సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19తో జరుపుతున్న పోరాటాన్ని బలోపతం చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి 20 అంబులెన్స్‌లు, 4,000 పీపీఈ కిట్లు మరియు 1,50,000 రోజువారీ భోజనాలను ఎంటర్‌టైన్‌మెంట్ పవర్‌హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీ) విరాళంగా ప్రకటించింది. ఐటీ, కమ్మూనికేషన్, పట్టణ వ్యవహహారాల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇవాళ(సోమవారం) జీ ఎంటర్‌టైన్‌మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ గొయెంకా విరాళాలను అందించించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... మహమ్మారి వేళ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు.. రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఆరోగ్య భద్రత పట్ల భరోసా కల్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తుందన్నారు. కోవిడ్-19 ప్రతిస్పందన, ఉపశమనం కోసం అవసరమైన సమయంలో మద్దతునిచ్చి సహకరించినందుకు పునీత్ గోయెంకా, జీ యాజమాన్యానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
అలాగే జీ ఎంటర్‌ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ గోయెంకా మాట్లాడుతూ.. మొత్తం మీద ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించి, కోవిడ్-19తో జరుగుతున్న పోరాటంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి బలీయమైన మద్దతునందించడానికి జీ కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుత మహమ్మారి వేళ రాష్ట్రానికి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో తామందించే ఆరోగ్య సంరక్షణ అవసరాలు, ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్రానికి మరింత దోహదపడతాయని తాము ఆశిస్తున్నామని తెలిపారు. కోవిడ్-19కు వ్యతిరేకంగా దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలికవసతులను మెరుగుపరిచేందుకు సీఎస్‌ఆర్ డ్రైవ్‌లో భాగంగా, 240కు పైగా అంబులెన్స్‌లు, 46వేల పీపీఈ కిట్లు, 90కు పైగా ఆక్సిజన్ హ్యుమిడిఫయర్లు, 6లక్షలకు పైగా రోజువారీ భోజనాలను అందించడానికి జీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ విరాళాన్ని జాతీయ స్థాయి సీఎస్‌ఆర్ డ్రైవ్‌లో భాగంగా తెలంగాణా రాష్ట్రానికి అందించామని చెప్పారు. జాతీయ స్ధాయిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కంపెనీలో పనిచేస్తున్న 5వేల మంది రోజువారీ కూలీలకు కంపెనీ ఆర్థికంగా మద్దతునందించిందని చెప్పారు.
అంతేగాక 3400 మందికిపైగా ఉద్యోగులు పీఎం కేర్స్ ఫండ్‌కు తోడ్పాటునందించారని, ఉద్యోగులు అందించిన మొత్తాలకు సమానమైన మొత్తాన్ని జీ జత చేసి దానిని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా అందించామని తెలిపారు. బాధ్యతాయుతమైన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్ధగా, కోవిడ్-19తో పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి అవసరమైన బలమైన చర్యలను జీ కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే మహమ్మారి ప్రభావిత రాష్ట్రాల్లో ష్టమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను విరాళంగా అందించడం ద్వారా కోవిడ్-19పై పోరాటాన్ని కంపెనీ ముమ్మరం చేసింది. ఆరోగ్య సంరక్షణ ఉపశమనానికి మించి ఈ కంపెనీ, అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో చేసుకున్న భాగస్వామ్యంతో 1,50,000 రోజువారీ భోజనాలను రాష్ట్ర వ్యాప్తంగా వలసకార్మికులు, రోజువారీ కూలీలకు అందించింది. ఈ కంపెనీ ప్రభుత్వం కేటాయించుకున్న సీఎస్‌ఆర్ బడ్జెట్ (కరోనాతో పోరాటం చేసేందుకు)ను తెలంగాణా రాష్ట్రంలో ఈ దిగువ అవసరాలను తీర్చడానికి వినియోగించింది. రాష్ట్రానికి 20 అంబులెన్స్‌లు విరాళంగా అందించింది . పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్) కిట్స్ రాష్ట్రానికి 4వేల కిట్స్‌ను విరాళంగా అందించింది.
Comments
Please login to add a commentAdd a comment