నెలరోజుల్లో ఐడియా, వొడాఫోన్‌ విలీన ఒప్పందం | Vodafone, Idea may merge this month | Sakshi
Sakshi News home page

నెలరోజుల్లో ఐడియా, వొడాఫోన్‌ విలీన ఒప్పందం

Published Mon, Feb 20 2017 1:24 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

నెలరోజుల్లో ఐడియా, వొడాఫోన్‌ విలీన ఒప్పందం

నెలరోజుల్లో ఐడియా, వొడాఫోన్‌ విలీన ఒప్పందం

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భావానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్, దేశీయ అగ్రగామి సెల్యులర్‌ కంపెనీ ఐడియాల మధ్య విలీన ఒప్పందం నెలలోపు ఖరారు కానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ఈ నెల 24–25 నాటికి ఈ రెండు సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన విలీన ఒప్పందాన్ని ప్రకటించనున్నాయి. డీల్‌పై సంతకాలకూ సిద్ధమైపోయాయి.

అయితే, విలీనంపై అటు వొడాఫోన్, ఇటు ఐడియాలు మాత్రం గోప్యతను పాటిస్తున్నాయి. వొడాఫోన్‌ మాత్రం ఈ విలీన బాధ్యతలను తన భారత విభాగానికి లోగడ చీఫ్‌గా వ్యవహరించిన మార్టిన్‌ పీటర్స్‌కు అప్పగించింది. వొడాఫోన్‌ గ్రూపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విట్టోరియో కొలావో సైతం తన భారత విభాగంలోని అన్ని విభాగాల అధిపతులకు విలీనం గురించి వచ్చేవారం వివరించనున్నారు.

ప్రథమ స్థానానికి: ఇండియా రేటింగ్స్‌
ఈ డీల్‌ సాకారమైతే రెండు సంస్థల విలీనం ద్వారా ఏర్పడే సంస్థ దేశీ టెలికం రంగంలో... 40% వాటాతో, 38 కోట్ల మంది కస్టమర్లతో అతిపెద్ద టెల్కోగా నిలుస్తుందని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. అలాగే, ఆదాయం రూ.77,500 – 80,000 కోట్ల స్థాయిలో ఉండనుంది. ఇక స్పెక్ట్రమ్, మౌలిక వసతులపై ఇరు సంస్థలు వేర్వేరుగా భారీగా వ్యయం చేయాల్సిన అవసరం కూడా తప్పుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement