టాటా.. గుడ్‌బై.. విస్తారా ఇక కనుమరుగు.. | Vistara to merge with Air India from 12 November 2024 | Sakshi
Sakshi News home page

టాటా.. గుడ్‌బై.. విస్తారా ఇక కనుమరుగు..

Published Sat, Aug 31 2024 4:25 AM | Last Updated on Sat, Aug 31 2024 9:44 AM

Vistara to merge with Air India from 12 November 2024

నవంబర్‌ 12 నుంచి ఎయిరిండియాలో విలీనం 

సెపె్టంబర్‌ 3 నుంచి బుకింగ్స్‌ నిలిపివేత 

ఎస్‌ఐఏ రూ. 2,058 కోట్ల ఎఫ్‌డీఐకి గ్రీన్‌ సిగ్నల్‌ ..

న్యూఢిల్లీ:  పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఇక కనుమరుగు కానుంది. నవంబర్‌ 12 నుంచి టాటా గ్రూప్‌లో భాగమైన మరో సంస్థ ఎయిరిండియాలో విలీనం కానుంది. విస్తారా సేవల నిలిపివేతకు నవంబర్‌ 11 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్‌ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తెలిపారు.

 నవంబర్‌ 12 లేదా ఆ తర్వాత చేసే ప్రయాణాలకు సంబంధించి సెపె్టంబర్‌ 3 నుంచి బుకింగ్స్‌ నిలిచిపోతాయని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత నుంచి తమ వెబ్‌సైట్లో బుకింగ్స్‌ అన్ని ఎయిరిండియా సైటుకు రీడైరెక్ట్‌ అవుతాయని పేర్కొంది. నవంబర్‌ 12 తర్వాత ప్రయాణాలకు బుక్‌ చేసుకున్నవారి ఫ్లయిట్‌ నంబర్లను సెపె్టంబర్‌లో దశలవారీగా ఆటోమేటిక్‌గా ఎయిరిండియాకు మారుస్తారు. కస్టమర్లకు ఆ వివరాలు తెలియజేస్తారు. మరింత విస్తృత నెట్‌వర్క్, విమానాలతో మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఈ విలీనం తోడ్పడగలదని విస్తారా సీఈవో వినోద్‌ కణ్ణన్‌ తెలిపారు.  

ఎయిరిండియాలో ఎస్‌ఐఏకి 25.1 శాతం వాటా.. 
విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ. 2,058.50 కోట్ల మేర సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైందని, ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రక్రియ పూర్తి కావచ్చని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది.  

ఫిట్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభం.. 
ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియపై ప్యాసింజర్లకు స్పష్టతనిచ్చేందుకు ఇప్పటికే ఎఫ్‌ఏక్యూలను (సందేహాలు, సమాధానాలు) సిద్ధం చేశారు. అలాగే ఫిట్‌మెంట్‌ ప్రక్రియను కూడా ప్రారంభించారు. టాటా గ్రూప్, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ జాయింట్‌ వెంచర్‌గా విస్తారా 2015 జనవరిలో కార్యకలాపాలు ప్రారంభించింది. విస్తారాకు 70 విమానాలు ఉండగా, 50 పైచిలుకు గమ్యస్థానాలకు సరీ్వసులు నిర్వహిస్తోంది.  ఎయిరిండియాలో కంపెనీ విలీనాన్ని 2022 నవంబర్‌లో ప్రకటించారు. 2023 సెపె్టంబర్‌లో ఈ డీల్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. నష్టాల్లోనే కొనసాగుతున్న ఎయిరిండియా, విస్తారాలో 23,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా గ్రూప్‌ గొడుగు కింద ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్‌ కనెక్ట్‌ (గతంలో ఎయిర్‌ఏషియా ఇండియా) కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement