ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హెచ్‌పీ సరికొత్త గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లను ఆవిష్కరించింది. లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2024)లో తమ OMEN, HyperX సబ్-బ్రాండ్‌ల కింద కొత్త గేమింగ్ పోర్ట్‌ఫోలియోను పరిచయం చేసింది.
కంపెనీ కొత్త లాంచ్‌లలో గేమర్లకు గేమింగ్, ఇతర క్రియేటివ్ టాస్క్‌ల కోసం ఒమెన్ ట్రాన్సెండ్ 14 (Omen Transcend 14) గేమింగ్ ల్యాప్‌టాప్ ఉంది. దీంతోపాటు 240Hz రిఫ్రెష్ రేట్‌తో 2.5K OLED డిస్‌ప్లేతో OMEN ట్రాన్స్‌సెండ్ 16-అంగుళాల ల్యాప్‌టాప్‌ను కూడా హెచ్‌పీ ఆవిష్కరించింది. HP Omen 16 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్, Victus 16 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్ రెండూ సరికొత్త Intel i7 HX ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి.
హెచ్‌పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 ముఖ్యమైన ఫీచర్లు..
- 120Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, కంటెంట్ క్రియేషన్‌కు అనువైన IMAX కూడిన సర్టిఫైడ్ 2.8K OLED డిస్‌ప్లే
- లాటిస్-లెస్ స్కై-ప్రింటెడ్ RGB కీబోర్డ్
- ఎక్కడికైనా తీసుకెళ్ళేందుకు వీలుగా 1.6 కేజీల బరువుతో తేలికనది
- 140W ఛార్జింగ్ అడాప్టర్‌తో 11.5 గంటల బ్యాటరీ లైఫ్
- NVIDIA GeForce RTX 4070 GPUతో ఇంటెల్ అల్ట్రా 9 185H ప్రాసెసర్
Comments
Please login to add a commentAdd a comment