merger agreement
-
కేర్ హాస్పిటల్స్, ఆస్టర్ డీఎం విలీనం
న్యూఢిల్లీ: వైద్య సేవల దిగ్గజాలు ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, క్వాలిటీ కేర్ ఇండియా (కేర్ హాస్పిటల్స్) విలీనం కానున్నాయి. తద్వారా ఆదాయం, పడకల సంఖ్యపరంగా దేశీయంగా మూడో అతి పెద్ద హాస్పిటల్ చైన్ ఆవిర్భవించనుంది. ఇందుకు సంబంధించిన విలీన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. డీల్ ప్రకారం క్వాలిటీ కేర్ ఇండియాలో (క్యూసీఐఎల్) పెట్టుబడులున్న బ్లాక్‌స్టోన్, టీపీజీల నుంచి ఆస్టర్ 5% వాటాలను కొనుగోలు చేస్తుంది. ప్రతిగా తమ సంస్థలో 3.6% వాటాకు సమానమైన షేర్లను జారీ చేస్తుంది. తదుపరి ఆస్టర్‌లో క్యూసీఐఎల్ని విలీనం చేస్తారు. లిస్టెడ్ విలీన సంస్థ పేరు ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్‌గా మారుతుంది. రిజిస్టర్డ్ కార్యాలయాన్ని కర్ణాటక నుంచి తెలంగాణకు మారుస్తారు. ‘ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడగలదు’ అని ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆజాద్ మూపెన్ ఈ సందర్భంగా తెలిపారు. ‘విలీన సంస్థ భారత హెల్త్‌కేర్ రంగంలో అగ్రగామిగా, ప్రపంచ స్థాయి సంస్థగా ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తాం’ అని బ్లాక్‌స్టోన్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా హెడ్ అమిత్ దీక్షిత్ వివరించారు. చైర్మన్‌గా ఆజాద్ మూపెన్.. విలీన కంపెనీలో ఆస్టర్ ప్రమోటర్లకు 24 శాతం, బ్లాక్‌స్టోన్‌కు 30.7 శాతం వాటాలుంటాయి. షేర్ల మారి్పడి నిష్పత్తి ప్రకారం విలీన కంపెనీలో ప్రమోటర్లతో కలిపి ఆస్టర్ షేర్హోల్డర్లకు 57.3%, క్యూసీఐఎల్ షేర్హోల్డర్లకు 42.7% వాటా ఉంటుంది. క్యూసీఐఎల్ షేర్హోల్డర్లకు ప్రతి 1,000 షేర్లకు గాను 977 ఆస్టర్ షేర్లు లభిస్తాయి. ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ ఫౌండర్, చైర్మన్ ఆజాద్ మూపెన్ .. మూడేళ్ల ఆరు నెలల పాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. మరోవైపు, క్యూసీఐఎల్ గ్రూప్ ఎండీ వరుణ్ ఖన్నా.. ఎండీ, గ్రూప్ సీఈవోగా ఉంటారు. 38 ఆస్పత్రులు.. 10 వేల పైగా బెడ్స్.. విలీన సంస్థ 27 నగరాల్లో 38 ఆస్పత్రులు, 10,150 పడకలతో దేశీయంగా మూడో అతి పెద్ద హాస్పిటల్ చెయిన్‌గా ఉంటుంది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఆస్టర్ డీఎం ఇచి్చన సమాచారం ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారుగా మరో 3,500 పడకలను పెంచుకునే ప్రణాళికలు ఉన్నాయి. ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ కింద నాలుగు బ్రాండ్లు (ఆస్టర్ డీఎం, కేర్ హాస్పిటల్స్, కిమ్స్‌హెల్త్, ఎవర్‌కేర్) ఉంటాయి. ప్రస్తుతం అపోలో గ్రూప్, మణిపాల్ హాస్పిటల్స్ టాప్ 3లో ఉన్నాయి. శుక్రవారం బీఎస్ఈలో ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ షేరు సుమారు 2 శాతం పెరిగి రూ. 499.95 వద్ద క్లోజయ్యింది. -
టాటా.. గుడ్‌బై.. విస్తారా ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఇక కనుమరుగు కానుంది. నవంబర్ 12 నుంచి టాటా గ్రూప్‌లో భాగమైన మరో సంస్థ ఎయిరిండియాలో విలీనం కానుంది. విస్తారా సేవల నిలిపివేతకు నవంబర్ 11 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. నవంబర్ 12 లేదా ఆ తర్వాత చేసే ప్రయాణాలకు సంబంధించి సెపె్టంబర్ 3 నుంచి బుకింగ్స్ నిలిచిపోతాయని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత నుంచి తమ వెబ్సైట్లో బుకింగ్స్ అన్ని ఎయిరిండియా సైటుకు రీడైరెక్ట్ అవుతాయని పేర్కొంది. నవంబర్ 12 తర్వాత ప్రయాణాలకు బుక్ చేసుకున్నవారి ఫ్లయిట్ నంబర్లను సెపె్టంబర్లో దశలవారీగా ఆటోమేటిక్‌గా ఎయిరిండియాకు మారుస్తారు. కస్టమర్లకు ఆ వివరాలు తెలియజేస్తారు. మరింత విస్తృత నెట్వర్క్, విమానాలతో మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఈ విలీనం తోడ్పడగలదని విస్తారా సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. ఎయిరిండియాలో ఎస్‌ఐఏకి 25.1 శాతం వాటా.. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ. 2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైందని, ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రక్రియ పూర్తి కావచ్చని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. ఫిట్మెంట్ ప్రక్రియ ప్రారంభం.. ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియపై ప్యాసింజర్లకు స్పష్టతనిచ్చేందుకు ఇప్పటికే ఎఫ్ఏక్యూలను (సందేహాలు, సమాధానాలు) సిద్ధం చేశారు. అలాగే ఫిట్మెంట్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్‌గా విస్తారా 2015 జనవరిలో కార్యకలాపాలు ప్రారంభించింది. విస్తారాకు 70 విమానాలు ఉండగా, 50 పైచిలుకు గమ్యస్థానాలకు సరీ్వసులు నిర్వహిస్తోంది. ఎయిరిండియాలో కంపెనీ విలీనాన్ని 2022 నవంబర్‌లో ప్రకటించారు. 2023 సెపె్టంబర్లో ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. నష్టాల్లోనే కొనసాగుతున్న ఎయిరిండియా, విస్తారాలో 23,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా గ్రూప్ గొడుగు కింద ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
జీ ఎంటర్టైన్మెంట్–సోనీ పిక్చర్స్.. చేయి చేయి!
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) – సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మంగళవారం కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. విఫలమైన 10 బిలియన్ల డాలర్ల విలీన ఒప్పందం విషయంలో గత ఆరు నెలలుగా తమ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ కార్పొరేట్ వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. ఈ విషయంలో ఒకదానిపై మరొకటి అన్ని క్లెయిమ్‌లను ఉపసంహరించుకోవడానికి అంగీకరించినట్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ఆర్బిట్రేషన్ పక్రియలో జీల్ అలాగే కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ –సీఎంఈపీఎల్ (సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా– కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్... వినియోగ ఫేసింగ్కు సంబంధించిన గుర్తింపు. ఇది జపాన్‌లో ని సోనీ గ్రూప్ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ) ఈ మేరకు ‘‘సమగ్ర నగదు రహిత సెటిల్మెంట్’’ను కుదుర్చుకున్నట్లు సంయు క్త ప్రకటన పేర్కొంది. దీనిప్రకా రం ఎన్సీఎల్టీసహా అన్ని న్యా యవేదికలపై కొనసాగుతున్న క్లెయిమ్‌లను పరస్పరం ఉపసంహరించుకోనున్నాయి. ఆయా అంశాలను సంబంధిత నియంత్రణ అధికారులకు తెలియజేస్తాయి. ఇక ఎవరిదారి వారిది.. తాజా పరిష్కార ఒప్పంద ప్రకారం ఇకపై రెండు సంస్థల్లో ఎవరికి ఎవరిపై ఎటువంటి క్లెయిల్లు ఉండబోవు. అభివృద్ధి చెందుతున్న మీడియా, వినోద రంగాలపై భవిష్యత్ వృద్ధి అవకాశాలపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాయి. అన్ని వివాదాల ఖచ్చితమైన ముగింపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జీల్ ఎంటర్టైన్మెంట్ షేర్లు 12% అప్ తాజా పరిణామం నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు మంగళవారం దాదాపు 12 శాతం పెరిగాయి. బీఎస్ఇలో ఈ షేరు ధర 11.45 శాతం జంప్ చేసి రూ.150.85 వద్ద స్థిరపడింది. ఒక దశలో 14.25 శాతం పెరిగి రూ.154.65ని తాకింది. ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు 11.61 శాతం పెరిగి రూ.150.90కి చేరాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,488.81 కోట్లు పెరిగి రూ.14,489.44 కోట్లకు చేరుకుంది. నేపథ్యం ఇలా.. » 2021 డిసెంబర్ 22న రెండు సంస్థలూ విలీన సహకార ఒప్పందం (ఎంసీఏ)పై సంతకాలు చేశాయి. » ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ 2023 ఆగస్టు 10న 10 బిలియన్ డాలర్ల మీడియా సంస్థను సృష్టించగల సోనీ గ్రూప్–, బంగ్లా ఎంటర్టైన్మెంట్ (బీఈపీఎల్)తో జీల్ విలీన పథకాన్ని ఆమోదించింది. » ఈ ఏడాది జనవరిలో ఒప్పందం రద్దుచేసి, అటు తర్వాత రెండు రోజుల్లో సోనీ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. జీల్ విలీన షరతులను పాటించకపోవడం దీనికి కారణంగా పేర్కొంది. ఇందుకుగాను 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 748.7 కోట్లు) ముగింపు రుసుమును క్లెయిమ్ చేసింది. » అయితే ఈ వాదనను జీల్ దీనిని ఆర్బిట్రేషన్ సెంట్రల్లో తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపాదిత విలీనాన్ని అమలు చేయాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ)ని జీల్ ఆశ్రయించింది. అయితే అటు తర్వాత ఈ అభ్యర్థనను ఉపసంహరించుకుంది. » తరువాత 2024 మేలో జీల్ కూడా ఎంసీఏని రద్దు చేసింది. రెండు సోనీ గ్రూప్ సంస్థలు– సోనీ పిక్చర్స్ లిమిటెడ్, బంగ్లా ఎంటర్టైన్మెంట్ల నుండి 90 మిలియన్ డాలర్ల టెర్మినేషన్ రుసుమునూ కూడా డిమాండ్ చేసింది. » ఒప్పందం ముగిసిన తర్వాత, రెండు కంపెనీలు స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే జీల్ ఆర్థిక అడ్డంకులను ఎదుర్కొంటోంది. పలు చర్యల ద్వారా దీనిని అధిగమించడానికి ప్ర యతి్నస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.118 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.» విలీన ఒప్పందం 2021 డిసెంబర్ 22» ఎన్సీఎల్టీ ఆమోదం 2023 ఆగస్టు 10» రద్దుకు సోనీ నిర్ణయం 2024 జనవరి 22» రద్దుకు జీల్ నిర్ణయం 2024 మే 24 -
Reliance-Disney: త్వరలో రిలయన్స్–డిస్నీ స్టార్ ఇండియా విలీనం
న్యూఢిల్లీ: దేశీయంగా మీడియా రంగంలో కన్సాలిడేషన్‌కు తెరతీస్తూ డిస్నీ–స్టార్ ఇండియాను విలీనం చేసుకునే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన నాన్–బైండింగ్ టర్మ్ షీటుపై సంతకాల కోసం లండన్‌లో జరిగిన భేటీలో డిస్నీ ప్రతినిధి కెవిన్ మేయర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన మనోజ్ మోదీ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదరడంతో వ్యాపార విలువ మదింపు తదితర ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 45–60 రోజుల గడువు విధించుకున్నారు. అవసరమైతే దీన్ని పొడిగించే అవకాశం ఉంది. జనవరి ఆఖరు నాటికి ఈ డీల్‌ను పూర్తి చేయాలని రిలయన్స్ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తిగా స్టాక్, నగదు రూపంలో ఉండగలదని వివరించాయి. ఇరు సంస్థలు టర్మ్ షీటుపై చాలాకాలంగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రతిపాదన ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్18, స్టార్ ఇండియా కార్యకలాపాలను విలీనం చేస్తారు. విలీన సంస్థలో రిలయన్స్‌కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటాలు ఉండనున్నాయి. ఇందులో స్టార్ ఇండియాకు చెందిన 77 చానల్స్, వయాకామ్18కి చెందిన 38 చానల్స్ కలిపి మొత్తం 115 చానల్స్ ఉంటాయి. వీటితో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా అనే రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా భాగమవుతాయి. జీ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
జీ ఎంటర్టైన్మెంట్కు ఎన్సీఎల్ఏటీలో ఊరట
న్యూఢిల్లీ: సోనీతో విలీనానికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్కు ఊరట లభించింది. ఈ డీల్‌కు అనుమతులను పునరాలోచన చేయాలంటూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలను సూచిస్తూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్సీఎల్ఏటీ తోసిపుచ్చింది. ఈ వ్యవహరంలో జీ ఎంటర్టైన్మెంట్ తన వాదనలు వినిపించేందుకే ఎన్సీఎల్టీ అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పే ర్కొంది. ఇరు పక్షాల వాదనలు విని కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కేసును తిరిగి ఎన్సీఎల్టీకి పంపించింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి 2021లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీ వ్యవస్థాపకులకు 4 శాతం, మిగతా వాటా జీ ఎంటర్టైన్మెంట్ ఇతర షేర్హోల్డర్లకు ఉంటుంది. అయితే, షిర్పూర్ గోల్డ్ రిఫైనరీలో నిధుల మళ్లింపునకు సంబంధించి జీ ప్రమోటర్ల పేర్ల ప్రస్తావన ఉందన్న అంశంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈ .. విలీన స్కీముపై ఎన్సీఎల్టీకి సందేహాలను తెలియజేశాయి. దీనితో విలీనానికి గతంలో ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించుకుని, తదు పరి విచారణ తేదీలోగా, తగు నిర్ణయం తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సూచించింది. దీన్ని సవాలు చేస్తూ జీ ఎంటర్టైన్మెంట్ పిటీషన్ వేయడంతో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ తాజా ఆదేశాలు ఇచ్చింది. -
Russia Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాల విలీనం ఒప్పందంపై సంతకాలు చేయడానికి కొన్ని గంటల ముందే రష్యా క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై విరుచుకుపడింది. జపోరిజియా నగరంలోని మానవతా కాన్వాయ్‌పై జరిపిన దాడిలో 30 మంది మరణించారు. రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న తమ బంధువులకి వస్తు సామాగ్రిని అందించడం కోసం వెళుతుండగా ఆ మానవతా కాన్వాయ్‌పై దాడులు జరిగాయి. రష్యాలో తయారైన ఎస్–300 క్షిపణులతో ఈ దాడులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. విలీన ఒప్పందంపై పుతిన్ సంతకం ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకునే ఒప్పందంపై అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం సంతకాలు చేశారు. డాంటెస్క్, లుహాన్సŠక్, ఖెర్సాన్, జపోరిజియా ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామని ఆ ప్రాంత ప్రజలు రష్యాలో విలీనమవడానికి అంగీకరించాయని ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు చెందిన రష్యా అనుకూల పాలకులు హాజరవగా క్రెమ్లిన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పుతిన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ తమ దేశంలో విలీనమైన ప్రాంతాలను అన్ని విధాల కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధంపై ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు రావాలని కోరారు. తమ దేశంలో విలీనమైన ప్రాంతాలను మళ్లీ వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని పుతిన్ తేల్చి చెప్పారు.తమ దేశాన్ని ఒక కాలనీగా మార్చి, తమ ప్రజల్ని పిరికివాళ్లయిన బానిసలుగా మార్చడానికి పశ్చిమ దేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, పశ్చిమ దేశాలు ఆ విలీనాన్ని అంగీకరింబోమని స్పష్టం చేశాయి. ప్రజాభిప్రాయం పేరుతో వారిపై తుపాకులు పెట్టి బలవంతంగా విలీనం చేసుకున్నారని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో కూటమిలో తమ దేశాన్ని చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యాకి చెందిన వెయ్యి మంది ప్రజలు, సంస్థలు తమ దేశానికి రాకుండా అమెరికా వారి వీసాలపై నియంత్రణ విధించింది. -
నెలరోజుల్లో ఐడియా, వొడాఫోన్ విలీన ఒప్పందం
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భావానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్, దేశీయ అగ్రగామి సెల్యులర్ కంపెనీ ఐడియాల మధ్య విలీన ఒప్పందం నెలలోపు ఖరారు కానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ఈ నెల 24–25 నాటికి ఈ రెండు సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన విలీన ఒప్పందాన్ని ప్రకటించనున్నాయి. డీల్‌పై సంతకాలకూ సిద్ధమైపోయాయి. అయితే, విలీనంపై అటు వొడాఫోన్, ఇటు ఐడియాలు మాత్రం గోప్యతను పాటిస్తున్నాయి. వొడాఫోన్ మాత్రం ఈ విలీన బాధ్యతలను తన భారత విభాగానికి లోగడ చీఫ్‌గా వ్యవహరించిన మార్టిన్ పీటర్స్‌కు అప్పగించింది. వొడాఫోన్ గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ విట్టోరియో కొలావో సైతం తన భారత విభాగంలోని అన్ని విభాగాల అధిపతులకు విలీనం గురించి వచ్చేవారం వివరించనున్నారు. ప్రథమ స్థానానికి: ఇండియా రేటింగ్స్ ఈ డీల్ సాకారమైతే రెండు సంస్థల విలీనం ద్వారా ఏర్పడే సంస్థ దేశీ టెలికం రంగంలో... 40% వాటాతో, 38 కోట్ల మంది కస్టమర్లతో అతిపెద్ద టెల్కోగా నిలుస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే, ఆదాయం రూ.77,500 – 80,000 కోట్ల స్థాయిలో ఉండనుంది. ఇక స్పెక్ట్రమ్, మౌలిక వసతులపై ఇరు సంస్థలు వేర్వేరుగా భారీగా వ్యయం చేయాల్సిన అవసరం కూడా తప్పుతుంది.