CES
-
CES 2024: హెచ్‌పీ నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లు
ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హెచ్‌పీ సరికొత్త గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లను ఆవిష్కరించింది. లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2024)లో తమ OMEN, HyperX సబ్-బ్రాండ్ల కింద కొత్త గేమింగ్ పోర్ట్‌ఫోలియోను పరిచయం చేసింది. కంపెనీ కొత్త లాంచ్‌లలో గేమర్లకు గేమింగ్, ఇతర క్రియేటివ్ టాస్క్‌ల కోసం ఒమెన్ ట్రాన్సెండ్ 14 (Omen Transcend 14) గేమింగ్ ల్యాప్‌టాప్ ఉంది. దీంతోపాటు 240Hz రిఫ్రెష్ రేట్‌తో 2.5K OLED డిస్ప్లేతో OMEN ట్రాన్స్‌సెండ్ 16-అంగుళాల ల్యాప్‌టాప్‌ను కూడా హెచ్‌పీ ఆవిష్కరించింది. HP Omen 16 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్, Victus 16 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్ రెండూ సరికొత్త Intel i7 HX ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. హెచ్‌పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 ముఖ్యమైన ఫీచర్లు.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, కంటెంట్ క్రియేషన్‌కు అనువైన IMAX కూడిన సర్టిఫైడ్ 2.8K OLED డిస్ప్లే లాటిస్-లెస్ స్కై-ప్రింటెడ్ RGB కీబోర్డ్ ఎక్కడికైనా తీసుకెళ్ళేందుకు వీలుగా 1.6 కేజీల బరువుతో తేలికనది 140W ఛార్జింగ్ అడాప్టర్‌తో 11.5 గంటల బ్యాటరీ లైఫ్ NVIDIA GeForce RTX 4070 GPUతో ఇంటెల్ అల్ట్రా 9 185H ప్రాసెసర్ -
అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా!
లాస్ వేగాస్‌లో అట్టహాసంగా జరుగుతున్న 2024 సీఈఎస్ ఈవెంట్లో అత్యుత్తమ ఉత్పత్తులు కనివిందు చేస్తున్నాయి. ఈ ఈవెంట్లో సాధారణ ఉత్పత్తులకంటే కూడా కొత్త టెక్నాలజీతో అబ్బురపరిచే గ్యాడ్జెట్స్, వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కథనంలో ఏఐ (AI) టెక్నాలజీ కలిగిన ఉత్తమ గాడ్జెట్లను గురించి వివరంగా తెలుసుకుందాం. బల్లీ (BALLIE) సీఈఎస్ వేదికపై కనిపించిన ఉత్తమ ఏఐ ఉత్పత్తులలో ఒకటి 'బల్లీ'. శామ్సంగ్ కంపెనీ లాంచ్ చేసిన ఈ గ్యాడ్జెట్ చూడటానికి చిన్న బాల్ మాదిరిగా ఉంటుంది. కానీ పనితీరులో మాత్రం దానికదే సాటి అని చెప్పాలి. నిజానికి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ డివైజ్ అయినప్పటికీ.. ఇంట్లో చాలా పనులు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. నెల మీద, పైకప్పు మీద కూడా ప్రాజెక్ట్ చేయగల కెపాసిటీ కలిగిన బల్లీ.. ఈవెంట్లో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ గ్యాడ్జెట్ ధర, వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. (Image credit: Future) LG స్మార్ట్ హోమ్ ఏజెంట్ శామ్సంగ్ ఉత్పత్తులకు ఏ మాత్రం తీసిపోకుండా.. LG కంపెనీ కూడా ఓ స్మార్ట్ హోమ్ ఏజెంట్‌ను ఆవిష్కరించింది. లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఈ గ్యాడ్జెట్ ఒక స్మార్ట్ హబ్. ఇది ChatGPT వాయిస్‌తో కమ్యూనికేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మీ మానసిక స్థితిని పర్యవేక్షించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఈ ఏఐ రోబోటిక్ ధర కూడా సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. (Image credit: LG) సెగ్వే నవిమో (SEGWAY NAVIMOW) సెగ్వే నవిమో అనేది ఓ రోబోట్ లాన్‌మూవర్స్. నిజానికి రోబోట్ లాన్‌మూవర్స్ ఈ రోజు ఆలోచన కాదు. అయితే సీఈఎస్ వేదికపై కనిపించిన ఈ సెగ్వే నవిమో ఏఐ టెక్నాలజీ కలిగిన గ్యాడ్జెట్. ఇది బ్లేడ్హాల్ట్ సెన్సార్, రెయిన్ సెన్సార్, అల్ట్రాసోనిక్ సెన్సార్, విజన్ఫెన్స్ సెన్సార్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అమెరికాలో ఈ గ్యాడ్జెట్ ధరలు అందుబాటులో లేదు కానీ.. యూరప్ మార్కెట్లో 1300 డాలర్ల ప్రారంభ ధర వద్ద లభిస్తోంది. (Image credit: Segway) ఓరో (ORO) శామ్సంగ్, LG గ్యాడ్జెస్ట్స్ కంటే కూడా ఓరో అనేది పెంపుడు జంతువులకు మరింత ఫ్రెండ్లీగా ఉంటుంది.పెద్ద పెద్ద కళ్ళు కలిగిం ఈ పరికరం బంతిని విసరడం, ఆహారాన్ని అందించడం వంటివి చేసేలా రూపొందించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూడా పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటుంది. దీని ధర 799 డాలర్లు. ఏప్రిల్ నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం. ఇప్పుడు దీనిని 299 డాలర్ల డౌన్‌పేమెంట్‌తో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. (Image credit: ORo) మొబిన్ (MOBINN) సాధారణంగా గ్యాడ్జెట్స్.. ఇంటి పరిసరాల్లో లేదా ఇంట్లో చదునుగా ఉన్న ప్రాంతాల్లో తిరగటానికి అనుకూలంగా ఉంటాయి. కానీ మొబిన్ అనేది మెట్లను కూడా ఎక్కగలదు. ఫ్లెక్సిబుల్ వీల్స్‌తో కూడిన ఈ రోబోట్ మనం ఆర్డర్ చేసిన వస్తువులను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. LiDAR-బేస్డ్ మ్యాపింగ్ సిస్టమ్‌ను కలిగిన మొబిన్ వర్షం, మంచు, రాత్రి సమయంలో కూడా పని చేస్తుంది. సంస్థ ఈ గ్యాడ్జెట్ ధర, లాంచ్ డేట్ వంటి వాటిని అధికారికంగా వెల్లడించలేదు. (Image credit: MOBINN) లూనా (LOONA) సాధారణంగా ఎవరైనా తమను ఎంటర్టైన్ చేయడానికి పెంపుడు జంతువులను పెంచుకుంటారు. అయితే లూనా అనే రోబోట్ పెంపుడు జంతువులకు ఏ మాత్రం తీసిపోదు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. ChatGPT ఆధారంగా పనిచేస్తుంది. ఇది కదిలే హోమ్ మానిటర్, ప్రోగ్రామింగ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది. దీని ధర 380 డాలర్ల వరకు ఉంటుంది. (Image credit: keyirobot) రోబోట్ వాక్యూమ్ రోబోట్ వాక్యూమ్ అనేది వాయిస్ అసిస్టెంట్, రోబోట్ ఆర్మ్, వీడియో కాలింగ్ ఫంక్షనాలిటీ వంటి వాటిని పొందుతుంది. CES 2024 వేదికగా కనిపించిన అద్భుతమైన గ్యాడ్జెట్లలో ఇది కూడా ఒకటి. మరొక పరికరం అవసరం లేకుండా దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఈ పరికరం లోపల ఉండే కెమెరా యజమానికి కాల్ చేయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ రోబోట్ వాక్యూమ్ ధర, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
CES 2024: ఈ కార్లు...మైండ్ బ్లోయింగ్: (ఫోటోలు)
-
సీఈఎస్ వేదికపై అట్రాక్ట్ చేస్తున్న 'అఫీలా' కారు - వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి లాస్ వెగాస్‌లో ప్రారంభమైన సీఈఎస్ 2024 వేదికగా మరిన్ని కొత్త వాహనాలు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. లాస్ వేగాస్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో 'సోనీ' (Sony) కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా సోనీ, హోండా కలిసి 'అఫీలా' (Afeela) అనే కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఆ కారుని కంపెనీ ఎట్టకేలకు ఈ CES 2024 వేదికగా ప్రదర్శించింది. ఇక్కడ కనిపించే కారు కేవలం డెమో కోసం మాత్రమే అని, రానున్న రోజుల్లో టెస్టింగ్ వంటివి నిర్వహించి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ఇజుమి కవానిషి' ప్రకారం, ఈ కారు 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభం నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఈ కారు లాంచ్ అయిన తరువాత మరిన్ని ఉత్పత్తులు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? అఫీలా (Afeela) కారు అద్భుతమైన డిజైన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది 3డీ గ్రాఫిక్స్, విజువల్స్ కలిగి మల్టిపుల్ కెమెరా సెటప్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇందులో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను రానున్న రోజుల్లో వెల్లడించనుంది. అయితే ఈ మోడల్ భారతీయ తీరానికి చేరుకుంటుందా? లేదా?.. ఒక వేళా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. -
CES 2024: కొత్త టెక్నాలజీలతో అబ్బురపరుస్తున్న లేటెస్ట్ ప్రొడక్ట్స్ (ఫోటోలు)
-
2022 సీఈఎస్ టెక్ షోలో హైదరాబాద్ కంపెనీ అదిరిపోయే ఆవిష్కరణ!
న్యూఢిల్లీ: ప్రజలకు సులువుగా తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ, సమస్యలను పరిష్కరించుకునేందుకు సరికొత్త మార్గాన్ని అందిస్తూ హైదరాబాద్ నగరానికి చెందిన బ్లూసెమీ అనే భారతీయ హెల్త్ టెక్ స్టార్టప్ కంపెనీ అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరుగుతున్న సీఈఎస్ 2022లో ఈవైవీఏ (EYVA) అనే విప్లవాత్మక ఉత్పత్తిని ఆవిష్కరించింది. ఇది నాన్ ఇన్వేజివ్ కన్స్యూమర్ హెల్త్ టెక్ పరికరం. ఇందులో సృజనాత్మకమైన పేటెంట్ టెక్నాలజీ ఆధారిత సెన్సర్ ఫ్యుజన్, కచ్చితమైన ఏఐ ఆల్గరిథమ్స్, స్మార్ట్ ఐఓటీ ఉన్నాయి. ఈవైవీఏ ఆవిష్కరణతో, బ్లూసెమీ సంస్థ సీఈఎస్‌లో ఇలాంటి పరికరాన్ని ఆవిష్కరించిన మొట్టమొదటి భారతీయ సంస్థగా నిలిచింది. సీఈఎస్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన టెక్ ఈవెంట్. అరచేతిలో ఆరోగ్యం ఈ పరికరం మనిషి శరీరంలోని 6 కీలక వైటల్స్‌ను గుర్తిస్తుంది. అవి రక్తంలో గ్లూకోజ్, ఈసీజీ, గుండె కొట్టుకునే రేటు, బీపీ, ఎస్పీఓ2, ఉష్ణోగ్రత. గుచ్చడం, రక్తం తీయడం లాంటివి అవసరం లేకుండా ఇలా ముట్టుకుంటే అలా కేవలం 60 సెకండ్లలోనే ఈ వివరాలన్నీ వచ్చేస్తాయి. భారతదేశంలో కేవలం రూ. 15,490/- ఖర్చుతో వచ్చే ఈ పరికరంతో పాటు ఉచిత మొబైల్ యాప్ కూడా అందిస్తారు. దీని ద్వారా వినియోగదారులు తమ ఆరోగ్య విషయాలు తెలుసుకుని, జీవనశైలి, ఫిట్నెస్, పోషకాహారం, ఒత్తిడి నివారణ వంటి చర్యలు తీసుకోవచ్చు. ఇంకా కావాలంటే పెయిడ్ ప్లాన్స్ ఎంచుకుని, మరింత లోతుగా తెలుసుకుని, తమ ఆహారం, వ్యాయామంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకోవచ్చు. యాంథియా రీల్మ్ ఈవైవీఏలో కేవలం అద్భుతమైన టెక్నాలజీ మాత్రమే కాదు.. ఆరోగ్యం గురించిన దాని ఆలోచనా విధానం కూడా చాలా కీలకం. ఇది ప్రస్తుత ప్రపంచంలో తన మొబైల్ యాప్ ద్వారా అన్నింటినీ అందిస్తోంది. యాంథియా రీల్మ్((Anthea Realm)) అనే ఈ యాప్ మీతోనే ఉండి మీ ఆరోగ్యాన్ని బాగుచేస్తుంది. దీనిద్వారా యూజర్ తనతో తాను అనుసంధానమై తనకు తాను సాయం చేసుకోగలడు. యాంథియా ప్రపంచం మీకు ఓదార్పునిస్తుంది. ఇన్నాళ్లూ బాగా కష్టంగా, బోరింగ్‌గా ఉండే ఆరోగ్య విషయాలను అద్భుతంగా, ఆశ్చర్యం గొలిపేలా మార్చేసేందుకు దీన్ని రూపొందించారు. ఈ గాడ్జెట్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. చిన్నగా, సన్నగా ఉండి మీరెక్కడున్నా, మీతోపాటు ఉండి మొత్తం ఆరోగ్యాన్ని మీ సొంతం చేస్తుంది. మీకు కాలంతో పాటు ప్రయాణించేలా భావన కలిగిస్తుంది. ఈ అద్భుతమైన పరికరం ఆవిష్కరణ సందర్భంగా బ్లూసెమీ వ్యవస్థాపకుడు, సీఈవో సునీల్ మద్దికట్ల మాట్లాడుతూ.. “ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా, ఆరోగ్యవంతంగా చేసేందుకు మేం పడిన కష్టానికి, మా నిబద్ధతకు ఫలితమే ఈవైవీఏ. ఈ అసాధారణ పరికరాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో మొట్టమొదటి భారతీయ హెల్త్ టెక్ కంపెనీగా పరిచయం చేసినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఏదైనా పరికరం విజయవంతం కావాలంటే అది యూజర్లకు అనుకూలంగా ఉండాలి. ఈవైవీఏ అందులో నూరుశాతం విజయవంతమైంది. ఇది విభిన్నంగా, ఆకర్షణీయంగా, చిన్నగా, సన్నగా ఉంటూ, సులభంగా తీసుకెళ్లగలిగేలా ఉండి, ఉపయోగించడంలో ఎలాంటి ఇబ్బంది కలగజేయదు. కేవలం వేలి కొనల స్పర్శతోనే ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేంత విప్లవాత్మకంగా ఈ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది” అన్నారు. “ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా ఉంది. ఇలాంటి సమయంలో ఈవైవీఏ లాంటి పరికరాలు ఇల్లు, ఆఫీసు, ప్రజారవాణా, విమానాశ్రయం, రైల్వేస్టేషన్, మార్కెట్.. ఇలా ఎక్కడున్నా పనిచేస్తాయి. అందువల్ల ఈ ఉత్పత్తిని రూపొందించడం శాస్త్రీయ అవసరంతో పాటు, నిరంతర ఆవిష్కరణ విషయంలో మా అభిరుచికి నిదర్శనం. ప్రతి ఒక్కరూ ఈ కొత్త ఆరోగ్యకర ప్రపంచంలో భాగం కావాలని బ్లూసెమీలో మేం ఆహ్వానిస్తున్నాం. ఈవైవీఏ మ్యాజిక్‌తో జీవితాన్ని ఆస్వాదించండి” అని సునీల్ తెలిపారు. 2022 మార్చినాటికల్లా ఈవైవీఏ బ్లూసెమీ మార్కెట్ భాగస్వాముల ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మొదట్లో పరిమితంగానే అందుబాటులో ఉన్నా, 2022 మధ్యనాటికి వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తేవాలని కంపెనీ యోచిస్తోంది. (చదవండి: బంపరాఫర్..! ఉచితంగా యాపిల్ ఎయిర్ పాడ్స్!) -
ఒమిక్రాన్ ఎఫెక్ట్..! మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం..! గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ బాటలోనే...
ప్రపంచదేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ దెబ్బకు కేసులు గణనీయంగా పెరగడంతో ఆయా దేశాలు లాక్ డౌన్‌ను విధించే ఆలోచనలో ఉన్నాయి. కాగా ఒమిక్రాన్ ప్రభావం దిగ్గజ టెక్ కంపెనీలపై కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ బాటలోనే..! 2022 జనవరి అమెరికా లాస్‌వెగాస్‌లో జరిగే టెక్ కాన్ఫరెన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ ఇప్పటికే పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. వారి బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా పయనిస్తోంది. సీఈఎస్-2022 షోలో పాల్గొనట్లేదని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా తాత్కలికంగా టెక్ కాన్ఫరెన్స్‌ను వాయిదా వేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. లాస్ వెగాస్‌లో జనవరి 5,6,7,8 తేదీల్లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జరగనుంది. 40కు పైగా కంపెనీలు లెనొవొ, టీ-మొబైల్స్, ఏటీ అండ్ టీ, మెటా, ట్విటర్, అమెజాన్, టిక్‌టాక్, పింట్రెస్ట్, ఆల్ఫాబెట్‌కు చెందిన వేమో వంటి 40కి పైగా బడా టెక్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ సదస్సుకు హాజరు కావాల్సి ఉండగా....వీరు కూడా సీఈఎస్-2022 షోలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ షోలో సుమారు 2200 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు పాల్గొనున్నాయి. అంతర్జాతీయ సదస్సులు వాయిదా..! అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇప్పటికే తెలిపింది.కాగా మరోవైపు ఒమిక్రాన్ అలజడితో జెనీవాలో జరగాల్సిన డబ్య్లూటీవో మినిస్టీరియల్ (ఎంసీ12) కూడా వాయిదా పడింది. చదవండి: చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్ మస్క్..! -
అడుగులు వేసే కారు!
లాస్‌వెగాస్: కారు చక్రల మీద రయ్యిమంటూ దూసుకెళ్లకుండా, అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ వెళితే ఎలా ఉంటుంది? కేవలం హాలీవుడ్ సినిమాల్లోనే ఇది సాధ్యమవుతుందనుకుంటున్నారా? అయితే ఇంకొన్నేళ్లలో ఇది అక్షరాలా నిజం కానుంది. ఈదిశగా ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండయ్ ముందడుగు వేసింది. ఏటా వినూత్న వాహనాల ప్రదర్శన జరిగే సీఈఎస్–2019లో హ్యుండయ్ ఈ కార్ల గురించి వివరించింది. ఈ నడిచే కార్ల సహాయంతో కష్టసాధ్యమైన మార్గాల్లోనూ సులభంగా ప్రయాణించవచ్చని హ్యుండయ్ క్రెడిల్ వైస్ ప్రెసిడెంట్ జాన్ స్యూ తెలిపారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. ఎత్తైన ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికీ ఈ కార్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన చెబుతున్నారు. 5 అడుగుల ఎత్తయిన గోడలను సైతం ఎక్కేలా వీటిని రూపొందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ కార్లు మార్కెట్లోకి రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. -
సోనీ మూడు కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్
మల్టీ నేషనల్ టెలికమ్యూనికేషన్ కంపెనీ సోనీ మొబైల్స్ మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. లాస్ వెగాస్‌లో జరుగుతున్న సీఈఎస్ 2018లో వీటిని పరిచయం చేసింది. జనవరి 9నుంచి 12వ తేదీవరకు జరగనున్నఈ ఎక్స్‌పోలో సోనీ గత సంవత్సరం లాంచ్ చేసిన ఎక్స్‌పీరియా ఎక్స్ఏ1, ఎక్స్ఏ1 అ ల్ట్రా కొనసాగింపుగా ఎక్స్ఏ2, ఎక్స్ఏ2 అ ల్ట్రా, ఎక్స్‌పీరియా ఎల్ 2 పేరుతో లాంచ్ చేసింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఎల్ 2 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ డివైస్‌లలో బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచింది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను వెనుకకు మార్చడం తప్ప పెద్దగా మార్పులేమీ చేయలేదు. మీడియా టెక్ ప్రాసెసర్లతో, ఎక్స్ఏ2, ఎక్స్ఏ2 అ ల్ట్రా క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 630 చిప్‌సెట్‌ను అమర్చింది. ఎక్స్ఏ2 ఫీచర్లు 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 23 ఎంపీ ప్రైమరీ కెమెరా 8ఎంపీ కెమెరా సెల్ఫీ లెన్స్ విస్తరించుకునే సదుపాయం 3,300ఎంఏహెచ్ బ్యాటరీ ఎక్స్ఏ2 అ ల్ట్రా ఫీచర్లు 6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ విస్తరించుకునే సదుపాయం 23 ఎంపీ ప్రైమరీ కెమెరా 8+6 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా లెన్స్ 3,580 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ రెండు డివైస్లతో పాటు లాంచ్ చేసిన కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎల్ 2 ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. ఎక్స్‌పీరియా ఎల్ 2 ఫీచర్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ 3 జీబి ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ ఎక్స్‌పాండబుల్ మెమరీ 8ఎంపీ సెల్ఫీ కెమెరా 13ఎంపీ రియర్ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా గ్లోబల్ మార్కెట్లో 2018, ఫిబ్రవరి మాసంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు స్మార్ట్ఫోన్ల రేట్లవివరాలు అందుబాటులోకి రావాల్సిఉంది. Brave, bold, borderless – #Xperia XA2 was made to free your inner creative. #SonyCEShttps://t.co/T1ZOpYDC6v pic.twitter.com/ocL4gMTpJS — Sony Xperia (@sonyxperia) January 8, 2018 -
సూపర్ సూట్‌తో మీ పిల్లలు ఫిట్
న్యూఢిల్లీ: టీవీల్లో కార్టూన్ సీరియళ్లు, మొబైల్స్‌లో వీడియో గేమ్స్ అంటూ స్క్రీన్లకు అతుక్కుపోయే పిల్లలు శారీరకంగా ఎంతగా బలహీనంగా తయారవుతున్నారో తెలిసిందే. కారణం శరీరాన్ని ఉత్తేజంగా, శక్తిమంతంగా ఉంచే అవుట్డోర్ గేమ్స్‌కు వారు దూరం కావడమే. అయితే ఈ సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉందంటోంది అమెరికాకు చెందిన ఓ గేమ్స్ డిజైన్ సంస్థ. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ సూపర్ సూట్‌ను తయారు చేశామని, ఇది పిల్లలకు అవుట్డోర్ గేమ్స్‌పై ఆసక్తి పెంచడమే కాకుండా ఫిట్నెస్గా తయారు చేస్తుందని చెబుతున్నారు. ఈ సూట్ ధరించిన పిల్లల ఫిట్నెస్ ఎంతో తల్లిదండ్రులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా తెలుసుకునేలా ఓ యాప్‌ను కూడా రూపొందించామని తయారీదారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనిని మార్కెట్లోకి విడుదల చేస్తామని, పిల్లలంతా అవుట్డోర్ గేమ్స్‌ను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తోంది. -
ఆ షోకు.. లోయిస్ విట్మన్ మిస్సవ్వలేదు..!
ఎలక్ట్రానిక్స్ షోలో ఆమెది ఏభై ఏళ్ళ ప్రస్థానం.. జనవరి తొమ్మిది వరకూ లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో లోనూ లోయిస్ విట్మన్ పాత్ర ఉంది. ఇప్పుడే కాదు ఆమె న్యూయార్క్ సిటీ లో 1967లో మొట్టమొదటిసారి జరిపిన ప్రదర్శననుంచి ప్రతి సీఈఎస్ కు హాజరౌతూనే ఉంది. కంన్జూమర్ ఎలక్ట్రానిక్స్ లో నిర్వహిస్తున్న తన ఉద్యోగాన్నే కాక, ఆ వ్యాపారంలో ఉండే ప్రతి వారినీ ఆమె ఎంతో ఇష్ట పడుతుంది. హోం ఫర్నిషింగ్ డైలీ మాగజిన్ లో 1966 లో కెరీర్ ప్రారంభించిన లోయిస్ విట్మన్.. 1967 లో ప్రారంభమైన మొట్టమొదటి కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో నుంచీ ప్రతి ప్రదర్శనలో పాల్గొంటోంది. అప్పట్లో ఈ షోలో... గడియారాలు, రేడియోలు, ఫర్నిచర్ తో పాటు, గృహోపకరణాల్లో ఉండే కన్సోల్ ఆడియోసిస్టమ్స్, టీవీలు వంటివి ఎక్కువగా ఉండేవి. అప్పటికే అమెరికాలో ఇళ్ళు కంప్యూటర్ ప్రపంచాన్ని ఆక్రమించడంతో.. హోం ఆడియోలు, టీవీలు యూఎస్ లో తయారుచేసేవారు. అయితే రాను రాను కొన్ని జపనీస్ కంపెనీల ఆధిపత్యం... హోమ్ ఆడియో సెక్టార్లో పుంజుకుంది. మొదట్లో కొన్ని షోలు కేవలం కొన్ని గంటల్లోనే చూడగలిగేలా చిన్నగా ఉండేవని విట్మన్ తన ఏభై ఏళ్ళ అనుభవాన్ని గుర్తు చేసుకుంటుంది. 1967 లో మొట్టమొదటిసారి న్యూయార్క్ సిటీలో మొదలైన కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో 1970 వరకూ అక్కడే కొనసాగింది. ఆ తర్వాత చికాగో కు చేరి అక్కడే 1971 నుంచి 77 వరకు కొనసాగి, అక్కడినుంచి 1978 వింటర్ లో లాస్ వెగాస్ కు చేరింది. అప్పట్నుంచీ అక్కడ ప్రతి జనవరిలో వింటర్ సీఈఎస్ తోపాటు, లాస్ వెగాస్ లో 1978 నుంచి 95 వరకు ప్రతి సంవత్సరం సమ్మర్ సీఈఎస్ కూడ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ప్రతి షోలో విట్మన్ ఉంది. వీసీఆర్ లు వచ్చే సమయానికి విట్మస్ జర్నలిజం నుంచి బయటకు వచ్చి, హెచ్ డబ్ల్యూ హెచ్ పేరిట 1978లో ప్రజాంసంబంధాల సంస్థ ప్రారంభించింది. అప్పట్లో ఆమె ఖాతాల్లో ఒకటైన వీహెచ్ ఎస్... వీడియో టేప్ ఫార్మాట్ లో ఉండే జేవీసీ... సోనీ బీటామాక్స్ పేరిట బయటకు వచ్చేది. 1970 నుంచి 1980 లమధ్య వచ్చిన ఫార్మాట్ వార్ తో వీహెచ్ ఎస్ అమ్మకాలు కూడ ఒక్కో సంవత్సరం పెరుగుతూ వచ్చాయి. దీంతో విట్మన్ విజయపథంవైపు అడుగులు వేసింది. మొదటిసారి లేజర్ డిస్క్, ఆప్టికల్ డిస్క్ వీడియో ప్లేయర్ సంయుక్తంగా 1978 సమయంలో ప్రారంభిచబడింది. అప్పట్లో వీహెచ్ ఎస్, బీటా లకు ప్రజాదరణ కాస్త తగ్గినా... లేజర్ డిస్క్ మాత్రం మాస్ మార్కెట్లో దూసుకుపోయింది. 1982 లో సీఈఎస్ ప్రారంభమయ్యే సమయానికి విట్మస్ ఎనిమిది నెలల గర్భవతి. అయినా ఆమె ప్రదర్శనకు వెళ్ళడం మానలేదు. ఫ్లాట్ స్క్రీన్ డిస్ ప్లే ప్రారంభ సమయం కావడంతో 2000 సంవత్సరంలో ఆమె శామ్సంగ్ కు ఆ వర్గ మేనేజర్ గా మారింది. . పనిని ప్రేమించే తత్వం ఉన్న విట్మన్ 2016 సీఈఎస్ లో కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలకోసం ఆత్రుతగా చూస్తోంది. ప్రస్తుతం డిజిడ్యామ్ బ్లాగ్ తోపాటు... తన భర్త ఎలైట్ హెస్ తో కలసి... విట్మన్... హెచ్ డబ్ల్యూ హెచ్ పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీని నడుపుతోంది. ఎన్నో కంపెనీలకు బిజినెస్ అడ్వైజర్ గా, మార్కెటింగ్ కన్సల్టెంట్ గా, స్పీకర్ గా, రచయితగా ఉండటమే కాక, నేటికీ అలుపెరుగని నెట్‌వర్కర్ గా ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతోంది.