: రూ.99,999

ఎంఎస్‌ఐ ప్రెస్టీజ్ 16 ఏఐ ఈవో బీ1ఎం

  • ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్‌ 11 హోమ్‌
  • స్క్రీన్‌: 16 అంగుళాలు
  • ప్రాసెసర్: ఇంటెల్ కోర్ అల్ట్రా 9
  • ఇందులో ఎన్‌పీయూ, ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సదుపాయాలు ఉన్నాయి. 
  • బరువు: 1.5 కిలోలు. 
  • ధర సుమారు: 1,19,990

ఆసుస్ ఆర్‌ఓజీ జెఫిరస్ G14 

  • ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్‌ 11 హోమ్
  • గ్రాఫిక్ మెమరీ: జీడీడీఆర్‌6
  • గ్రాఫిక్ మెమరీ కెపాసిటీ: 12 GB
  • ప్రాసెసర్: AMD రైజెన్ 9 ఆక్టా కోర్
  • ఎస్‌ఎస్‌డీ: 1 టీబీ
  • ర్యామ్‌: 32 GB DDR5
  • గ్రాఫిక్ ప్రాసెసర్: NVIDIA GeForce RTX 4080
  • ధర సుమారు: 2,49,990

ఇదీ చదవండి: ఆకాశవీధిలో 15.4 కోట్ల ప్రయాణికులు

ఆసుస్‌ జెన్‌బుక్ 14 ఓలెడ్‌

  • ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్‌ 11 హోమ్
  • ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i7
  • ఎస్‌ఎస్‌డీ: 512 GB
  • ర్యామ్‌: 16 జీబీ LPDDR5
  • గ్రాఫిక్ ప్రాసెసర్: ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఐరిస్ X గ్రాఫిక్స్
  • ధర సుమారు: రూ.99,990

Advertisement

తప్పక చదవండి

Advertisement