'ఈ రోజుల్లో అలా నడుచుకోవడం కుదురుతుందా'
'ఈ రోజుల్లో అలా నడుచుకోవడం కుదురుతుందా'
Published Mon, Oct 3 2016 11:29 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
మీరట్: 'ఈ రోజుల్లో గాంధీజీ అడుగుజాడల్లో నడవడం కుదురుతుందా. ఇటీవల మన భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ నా ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. మనం ఒకవేళ గాంధీజీ చూపిన మార్గంలోనే నడిస్తే.. సర్జికల్ దాడులు జరగకూడదు' అని అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు అశోక్ శర్మ ఇక్కడ గాడ్సే విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడారు. ఆదివారం గాంధీ జయంతిని అఖిల భారతీయ హిందూ మహాసభ ధిక్కార్ దివస్గా జరుపుకుంది. ఈ సందర్భంగా మీరట్లోని సంస్థ కార్యాలయంలో గాడ్సే విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అఖిల భారత హిందూ మహాసభ 2014 లోనే గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి ప్రయత్నించినప్పటికీ.. పోలీసులు, వివిధ సంఘాలు ప్రతిఘటించడంతో విగ్రహ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. అయితే.. ఈసారి గాంధీ జయంతి సందర్భంగా హిందూ మహాసభ తన పంతం నెరవేర్చుకుంది. గాంధీజీ అడుగుజాడల్లో నడవడం మానేసి అందరూ గాడ్సేను ఆరాధించడం మొదలుపెట్టాలని ఈ సందర్భంగా అశోక్ శర్మ మాట్లాడారు.
Advertisement