ఆరు నెలల విలీన వివాదపరిష్కారానికి నిర్ణయం
అన్ని క్లెయిమ్‌ల ఉపసంహరణకు అంగీకారం
న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) – సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా మంగళవారం కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. విఫలమైన 10 బిలియన్ల డాలర్ల విలీన ఒప్పందం విషయంలో గత ఆరు నెలలుగా తమ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ కార్పొరేట్ వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. ఈ విషయంలో ఒకదానిపై మరొకటి అన్ని క్లెయిమ్‌లను ఉపసంహరించుకోవడానికి అంగీకరించినట్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ) ఆర్బిట్రేషన్ పక్రియలో జీల్ అలాగే కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ –సీఎంఈపీఎల్ (సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా– కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్... వినియోగ ఫేసింగ్‌కు సంబంధించిన గుర్తింపు.
ఇది జపాన్‌లో ని సోనీ గ్రూప్ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ) ఈ మేరకు ‘‘సమగ్ర నగదు రహిత సెటిల్‌మెంట్’’ను కుదుర్చుకున్నట్లు సంయు క్త ప్రకటన పేర్కొంది. దీనిప్రకా రం ఎన్‌సీఎల్‌టీసహా అన్ని న్యా యవేదికలపై కొనసాగుతున్న క్లెయిమ్‌లను పరస్పరం ఉపసంహరించుకోనున్నాయి. ఆయా అంశాలను సంబంధిత నియంత్రణ అధికారులకు తెలియజేస్తాయి.
ఇక ఎవరిదారి వారిది..
తాజా పరిష్కార ఒప్పంద ప్రకారం ఇకపై రెండు సంస్థల్లో ఎవరికి ఎవరిపై ఎటువంటి క్లెయిల్‌లు ఉండబోవు. అభివృద్ధి చెందుతున్న మీడియా, వినోద రంగాలపై భవిష్యత్ వృద్ధి అవకాశాలపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాయి. అన్ని వివాదాల ఖచ్చితమైన ముగింపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
జీల్ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు 12% అప్
తాజా పరిణామం నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు మంగళవారం దాదాపు 12 శాతం పెరిగాయి. బీఎస్‌ఇలో ఈ షేరు ధర 11.45 శాతం జంప్ చేసి రూ.150.85 వద్ద స్థిరపడింది. ఒక దశలో 14.25 శాతం పెరిగి రూ.154.65ని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు 11.61 శాతం పెరిగి రూ.150.90కి చేరాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,488.81 కోట్లు పెరిగి రూ.14,489.44 కోట్లకు చేరుకుంది.
నేపథ్యం ఇలా..
» 2021 డిసెంబర్ 22న రెండు సంస్థలూ విలీన సహకార ఒప్పందం (ఎంసీఏ)పై సంతకాలు చేశాయి.
» ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్ 2023 ఆగస్టు 10న 10 బిలియన్ డాలర్ల మీడియా సంస్థను సృష్టించగల సోనీ గ్రూప్–, బంగ్లా ఎంటర్‌టైన్‌మెంట్ (బీఈపీఎల్)తో జీల్ విలీన పథకాన్ని ఆమోదించింది.
» ఈ ఏడాది జనవరిలో ఒప్పందం రద్దుచేసి, అటు తర్వాత రెండు రోజుల్లో సోనీ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. జీల్ విలీన షరతులను పాటించకపోవడం దీనికి కారణంగా పేర్కొంది. ఇందుకుగాను 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 748.7 కోట్లు) ముగింపు రుసుమును క్లెయిమ్ చేసింది.
» అయితే ఈ వాదనను జీల్ దీనిని ఆర్బిట్రేషన్ సెంట్రల్‌లో తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపాదిత విలీనాన్ని అమలు చేయాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ)ని జీల్ ఆశ్రయించింది. అయితే అటు తర్వాత ఈ అభ్యర్థనను ఉపసంహరించుకుంది.
» తరువాత 2024 మేలో జీల్ కూడా ఎంసీఏని రద్దు చేసింది. రెండు సోనీ గ్రూప్ సంస్థలు– సోనీ పిక్చర్స్ లిమిటెడ్, బంగ్లా ఎంటర్‌టైన్‌మెంట్‌ల నుండి 90 మిలియన్ డాలర్ల టెర్మినేషన్ రుసుమునూ కూడా డిమాండ్ చేసింది.
» ఒప్పందం ముగిసిన తర్వాత, రెండు కంపెనీలు స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే జీల్ ఆర్థిక అడ్డంకులను ఎదుర్కొంటోంది. పలు చర్యల ద్వారా దీనిని అధిగమించడానికి ప్ర యతి్నస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.118 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
» విలీన ఒప్పందం 2021 డిసెంబర్ 22
» ఎన్‌సీఎల్‌టీ ఆమోదం 2023 ఆగస్టు 10
» రద్దుకు సోనీ నిర్ణయం 2024 జనవరి 22
» రద్దుకు జీల్ నిర్ణయం 2024 మే 24
Comments
Please login to add a commentAdd a comment