వండర్‌లాలో రెండు రైడ్స్‌ను ఆవిష్కరించిన స్టార్‌ నాగ చైతన్య | Legendary actor Naga Chaitanya unveils futuristic thrills at Wonderlaw Hyderabad | Sakshi
Sakshi News home page

వండర్‌లాలో రెండు రైడ్స్‌ను ఆవిష్కరించిన స్టార్‌ నాగ చైతన్య

Published Sat, Sep 28 2024 10:10 AM | Last Updated on Sat, Sep 28 2024 4:07 PM

Legendary actor Naga Chaitanya unveils futuristic thrills at Wonderlaw Hyderabad

భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్‌ పార్క్‌ చైన్లలో ఒకటైన వండర్‌లా హాలిడేస్‌ లిమిటెడ్‌,  వండర్‌లా హైదరాబాద్‌లో రెండు హైపర్‌వర్స్‌, జి-ఫాల్‌ అనే అత్యాధునిక రైడ్స్‌ను  టాలీవుడ్‌  స్టార్‌ హీరో అక్కినేని నాగ చైతన్య ఆవిష్కరించారు. కంపెనీ ఎండీ అరుణ్‌ కె చిట్టిలపిల్లి , సీఓఓ ధీరన్‌ చౌదరి, పార్క్‌ హెడ్‌,  మధు సూధన్‌ గుత్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

జి-ఫాల్‌ రైడ్‌, 40 మీటర్ల ఎత్తులో, గుండ్రంగా చుట్టూ కూర్చున్న 12 మంది రైడర్‌లతో, అడ్రినలిన్‌ ప్రేమికులకు తప్పనిసరిగా పొందాలనే అనుభూతిని అందిస్తుంది.

హైపర్‌వర్స్‌,  అత్యాధునిక మెటావర్స్‌ 3డి థియేటర్‌ అనుభవాన్ని అందిస్తుంది, లీనమయ్యే రీతిలో 5 నిమిషాల వీక్షణ కోసం సెషన్‌కు 30 మందికి పైగా వ్యక్తులకు వీక్షణ వసతి కల్పిస్తుంది. 8కె హై-రిజల్యూషన్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీ సరౌండ్‌ సౌండ్‌ లైట్‌ 270డిగ్రీ షాడో డిజైన్‌ను కలిగి ఉంటుంది. అద్భుతమైన 3డి విజువల్స్‌తో ఉత్కంఠభరితమైన రీతిలో ఎగిరే దృశ్యాలలోకి అతిథులను తీసుకుని వెళ్తుంది.

ఈ సందర్భంగా వండర్‌లా హాలిడేస్‌ ఎండీ అరుణ్‌ కె. చిట్టిలపిల్లి మాట్లాడుతూ, ‘‘వండర్‌లా వద్ద, వినోదవంతంగా ఉత్తేజకరమైన, విప్లవాత్మకమైన అనుభవాన్ని అందించే లక్ష్యంతో కొత్త రైడ్‌, హైపర్‌వర్స్‌, లీనమయ్యే సాంకేతికత సాహసోపేతమైన ముందడుగు అన్నారు.

జి-ఫాల్‌ విషయానికొస్తే, ఇది అసాధారణమైన థ్రిల్స్‌ విభాగంలోకి మా సరికొత్త ప్రయాణం, వినూత్న అనుభవాలను సొంతం చేసుకోవాలని సాహసించే వారందరికీ మరపురాని అనుభవాలను అందిస్తుంది. ప్రతి ఒక్కరూ  ఈ సంచలనాత్మక ఆకర్షణలను ప్రత్యక్షంగా అనుభవించాలని ఆశిస్తున్నామన్నారు.

ఈ అద్భుతమైన ఆకర్షణలను వండర్‌లా హైదరాబాద్‌లో ప్రారంభించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను అన్నారు నాగ చైతన్య. గ్లోబల్‌ పార్కులతో సమానంగా భారతదేశానికి ప్రపంచ స్థాయి రైడ్‌లను వండర్‌లా ఎలా తీసుకువస్తోందో చూడటం తనకు థ్రిల్లింగ్‌గా ఉందనీ, విఆర్‌ - ఆధారిత అనుభవాల కోసం పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణులతో సమానంగా లీనమయ్యే వినోదం అందించటంలో వండర్లా  టాప్‌లో ఉందని కొనియాడారు. ఇది సందర్శకులకు మంచి అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నా అన్నారు.

వండర్‌లా సందర్శకులను ఆన్‌లైన్ పోర్టల్ ముందుగానే తమ ఎంట్రీ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. నేరుగా పార్క్ కౌంటర్‌ల నుండి టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ పార్క్‌ను : 084 146 76333 లేదా +91 91000 63636 వద్ద సంప్రదించవచ్చు.

వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ గురించి భారతదేశపు అతిపెద్ద, ప్రీమియర్ అమ్యూజ్‌మెంట్ పార్క్ ఆపరేటర్, వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్. ఇది అగ్రశ్రేణి వినోదం, వినూత్న ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, భువనేశ్వర్‌లలో నాలుగు ప్రపంచ స్థాయి అమ్యూజ్మెంట్ పార్క్ లను నిర్వహిస్తోంది. ఆహ్లాదం, కుటుంబ వినోదం కోసం బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుంది.

మరింత సమాచారం కోసం
వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్
+91 8136852848

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement