Zee channel
-
జీ ఎంటర్టైన్మెంట్–సోనీ పిక్చర్స్.. చేయి చేయి!
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) – సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మంగళవారం కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. విఫలమైన 10 బిలియన్ల డాలర్ల విలీన ఒప్పందం విషయంలో గత ఆరు నెలలుగా తమ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ కార్పొరేట్ వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. ఈ విషయంలో ఒకదానిపై మరొకటి అన్ని క్లెయిమ్‌లను ఉపసంహరించుకోవడానికి అంగీకరించినట్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ఆర్బిట్రేషన్ పక్రియలో జీల్ అలాగే కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ –సీఎంఈపీఎల్ (సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా– కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్... వినియోగ ఫేసింగ్కు సంబంధించిన గుర్తింపు. ఇది జపాన్‌లో ని సోనీ గ్రూప్ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ) ఈ మేరకు ‘‘సమగ్ర నగదు రహిత సెటిల్మెంట్’’ను కుదుర్చుకున్నట్లు సంయు క్త ప్రకటన పేర్కొంది. దీనిప్రకా రం ఎన్సీఎల్టీసహా అన్ని న్యా యవేదికలపై కొనసాగుతున్న క్లెయిమ్‌లను పరస్పరం ఉపసంహరించుకోనున్నాయి. ఆయా అంశాలను సంబంధిత నియంత్రణ అధికారులకు తెలియజేస్తాయి. ఇక ఎవరిదారి వారిది.. తాజా పరిష్కార ఒప్పంద ప్రకారం ఇకపై రెండు సంస్థల్లో ఎవరికి ఎవరిపై ఎటువంటి క్లెయిల్లు ఉండబోవు. అభివృద్ధి చెందుతున్న మీడియా, వినోద రంగాలపై భవిష్యత్ వృద్ధి అవకాశాలపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాయి. అన్ని వివాదాల ఖచ్చితమైన ముగింపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జీల్ ఎంటర్టైన్మెంట్ షేర్లు 12% అప్ తాజా పరిణామం నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు మంగళవారం దాదాపు 12 శాతం పెరిగాయి. బీఎస్ఇలో ఈ షేరు ధర 11.45 శాతం జంప్ చేసి రూ.150.85 వద్ద స్థిరపడింది. ఒక దశలో 14.25 శాతం పెరిగి రూ.154.65ని తాకింది. ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు 11.61 శాతం పెరిగి రూ.150.90కి చేరాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,488.81 కోట్లు పెరిగి రూ.14,489.44 కోట్లకు చేరుకుంది. నేపథ్యం ఇలా.. » 2021 డిసెంబర్ 22న రెండు సంస్థలూ విలీన సహకార ఒప్పందం (ఎంసీఏ)పై సంతకాలు చేశాయి. » ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ 2023 ఆగస్టు 10న 10 బిలియన్ డాలర్ల మీడియా సంస్థను సృష్టించగల సోనీ గ్రూప్–, బంగ్లా ఎంటర్టైన్మెంట్ (బీఈపీఎల్)తో జీల్ విలీన పథకాన్ని ఆమోదించింది. » ఈ ఏడాది జనవరిలో ఒప్పందం రద్దుచేసి, అటు తర్వాత రెండు రోజుల్లో సోనీ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. జీల్ విలీన షరతులను పాటించకపోవడం దీనికి కారణంగా పేర్కొంది. ఇందుకుగాను 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 748.7 కోట్లు) ముగింపు రుసుమును క్లెయిమ్ చేసింది. » అయితే ఈ వాదనను జీల్ దీనిని ఆర్బిట్రేషన్ సెంట్రల్లో తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపాదిత విలీనాన్ని అమలు చేయాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ)ని జీల్ ఆశ్రయించింది. అయితే అటు తర్వాత ఈ అభ్యర్థనను ఉపసంహరించుకుంది. » తరువాత 2024 మేలో జీల్ కూడా ఎంసీఏని రద్దు చేసింది. రెండు సోనీ గ్రూప్ సంస్థలు– సోనీ పిక్చర్స్ లిమిటెడ్, బంగ్లా ఎంటర్టైన్మెంట్ల నుండి 90 మిలియన్ డాలర్ల టెర్మినేషన్ రుసుమునూ కూడా డిమాండ్ చేసింది. » ఒప్పందం ముగిసిన తర్వాత, రెండు కంపెనీలు స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే జీల్ ఆర్థిక అడ్డంకులను ఎదుర్కొంటోంది. పలు చర్యల ద్వారా దీనిని అధిగమించడానికి ప్ర యతి్నస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.118 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.» విలీన ఒప్పందం 2021 డిసెంబర్ 22» ఎన్సీఎల్టీ ఆమోదం 2023 ఆగస్టు 10» రద్దుకు సోనీ నిర్ణయం 2024 జనవరి 22» రద్దుకు జీల్ నిర్ణయం 2024 మే 24 -
జీ-సోనీ డీల్ రద్దు.. రూ.748 కోట్లు కట్టాల్సిందే!
విలీన ఒప్పందాన్ని రద్దు చేసినందుకుగాను సోనీ పిక్చర్స్ నుంచి జీ ఎంటర్టైన్మెంట్ రూ.748 కోట్లు కోరుతుంది. ఈమేరకు జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.2021 డిసెంబర్ 22న జీ, సోనీ విలీనానికి ఒప్పందం కుదిరింది. 2023 ఆగస్టు 10న ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం సోనీ గ్రూప్ సంస్థలైన కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్, బంగ్లా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జెడ్‌ఈఈఎల్)తో విలీనానికి ఆమోదం కూడా తెలిపింది. ఇది 10 బిలియన్ డాలర్ల విలువైన మీడియా సంస్థ ఏర్పాటు చేస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే డీల్ కుదిరిన రెండేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరి 22న విలీన ఒప్పందాన్ని సోనీ కార్పొరేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. జెడ్‌ఈఈఎల్ విలీన షరతులను పాటించడం లేదని తెలిపింది.ఇన్వెస్టర్లను నమ్మించి చివరకు ఇలా డీల్‌కు రద్దు చేసుకోవడం పట్ల సోనీ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ) నుంచి 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.748.7 కోట్లు) టర్మినేషన్ ఫీజును జెడ్‌ఈఈఎల్ డిమాండ్ చేస్తుంది. -
ప్రముఖ టీవీ ఛానల్ ద్వారా షేర్ల రిగ్గింగ్!
ప్రముఖ బిజినెస్ చానల్లో స్టాక్ సిఫార్సులిచ్చే పది మంది నిపుణులతోపాటు ఐదుగురు గెస్ట్ అనలిస్ట్‌లపై నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. షేర్ రిగ్గింగ్‌కు పాల్పడి చట్టవిరుద్ధంగా వారు ఆర్జించిన రూ.7.41 కోట్ల స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. సెబీ దర్యాప్తు వివరాల ప్రకారం జీ బిజినెస్ న్యూస్ ఛానల్లో ఏ స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నామన్నది గెస్ట్ నిపుణులు ముందుగానే కొంతమంది ప్రాఫిట్ మేకర్స్‌కు చెబుతారు. సమాచారం అందుకున్న ప్రాఫిట్ మేకర్స్ తొలుత ఆ షేరు లేదా డెరివేటివ్ కాంట్రాక్టులో పొజిషన్లు తీసుకుంటారు. దాంతో రిటైలర్లు సైతం అందులో ఇన్వెస్ట్‌చేసిన తర్వాత లాభాలు స్వీకరించి పొజిషన్లను విక్రయిస్తారు. గెస్ట్ అనలిస్టులు కిరణ్ జాదవ్, అశీష్ కేల్కర్, హిమాన్షు గుప్తా, ముదిత్ గోయల్, సిమి భౌమిక్‌ల సిఫార్సులు ఛానల్లో ప్రసారం అయిన తర్వాత ఆ పొజిషన్లను మార్చి లాభం సంపాదించినట్లు సెబీ గుర్తించింది. ఈ ఉదంతంలో నిర్మల్ కుమార్ సోని, పార్థసారథి ధర్, శార్ కమోడిటీస్, మానన్ షేర్‌కామ్, కన్హా ట్రేడింగ్ కంపెనీలు ప్రాఫిట్ మేకర్స్‌గా వ్యవహరించారని సెబీ పేర్కొంది. ఆ లావాదేవీల్లో వచ్చిన లాభాల్ని అందరూ పంచుకున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: ‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు.. దర్యాప్తు అనంతరం సెబీ 127 పేజీల ఆర్డర్‌ను జారీచేస్తూ వారిని సెక్యూరిటీ లావాదేవీల నుంచి నిషేధించింది. గెస్ట్ నిపుణులకు సంబంధించిన కంటెంట్‌తో సహా వీడియో రికార్డులు, ఇతర రికార్డుల్ని భద్రపర్చాలని జీ మీడియాను ఆదేశించింది. -
Zee-Sony Merger Deal: సోనీతో విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ – సీఎంఈపీఎల్) విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నామని జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు కృషి చేస్తున్నామని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. విలీన సంస్థకు జీల్ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించడం ఇష్టం లేని కారణంగా సోనీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో జీల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జీల్‌తో తమ భారత విభాగం సీఎంఈపీఎల్ను విలీనం చేసేందుకు జపాన్‌కు చెందిన సోనీ గ్రూప్ రెండేళ్ల క్రితం డీల్ కుదుర్చుకుంది. అప్పట్నుంచి వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. జీల్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన తనయుడైన గోయెంకా .. కంపెనీ నిధులను మళ్లించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీనిపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరిపింది. గోయెంకాను ఏ లిస్టెడ్ కంపెనీ బోర్డులో చేరరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అప్పిలేట్ న్యాయస్థానంలో ఆయనకు ఊరట లభించింది. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ గవర్నెన్స్ వైఫల్యంగా భావిస్తున్న సోనీ.. విలీన సంస్థకు గోయెంకాను సీఈవోగా చేసేందుకు ఇష్టపడటం లేదని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తోందని వార్తలు వచ్చాయి. ఒప్పందం పూర్తి కావడానికి జనవరి 20 వరకు గడువు ఉండటంతో ఏం జరగనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
‘జీ’, సిటీ నెట్‌వర్క్స్‌పై దివాలా చర్యలు: ఎన్సీఎల్ఏటీ భారీ ఊరట
ముంబై: మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కి భారీ ఊరట లభించింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) శుక్రవారం జీపై దివాలా చర్యలను ప్రారంభించాలని ఆదేశించిన ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై స్టే విధించింది. జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునిత్ గోయెంకా, కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలను సవాలు చేస్తూ చేసిన అభ్యర్థనను మేరకు ఈ పరిణామం చోటుచేసుకుంది. గోయెంకా దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ ప్రైవేట్ రంగ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్‌కు నోటీసు జారీ చేసింది. దీనిపై విచారణను మార్చి 27వ తేదీకి వాయిదా వేసింది. ఎన్సీఎల్ఏటీ ఆదేశాలపై గోయెంకా సంతోషం వ్యక్తం చేశారు.అందరి వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రతిపాదిత విలీనాన్ని సకాలంలో పూర్తి చేయడంపై కట్టుబడి ఉన్నామన్నారు. కాగా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్), సిటీ నెట్‌వర్క్స్‌పై దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపడం ఆందోళనకు దారి తీసింది. దీనికి సంబంధించి ఇండస్ఇండ్ బ్యాంక్ దాఖలు చేసిన పిటీషన్లను విచారణకు స్వీకరించింది. జీల్ వ్యవహారంలో సంజీవ్ కుమార్ జలాన్‌ను, సిటీ నెట్వర్క్స్ విషయంలో మోహిత్ మెహ్రాను దివాలా పరిష్కార నిపుణులుగా (ఆర్పీ) నియమించింది. ఉత్తర్వులపై రెండు వారాల స్టే ఇవ్వాల్సిందిగా జీల్ కోరినప్పటికీ ఎన్సీఎల్టీ బెంచ్ నిరాకరించింది. దీనిపై జీ ఎంటర్ప్రైజెస్ ఎండీ పునీత్ గోయెంకా .. నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్ఏటీ) సవాలు చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెడితే జీ గ్రూప్‌లో భాగమైన సిటీ నెట్వర్క్స్ వివిధ బ్యాంకుల నుంచి రూ. 850 కోట్లకు మేర రుణాలు తీసుకుంది. జీల్‌ను హామీదారుగా ఉంచి ఇండస్ఇండ్ నుంచి తీసుకున్న రూ. 89 కోట్ల రుణ చెల్లింపులో సిటీ డిఫాల్ట్ కావడంతో తాజా పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సోనీలో జీల్ విలీనం తుది దశల్లో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడంతో డీల్‌కు అడ్డంకులు ఏర్పడవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్సీఏల్ఏటీ తాజా ఉత్తర్వు సంస్థకు భారీ ఊరట కల్పించింది. -
సోనీటీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం !
-
ఆ సినిమా హక్కులన్నీ ‘జీ’కే సొంతం!
కరోనా కట్టడికై విధించిన లాక్డౌన్ దెబ్బకు థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అనేకానేక చిన్న చిత్రాలతో పాటు ‘మహానటి’ కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’, మిస్ ఇండియా, అనుష్క ‘నిశ్శబ్దం’ తదితర సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్‌ఫాంలో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో థియేటర్లు తెరిచే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ‘జీ’ ఛానెల్ సరికొత్త పంథాను ఎంచుకుంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. విడుదలకు సంబంధించిన అన్ని రకాల హక్కులు సొంతం చేసుకుంది. (చదవండి: నా సినిమాల్లో అన్నయ్య ప్రమేయం ఉండదు) శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా థియేటరికల్, డిజిటల్, సాటిలైట్ హక్కులు పొందింది. ఈ మేరకు డిసెంబరులో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను తొలుత థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు జీ స్టూడియోస్ ఓ ప్రకటలో తెలిపింది. అనంతరం జీ5(ఓటీటీ ప్లాట్‌ఫాం) సహా బుల్లితెరపై ప్రదర్శించనున్నట్లు పేర్కొంది. కాగా సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాతో సుబ్బు డైరెక్టర్‌గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. తొలుత మే 1న సినిమాను విడుదల చేయాలని భావించినా లాక్డౌన్ కారణంగా వాయిదా పడగా.. జీ తాజా ప్రకటనతో సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. This isn't your typical rom-com, this unique entertainer is full of quirks! 😄 Presenting #SoloBrathukeSoBetter, an @SVCCofficial production starring the powerhouse of talent @IamSaiDharamTej and @NabhaNatesh. In cinemas this December! pic.twitter.com/NdPQNHX99k — Zee Studios (@ZeeStudios_) November 18, 2020 -
కరోనా: రాష్ట్రానికి జీ ఎంటర్టైన్మెంట్ విరాళాలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19తో జరుపుతున్న పోరాటాన్ని బలోపతం చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి 20 అంబులెన్స్‌లు, 4,000 పీపీఈ కిట్లు మరియు 1,50,000 రోజువారీ భోజనాలను ఎంటర్టైన్మెంట్ పవర్‌హౌస్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీ) విరాళంగా ప్రకటించింది. ఐటీ, కమ్మూనికేషన్, పట్టణ వ్యవహహారాల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇవాళ(సోమవారం) జీ ఎంటర్టైన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ గొయెంకా విరాళాలను అందించించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... మహమ్మారి వేళ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు.. రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఆరోగ్య భద్రత పట్ల భరోసా కల్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తుందన్నారు. కోవిడ్-19 ప్రతిస్పందన, ఉపశమనం కోసం అవసరమైన సమయంలో మద్దతునిచ్చి సహకరించినందుకు పునీత్ గోయెంకా, జీ యాజమాన్యానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే జీ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ గోయెంకా మాట్లాడుతూ.. మొత్తం మీద ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించి, కోవిడ్-19తో జరుగుతున్న పోరాటంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి బలీయమైన మద్దతునందించడానికి జీ కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుత మహమ్మారి వేళ రాష్ట్రానికి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో తామందించే ఆరోగ్య సంరక్షణ అవసరాలు, ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్రానికి మరింత దోహదపడతాయని తాము ఆశిస్తున్నామని తెలిపారు. కోవిడ్-19కు వ్యతిరేకంగా దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలికవసతులను మెరుగుపరిచేందుకు సీఎస్ఆర్ డ్రైవ్‌లో భాగంగా, 240కు పైగా అంబులెన్స్‌లు, 46వేల పీపీఈ కిట్లు, 90కు పైగా ఆక్సిజన్ హ్యుమిడిఫయర్లు, 6లక్షలకు పైగా రోజువారీ భోజనాలను అందించడానికి జీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ విరాళాన్ని జాతీయ స్థాయి సీఎస్ఆర్ డ్రైవ్‌లో భాగంగా తెలంగాణా రాష్ట్రానికి అందించామని చెప్పారు. జాతీయ స్ధాయిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కంపెనీలో పనిచేస్తున్న 5వేల మంది రోజువారీ కూలీలకు కంపెనీ ఆర్థికంగా మద్దతునందించిందని చెప్పారు. అంతేగాక 3400 మందికిపైగా ఉద్యోగులు పీఎం కేర్స్ ఫండ్‌కు తోడ్పాటునందించారని, ఉద్యోగులు అందించిన మొత్తాలకు సమానమైన మొత్తాన్ని జీ జత చేసి దానిని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా అందించామని తెలిపారు. బాధ్యతాయుతమైన మీడియా, ఎంటర్టైన్మెంట్ సంస్ధగా, కోవిడ్-19తో పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి అవసరమైన బలమైన చర్యలను జీ కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే మహమ్మారి ప్రభావిత రాష్ట్రాల్లో ష్టమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను విరాళంగా అందించడం ద్వారా కోవిడ్-19పై పోరాటాన్ని కంపెనీ ముమ్మరం చేసింది. ఆరోగ్య సంరక్షణ ఉపశమనానికి మించి ఈ కంపెనీ, అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో చేసుకున్న భాగస్వామ్యంతో 1,50,000 రోజువారీ భోజనాలను రాష్ట్ర వ్యాప్తంగా వలసకార్మికులు, రోజువారీ కూలీలకు అందించింది. ఈ కంపెనీ ప్రభుత్వం కేటాయించుకున్న సీఎస్ఆర్ బడ్జెట్ (కరోనాతో పోరాటం చేసేందుకు)ను తెలంగాణా రాష్ట్రంలో ఈ దిగువ అవసరాలను తీర్చడానికి వినియోగించింది. రాష్ట్రానికి 20 అంబులెన్స్‌లు విరాళంగా అందించింది . పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్) కిట్స్ రాష్ట్రానికి 4వేల కిట్స్‌ను విరాళంగా అందించింది. -
‘జీ’పై విదేశీ దిగ్గజాల కన్ను!?
ముంబయి: సుభాష్ చంద్ర... దేశీ మీడియా రంగంలో సుపరిచితమైన పేరు. జీ టెలివిజన్ చానెళ్లతో విదేశీ మీడియా సంస్థలకు దీటుగా వ్యాపారాన్ని విస్తరించారు. అయితే, హఠాత్తుగా ప్రధాన కంపెనీలో వాటాలను విక్రయించాలని నిర్ణయించడంతో మీడియాలో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. తన వ్యాపారానికి మూల స్తంభంలాంటి జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) పగ్గాలను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ మీడియా దిగ్గజాలు, టెక్నాలజీ కంపెనీలతో పాటు దేశీయంగా మీడియాలో దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా జీ ఎంటర్టైన్మెంట్పై కన్నేసినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. బంపర్ ఆఫర్ వచ్చిందా... ఒక గ్లోబల్ మీడియా అగ్రగామి నుంచి భారీస్థాయిలో ఆఫర్ వచ్చిందని... ఈ నేపథ్యంలో తాము వాటా విక్రయానికి సిద్ధమైనట్లు స్వయంగా జీల్ సీఈఓ, సుభాష్ చంద్ర తనయుడు పునీత్ గోయెంకా తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రమోటర్లకు (ఎస్సెల్ హోల్డింగ్స్) జీల్లో 42 శాతం వాటా ఉంది. ఇందులో సగం వరకూ వాటాను విక్రయించనున్నామని... కొనుగోలుదారులు అడిగితే మరింత వాటాను విక్రయించడానికి కూడా రెడీగా ఉన్నట్లు గత వారంలో జీ ప్రమోటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గోల్డ్‌మన్ శాక్స్, సలహా సంస్థ లయన్ ట్రీలను కూడా నియమించుకున్నారు. తాము వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగే ప్రణాళికల్లేవని పునీత్ చెబుతున్నప్పటికీ.. కంపెనీపై నియంత్రణ వదులుకోవడానికి ప్రమోటర్లు సిద్ధపడే అవకాశం ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘జీ ఎంటర్టైన్మెంట్ను కొనుగోలు చేసేందుకు ప్రపంచస్థాయి మీడియా దిగ్గజం ఇటీవలే ప్రమోటర్లను సంప్రతించింది. దీంతో వాటా విక్రయం ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం లభిస్తుంది’ అని గోయెంకా పేర్కొనడం విశేషం. రేసులో ఎవరెవరు... జీల్ కొనుగోలు రేసులో అంతర్జాతీయ మీడియా, టెక్నాలజీ దిగ్గజాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవలి ఒక మీడియా కథనం ప్రకారం కామ్‌కాస్ట్, సోనీ, చార్టర్ కమ్యూనికేషన్స్, అలీబాబా, గూగుల్, యాపిల్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియోతో దేశీ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ కూడా జీల్లో మెజారిటీ వాటా కోసం పోటీపడొచ్చని వార్తలొస్తున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశీ ఎంటర్టైన్మెంట్ మీడియా కంపెనీల్లో 100 శాతం వాటాను విదేశీ సంస్థలు కొనుగోలు చేసేందుకు వీలుంది. అయితే, తాము వ్యూహాత్మక భాగస్వామ్యానికే మొగ్గుచూపుతామని పునీత్ చెబుతున్నారు. మరోపక్క, విదేశీ కంపెనీలు కూడా ఇక్కడి కంపెనీలను పూర్తి స్థాయిలో టేకోవర్ చేసేందుకు వెనకాడవచ్చనేది నిపుణుల మాట. విభిన్న భాషలు, సంక్లిష్టమైన కార్యకలాపాలతో కూడిన దేశీ ఎంటర్టెన్మెంట్ మార్కెట్‌ను నడిపించేందుకు స్థానిక భాగస్వామ్యాన్ని వారు కోరుకోవచ్చని భావిస్తున్నారు. కాగా, తాజా షేరు ధర ప్రకారం జీల్ మార్కెట్ విలువ దాదాపు రూ.42,000 కోట్లు. ఇందులో ప్రమోటర్ల వాటా సుమారు రూ.17,600 కోట్లు. అయితే, ఈ విలువకన్నా 20–25 శాతం అధిక ధరకే డీల్ కుదరవచ్చన్నది విశ్లేషకుల అంచనా. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ విలువను రూ.57,800 కోట్ల నుంచి రూ. 64,500 కోట్లుగా (8–9 బిలియన్ డాలర్లు) లెక్కగట్టొచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో రూపర్ట్ మర్దోక్‌కు చెందిన ట్వంటియత్ సెంచురీ ఫాక్స్ వ్యాపారాన్ని డిస్నీ ఏకంగా 71 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం తెలిసిందే. ఇందులో భారత్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. దీనిప్రకారం స్టార్ ఇండియా విలువను ఏకంగా 15 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. గ్లోబల్ టెలికం– కంటెంట్ దిగ్గజం కామ్‌కాస్ట్ గనుక జీల్లో మెజారిటీ వాటాను దక్కించుకుంటే... అది దేశీ మీడియా రంగం స్వరూపాన్ని మార్చివేయొచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. రిలయన్స్ జియోపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపొచ్చనేది వారి అభిప్రాయం. ఓటీటీలో దూసుకెళ్లేందుకేనా... మీడియా రంగంలో ప్రస్తుతం విపరీతమైన పోటీ నెలకొంది. మరోపక్క, ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్ కూడా అంతకంతకూ ప్రేక్షకులను ఆకర్షిస్తుండటం సాంప్రదాయ టెలివిజన్ చానెళ్ల ఆదాయానికి గండికొడుతోంది. ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌గా పిలుస్తున్న ఈ విభాగంలో యూజర్లు అంతకంతకూ పెరిగిపోతుండటం దీనికి నిదర్శనం. ప్రస్తుతం దేశంలో స్టార్ టీవీ గ్రూప్‌నకు చెందిన హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ఆపరేటర్ల కంటెంట్‌కు మంచి గిరాకీయే ఉంది. ఇదే తరుణంలో సుభాష్ చంద్ర ప్రారంభించిన జీల్ అనుబంధ సంస్థ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టెక్నాలజీ మీడియా కంపెనీగా జీల్ మార్పు చెందడం కోసమే వాటా విక్రయానికి నిర్ణయం తీసుకున్నట్లు జీ ప్రమోటర్లు చెబుతున్నారు. హాట్‌స్టార్ యూజర్ల సంఖ్య 10 కోట్లను దాటింది. జీ5 యూజర్లు కూడా 5 కోట్లకు చేరుకోనున్నారు. వాస్తవానికి జీ5లోనే వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు వాటా విక్రయించాలని భావించామని... అయితే, మాతృ సంస్థ వద్ద భారీగా కంటెంట్ ఉండటంతో జీల్లో వాటాకు విదేశీ ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని పునీత్ చెప్పారు. తాము అధునాతన టెక్నాలజీతో కూడిన కంటెంట్ కంపెనీగానే కొనసాగాలని భావిస్తున్నామని వివరించారు. అంతర్జాతీయ మీడియా రంగంలో ఓటీటీ కంటెంట్‌తో పాటు టెలికం సేవలు కూడా కలగలిసిపోతు న్నాయి. అందుకే కొన్ని టెలికం, టెక్నాలజీ కంపె నీలు కూడా మీడియాలోనూ (ఓటీటీ ప్లాట్‌ఫామ్) భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. పునీత్ మాత్రం తమకు టెలికంపై ఎలాంటి ఆసక్తీ లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో జీల్లో ప్రమోటర్ల వాటా విక్రయానికి భారీగానే విలువ (వేల్యుయేషన్) దక్కొచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
బుల్లితెరపై... ‘వేలంటైన్స్’ హంగామా
బుల్లితెరపై ప్రేమికుల రోజు సంబరాలను ప్రతిబింబించేలా జీ చానల్ ‘ప్యార్ మే పడిపోయానే’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒకటైన బుల్లితెర సెలబ్రిటీ జంటల సందడితో ఆద్యంతం హుషారుగా సాగిన ఈ ప్రోగ్రామ్‌ను ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారం చేయనున్నట్లు జీ తెలుగు చానల్ ప్రతినిధులు తెలిపారు.