unveils
-
హైస్పీడ్ బుల్లెట్ రైలును పరీక్షించిన చైనా
బీజింగ్:ఆవిష్కరణల్లో చైనా తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ రైలు నమూనాను చైనా రైల్వే సంస్థ తాజాగా ఆవిష్కరించింది. దీనికి సీఆర్450గా పేరుపెట్టింది. ఆదివారం(డిసెంబర్29) బీజింగ్‌లో ఈ రైలును పరీక్షించారు. ట్రయల్‌రన్‌లో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైలు దూసుకుపోయింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిమీ వేగాన్ని అందుకోగలదని చైనా రైల్వే తెలిపింది. ఇది ప్రయాణాలకు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్యాసింజర్ రైలుగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది.ఈ బుల్లెట్ రైలు చైనా రాజధాని బీజింగ్ నుంచి షాంఘై నగరానికి కేవలం రెండున్నర గంటల్లోనే ప్రయాణించగలదు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతమున్న సీఆర్400 మోడల్ కంటే ఇది 12 శాతం బరువు తక్కువ. ఇంధనాన్ని కూడా 20 శాతం తక్కువగానే వాడుతుందని చైనా రైల్వే అధికారులు తెలిపారు.ఇక గత బుల్లెట్ రైలు మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిమీ వేగాన్ని అందుకోవడం గమనార్హం. చైనా హైస్పీడ్ రైల్ నెట్వర్క్ ప్రపంచలోనే అతిపెద్దది కావడం గమనార్హం. చైనాలో ఇప్పుడున్న బుల్లెట్ రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు. -
వండర్లాలో రెండు రైడ్స్‌ను ఆవిష్కరించిన స్టార్ నాగ చైతన్య
భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్లలో ఒకటైన వండర్లా హాలిడేస్ లిమిటెడ్, వండర్లా హైదరాబాద్‌లో రెండు హైపర్‌వర్స్, జి-ఫాల్ అనే అత్యాధునిక రైడ్స్‌ను టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య ఆవిష్కరించారు. కంపెనీ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి , సీఓఓ ధీరన్ చౌదరి, పార్క్ హెడ్, మధు సూధన్ గుత్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జి-ఫాల్ రైడ్, 40 మీటర్ల ఎత్తులో, గుండ్రంగా చుట్టూ కూర్చున్న 12 మంది రైడర్లతో, అడ్రినలిన్ ప్రేమికులకు తప్పనిసరిగా పొందాలనే అనుభూతిని అందిస్తుంది.హైపర్‌వర్స్, అత్యాధునిక మెటావర్స్ 3డి థియేటర్ అనుభవాన్ని అందిస్తుంది, లీనమయ్యే రీతిలో 5 నిమిషాల వీక్షణ కోసం సెషన్‌కు 30 మందికి పైగా వ్యక్తులకు వీక్షణ వసతి కల్పిస్తుంది. 8కె హై-రిజల్యూషన్ డిస్ప్లే, 360 డిగ్రీ సరౌండ్ సౌండ్ లైట్ 270డిగ్రీ షాడో డిజైన్‌ను కలిగి ఉంటుంది. అద్భుతమైన 3డి విజువల్స్‌తో ఉత్కంఠభరితమైన రీతిలో ఎగిరే దృశ్యాలలోకి అతిథులను తీసుకుని వెళ్తుంది.ఈ సందర్భంగా వండర్లా హాలిడేస్ ఎండీ అరుణ్ కె. చిట్టిలపిల్లి మాట్లాడుతూ, ‘‘వండర్లా వద్ద, వినోదవంతంగా ఉత్తేజకరమైన, విప్లవాత్మకమైన అనుభవాన్ని అందించే లక్ష్యంతో కొత్త రైడ్, హైపర్‌వర్స్, లీనమయ్యే సాంకేతికత సాహసోపేతమైన ముందడుగు అన్నారు.జి-ఫాల్ విషయానికొస్తే, ఇది అసాధారణమైన థ్రిల్స్ విభాగంలోకి మా సరికొత్త ప్రయాణం, వినూత్న అనుభవాలను సొంతం చేసుకోవాలని సాహసించే వారందరికీ మరపురాని అనుభవాలను అందిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సంచలనాత్మక ఆకర్షణలను ప్రత్యక్షంగా అనుభవించాలని ఆశిస్తున్నామన్నారు.ఈ అద్భుతమైన ఆకర్షణలను వండర్లా హైదరాబాద్‌లో ప్రారంభించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను అన్నారు నాగ చైతన్య. గ్లోబల్ పార్కులతో సమానంగా భారతదేశానికి ప్రపంచ స్థాయి రైడ్లను వండర్లా ఎలా తీసుకువస్తోందో చూడటం తనకు థ్రిల్లింగ్‌గా ఉందనీ, విఆర్ - ఆధారిత అనుభవాల కోసం పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణులతో సమానంగా లీనమయ్యే వినోదం అందించటంలో వండర్లా టాప్‌లో ఉందని కొనియాడారు. ఇది సందర్శకులకు మంచి అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నా అన్నారు.వండర్లా సందర్శకులను ఆన్లైన్ పోర్టల్ ముందుగానే తమ ఎంట్రీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. నేరుగా పార్క్ కౌంటర్ల నుండి టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ పార్క్‌ను : 084 146 76333 లేదా +91 91000 63636 వద్ద సంప్రదించవచ్చు.వండర్లా హాలిడేస్ లిమిటెడ్ గురించి భారతదేశపు అతిపెద్ద, ప్రీమియర్ అమ్యూజ్మెంట్ పార్క్ ఆపరేటర్, వండర్లా హాలిడేస్ లిమిటెడ్. ఇది అగ్రశ్రేణి వినోదం, వినూత్న ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, భువనేశ్వర్లలో నాలుగు ప్రపంచ స్థాయి అమ్యూజ్మెంట్ పార్క్ లను నిర్వహిస్తోంది. ఆహ్లాదం, కుటుంబ వినోదం కోసం బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుంది.మరింత సమాచారం కోసంవండర్లా హాలిడేస్ లిమిటెడ్+91 8136852848 -
రైట్ కాదు.. ఫ్లైట్! లోగో మార్చిన యస్ బ్యాంక్
ముంబై: కస్టమర్లకు చేరువయ్యే దిశగా ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ మార్కెటింగ్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రకటనలపై 30 శాతం అధికంగా వెచ్చించనున్నట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నిపుణ్ కౌశల్ తెలిపారు. జూన్ 20 నుంచి ప్రారంభించే ప్రచార కార్యక్రమాలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు. తమ రిటైల్ కార్యకలాపాలు కీలక స్థాయికి చేరుకున్నాయని, ఇక నుంచి లాభదాయకత పెరగగలదని చెప్పారు. యస్ బ్యాంక్ కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా కౌశల్ ఈ విషయాలు తెలిపారు. స్వల్ప మార్పులతో యస్ బ్యాంక్ తమ కొత్త లోగోను ఆవిష్కరించింది. బ్యాంక్ ప్రస్తుత ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ టిక్ స్థానంలో పైకెగిరే పక్షిని తలపించేలా మార్పులు చేశారు. ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర -
మహీంద్రా లాజిస్టిక్స్ వేర్‌హౌస్ షురూ
హైదరాబాద్: దేశీయంగా సమీకృత లాజిస్టిక్స్ సర్వీసులందించే మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్(ఎంఎల్ఎల్) స్థానికంగా నెట్ జీరో సౌకర్యానికి తెరతీసింది. బహుళ ఖాతాదారుల సామర్థ్యాలు, పునరుత్పాదక ఇంధనం, వనరుల పరిరక్షణసహా పర్యావరణ అనుకూల(గ్రీన్ కవర్) వేర్‌హౌసింగ్ ఆర్కిటెక్చర్‌తో దీనిని ఏర్పాటు చేసింది. ఈ అత్యాధునిక వేర్‌హౌస్ సిద్దిపేట జిల్లా ములుగు మండలం, బండమైలారం గ్రామంలోని అరుణ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద నెలకొంది. కంపెనీకిగల దేశవ్యాప్త మల్టీ యూజర్ సోలార్ విద్యుత్ సౌకర్యాలలో భాగమైన ఈ కేంద్రం కస్టమర్ల తయారీ, ఫుల్ఫిల్మెంట్ ఇన్‌బౌండ్ కార్యక్రమాలకు వీలు కల్పించనుంది. ఈ-కామర్స్ కస్టమర్లకు మద్దతివ్వనుంది. (లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!) ఈ నూతన కేంద్రం 100శాతం సౌర, బ్యాటరీ స్టోర్డ్ శక్తితో పనిచేస్తుంది. అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందజేస్తుంది. ఎలక్ట్రిక్ కార్గో వాహనాలకు చార్జింగ్ సౌకర్యాలనూ కల్పించనుంది. ఎంఎల్ఎల్ 350 మందికి పైగా ఇక్కడ ఉపాధి అవకాశాలను కల్పించింది. అధిక డిమాండ్ సమయంలో థర్డ్ పార్టీ అసోసియేట్లు ఈ సంఖ్యకు మూడింతలు అధికంగా ఉపాధి కల్పించే అవకాశమున్నట్లు కంపెనీ పేర్కొంది.(పేటీఎం భారీ బైబ్యాక్: ఒక్కో షేరు ధర ఎంతంటే! ) -
ఎయిరిండియా.. టాటా గ్రూపు సంచలనం..కొత్త..కొత్తగా!
సాక్షి, ముంబై: ఎయిరిండియాకు సంబంధించి టాటా గ్రూపు కీలక ప్రకటన చేసింది. కొత్తపేరు, కొత్త ప్రణాళికలతో ప్రయాణికుల ముందుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘విహాన్ ఎయిరిండియా’ అనే ప్లాన్స్‌తో దీర్ఘకాలిక లక్ష్యాలు, ప్రణాళికలను తాజాగా ప్రకటించింది. ఇందుకోసం రానున్న ఐదేళ్లలో, ఐదు నిర్దేశిత లక్ష్యాలను ఎంచుకుంది. (రెసిషన్ భయాలు:రుపీ మరోసారి క్రాష్) కస్టమర్ అనుభవం, బలమైన కార్యకలాపాలు, పరిశ్రమ-ఉత్తమప్రతిభ, పరిశ్రమ నాయకత్వం, వాణిజ్య సామర్థ్యం అనే ఐదు కీలక లక్ష్యాలతో ఒక ప్రణాళికను ఆవిష్కరించింది. దాని పేరు విహాన్ ఏఐ ... విహాన్ అంటే సంస్కృతంలో కొత్త శకానికి నాంది అని అర్థం. దీంతోపాటు రాబోయే ఐదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించింది. దేశీ మార్కెట్లో ప్రస్తుతం 8 శాతంగా ఉన్న తన వాటాను కనీసం 30 శాతానికి పెంచుకోవడానికి ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ ఎయిర్‌లైన్‌గా మరోసారి సత్తా చాటేలా అంతర్జాతీయ సర్వీసులను గణనీయంగా పెంచాలని భావిస్తోంది. ఇందులోనే భాగంగా నెట్వర్క్, ఫ్లీట్ రెండింటి వృద్ధిపైనా మరింత దృష్టిపెట్టనుంది. ఎయిరిండియాను దారిలో పెట్టడమే ఈ ప్లాన్ లక్ష్యమంటూ ఎయిరిండియా సీఎండీ కాంప్‌బెల్ విల్సన్ సీనియర్ మేనేజ్మెంట్ సభ్యులతో కలిసి, వర్క్‌ప్లేస్, వర్చువల్ కమ్యూనికేషన్ ఎంగేజ్ మెంట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మొత్తం సంస్థ ప్లాన్‌ను ఆవిష్కరించారు. చరిత్రాత్మక మార్పునకు నాంది ఇదని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త శకానికి తొలి అడుగు.. అద్భుతమైన ఉత్సాహంతో కొత్త వృద్ధికి పునాది వేస్తున్నామని ప్రకటించారు. ఈ ట్రాన్సఫర్మమేషన్ ఇప్పటికే మొదలైంది, విమాన క్యాబిన్స్ పునరుద్ధరణ, సౌకర్యవంతమైన సీట్లు, భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ నిరంతరం యాక్టివ్‌గా ఉండటంతోపాటు ఆన్-టైమ్ పనితీరును మెరుగు, క్రియాశీల నిర్వహణ, విమాన షెడ్యూల్‌లను మెరుగుపరుస్తామని ఆయన ప్రకటించారు. -
వచ్చేసింది కియా నయా కార్..! కళ్లు చెదిరే లుక్స్‌తో, సూపర్ డూపర్ ఫీచర్స్‌తో..!
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ రాబోయే సెవెన్-సీటర్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) 'కరెన్స్'ను గురువారం (డిసెంబర్ 16) ఆవిష్కరించింది. ఈ కారును రిక్రియేషనల్ వెహికిల్‌గా కియా పేర్కొంది. సెల్టోస్, కార్నివాల్, సోనెట్ తర్వాత భారతదేశ లైనప్‌లో కియాకు చెందిన నాల్గో వాహనంగా కరెన్స్ నిలవనుంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్‌లోని కియా ప్లాంట్‌లో తయారుకానుంది. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా కియా కరెన్స్ సప్లై కానున్నట్లు తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే..! కియా సెల్టోస్ మాదిరిగా కాకుండా, కియా కరెన్స్ సొగసైన గ్రిల్ డిజైన్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో రానుంది. బోల్డ్ డిజైన్, హై-టెక్ ఫీచర్లు, ఇండస్ట్రీ-లీడింగ్ సేఫ్టీ సిస్టమ్స్‌తో కొత్త సెగ్మెంట్, ఇండస్ట్రీ బెంచ్ మార్క్‌గా కియా కరెన్స్ నిలవనుంది. ఎంపీవీ వెనుక భాగంలో టీ-ఆకారంలో ర్యాప్ రౌండ్ ఎల్ఈడీ క్లస్టర్స్‌ను కల్గి ఉంది. అంతేకాకుండా చిసెల్డ్ ఫ్రంట్ బంపర్, క్రోమ్ ఇన్సర్ట్లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ , ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు కూడా ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో హై ఎండ్..! కియా కరెన్స్ ఇంటీరియర్స్ హై ఎండ్ డిజైన్‌ను పొందనుంది. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే , ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరాలు అమర్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్ఈ, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ , రియర్ పార్కింగ్ సెన్సార్ల ద్వారా కారులో ప్రయాణించే వారికి మరింత భద్రతను కరెన్స్ అందిస్తోంది. ఇంజిన్ విషయానికి వస్తే..! కియా కరెన్స్ 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్ లేదా 1.4-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ రెండు వేరియంట్లలో ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికంగా ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, టర్బో పెట్రోల్‌తో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవచ్చును. వీటికి గట్టిపోటీ..! కియా మోటార్స్ ఆవిష్కరించిన కియా కరెన్స్ కొత్త వాహనం పలు దిగ్గజం కంపెనీల ఎస్‌యూవీలతో పోటీ పడనుంది. హ్యుందాయ్ అల్కాజార్, మారుతి ఎర్టిగా, ఎంజీ హెక్టర్ ప్లస్, మహీంద్రా మరాజో, మహీంద్రా XUV700 వంటి వాటితో సెవెన్-సీటర్ కరెన్స్ పోటీపడే అవకాశం ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే...కియా కరెన్స్ సెగ్మెంట్లో పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ వాహనం సిక్స్-సీటర్, సెవెన్-సీటర్ వేరియంట్లలో కూడా లభ్యం కానుంది. బుకింగ్స్ ఎప్పుడంటే..! కియా కరెన్స్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రి-బుకింగ్స్ చేసుకునే అవకాశాన్ని కొనుగోలుదారులకు కల్పించింది. ఇప్పటికే బుకింగ్‌లను అంగీకరించడం ప్రారంభించింది. 2022 మొదటి త్రైమాసికంలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. కాగా ఈ కారు ధరలను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. చదవండి: టీఎంసీ బంపర్ ఆఫర్..!, 2025 వరకు రాయితీ వర్తింపు -
ఈక్యూ మోడ్‌తో లెనోవా వైర్లెస్ హెడ్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా బహుళజాతి సాంకేతిక సంస్థ లెనోవా తన కొత్త వైర్లెస్ హెడ్ఫోన్లను తాజాగా విడుదల చేసింది. సరికొత్త ఈక్యూ టెక్నాలజీతో 'హెచ్డి 116' పేరుతో ప్రస్తుతం అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంచింది. ఈ నెల చివరి నాటికి ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధరను రూ .2,499 గా వుంచింది. మంచి,లుక్, ఉన్నతమైన నాణ్యత, గొప్ప సౌండ్ అవుట్‌పుట్, బలమైన బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి క్లాసిక్ మేళవింపుతో తమ తాజా హెడ్‌ఫోన్స్ ఆకట్టుకుంటాయని షెన్జెన్ ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈవో జిసేన్జు తెలిపారు. డ్యూయల్ ఈక్యూ మోడ్, (ఒకే బటన్‌ను నొక్కడం ద్వారా వినియోగదారుడు రెండు మోడ్లకు మారడానికి అనుమతి), 240హెచ్ స్టాండ్‌బై సమయంతో 24 గంటల ప్లేయింగ్ సమయం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 2019లో తమ ఆడియో పరికరాలకు భారత వినియోగదారుల నుంచి వచ్చిన విశేష ఆదరణ నేపథ్యంలోఇక్యూ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ వెర్షన్‌ను తీసుకొచ్చామని ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్ ఇండియా బిజినెస్ హెడ్ నవీన్ బజాజ్ తెలిపారు -
దూసుకొచ్చిన యమహా ‘ఎంటీ–015’
యమహా మోటార్ ఇండియా ఎంటీ సిరీస్‌లో మరో అధునాతన బైక్‌ను శుక్రవారం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘ఎంటీ–015’ పేరుతో విడుదలైన ఈ 155 సీసీ బైక్ ధర రూ.1.36 లక్షలు. లిక్విడ్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్, సింగిల్ చానల్ యాంటి–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఫ్యూయల్ ఇంజెక్టడ్ వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ (వీబీఏ) ఫీచర్లుగా కంపెనీ తెలిపింది. ఈ ఏడాదిలో 60,000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
షావోమి మరో విప్లవం : ఈ ఫోన్‌కు మీరే పేరు పెట్టండి!
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మరోసారి విప్లవాత్మక ఆవిష్కారానికి నాంది పలికింది. శాంసంగ్, ఎల్జీ లాంటి దిగ్గజ సంస్థలు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణకు అష్టకష్టాలు పడుతోంటే స్మార్ట్‌ఫోన్ సంచలనం ఏకంగా మూడు స్క్రీన్లతో డబుల్ ఫోల్డబుల్ డివైస్‌ను పరిచయం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మడిచివేసేందుకు అనువైన మూడు స్క్రీన్ల మొబైల్‌ని రిలీజ్ చేసింది. ఈ మేరకు షావోమి సహ వ్యవస్థాపకుడు లిన్-బిన్ చైనా వెబ్సైట్ వైబోలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. టాబ్లెట్ సైజులో ఉండే ఈ ఫోల్డబుల్ మొబైల్ విశేషం ఏమిటంటే...ఈ ఫోన్‌ను తెరచి..ఫోల్డ్ చేయగానే చిన్న సెంట్రల్ డిస్ప్లే కనబడుతుంది. మరోసారి ఫోల్డ్ చేస్తే లోపల మరో రెండు స్క్రీన్స్ కనిపిస్తాయి. అలాగే మడిచివేసిన స్క్రీన్‌లోని భాగాలు డీ-యాక్టివేట్ అయిపోయి తిరిగి యధాతధ స్థితికి చేరుకుంటాయట. అయితే వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. మరోవైపు ఈ డివైస్‌లోని ఇతర ఫీచర్లు, కెమెరా గురించి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఫ్లెక్సిబుల్ ఫోల్దింగ్ స్క్రీన్ టెక్నాలజీతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తాము ఇలాంటి ఫోన్‌ని డెవలప్ చేశామని లిన్-బిన్ తెలిపారు. చైనా యాపిల్‌గా పిలుస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రాథమికంగా ఇంజనీరింగ్ మోడల్లో ఉందనీ, మరింత అభివృద్ది పరుస్తామని తెలిపారు. అలాగే డిమాండ్ ఆధారంగా వీటిని ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రస్తుతం షావోమీ డ్యుయెల్ ఫ్లెక్స్, షావోమీ మిక్స్ ఫ్లెక్స్ అనే పేర్లను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అంతేకాదు ఇంకా మార్కెట్లోకి రాని ఈ త్రీ స్క్రీన్ ఫోన్‌కి ఎవరైనా పేరు పెట్టవచ్చునని లిన్ ఆహ్వానించారు. అందుకే ఈ ఫోన్‌ను అందరికీ పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. కామెంట్లు, లైకుల ఆధారంగా, అందరికీ నచ్చితే.. భవిష్యత్తులో భారీ సంఖ్యలో వీటిని తయారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. Xiaomi foldable phone? #xiaomi #foldable pic.twitter.com/yAXYsTdl2Z — Bang Gogo (@bang_gogo_) January 23, 2019 -
బీఎస్ఎన్ఎల్: కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది.ఒకటి కాదు రెండు ఏకంగా ఆరు ప్లాన్లను తీసుకొచ్చింది. సరసమైన ధరలో రూ.118 ప్రారంభ ప్యాక్‌గా, రూ.379, రూ. 551 సహా ఇతర ప్రీపెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించింది. అలాగే రూ.339 ప్లాను రివ్యూ చేసి అదనపు సౌకర్యాలను జోడించింది. ముఖ్యంగా రిలయన్స్ జియోతో పాటు ఇతర టెలీకాం సంస్థల పోటీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ఈ కొత్త టారిఫ్ ప్లాన్లను తీసుకొచ్చింది. దీంతోపాటు ఈ అన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో వినియోగదారులు వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ టోన్ (పీఆర్బీటీ) కు ఉచితంగా అందిస్తోంది. రూ. 118 ప్లాన్: 1జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 28 రోజులు వాలిడిటీ. ఈ ప్లాన తమిళనాడు సర్కిల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రూ.379ప్లాన్: రోజుకు 4జీబీ 4జీ/3జీ డేటా .. బీఎస్ఎన్ఎల్ టూ బీఎస్ఎన్ఎల్ రోజుకు 30 నిమిషాల వాయిస్ కాల్స్, 30రోజులు వాలిడీటీ. అయితే ఈ ప్లాన్ కేరళ సర్కిల్లో మాత్రమే. రూ.551ప్లాన్: రోజుకు 1.5జీబీ 4జీ డేటా , కేరళకు మాత్రమే ప్రత్యేకం. రూ. 444 ప్లాన్:1.5జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్‌కాల్స్, 60 రోజులు వాలిడిటీ. రూ.666 ప్లాన్: 1 జీబీ 4జీడేటా, అన్‌లిమిటెడ్‌కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు,129 రోజులు వాలిడిటీ. రూ.485 ప్లాన్: రోజుకు1 జీబీ 4జీడేటా, రోజుకి వంద ఎస్ఎంఎస్లు, అన్‌లిమిటెడ్‌కాల్స్, 90 రోజులు వాలిడిటీ. దీంతోపాటు రూ.799ల మరో ప్రీమియం ప్రీపెయిడ్ ప్లాన్‌లో 30జీబీ డేటా, అన్‌లిమిటెడ కాల్స్ ఆఫర్ చేస్తోంది.అ లాగే ఇటీవల లాంచ్ చేసిన రూ.399 ప్లాన్‌ను మోడిఫై చేసి ఇపుడు అన్ లిమిటెడ్కాల్స్ అందిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఇవిఅమల్లోకి రానున్నాయి. మరోవైపు మిగతా ప్రాంతాల్లో ఈ ప్లాన్లను ఎపుడు అమలు చేసేదీ బీఎస్ఎన్ఎల్ వెల్లడిచేయలేదు. -
సోనీ మూడు కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్
మల్టీ నేషనల్ టెలికమ్యూనికేషన్ కంపెనీ సోనీ మొబైల్స్ మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. లాస్ వెగాస్‌లో జరుగుతున్న సీఈఎస్ 2018లో వీటిని పరిచయం చేసింది. జనవరి 9నుంచి 12వ తేదీవరకు జరగనున్నఈ ఎక్స్‌పోలో సోనీ గత సంవత్సరం లాంచ్ చేసిన ఎక్స్‌పీరియా ఎక్స్ఏ1, ఎక్స్ఏ1 అ ల్ట్రా కొనసాగింపుగా ఎక్స్ఏ2, ఎక్స్ఏ2 అ ల్ట్రా, ఎక్స్‌పీరియా ఎల్ 2 పేరుతో లాంచ్ చేసింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఎల్ 2 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ డివైస్‌లలో బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచింది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను వెనుకకు మార్చడం తప్ప పెద్దగా మార్పులేమీ చేయలేదు. మీడియా టెక్ ప్రాసెసర్లతో, ఎక్స్ఏ2, ఎక్స్ఏ2 అ ల్ట్రా క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 630 చిప్‌సెట్‌ను అమర్చింది. ఎక్స్ఏ2 ఫీచర్లు 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 23 ఎంపీ ప్రైమరీ కెమెరా 8ఎంపీ కెమెరా సెల్ఫీ లెన్స్ విస్తరించుకునే సదుపాయం 3,300ఎంఏహెచ్ బ్యాటరీ ఎక్స్ఏ2 అ ల్ట్రా ఫీచర్లు 6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ విస్తరించుకునే సదుపాయం 23 ఎంపీ ప్రైమరీ కెమెరా 8+6 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా లెన్స్ 3,580 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ రెండు డివైస్లతో పాటు లాంచ్ చేసిన కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎల్ 2 ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. ఎక్స్‌పీరియా ఎల్ 2 ఫీచర్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ 3 జీబి ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ ఎక్స్‌పాండబుల్ మెమరీ 8ఎంపీ సెల్ఫీ కెమెరా 13ఎంపీ రియర్ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా గ్లోబల్ మార్కెట్లో 2018, ఫిబ్రవరి మాసంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు స్మార్ట్ఫోన్ల రేట్లవివరాలు అందుబాటులోకి రావాల్సిఉంది. Brave, bold, borderless – #Xperia XA2 was made to free your inner creative. #SonyCEShttps://t.co/T1ZOpYDC6v pic.twitter.com/ocL4gMTpJS — Sony Xperia (@sonyxperia) January 8, 2018 -
హ్యుందాయ్ కొత్త వెర్నా వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా కార్ మేకర్ హ్యుందాయ్ మోటార్ ఇండియా మిడ్ సైజ్, సెడాన్ వెర్నా అన్ని కొత్త వెర్షన్ల ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించింది. వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న ఫిఫ్త్ జనరేషన్ వెర్నాను శుక్రవారం ఆవిష్కరించింది. కొత్తగా అభివృద్ధి చెందిన కే 2 ప్లాట్‌పారం ఆధారంగా దీన్ని రూపొందించింది. రూ .1,040 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేసినట్టు కంపెనీ వెల్లడించింది. మాన్యుల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో1.6లీటర్ పెట్రోల్ , డీజిల్ వెర్షన్లలో కొత్త వెర్నా ను అందుబాటులోకి తెస్తోంది. ఈ అప్ కమింగ్ వెర్నా బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయనీ, ఆగస్టు 22 న దీన్ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. దీపావళి పండుగకు ముందే 10,000 డెలివరీలను లక్ష్యంగా పెట్టుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో వైకె కూ చెప్పారు. నెక్స్ట్ జనరేషన్ వెర్నా బెంచ్‌మార్క్ ఫీచర్లు మరియు పనితీరుతో సెడాన్ విభాగంలో సంచలనం సృష్టిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 88 లక్షల సెడాన్ కార్లను, భారతదేశంలో మొత్తం 3,72,982 యూనిట్లు విక్రయించామన్నారు. 2006 లో ఈ మోడల్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచీ దేశంలో 3.17 లక్షల సెడాన్లను కంపెనీ విక్రయించింది. అయితే ఈ కొత్త కారు ధరెంతో ఉంటుందో ఇంకా స్పష్టంకాలేదు. హ్యుందాయ్ వెర్నా భారత్‌లోకి ప్రవేశించిన తొలి ఫ్లూయిడ్ మోడల్. హ్యుందాయ్ ఫ్లూయిడ్ కార్లకు ఇప్పటికీ భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. అలాగే మునుపటి వెర్నాతో పోలిస్తే 2017 వెర్నా పెద్దదిగా, 70ఎమ్ఎమ్ పొడవు, 29ఎమ్ఎమ్ వెడల్పు, 10ఎమ్ఎమ్ వీల్ బేస్ పెరుగుతుందట. ఎక్కువ క్యాబిన్ స్పేస్ తో పాటు, 2017 వెర్నా సెడాన్‌లో హ్యుందాయ్ సేఫ్టీకి పెద్ద పీట వేయనుందని, ఇందులో ప్రత్యేకించి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు, టాప్ ఎండ్ వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ అసిస్ట్ ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం. మిడిల్ సెడాన్ సెగ్మెంట్లో రూ.7.65-13.43 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ధర పలికే మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ సెడాన్లకు పోటీగా హ్యుందాయ్ ఈ కొత్త వెర్నాను తీసుకొస్తోందని అంచనా. Get ready to be blown away by the #NextGenVerna. Bookings Open! Assured early delivery. Click here to Book Now https://t.co/gsvAKVHCU5 pic.twitter.com/FM0rlBKvpR — HyundaiIndia (@HyundaiIndia) August 4, 2017 -
'ఈ రోజుల్లో అలా నడుచుకోవడం కుదురుతుందా'
మీరట్: 'ఈ రోజుల్లో గాంధీజీ అడుగుజాడల్లో నడవడం కుదురుతుందా. ఇటీవల మన భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ నా ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. మనం ఒకవేళ గాంధీజీ చూపిన మార్గంలోనే నడిస్తే.. సర్జికల్ దాడులు జరగకూడదు' అని అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు అశోక్ శర్మ ఇక్కడ గాడ్సే విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడారు. ఆదివారం గాంధీ జయంతిని అఖిల భారతీయ హిందూ మహాసభ ధిక్కార్ దివస్‌గా జరుపుకుంది. ఈ సందర్భంగా మీరట్‌లోని సంస్థ కార్యాలయంలో గాడ్సే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అఖిల భారత హిందూ మహాసభ 2014 లోనే గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి ప్రయత్నించినప్పటికీ.. పోలీసులు, వివిధ సంఘాలు ప్రతిఘటించడంతో విగ్రహ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. అయితే.. ఈసారి గాంధీ జయంతి సందర్భంగా హిందూ మహాసభ తన పంతం నెరవేర్చుకుంది. గాంధీజీ అడుగుజాడల్లో నడవడం మానేసి అందరూ గాడ్సేను ఆరాధించడం మొదలుపెట్టాలని ఈ సందర్భంగా అశోక్ శర్మ మాట్లాడారు. -
షియోమి ఎయిర్ ప్యూరిఫైర్2 వచ్చేసింది!
న్యూఢిల్లీ : చైనీస్ బహుళ జాతీయ కంపెనీ షియోమి రెండు కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. మి ఎయిర్ ప్యూరిఫైర్ 2 తో పాటు, వేరియబుల్ బ్యాండు మి బ్యాండు 2ను భారత వినియోగదారుల చెంతకు తీసుకొచ్చింది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్తో గృహోపకరణలోకి అడుగుపెట్టిన షియోమి, తాజాగా మి ఎయిర్ ప్యూరిఫైర్ 2 పేరుతో మరో ఉత్పత్తిని తీసుకొచ్చింది. రూ.9999కు ఈ మి ఎయిర్ ప్యూరిఫైర్ 2ను , మి డాట్ కామ్‌లో సెప్టెంబర్ 26 నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్ఫామ్లో దీన్ని అక్టోబర్ 2 నుంచి విక్రయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అదేవిధంగా మి బ్యాండు 2ను 1,999రూపాయలకు మి డాట్ కామ్‌లో సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్ 30 నుంచి కూడా ఈ బ్యాండును అమెజాన్‌లో కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించింది. పాత వెర్షన్‌తో పోలిస్తే మి ఎయిర్ ఫ్యూరిఫైర్ 2 డిజైన్ చాలా దృఢంగా ఉంటుందని కంపెనీ చెపుతోంది. మి ఎయిర్ ప్యూరిఫైర్ 2, భారత ఎయిర్ ప్యూరిఫైర్ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తుందని షియోమి వైస్ ప్రెసిడెంట్ హ్యగో బరా తెలిపారు. వై-ఫై కనెక్షన్‌తో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చని చెప్పారు. సంప్రదాయం ఎయిర్ ప్యూరిఫైర్ల మాదిరిగా కాకుండా మూలమూలలా గాలిని ఇది శుద్ధి చేస్తుందని 360 డిగ్రీల్లో ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతన్న వాటికంటే ఇది చాలా అధికం. ఎయిర్ ఫ్యూరిఫైర్ 2 గాలిలోని కాలుష్యాన్ని 99.7 శాతం వరకు తగ్గిస్తుందని షియోమి వెల్లడించింది.అంతే కాకుండా దీని క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ (సీఏడీఆర్) సామర్థ్యం గంటకు 330 క్యూబిక్ మీటర్లని పేర్కొంది. మి బ్యాండు 2 పేరుతో తీసుకొచ్చిన వేరియబుల్ బ్యాండు ఓలెడ్ డిస్ప్లేతో, తక్కువ బరువు కలిగి ఉంటుందని షియోమి తెలిపింది. ఇది చాలా స్లిమ్‌గా ఉంటుందని చెప్పింది. దీన్ని బ్యాటరీ లైఫ్ 20 రోజుల వరకు ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది. -
ఆసుస్ జెన్‌ఫోన్ కొత్త సెల్ఫీ స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: తైవాన్ కు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఆసుస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను బుధవారం లాంచ్ చేసింది. జెన్ఫోన్సె ల్ఫీ స్మార్ట్ పోన్ కొత్త వెర్షన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. దీనిధరను రూ 12.999 గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇది అమెజాన్ లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ నుంచి ఇతర రిటైల్ కేంద్రాల నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపింది.. మైక్రో ఫోటోగ్రఫీని తమ లేటెస్ట్ డివైస్ సపోర్టు చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ అప్ డేటెడ్ స్మార్ట్ ఫోన్ లోని 88 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ ద్వారా సెల్ఫీ పనోరమ ను సృష్టించుకోవచ్చని,6సీఎం పైగా ఉన్న వస్తువులను కాప్చర్ చేయొచ్చని తెలిపింది. స్టన్నింగ్ డైమండ్ కట్ డిజైన్ తో వస్తున్న ఈ ఫోన్ తో అద్భుతమైన సెల్ఫీ ఫోటోలను తీసుకోచ్చని కంపెనీసౌత్ ఆసియా హెడ్ పీటర్ చాంగ్ తెలిపారు. ఆసుస్ జెన్‌ఫోన్ సెల్ఫీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు 5.5 ఇంచెస్ స్ర్కీన్, 615 క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్ 3 జీబీ రామ్, 16జీబీ మొమరీ, 128జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ 13 ఎంపీ రియర్ కెమెరా 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఆటో లేజర్ ఫోకస్, డ్యుయల్ కలర్ రియల్ టోన్ ఫ్లాష్ 3000ఎంఏహెచ్ బ్యాటరీ -
'అన్నా' హజారే పోస్టర్ విడుదల!
సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'అన్నా' ఫస్ట్ లుక్ విడుదలైంది. శశాంక్ ఉదపుర్కర్ దర్శకత్వంలో వెలువడుతున్న చిత్రం పోస్టర్ ను ముంబైలోని ఓ కార్యక్రమంలో అన్నా హజారే స్వయంగా విడుదల చేశారు. 25 ఏళ్ళ వయసులో దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్న తనకు ప్రస్తుతం 79 సంవత్సరాలని, ఇప్పటికీ అదే మార్గంలో తాను నడుస్తున్నానని హజారే పోస్టర్ రిలీజ్ సందర్భంలో తెలిపారు. దేశంలో ఉన్నవారంతా తన కుటుంబ సభ్యులేనన్నారు. ద రైజ్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో వెలువడనున్న 'అన్నా' చిత్రానికి మహేంద్ర జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోవింద్ నమ్ దేవ్, శతాత్ సక్సేనా, కిషోర్ కదమ్ చిత్రంలో నటిస్తుండగా... దర్శకుడు శశాంక్ ఉదపుర్కర్ అన్నా పాత్రను పోషిస్తున్నారు. కాజోల్ సోదరి తనీషా ముఖర్జీ ఈ సినిమాలో జర్నలిస్టు రోల్ లో కనిపించనుంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అన్నా హజారే.. 2011 లో జన్ లోక్ పాల్ బిల్లు తీసుకురావాలంటూ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. -
నేతాజీ రహస్య ఫైళ్లు విడుదల చేసిన మోదీ