wonderla
-
వండర్లాలో రెండు రైడ్స్‌ను ఆవిష్కరించిన స్టార్ నాగ చైతన్య
భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్లలో ఒకటైన వండర్లా హాలిడేస్ లిమిటెడ్, వండర్లా హైదరాబాద్‌లో రెండు హైపర్‌వర్స్, జి-ఫాల్ అనే అత్యాధునిక రైడ్స్‌ను టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య ఆవిష్కరించారు. కంపెనీ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి , సీఓఓ ధీరన్ చౌదరి, పార్క్ హెడ్, మధు సూధన్ గుత్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జి-ఫాల్ రైడ్, 40 మీటర్ల ఎత్తులో, గుండ్రంగా చుట్టూ కూర్చున్న 12 మంది రైడర్లతో, అడ్రినలిన్ ప్రేమికులకు తప్పనిసరిగా పొందాలనే అనుభూతిని అందిస్తుంది.హైపర్‌వర్స్, అత్యాధునిక మెటావర్స్ 3డి థియేటర్ అనుభవాన్ని అందిస్తుంది, లీనమయ్యే రీతిలో 5 నిమిషాల వీక్షణ కోసం సెషన్‌కు 30 మందికి పైగా వ్యక్తులకు వీక్షణ వసతి కల్పిస్తుంది. 8కె హై-రిజల్యూషన్ డిస్ప్లే, 360 డిగ్రీ సరౌండ్ సౌండ్ లైట్ 270డిగ్రీ షాడో డిజైన్‌ను కలిగి ఉంటుంది. అద్భుతమైన 3డి విజువల్స్‌తో ఉత్కంఠభరితమైన రీతిలో ఎగిరే దృశ్యాలలోకి అతిథులను తీసుకుని వెళ్తుంది.ఈ సందర్భంగా వండర్లా హాలిడేస్ ఎండీ అరుణ్ కె. చిట్టిలపిల్లి మాట్లాడుతూ, ‘‘వండర్లా వద్ద, వినోదవంతంగా ఉత్తేజకరమైన, విప్లవాత్మకమైన అనుభవాన్ని అందించే లక్ష్యంతో కొత్త రైడ్, హైపర్‌వర్స్, లీనమయ్యే సాంకేతికత సాహసోపేతమైన ముందడుగు అన్నారు.జి-ఫాల్ విషయానికొస్తే, ఇది అసాధారణమైన థ్రిల్స్ విభాగంలోకి మా సరికొత్త ప్రయాణం, వినూత్న అనుభవాలను సొంతం చేసుకోవాలని సాహసించే వారందరికీ మరపురాని అనుభవాలను అందిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సంచలనాత్మక ఆకర్షణలను ప్రత్యక్షంగా అనుభవించాలని ఆశిస్తున్నామన్నారు.ఈ అద్భుతమైన ఆకర్షణలను వండర్లా హైదరాబాద్‌లో ప్రారంభించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను అన్నారు నాగ చైతన్య. గ్లోబల్ పార్కులతో సమానంగా భారతదేశానికి ప్రపంచ స్థాయి రైడ్లను వండర్లా ఎలా తీసుకువస్తోందో చూడటం తనకు థ్రిల్లింగ్‌గా ఉందనీ, విఆర్ - ఆధారిత అనుభవాల కోసం పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణులతో సమానంగా లీనమయ్యే వినోదం అందించటంలో వండర్లా టాప్‌లో ఉందని కొనియాడారు. ఇది సందర్శకులకు మంచి అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నా అన్నారు.వండర్లా సందర్శకులను ఆన్లైన్ పోర్టల్ ముందుగానే తమ ఎంట్రీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. నేరుగా పార్క్ కౌంటర్ల నుండి టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ పార్క్‌ను : 084 146 76333 లేదా +91 91000 63636 వద్ద సంప్రదించవచ్చు.వండర్లా హాలిడేస్ లిమిటెడ్ గురించి భారతదేశపు అతిపెద్ద, ప్రీమియర్ అమ్యూజ్మెంట్ పార్క్ ఆపరేటర్, వండర్లా హాలిడేస్ లిమిటెడ్. ఇది అగ్రశ్రేణి వినోదం, వినూత్న ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, భువనేశ్వర్లలో నాలుగు ప్రపంచ స్థాయి అమ్యూజ్మెంట్ పార్క్ లను నిర్వహిస్తోంది. ఆహ్లాదం, కుటుంబ వినోదం కోసం బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుంది.మరింత సమాచారం కోసంవండర్లా హాలిడేస్ లిమిటెడ్+91 8136852848 -
ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. మహిళల కోసం స్పెషల్ ఆఫర్: ఎక్కడో తెలుసా?
సమ్మర్ ఆఫర్స్, ఫెస్టివల్ ఆఫర్స్ మాదిరిగానే రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వండర్లా ఒక ప్రత్యేకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇది కేవలం మహిళల కోసం మాత్రమే. ఇందులో భాగంగానే ఆ రోజు ఒక టికెట్ కొంటె మరో టికెట్ ఉచితంగా పొందవచ్చు. వండర్లా ఎంట్రీ టికెట్ జిఎస్టితో కలిపి రూ. 999. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ధరకు మహిళలు రెండు టికెట్స్ పొందవచ్చు. మహిళలు సరదాగా ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడానికి ఈ రోజులలో ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మార్చి 8న 10 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులను అనుమతించరు. మార్చి 8న సరదాగా గడపాలనుకునే మహిళలు ఈ ఆఫర్‌తో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్లి కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ రుగు పురుషులు బుక్ చేసుకుంటే అనుమతించబడదు. బుక్ చేసుకున్న ఏ టికెట్ అయినా రద్దు చేస్తారు. వండర్లా హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్ని అవసరమైన మార్గదర్శకాలను తప్పకుండా అనుసరిస్తుంది. పరిశుభ్రత, భద్రతలను దృష్టిలో ఉంచుకుని అతిథులు రైడ్లు, రెస్టారెంట్లు, క్యూ ప్రాంతాలలో భౌతిక దూరాలు వంటివి పాటించాల్సిన అవసరం ఉంది. వండర్‌లాలోని మొత్తం సిబ్బంది మాస్క్‌లు ధరించడం తప్పనిసరి, అన్ని రైడ్లు, రెస్టారెంట్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఇతర ఎంట్రీ పాయింట్ల వద్ద ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్లు అందించబడుతుంది. మొత్తానికి సమ్మర్ సీజన్లో మహిళలు ఎంజాయ్ చేయడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. -
మీ పేరు కమలా! అయితే మీకో బంపరాఫర్!
మీ పేరు కమలా! అయితే మీకో బంపర్ ఆఫర్! ఈనెల 24న.. అదేనండీ ఆదివారం రోజు మీకు ఓ ప్రఖ్యాత థీమ్ పార్కులోకి ఎంట్రీ ఉచితం.. అవునండీ నిజమే.. మీరు పేరు కమల, కమ్లా లేదా కమల్, కమలం అయితే చాలు ఎలాంటి రుసుము చెల్లించకుండానే సదరు పార్కులో ప్రవేశించవచ్చు. అయితే ఫొటో ఐడీ మాత్రం తప్పనిసరి. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకు మాత్రమే ఈ ఆఫర్! ఇంతకీ ఈ ఆఫర్ ఇచ్చింది ఎవరో చెప్పమంటారా! వండర్లా.. అవును ఈ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ చైన్ ఈ మేరకు తమ కస్టమర్లకు అవకాశం కల్పించింది. అయితే ఇందుకో ప్రత్యేకత ఉంది. భారత- జమైకా సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా అగ్రరాజ్య తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా, ఈ అవకాశం దక్కించుకున్న తొలి శ్వేతజాతీయేతరురాలిగా చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో వండర్లా ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ..‘‘ఈ ఆదివారం అంతా కమల విజయమే!’’ ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.(చదవండి: అమ్మ మాట బంగారు బాట) కమల అన్న పేరు ఉన్నవాళ్లకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని చెప్పింది. అయితే తొలి 100 మంది అతిథులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. దీనితో పాటు మరికొన్ని షరతులు కూడా వర్తిస్తాయని పేర్కొంది. ఇంకెందుకు ఆలస్యం ఒకవేళ మీరు వండర్లాను సందర్శించాలన్న కోరిక ఉంటే ఈ ఆఫర్‌ను వినియోగించుకోండి మరి! ఏంటీ.. కమల అని కలిసి వచ్చేట్లుగా మీకు పేరు పెట్టిన తల్లిదండ్రులకు మరోసారి థాంక్స్ చెప్పుకొంటున్నారా!? -
ఐదేళ్లలో 4 వండర్లా కొత్త పార్క్‌లు
⇒ రూ.350 కోట్లతో చెన్నైలో 56 ఎకరాల్లో ప్రారంభం ⇒ శరవేగంగా నిర్మాణ పనులు; రెండేళ్లలో అందుబాటులోకి ⇒ ఆ తర్వాత గోవా, మహారాష్ట్ర, గుజరాత్లో కూడా.. ⇒ ఏడాదిలో 6.2 లక్షలకు హైదరాబాద్ పార్క్ సందర్శకులు ⇒ వండర్లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్యూజ్మెంట్ పార్క్‌ల నిర్వహణలో ఉన్న వండర్లా దేశంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 4 అమ్యూజ్మెంట్ పార్క్‌లను ఏర్పాటు చేయనుంది. ముందుగా రూ.350 కోట్ల పెట్టుబడులతో చెన్నైలో ప్రారంభించనుంది. పాత మహాబలిపురంలో రోడ్డులో 56 ఎకరాల్లో పార్క్‌ను నిర్మిస్తున్నామని, రెండేళ్లలో పార్క్‌ను అందుబాటులోకి వస్తుందని వండర్లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి తెలిపారు. ఆ తర్వాత గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో పార్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారమిక్కడ వండర్లా కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018 ఆర్ధిక సంవత్సరంలో మార్కెటింగ్ కోసం రూ.26 కోట్లు కేటాయించామని ఇందులో భాగంగా కొత్త లోగోను డిజైన్ చేశామని చెప్పారు. ప్రస్తుతం కోచి, బెంగళూరు, హైదరాబాద్‌లో పార్క్లుండగా.. 26 లక్షల మంది సందర్శించారని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధిని పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్‌లో పార్క్‌ను ప్రారంభించి నేటితో ఏడాది. తొలి సంవత్సరంలో 6.2 లక్షల మంది సందర్శించారు. ఈ ఏడాది 8 లక్షలు, మూడేళ్లలో 10 లక్షల సందర్శకులు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాతే హైదరాబాద్‌లోనూ రిసార్ట్ ఏర్పాటు యోచన చేస్తామని తెలియజేశారు. కొత్త కస్టమర్లనే కాకుండా పాత కస్టమర్లనూ అకర్షించేందుకు ప్రతి ఏటా రూ.30–40 కోట్ల పెట్టుబడులతో కొత్త కొత్త రైడ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ వేసవిలో హైదరాబాద్ పార్క్‌లో స్కై వీల్‌ను, సెప్టెంబర్‌లో ఫ్లై థీమ్ స్పేస్ థియేటర్‌ను, కోచిలో రోలర్ కోస్ట్, బెంగళూరులో ఫ్యామిలీ రైడ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. ఏపీలో పార్క్ ప్రాథమిక స్థాయిలోనే.. ఆంధ్రప్రదేశ్‌లో పార్క్ ఏర్పాటు ఒప్పందం గురించి ప్రశ్నించగా.. ‘‘రూ.350 కోట్ల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌లో అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రెండేళ్ల క్రితమే ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. కానీ, అదింకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. స్థల ఎంపిక, రాయితీలపై స్పష్టత వచ్చాకే పార్క్ ఏర్పాటుపై ముందడుగేస్తామని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు సమాధానమిచ్చారు. ప్రస్తుతం కోచి, బెంగళూరు, హైదరాబాద్‌లో పార్క్‌లున్నాయి. ఇప్పటివరకు 3 కోట్ల మంది సందర్శించారు.