bust
-
విలువ తెలియక డోర్‌స్టాప్‌గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు!
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం ప్రభువు మహబూబ్ అలీఖాన్ గతంలో కొనుగోలుచేసి దురదృష్టంగా భావించి షూలోపల పడేసిన ప్రపంచ ప్రఖ్యాత జాకబ్ వజ్రాన్ని ఆయన కుమారుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చాన్నాళ్లు తన టేబుల్‌పై పేపర్‌వెయిట్‌గా వాడారని చరిత్ర చెబుతోంది. అది వందల కోట్ల విలువచేస్తుందని ఆయన తెలీదు. అచ్చం అలాగే కోట్లుపలికే పాలరాతి ప్రతిమను చాలా సంవత్సరాలపాటు బ్రిటన్‌లో ఒక పారిశ్రామికవాడలోని షెడ్డు తలుపు మూసుకుపోకుండా అడ్డుగా వాడారు. చివరకు అది ప్రముఖ శిల్పకారుడు ఎడ్మీ బౌచర్డన్ చెక్కిన అద్భుత ప్రతిమ అని తెల్సి ఇప్పుడు ఔత్సాహిక కుబేరుడు కోట్లు పెట్టి కొనేందుకు ముందుకొస్తున్నారు. ఒకాయన ఏకంగా రూ.27 కోట్లు చెల్లించేందుకు సుముఖత చూపడంతో ఈ శిల్పం కథాకమామిషు తెల్సుకునేందుకు అంతా గూగుల్ తల్లి వద్ద సెర్చింగ్లు మొదలుపెట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన 15వ లూయిస్ రాజు వద్ద ఆస్థాన శిల్పకారుడైన ఎడ్మీ చౌడర్డన్ 18వ శతాబ్దంలో ఈ ప్రతిమను చెక్కారు. బ్రిటన్‌లో భాగమైన స్కాట్లాండ్లోని హైల్యాండ్స్ కౌన్సిల్ ప్రాంతంలో ఆనాటి భూస్వామి, రాజకీయనాయకుడు జాన్ గార్డన్.. ఎడ్మీతో తన స్వీయ ప్రతిమను చెక్కించుకున్నాడు. తర్వాతి కాలంలో ఆయన ఈ ప్రాంతంలో ఇన్వర్గార్డన్ పట్టణానికి రూపకల్పనచేశారు. తర్వాత 19వ శతాబ్దంలో ఒక కోట తగలబడిన ఘటనలోనూ ఇది చెక్కుచెదరలేదు. ఆ సంఘటన తర్వాత 1930వ సంవత్సరంలో అదే ఇన్వర్గార్డన్ పట్టణ కౌన్సిల్ కేవలం ఐదు పౌండ్లకు కొనుగోలుచేసింది. అయితే తర్వాత అది అదృశ్యమైంది. కేవలం ఐదు పౌండ్ల విలువచేసే శిల్పం ఎక్కడో శిథిలమై ఉంటుందని కౌన్సిల్ సభ్యులు భావించారు. అంతా దానిని మర్చిపోయారు.దశాబ్దాల తర్వాత అంటే 1998లో హైల్యాండ్స్ పారిశ్రామికవాడలోని కర్మాగారం గేటు వద్ద దానిని కౌన్సిల్సభ్యురాలు మాక్సిన్ స్మిత్ చూశారు. తలుపు మూసుకుపోకుండా అప్పుడు అడ్డుగా దానిని వాడుతున్నారు. మిలమిల మెరిసిపోతున్న ఈ ప్రతిమకు ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావించి దానిని హైల్యాండ్ కౌన్సిల్ స్థానిక ప్రభుత్వానికి అప్పజెప్పారు. ప్రభుత్వాధికారులు దానిని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. తర్వాత దానిని పారిస్ నగరంలోని ‘ది లారీస్’, లాస్ఏంజిల్స్లోని ‘ది గెట్టీ మ్యూజియం’లోనూ ప్రదర్శించారు. ఆనోటా ఈనోట విన్నాక అది ప్రఖ్యాత శిల్పకారుడు చెక్కిన శిల్పమని స్పష్టమైంది. అరుదైనదికావడంతో అది చాలా విలువైనదని గ్రహించి దానిని స్థానిక ప్రభుత్వం అపహరణకు గురికాకుండా లోపల భద్రపరిచింది.సహాయక నిధుల కోసం వేలానికి.. విలువైన వస్తువును దగ్గర పెట్టుకోవడం కంటే దానిని విక్రయిస్తే వచ్చే సొమ్ముతో స్థానికుల సంక్షేమ పథకాలను అమలుచేయొచ్చని స్థానిక ప్రభుత్వం భావించింది. అమ్మడానికి సిద్ధమైంది. వచ్చే నిధులను ఇన్వర్గార్డన్ కామన్‌గుడ్ ఫండ్ కింద ఖర్చుచేస్తామని చాటింపు వేయించింది. చారిత్రక వస్తువును సొంత ఆస్తిగా భావించి వేలం ఎలా వేస్తారని కొందరు కోర్టుకెక్కారు. దీనిపై హైల్యాండ్స్ టెయిన్ షరీఫ్ కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. అది వారసత్వ ఆస్తి కాదని తేల్చిచెప్పింది. చదవండి: వెదురుగొట్టం తూనీగ.. పశ్చిమ కనుమల్లో సరికొత్త జాతిఈలోపే గత ఏడాది అక్టోబర్‌లోనే దానిని రూ.27 కోట్లకు కొంటానని ఒక కుబేరుడు ఆసక్తి చూపించారు. తాజాగా కోర్టు తీర్పుతో ప్రతిమ వేలానికి రంగం సిద్ధమైంది. నవంబర్ ఏడోతేదీన తొలిసారిగా వేలానికి పెట్టారు. రోజు రోజుకూ దీనికి బిడ్డింగ్ ధర పెరుగుతోంది. విషయం తెల్సుకున్న ఆనాటి కౌన్సిల్సభ్యురాలు మాక్సిన్ స్మిత్ మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు తొలిసారి చూసినప్పుడే దానిని మూడో కంటికి తెలీకుండా ఇంటికి పట్టుకుపోతే బాగుండేది. కోటీశ్వరురాలివి అయ్యేదానివి అని నా స్నేహితులు ఇప్పటికీ నన్ను ఆటపట్టిస్తారు’’అని ఆమె అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లేడీ అనురాధ డ్రగ్స్ దందా
హైదరాబాద్: డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న లేడీ అనురాధ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో అక్రమంగా డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో లేడీ అనురాధ కీలకమని వెల్లడించారు. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కా సమాచారంతో భారీగా డ్రగ్స్ పట్టుకున్నామని చెప్పారు. వీటి విలువ దాదాపు రూ.14 లక్షలు ఉంటుందని వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠాలో కీలకంగా ఉన్న లేడీ అనురాధ భర్త నుండి డైవర్స్ తీసుకుంది. రెగ్యులర్‌గా గోవాకు వెళ్తూ ఉంటుంది. గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. గోవాలో జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి రోడ్డు మార్గంలో నగరానికి తీసుకువచ్చింది. గోవాలో జేమ్స్ వద్ద గ్రామ్ పది వేలు చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసింది. నగరానికి తీసుకువచ్చి డిమాండ్‌ను బట్టి గ్రాము 20వేలకు పైగా విక్రయించింది. డ్రగ్స్ అమ్మకంలో వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి ఈమెకు సహకరించాడు. గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తి కూడా అనూరాధకు డ్రగ్ అమ్మకంలో సహకరించాడు. ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని, వెహికల్స్, మొబైల్ ఫోన్స్ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. అందులో వినియోగదారులకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నామని చెప్పారు. రిమాండ్‌కు తరలించి మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. 48 గ్రాముల MDMA, మరొక ఎనిమిది గ్రాముల క్రషింగ్ mdma, 51 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: ‘పండగ’ నేపథ్యంలో అత్యంత అప్రమత్తం -
హైదరాబాద్ లో మరో మారు డ్రగ్స్ కలకలం
-
బెంగళూరు టు ఆస్ట్రేలియా వయా హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: సింథటిక్ డ్రగ్స్‌గా పిలిచే యాంఫిటమైన్, సైడో ఎఫిడ్రిన్‌లను నగరం నుంచి ఆస్ట్రేలియాకు అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు రట్టు చేశారు. గత వారం బెంగళూరుతో పాటు నగరంలోని అక్బర్బాగ్ల్లో జరిపిన దాడుల్లో మొత్తం ముగ్గురిని పట్టుకున్నారు. వీరి నుంచి 3.9 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఎన్సీబీకి చెందిన బెంగళూరు యూనిట్ చేపట్టింది. బెంగళూరుకు చెందిన సూత్రధారులు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో ఈ సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటిని ఆ దేశాలనికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనికో సం ఈ గ్యాంగ్ పోలీసు, కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు వివిధ మా ర్గాలను అనుసరిస్తోంది. తొలుత బెంగళూరు నుంచి ఆస్ట్రేలియాకు జిమ్ ఉపకరణాల మధ్యలో ఉంచి 2.5 కేజీల యాంఫిటమైన్ స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించింది. దీనిపై సమాచారం అందుకున్న ఎన్సీబీ బెంగళూరు యూనిట్ గత నెల 6న అక్కడి ఓ కొరియర్ సంస్థపై దాడి చేసింది. ఇస్మాయిల్ అనే నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ఆస్ట్రేలియాకు పార్శిల్ చేసిన డ్రగ్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామంతో కంగుతిన్న స్మగ్లర్లు తమ ‘రూటు’ మార్చారు. హైదరాబాద్ నుంచి పార్శిల్ చేయాలని పథకం వేశారు. ఈ విషయాన్నీ గుర్తించిన ఎన్సీబీ టీమ్ గత వారం నగరానికి చేరుకుంది. చంచల్‌గూడ సమీపంలోని అక్బర్ బాగ్ ప్రాంతంలోని ఓ కొరియర్ కార్యాలయంపై కన్నేసి ఉంచింది. తమిళనాడుకు చెందిన ఎ.తాహెర్, ఆర్.మీరన్‌ను ఓ పార్శిల్‌తో అక్కడకు చేరుకున్నారు. ఎంబ్రాయిడరీ వస్తువుల పేరుతో ఆస్ట్రేలియాకు దాన్ని పంపాలని ప్రయత్నించారు. అక్కడే మాటు వేసి ఉన్న ఎన్సీబీ టీమ్ వారిని అదుపులోకి తీసుకుని పార్శిల్‌ను తనిఖీ చేసింది. అందులో 1.4 కేజీల సూడో ఎఫిడ్రిన్ పౌడర్ బయటపడింది. దీంతో ఆ ఇద్దరినీ అరెస్టు చేసిన అధికారులు బెంగళూరు తరలించి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. ఈ గ్యాంగ్‌కు సూత్రధారులుగా ఉన్న కర్ణాటక వాసుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. చదవండి : Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి -
‘కూలిన చోటే నిలువెత్తు విగ్రహం’
కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నెలరోజుల కిందట ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైన క్రమంలో అదేచోట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం విద్యాసాగర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రాజకీయ నేతలు, మేథావులు, బెంగాలీ నటుల సమక్షంలో విద్యాసాగర్ విగ్రహానికి దీదీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మే 14న బీజేపీ చీఫ్ అమిత్ షా రోడ్‌షో సందర్భంగా విద్యాసాగర్ కళాశాలలో నెలకొల్పిన విద్యాసాగర్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ హామీ ఇచ్చిన మేరకు ఇదే కళాశాలలో పునర్నిర్మించిన విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. కోల్‌కతా కాలేజ్ స్ట్రీట్‌లోని విద్యాసాగర్ కాలేజ్‌లో ఆరు అడుగుల ఎత్తైన విద్యాసాగర్ విగ్రహాన్ని విద్యార్ధులు, మేథావులు, రాజకీయ నేతల హర్షధ్వానాల మధ్య ఆమె ఆవిష్కరించారు. బెంగాలీ సంస్కృతితో పాటు సమాజ వికాసానికి, విద్యావ్యాప్తికి ఆయన చేసిన కృషి అసామాన్యమని దీదీ ఈ సందర్భంగా కొనియాడారు. -
ఉద్యోగాలిప్పిస్తామని కుచ్చుటోపి
-
అల్లం,వెల్లుల్లి కల్తీ పేస్ట్
-
'ఈ రోజుల్లో అలా నడుచుకోవడం కుదురుతుందా'
మీరట్: 'ఈ రోజుల్లో గాంధీజీ అడుగుజాడల్లో నడవడం కుదురుతుందా. ఇటీవల మన భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ నా ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. మనం ఒకవేళ గాంధీజీ చూపిన మార్గంలోనే నడిస్తే.. సర్జికల్ దాడులు జరగకూడదు' అని అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు అశోక్ శర్మ ఇక్కడ గాడ్సే విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడారు. ఆదివారం గాంధీ జయంతిని అఖిల భారతీయ హిందూ మహాసభ ధిక్కార్ దివస్‌గా జరుపుకుంది. ఈ సందర్భంగా మీరట్‌లోని సంస్థ కార్యాలయంలో గాడ్సే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అఖిల భారత హిందూ మహాసభ 2014 లోనే గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి ప్రయత్నించినప్పటికీ.. పోలీసులు, వివిధ సంఘాలు ప్రతిఘటించడంతో విగ్రహ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. అయితే.. ఈసారి గాంధీ జయంతి సందర్భంగా హిందూ మహాసభ తన పంతం నెరవేర్చుకుంది. గాంధీజీ అడుగుజాడల్లో నడవడం మానేసి అందరూ గాడ్సేను ఆరాధించడం మొదలుపెట్టాలని ఈ సందర్భంగా అశోక్ శర్మ మాట్లాడారు. -
కారు వాడుతూ.. చోరీలు..
- స్లైడింగ్ డోర్ ఉన్న లాడ్జిలు, ఇళ్లే టార్గెట్ - ఏడాది కాలంలో 14 చోట్ల దొంగతనాలు - అంతరాష్ట్ర దొంగ సహా ఇద్దరు అరెస్టు - నిందితుల్లో ఒకడు బీటెక్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్: తెల్లవారుజామున రెండు గంటలకు డెన్ నుంచి బయలుదేరడం... ఫోర్డ్ ఐకాన్ కారులో సంచరిస్తూ రెక్కీలు నిర్వహించి స్లైడింగ్ డోర్స్ ఉన్న లాడ్జిలు, హోటళ్లు, ఇళ్లు గుర్తించి అదును చూసి లోపలకు ప్రవేశించి అందినకాడికి దోచుకోవడం.. ఈ పంథాలో రెచ్చిపోతున్న ఇద్దరు దొంగల్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక అంతరాష్ట్ర దొంగతో కూడిన ఈ ద్వయం ఏడాదిలో 14 చోట్ల చోరీలకు పాల్పడినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి మంగళవారం తెలిపారు. వీరి నుంచి 1.45 కేజీల బంగారం, ఫోర్డ్ కారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముంబైలో నేరబాట.. ఛత్తీస్ఘర్ లోని బస్తర్ జిల్లా జగ్దల్పూర్కు చెందిన ఆర్య ప్రతాప్ నాగ్ అలియాస్ దీపక్ మెట్రిక్యులేషన్‌తో చదువుకు స్వస్థి చెప్పాడు. సినిమాల్లో నటించాలన్న ఆశతో ముంబై చేరుకున్నాడు. కొంతకాలం డ్యాన్సులు, నటన నేర్చుకున్నా.. అవకాశాలు రాకపోవడంతో ఫాల్ సీలింగ్ నిర్మాణాన్ని జీవనాధారంగా చేసుకున్నాడు. 2013లో ఓ భవనంలో పని చేస్తున్న ఇతను ఎదురుగా ఉన్న శాటిలైట్ హోటల్లో ప్రవేశించి చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసులో విల్లేపార్లే పోలీసులకు చిక్కి జైలు నుంచి వచ్చిన తర్వాత 2014లో అక్కడి సహార్ అంధేరీ (ఈస్ట్) ఠాణా పరిధిలో మరో లాడ్జిలోకి ప్రవేశించి ఖరీదైన సెల్‌ఫోన్ చోరీ చేశాడు. రైల్లో పరిచయంతో.. 2015లో బెయిల్ పొందిన ఇతను ఆ ఏడాది జూన్‌లో రైల్లో హైదరాబాద్‌కు వస్తుండగా ఎర్రగడ్డ భవానీనగర్‌కు చెందిన మహ్మద్ ముస్తాఫాతో పరిచయం ఏర్పడింది. బీటెక్ పూర్తి చేసిన ఇతడు సరైన ఉద్యోగం లేకపోవడంతో ఇంటీరియర్ డెకరేటర్ గా పని చేసేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్న ఇతడికి ఆర్య మాటలు నచ్చడంతో జట్టు కట్టి తన ఇంటికే తీసుకువచ్చి షెల్టర్ ఇచ్చాడు. సాధారణంగా తిరుగుతూ చోరీలు చేస్తే పోలీసులకు చిక్కుతామనే ఉద్దేశంతో ఎర్రగడ్డలో ఓ సెకండ్ హ్యాండ్ ఫోర్డ్ ఐకాన్ కారును ఖరీదు చేసి అందులో తిరుగుతూ రెక్కీలు నిర్వహించి చోరీలకు పాల్పడేవారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కారులో బయలుదేరి కిటికీలకు గ్రిల్స్ లేని, స్లైడింగ్ డోర్‌తో కూడిన గదుల్ని గుర్తిస్తారు. ముస్తఫా కారులోనే ఉండి పరిసరాలను గమనిస్తుండగా... ఆర్య డ్రైనేజ్ పైపు ద్వారా పైకి ఎక్కి స్లైడింగ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలకు వెళ్లి ఏమాత్రం అలికిడి కాకుండా బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులను కొట్టేసి కారులో ఉడాయిస్తారు. వీరిద్దరూ ఏడాది కాలంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, సైఫాబాద్, బేగంపేట, మార్కెట్, గోపాలపురం, సుల్తాన్‌బజార్, మియాపూర్ ఠాణాల పరిధిలోని ఏడు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఏడాదిలో ఒకే తరహాలో 14 చోరీలు చేసిన ఈ నిందితులకు సంబంధించి ఆధారాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులకు బేగంపేటలోని ట్రీబూ ట్రాన్సిట్ హోటల్లో దొరికింది. ఈ ఏడాది అక్కడ చోరీ చేసిన ఆర్య సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాడు. దీంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని ముస్తఫా, ఆర్యలను అరెస్టు చేశారు. ఈ నిందితులపై పీడీ యాక్ట్‌కు సిఫార్సు చేస్తామని, తదుపరి దర్యాప్తులో దొరికిన ఆధారాలను బట్టి రిసీవర్‌పై చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. -
సెక్స్ ముఠాను పట్టించిన విద్యార్థినులు
అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ను డార్జింలింగ్ పోలీసులకు పట్టించేందుకు ఓ పాఠాశాల విద్యార్థులు సాయం అందించారు. డిల్లీ కేంద్రంగా చేసిన ఈ ఆపరేషన్ ‘కింగ్ పిన్‘ పేరుతో అమ్మాయిలను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్-పశ్చిమ బెంగాల్ బోర్డర్లో ముగ్గురు ట్రాఫికర్స్ ను అరెస్టు చేయగా.. డార్జిలింగ్ లో నుంచి ఢిల్లీ బయలుదేరిన మరో టీమ్ రాకెట్ లో ఉన్న మిగతా వారిని అరెస్టు చేశారు. డార్జిలింగ్ లో ఓ పదిహేనేళ్ల బాలిక కొద్ది రోజులుగా కనిపించకుండా పోవడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు తీగ లాగడంతో అంతర్జాతీయ రాకెట్ గురించిన వివరాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం డార్జిలింగ్, సిక్కిం, నేపాల్ ల నుంచి ముఠా ఉద్యోగం పేరుతో బీదరికంలో ఉన్న అమ్మాయిలకు అక్రమంగా ఆధార్ కార్డులను సృష్టించి నేషనల్ కాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లోని బార్ లలో డాన్సర్లుగా మారుస్తూ వారి రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో నిందితులు వర్మ, సున్నీలను అరెస్టు చేయడానికి వెళ్లగా వారు నేపాల్ వైపు రోడ్డు మీదుగా తప్పించుకు పారిపోయినట్లు వివరించారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని పట్టుకున్నట్లు చెప్పారు. డార్జిలింగ్ లో అమ్మాయిల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అక్కడ పనిచేసే 12 మంది అమ్మాయిలతో కూడిన పాఠశాల ఎన్జీవో బృందం నిందితులను పట్టుకోవడంలో సాయపడినట్లు తెలిపారు. గిరిజన అమ్మాయిల్లా వీరు ముఠా వద్ద నటించి వారిని బురిడీకొట్టించారని వివరించారు. వారితో పాటు బార్లలో పనిచేయడానికి ఇల్లు వదిలేసి ఢిల్లీ వచ్చినట్లు వారిని మొదట నమ్మించారని చెప్పారు. ఆ తర్వాత 15,000వేల జీతానికి బార్ లో డాన్స్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్లు లేవని చెప్పడంతో నిందితులు 20 నిమిషాల్లో ఆధార్ కార్డులను సృష్టించి పంపినట్లు తెలిపారు. మొదట ఓ వ్యక్తి, మహిళ ఢిల్లీలోని పనిటంకీ వద్దకు వీరిని తీసుకువెళ్లడానికి వచ్చారని వీరిని పట్టుకుని సమాచారం సేకరించినట్లు చెప్పారు. ఆ సమాచారంతో అసలు ముఠా హెడ్ ను నేపాల్ బోర్డర్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.