హైదరాబాద్: డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న లేడీ అనురాధ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో అక్రమంగా డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో లేడీ అనురాధ కీలకమని వెల్లడించారు. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కా సమాచారంతో భారీగా డ్రగ్స్ పట్టుకున్నామని చెప్పారు. వీటి విలువ దాదాపు రూ.14 లక్షలు ఉంటుందని వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠాలో కీలకంగా ఉన్న లేడీ అనురాధ భర్త నుండి డైవర్స్ తీసుకుంది. రెగ్యులర్‌గా గోవాకు వెళ్తూ ఉంటుంది. గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. గోవాలో జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి రోడ్డు మార్గంలో నగరానికి తీసుకువచ్చింది.
గోవాలో జేమ్స్ వద్ద గ్రామ్ పది వేలు చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసింది. నగరానికి తీసుకువచ్చి డిమాండ్‌ను బట్టి గ్రాము 20వేలకు పైగా విక్రయించింది. డ్రగ్స్ అమ్మకంలో వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి ఈమెకు సహకరించాడు. గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తి కూడా అనూరాధకు డ్రగ్ అమ్మకంలో సహకరించాడు.
ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని, వెహికల్స్, మొబైల్ ఫోన్స్ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. అందులో వినియోగదారులకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నామని చెప్పారు. రిమాండ్‌కు తరలించి మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. 48 గ్రాముల MDMA, మరొక ఎనిమిది గ్రాముల క్రషింగ్ mdma, 51 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ‘పండగ’ నేపథ్యంలో అత్యంత అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment