మల్టీ నేషనల్ టెలికమ్యూనికేషన్ కంపెనీ సోనీ మొబైల్స్ మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. లాస్ వెగాస్‌లో జరుగుతున్న సీఈఎస్ 2018లో వీటిని పరిచయం చేసింది. జనవరి 9నుంచి 12వ తేదీవరకు జరగనున్నఈ ఎక్స్‌పోలో సోనీ గత సంవత్సరం లాంచ్ చేసిన ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ1, ఎక్స్‌ఏ1 అ ల్ట్రా కొనసాగింపుగా ఎక్స్‌ఏ2, ఎక్స్‌ఏ2 అ ల్ట్రా, ఎక్స్‌పీరియా ఎల్ 2 పేరుతో లాంచ్ చేసింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఎల్ 2 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ డివైస్‌లలో బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచింది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను వెనుకకు మార్చడం తప్ప పెద్దగా మార్పులేమీ చేయలేదు. మీడియా టెక్ ప్రాసెసర్లతో, ఎక్స్‌ఏ2, ఎక్స్‌ఏ2 అ ల్ట్రా క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 630 చిప్‌సెట్‌ను అమర్చింది.
ఎక్స్‌ఏ2 ఫీచర్లు
5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
23 ఎంపీ ప్రైమరీ కెమెరా
8ఎంపీ కెమెరా సెల్ఫీ లెన్స్
విస్తరించుకునే సదుపాయం
3,300ఎంఏహెచ్ బ్యాటరీ
ఎక్స్‌ఏ2 అ ల్ట్రా ఫీచర్లు
6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
విస్తరించుకునే సదుపాయం
23 ఎంపీ ప్రైమరీ కెమెరా
8+6 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా లెన్స్
3,580 ఎంఏహెచ్ బ్యాటరీ
ఈ రెండు డివైస్‌లతో పాటు లాంచ్ చేసిన కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎల్ 2 ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.
ఎక్స్‌పీరియా ఎల్ 2 ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ నౌగట్ 7.1
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్
3 జీబి ర్యామ్
32 జీబీ స్టోరేజ్
ఎక్స్‌పాండబుల్ మెమరీ
8ఎంపీ సెల్ఫీ కెమెరా
13ఎంపీ రియర్ కెమెరా
3,300 ఎంఏహెచ్ బ్యాటరీ
కాగా గ్లోబల్ మార్కెట్లో 2018, ఫిబ్రవరి మాసంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల రేట్లవివరాలు అందుబాటులోకి రావాల్సిఉంది.
Brave, bold, borderless – #Xperia XA2 was made to free your inner creative. #SonyCEShttps://t.co/T1ZOpYDC6v pic.twitter.com/ocL4gMTpJS
— Sony Xperia (@sonyxperia) January 8, 2018
Comments
Please login to add a commentAdd a comment