సాక్షి, ముంబై: ఎయిరిండియాకు సంబంధించి టాటా గ్రూపు కీలక ప్రకటన చేసింది. కొత్తపేరు, కొత్త ప్రణాళికలతో ప్రయాణికుల ముందుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘విహాన్ ఎయిరిండియా’ అనే ప్లాన్స్‌తో దీర్ఘకాలిక లక్ష్యాలు, ప్రణాళికలను తాజాగా ప్రకటించింది. ఇందుకోసం రానున్న ఐదేళ్లలో, ఐదు నిర్దేశిత లక్ష్యాలను ఎంచుకుంది. (రెసిషన్ భయాలు:రుపీ మరోసారి క్రాష్)
కస్టమర్ అనుభవం, బలమైన కార్యకలాపాలు, పరిశ్రమ-ఉత్తమప్రతిభ, పరిశ్రమ నాయకత్వం, వాణిజ్య సామర్థ్యం అనే ఐదు కీలక లక్ష్యాలతో ఒక ప్రణాళికను ఆవిష్కరించింది. దాని పేరు విహాన్ ఏఐ ... విహాన్ అంటే సంస్కృతంలో కొత్త శకానికి నాంది అని అర్థం. దీంతోపాటు రాబోయే ఐదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించింది. దేశీ మార్కెట్‌లో ప్రస్తుతం 8 శాతంగా ఉన్న తన వాటాను కనీసం 30 శాతానికి పెంచుకోవడానికి ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ ఎయిర్‌లైన్‌గా మరోసారి సత్తా చాటేలా అంతర్జాతీయ సర్వీసులను గణనీయంగా పెంచాలని భావిస్తోంది. ఇందులోనే భాగంగా నెట్‌వర్క్, ఫ్లీట్ రెండింటి వృద్ధిపైనా మరింత దృష్టిపెట్టనుంది.
ఎయిరిండియాను దారిలో పెట్టడమే ఈ ప్లాన్ లక్ష్యమంటూ ఎయిరిండియా సీఎండీ కాంప్‌బెల్ విల్సన్ సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులతో కలిసి, వర్క్‌ప్లేస్, వర్చువల్ కమ్యూనికేషన్ ఎంగేజ్ మెంట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మొత్తం సంస్థ ప్లాన్‌ను ఆవిష్కరించారు. చరిత్రాత్మక మార్పునకు నాంది ఇదని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త శకానికి తొలి అడుగు.. అద్భుతమైన ఉత్సాహంతో కొత్త వృద్ధికి పునాది వేస్తున్నామని ప్రకటించారు. ఈ ట్రాన్సఫర్మమేషన్ ఇప్పటికే మొదలైంది, విమాన క్యాబిన్స్ పునరుద్ధరణ, సౌకర్యవంతమైన సీట్లు, భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే మేనేజ్‌మెంట్ నిరంతరం యాక్టివ్‌గా ఉండటంతోపాటు ఆన్-టైమ్ పనితీరును మెరుగు, క్రియాశీల నిర్వహణ, విమాన షెడ్యూల్‌లను మెరుగుపరుస్తామని ఆయన ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment